Saturday, July 10, 2010

సినిమా ట్రిక్కులకి తెలంగాణా రాదు!

తెలంగాణా ప్రాంత వుప ఎన్నికల్లొ మూకుమ్మడి నామినేషన్లు వెయించి తద్వారా బేలట్ వొటింగు తప్పనిసరి చేయడాన్ని తమ విజయంగా భావించడం అక్కడి నాయకుల మూర్ఖత్వం!  వేగవంతం,ఖచ్చితత్వం మరియు సౌకర్యవంతమైన ఈ.వీ.ఎం. ల వినియోగాన్ని టాంపరింగ్ ఆరొపణలతొ ఆడ్డుకొవాలని చూడటం వారి ప్రగతి నిరొధక తత్వాన్నే సూచిస్తుంది. అసలు ఈ.వీ.ఎం.ల వాడకం మొదలు పెట్టాకే రిగ్గింగు, బేలట్ పేపర్లపై ఇంకు, నీళ్ళు పొయటం లాటి దుశ్చర్యలకి అవకాశం లేకుండా పొయింది.  అయినా ఈ.వీ.ఎం.లని టాంపరింగ్ చేయగలిగే అవకాశమే వుంటె,  2004లొ అధికారంలొ వున్న టెక్నాలజీ మాష్టర్ చంద్రబాబు ఎన్నికల్లొ ఓడిపొయేవాడా?  తెలంగాణా వుద్యమంలొ ప్రాణాలు కొల్పొయిన వారి సన్నిహితులని నిలబెట్టక పొగా, పదవీ లాలస వదలని అదే అభ్యర్ధులని మళ్ళీ బరిలొకి దించటమే గాక, ఎటువంటి అక్రమాలకైనా పాల్పడి తమ అభ్యర్ధులని గెలిపించుకొవాలన్న తాపత్రయమే ఈ చర్యల వెనుక వుద్దేశ్యం అన్నది ప్రజలకి అర్ధమై పొయింది. అలా అడ్డగొలుగా గెలిచేసి, ప్రజాభిప్రాయం తెలంగాణకే అని చాటాలన్న పిట్టల దొర ఆలొచన ఫలించదు. ఏనాడొ అసెంబ్లీ రౌడీ సినిమాలొ చూసాం. శివాజీ నిర్దొషి అని బేలట్లొ స్లిప్పులు వేస్తె, కొర్టు ప్రజాభిప్రాయంగా పరిగణించి హీరొని విడుదల చేస్తుంది.  అలాగే అడ్డగోలుగా అభ్యర్ధులు గెలిచినంత మాత్రాన (ఒక వెళ గెలిస్తే) అదె ప్రజాభిప్రాయం అనేసి తెలంగాణా ఇచ్చేస్తారని కలలు కనటం కూడా మూర్ఖత్వం.

3 comments:

  1. ఏకగ్రీవంగా వాళ్ళనే ఎన్నుకోండి అని ఈ ముగాంబో పిలుపు నిస్తే 60కి పైగా నామినేషన్లు వచ్చాయంటే, ఈడికి వున్న విలువేమిటో ఎన్నికలకు ముందే తేలిపోయినట్టే కదా! :))

    ReplyDelete
  2. Anna Ramanna!. Naaku politics gurinchi neeku telsinantha telvadu.
    Nee blog antha samykyandra ani bhajane !

    Telangana lo prajalu nijanga telangana avasaram ledu anukunte enta pedda leader vachhi cheppinaa evadu vinadu.
    KCR cheppedi enduku vintunnaru ante, people also hinking the same way.
    Okka KCR cheppadame kaadu, chaala mandi educationalists kooda ade cheptunnaru.
    Ippudu Telangana lo congress geliste TRS ki support lenatta ?
    Mari Andhra lo, TDP telangana istam ani cheppina tarvaata kooda more than 60 places lo TDP gelichindi. Ante akkadi vaallandariki Telangana ivvadam OK Na ? 2004 elections lo Congress supported TRS, but still congress won. Does it mean people in andhra were in favour for telangana formation in 2004 ?

    Inka nuvvu YSR ni netthi ki ekkinchuku maatlaadutunnav ? Eeroju raashtram divaala teeyadaaniki reason YSR. 2 Rs per/kg rice ?
    every one became lazy in villages.

    Ee sodi aapi try to understand why they are asking for Telangana. Listen to arguement from both sides and then say things.

    ReplyDelete
  3. ఎందుకిలా తొందర తొందర గా టపా వేశావు... కొంపదీసి వీళ్ళు గెలిస్తే తిట్టే అవకాశం ఉండదనా ? .. నీకు భయం గా ఉన్నట్ట్లు అనిపిస్తోంది ... భయం వద్దు సమైక్యం గెలుస్తుంది చూడు.. ఒకవేళ శ్రీనివాస్ ఒక్కడే గెలిచి మిగతా అన్ని చోట్లా టీ ఆర్ ఎస్ గెలిస్తే అప్పుడు మనమూ ఈ వీ ఎం లను నిషేదించమందాము లే...

    ReplyDelete