Wednesday, July 28, 2010

E-సుదర్శనం బాగుంది!

తి.తి.దే. ఈ మధ్యనే ప్రవేశపెట్టిన ఈ-సుదర్శనం చాలా బాగుంది. అసలు శ్రీవారి దర్శనానికి దెవస్థానం అమలు చేస్తున్న అనేక పధకాల్లో అత్యంత ప్రజాదరణ పొందినది సుదర్శనం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కేవలం 50 రూపాయలకే రెండు లడ్డూలతో పాటు రెండు గంటలలొ సులువుగా శ్రీవారి దర్శనం కలుగజేసే ఈ పధకం ఇన్నాళ్ళూ జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లొ మాత్రమే అందుబాటులొ వుండేది.  ఇప్పుడు దాన్ని ఈ-సుదర్శనం పేరుతొ ఇంటెర్నెట్ కి  విస్తరించడం ద్వారా అన్ని ప్రాంతాల వారికిఈ అందుబాటులొకి తేవడం అత్యంత ముదావహం.  ముందుగా రిజిష్ట్రేషన్ చేసుకొవడం, ఫొటోలు అప్ లోడ్ చేయడం లాంటి సాధక బాధకాలున్నా, పధకం దుర్వినియోగం కాకుండా వుండాలంటే అవన్నీ తప్పవు.  అయితే, యాత్రికుల ఫొటో తొ సహా రసీదు ప్రింటు తీసుకున్నాక, మళ్ళీ దానిని వెరే సుదర్శనం వొచర్ కి సీ.ఆర్.వో. ఆఫీసులొ మార్చుకొవడం అన్న ప్రక్రియని తొలగిస్తే బాగుంటుంది.  IRCTC  E-టికెట్ లాగ యాత్రికుల రసీదునే సుదర్శనంకి అనుమతిస్తే బాగుంటుంది.  అలాగే కొత్తగా ప్రవేశ పెట్టిన 100 రూ. లడ్డు పడి టికెట్ సౌకర్యం కూడా బాగుంది. యాత్రికులకి, కోరినన్ని లడ్డూలు లభించడంతో లడ్డూల బ్లాక్ మార్కెటింగ్, డూప్లికేట్ లడ్డూల చలామణీ వంటివి అరికట్టినట్లైంది. ఇందుకు తి.తి.దే. కి అభినందనలు.

ఇంక దేవస్థానం పాలక మండలిలో కూడా మద్యం వ్యాపారులని, రాజకీయులని తొలగించి, ఆధ్యాత్మిక భావం, సేవా తత్పరత మెండుగా వున్న వారిని నియమిస్తే, వారినుంచి భక్తులకి ఇటువంటి సౌకర్యాలు అనేకం మనం ఆశించ వచ్చు. అయితే, ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని భావించడం అత్యాశే అవుతుంది.  ఈ విషయంలొ  TV-9 చానెల్ చేస్తున్న ప్రచారం కూడా చిత్తశుధ్ధితో కూడుకున్నదని నేను అనుకొవట్లేదు.  కేవలం ఆదికేశవుడు దూషించాడనొ లేదా TRP రేటింగ్స్ పెంచుకోవడానికో చేస్తుండ వచ్చు.

3 comments:

  1. కృష్ణారావుగారికి ఇంకా స్వేచ్చ ఇస్తే తి తి దే పని మెరుగవుతుంది

    ReplyDelete
  2. ur right andi mohan garu
    ramanna garu bavundi mee post

    ReplyDelete
  3. ఆహా! తి తి దే ఆవగింజలో అరవై లక్షలో వంతు బాగుపడిందన్నమాట!

    సంతోషం!

    మరి కృష్ణారావు గారు, కృష్ణదేవరాయల ఆభరణాల విషయం లో మీడియా ముందు చిందులు వెయ్యకుండా వుంటే బాగుండేది కదా?

    చూద్దాం! నందో రాజా భవిష్యతి కదా!

    ReplyDelete