పిల్లల ఆట లాగ ఖాళీ చేసిన స్థానాల్లొనే మళ్ళీ పోటీ చేసి, ప్రజల నెత్తిన కోట్ల రూపాయల ఖర్చుతొ వుప ఎన్నికలని రుద్ది, గెలిచాం అనిపించుకున్న మాత్రాన తెలంగాణా రానే రాదు. ప్రత్యేక రాష్ట్రం కావాలంటే దానికి అన్ని ప్రాంతాల వారి అంగీకారం, సహకారం తప్పని సరిగా వుండాలి. సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి సైతం తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించాక వెల్లువెత్తిన నిరసనలతొ తోక ముడిచి ప్రకటన సవరించుకోవటం జరిగింది. అటువంటిది ఒక పన్నెండు మంది శాసన సభ్యులు తిరిగి ఎన్నికై పోతే అదే గొప్ప విజయమనుకొని తెలంగాణా వచ్చేస్తుందన్న పిచ్చి భ్రమలొ పడవద్దని వేర్పాటు వాదులకి నా సలహా!
Friday, July 30, 2010
Wednesday, July 28, 2010
E-సుదర్శనం బాగుంది!
తి.తి.దే. ఈ మధ్యనే ప్రవేశపెట్టిన ఈ-సుదర్శనం చాలా బాగుంది. అసలు శ్రీవారి దర్శనానికి దెవస్థానం అమలు చేస్తున్న అనేక పధకాల్లో అత్యంత ప్రజాదరణ పొందినది సుదర్శనం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కేవలం 50 రూపాయలకే రెండు లడ్డూలతో పాటు రెండు గంటలలొ సులువుగా శ్రీవారి దర్శనం కలుగజేసే ఈ పధకం ఇన్నాళ్ళూ జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లొ మాత్రమే అందుబాటులొ వుండేది. ఇప్పుడు దాన్ని ఈ-సుదర్శనం పేరుతొ ఇంటెర్నెట్ కి విస్తరించడం ద్వారా అన్ని ప్రాంతాల వారికిఈ అందుబాటులొకి తేవడం అత్యంత ముదావహం. ముందుగా రిజిష్ట్రేషన్ చేసుకొవడం, ఫొటోలు అప్ లోడ్ చేయడం లాంటి సాధక బాధకాలున్నా, పధకం దుర్వినియోగం కాకుండా వుండాలంటే అవన్నీ తప్పవు. అయితే, యాత్రికుల ఫొటో తొ సహా రసీదు ప్రింటు తీసుకున్నాక, మళ్ళీ దానిని వెరే సుదర్శనం వొచర్ కి సీ.ఆర్.వో. ఆఫీసులొ మార్చుకొవడం అన్న ప్రక్రియని తొలగిస్తే బాగుంటుంది. IRCTC E-టికెట్ లాగ యాత్రికుల రసీదునే సుదర్శనంకి అనుమతిస్తే బాగుంటుంది. అలాగే కొత్తగా ప్రవేశ పెట్టిన 100 రూ. లడ్డు పడి టికెట్ సౌకర్యం కూడా బాగుంది. యాత్రికులకి, కోరినన్ని లడ్డూలు లభించడంతో లడ్డూల బ్లాక్ మార్కెటింగ్, డూప్లికేట్ లడ్డూల చలామణీ వంటివి అరికట్టినట్లైంది. ఇందుకు తి.తి.దే. కి అభినందనలు.
ఇంక దేవస్థానం పాలక మండలిలో కూడా మద్యం వ్యాపారులని, రాజకీయులని తొలగించి, ఆధ్యాత్మిక భావం, సేవా తత్పరత మెండుగా వున్న వారిని నియమిస్తే, వారినుంచి భక్తులకి ఇటువంటి సౌకర్యాలు అనేకం మనం ఆశించ వచ్చు. అయితే, ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని భావించడం అత్యాశే అవుతుంది. ఈ విషయంలొ TV-9 చానెల్ చేస్తున్న ప్రచారం కూడా చిత్తశుధ్ధితో కూడుకున్నదని నేను అనుకొవట్లేదు. కేవలం ఆదికేశవుడు దూషించాడనొ లేదా TRP రేటింగ్స్ పెంచుకోవడానికో చేస్తుండ వచ్చు.
Wednesday, July 21, 2010
"మహా" మచ్చు తునక!
బాబ్లీ ప్రాజెక్టు మహా రాష్ట్ర అక్రమంగా కట్టిందా లేదా అన్నది పక్కన బెడదాం. అలాగే చంద్ర బాబు కూడా మహా రాష్ట్ర యాత్ర స్వంత రాజకీయ ప్రయోజనాల కోసమా కాదా అన్నది కూడా వేరే విషయం. అయితే ఇక్కడ స్పష్టంగా తేట తెల్లమైన విషయం ఏమిటంటే, భౌగొళికంగా నదీ ప్రవాహ ప్రాంతాలకు ఎగువన వున్న రాష్ట్రాలు, దిగువన వున్న ప్రాంతాలకు తలచుకుంటే ఇబ్బందులు కలుగ జేయగలవని ఈ సంఘటనతో రుజువైంది. అలాగే, తెలుగు వారితొ చరిత్రలొ ఎటువంటి తగాదాలూ లేని మహా రాష్ట్ర ప్రభుత్వమే తమ రాష్ట్రానికి వచ్చిన మన మాజీ ముఖ్య మంత్రిని, ఇతర ప్రజా ప్రతినిధులని ఎలా ట్రీట్ చేసిందొ చూసాం. ఇక సీమాంధ్ర వాసులపై వుత్తి పుణ్యానికే విరుచుకు పడే తెలబాన్లకి స్వంత రాష్ట్రం వస్తే ఏం జరుగుతుందొ చెప్పక్కర్లేదు. (నా ముందరి టపా "తెలంగాణా వస్తే కోస్తా ఎడారే" చదవండి... http://andhraaakasaramanna.blogspot.com/2010/03/blog-post_16.html ) . అటువంటి దుస్థితి తెలుగు వారికి సంప్రాప్తించకూడదని ఆ భగవంతుడిని ప్రార్ధిద్దాం..
Saturday, July 10, 2010
సినిమా ట్రిక్కులకి తెలంగాణా రాదు!
తెలంగాణా ప్రాంత వుప ఎన్నికల్లొ మూకుమ్మడి నామినేషన్లు వెయించి తద్వారా బేలట్ వొటింగు తప్పనిసరి చేయడాన్ని తమ విజయంగా భావించడం అక్కడి నాయకుల మూర్ఖత్వం! వేగవంతం,ఖచ్చితత్వం మరియు సౌకర్యవంతమైన ఈ.వీ.ఎం. ల వినియోగాన్ని టాంపరింగ్ ఆరొపణలతొ ఆడ్డుకొవాలని చూడటం వారి ప్రగతి నిరొధక తత్వాన్నే సూచిస్తుంది. అసలు ఈ.వీ.ఎం.ల వాడకం మొదలు పెట్టాకే రిగ్గింగు, బేలట్ పేపర్లపై ఇంకు, నీళ్ళు పొయటం లాటి దుశ్చర్యలకి అవకాశం లేకుండా పొయింది. అయినా ఈ.వీ.ఎం.లని టాంపరింగ్ చేయగలిగే అవకాశమే వుంటె, 2004లొ అధికారంలొ వున్న టెక్నాలజీ మాష్టర్ చంద్రబాబు ఎన్నికల్లొ ఓడిపొయేవాడా? తెలంగాణా వుద్యమంలొ ప్రాణాలు కొల్పొయిన వారి సన్నిహితులని నిలబెట్టక పొగా, పదవీ లాలస వదలని అదే అభ్యర్ధులని మళ్ళీ బరిలొకి దించటమే గాక, ఎటువంటి అక్రమాలకైనా పాల్పడి తమ అభ్యర్ధులని గెలిపించుకొవాలన్న తాపత్రయమే ఈ చర్యల వెనుక వుద్దేశ్యం అన్నది ప్రజలకి అర్ధమై పొయింది. అలా అడ్డగొలుగా గెలిచేసి, ప్రజాభిప్రాయం తెలంగాణకే అని చాటాలన్న పిట్టల దొర ఆలొచన ఫలించదు. ఏనాడొ అసెంబ్లీ రౌడీ సినిమాలొ చూసాం. శివాజీ నిర్దొషి అని బేలట్లొ స్లిప్పులు వేస్తె, కొర్టు ప్రజాభిప్రాయంగా పరిగణించి హీరొని విడుదల చేస్తుంది. అలాగే అడ్డగోలుగా అభ్యర్ధులు గెలిచినంత మాత్రాన (ఒక వెళ గెలిస్తే) అదె ప్రజాభిప్రాయం అనేసి తెలంగాణా ఇచ్చేస్తారని కలలు కనటం కూడా మూర్ఖత్వం.
Thursday, July 8, 2010
వై.ఎస్.ఆర్. కి అసలైన నివాళి!
రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క, జగన్ వర్గం ఓ పక్క, కాంగ్రెస్ శ్రేణులు, వై.ఎస్.ఆర్. అభిమానులు మరొ వైపు ఈ రొజు రాజ శేఖర రెడ్డి జయంతిని జరుపుకుంటున్నారు. అయితే కడ వరకూ సమైక్య వాదానికి కట్టుబడి - తెలంగాణా వస్తే హైదరాబాదుకి వెళ్ళాలంటే వీసా తీసుకొవాలన్న సత్యాన్ని చాటిన ఆయన జీవించి వుంటె ఈ రొజు వేర్పాటు వాద విష నాగులు పడగ ఎత్తే సాహసం చెసేవా?? రాష్ట్ర అసెంబ్లీలొ తీర్మానం పెట్టటమో, కడప జిల్లాకి వై..ఎస్.ఆర్. పేరు పెట్టటమో లేదా జగన్ ఓదార్పు యాత్రలకి హాజరు కావటమో కాదు. రానున్న వుప ఎన్నికల్లొ వేర్పాటు వాదులని పూర్తిగా మట్టి గరిపించి వారికి తగు గుణ పాఠం నేర్పటమే గాక తెలుగు వారందరూ సమైక్య వాదులే అని చాటడమే ఆయనకి మనమివ్వ గలిగే ఘనమైన నివాళి.
Monday, July 5, 2010
వేర్పాటు వాదులకు బుధ్ధి చెప్పాలి!
2009 సార్వత్రిక ఎన్నికలలొ సమైక్య వాదానికి కట్టుబడి ఒంటరిగా రాజ శేఖర రెడ్డి ఒక వైపు, తెలంగాణాకి సై అని మహా కూటమి మరొ వైపు మోహరించి పొరాడిన విషయం తెలిసిందే. అటువంటి ఎన్నికల సమరంలొ ప్రజలు ఇక్కడ వై.ఎస్. ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వటంతొ బాటు కెంద్రంలొ యూ.పీ.ఎ. ప్రభుత్వానికి కూడ 33 మంది ఎం.పీ. లని అందించారు. దీన్ని బట్టి ప్రజల మాండేటు సమైక్య వాదమే అన్నది అప్పుడె ఋజువై పొయింది. బలవంతుడైన వై.ఎస్. ని ఎదుర్కొవడం చెత గాక మూలన కూర్చున్న కే.సీ.ఆర్., ఆయన అకాల మరణం తరువాత మళ్ళీ తన వునికిని చాటుకొవటానికి తెలంగాణా వుద్యమాన్ని తలకెత్తుకున్నాడు. తదనంతర పరిణామాల్లొ తాను, తన చెల్లి మాత్రం పదవులు అంటి పెట్టుకొని సహచరులందరి చేత రాజీనామాలు చెయించి ప్రజల నెత్తిన బలవంతంగా వుప ఎన్నికలని రుద్దాడు. ఇవి ఖచ్చితంగా ప్రజలు కొరుకున్న ఎన్నికలు కావు. వారిపై బలవంతంగా రుద్ద బడిన ఎన్నికలు మాత్రమె. అయినా రాజీనామా చేసిన వారే మళ్ళీ పొటీ చేసి గెలిస్తే వారు చేసిన త్యాగం ఎమిటొ బోధ పడదు. తెలంగాణా వుద్యమంలొ ప్రాణాలు కొల్పోయిన వారి సన్నిహిత బంధువులని ఈ ఎన్నికల్లొ నిలబెట్టక పోగా, కనీసం ఇప్పుడు ఆ ప్రస్తావన కూడా ఎవరూ తీసుకు రావట్లేదంటె తెలంగాణ పట్ల వారి చిత్త శుధ్ధి ఏ పాటిదొ చెప్పకనే చెబుతోంది. కనుక ప్రజలు తమకు అనుకొకుండా వచ్చిన ఈ అవకాశాన్ని వుపయోగించి, వేర్పాటు వాదుల డ్రామాలు మరింక కొన సాగకుండా తీర్పు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
Friday, July 2, 2010
అడుసు తొక్కనేల? ఆసుపత్రిలొ చేరనేల?
రాజకీయాల్లొ సాధారణంగా ఎదుటి వారి పై బురద జల్లే వారినె చూస్తుంటాం. అయితే, స్వయంగా తామే అడుసు తొక్కిన చందంగా నొటి దురద వల్ల అవస్థల పాలవుతున్న రాములమ్మ లాంటి వారికి అసలు రాజకీయాలు ఎందుకు? నా ముందరి టపా "రంకెలేసిన రాములమ్మ" చదవండి.
Subscribe to:
Posts (Atom)