Friday, March 18, 2011

ఆంధ్రావనికి ద్రోహం చేస్తున్న జగన్...

మాట  తప్పని, మడమ తిప్పని వంశానికి చెందిన వాడినని చెప్పుకొనే జగన్ మాట తప్పుతున్నట్లే కనిపిస్తోంది. శాంతి స్వరూపుడైన బుద్ధుని విగ్రహాలని నాశనం చేసిన తాలిబాన్ల లాగ తెలుగు జాతి ఘన చరిత్రకి సంకేతాలైన టాంక్ బండ్ మీది విగ్రహాలని ద్వంసం చేసిన తెలబాన్లని జగన్ కించిత్తు విమర్శించక పోవటం ఆశ్చర్యకరం. కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర విభజనకి తాను వ్యతిరేకమని స్పష్టం చేసిన జగన్ ఇప్పుడు సొంత పార్టీ పెట్టాక తన విధానం ప్రకటించక పోవటం శోచనీయం.
( పైన వీడియో చూడండి)  భాగస్వామ్య పక్షాల అంగీకారం తీసుకోకుండా తొందరపాటుతో డిసెంబర్ 9 ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే అవకాశాన్ని పార్టీనుండి బయటకి వచ్చాక జగన్ ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు? ఎటూ తేల్చకుండా నాన బెట్టబట్టే తెలంగాణా సమస్య ఈ రోజు కోతి పుండు బ్రహ్మ రాక్షసి అన్నట్లు తయారయింది. ఈ సంగతి తెలిసి కూడా సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం తగలబడి పోతున్నా నిమ్మకి నీరెత్తినట్లున్న కాంగ్రెస్, టీడీపీ ల కి పోటీగా తాను కూడా వ్యూహాత్మక మౌనం పాటించటం నేరమే. వైఎస్ పధకాలన్నీ అమలు చేస్తానని డబ్బా కొడుతున్న జగన్, తండ్రి విశ్వసించిన సమైక్య వాదాన్ని ఎందుకు పాటిన్చట్లేదు? రాజ శేఖర రెడ్డి తరచుగా వాడిన పదం "విశ్వసనీయత". కేవలం పదవి కోసమే రాజకీయాలు చేసి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన నాడు జగన్ రాజకీయ భవిష్యత్తు అంధకారమే అవక తప్పదు.

3 comments:

  1. మా బాగా అడిగారు. తెగ ఊదరగొడుతున్న యువరజా వారి ఫ్యాన్స్ ఏమంటారొ, ఆయన నోరు పెగలని తనానికి? విగ్రహాలు పగలగొట్టినదానిమీదకూడా ఖండించటానికి కూడా దమ్ములేని తనానికి!!!

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. అలా అన్నాడంటే నాన్నగారి విగ్రహాలు మటాష్ అవుతాయని భయమేమో?

    ReplyDelete