Thursday, October 31, 2013

వేర్పాటు (తీవ్ర) వాదం !


వేర్పాటు వాదుల ఆగడాలు శృతి  మించుతున్నాయి.  వేర్పాటువాదం కాస్తా తీవ్ర వాదం గా పరిణమిస్తోంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల పర్యటనకి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మని  వేర్పాటు వాదులు ఆటకాయించటం సహించరానిది.     మన ప్రజాస్వామ్య దేశంలో ఏ మనిషికి గానీ, పార్టీ కి గాని స్వంత అభిప్రాయం ఏర్పరచుకునే హక్కు వుంది.  సమైక్య వాదాన్ని సమర్ధించినంత మాత్రం చేత తెలంగాణా లో తిరగరాదనటం  ఖచ్చితంగా మూర్ఖత్వమే.  సమైక్య వాదాన్ని సమర్ధించే పార్టీ అధ్యక్షురాలికి తెలంగాణా లో తిరిగే నైతిక హక్కు లేదని తెరాస నాయకులు ప్రకటించటం అర్ధ రహితం. తెలంగాణా ప్రాంతాన్ని స్వంత జాగీరు క్రింద జమ కట్టిన రీతిలో సమైక్య వాదులు వస్తే అడ్డుకుంటామని హెచ్చరించటం దేశ  సార్వ భౌమత్వాన్ని సవాల్ చేయటమే !  రాష్ట్రం రాక ముందే ఇంతగా చెలరేగి పోతున్న వారికి ఇంక ప్రత్యెక రాష్ట్రం ఇస్తే పట్ట పగ్గాలుంటాయా ? ఒక పార్టీ నాయకురాలుగా వరద బాధితులని పరామర్శించటానికి వచ్చినంత మాత్రాన తెలంగాణా వాదానికి వచ్చిన ముప్పు ఏమిటి ?   దయ్యాలు వేదాలు వల్లించిన విధంగా భారత దేశం లో ఎవ్వరైనా ఎక్కడైనా ప్రశాంతంగా జీవించ వచ్చంటూ నీతి  వాక్యాలు చెప్పే తెలబాన్లు కనీసం తెలంగాణా లో విజయమ్మ పర్యటనని సైతం సహించలేక పొతున్నారు.  నిజానికి హైదరాబాదు నగరంలోనే కాక తెలంగాణా జిల్లాలలో  కూడా సమైక్య రాష్ట్రాన్ని కోరుకొనే ప్రజలు చాలా మంది వున్నారని శ్రీ కృష్ణ కమిటీ తన నివేదిక లో స్పష్టం చేసింది.  అయితే ఇటువంటి వేర్పాటు వాదుల ఆగడాలకి జడిసి దిన దిన గండంగా బతుకు వెళ్ళ దీస్తున్న వారికి - ఇటువంటి అరాచక ప్రవర్తనల వల్ల భరోసా ఎక్కడ వస్తుంది ?  ఒక పార్టీ అధ్యక్షురాలి ఒక్క రోజు పర్యటనకే భద్రత కల్పించ లేక చేతులెత్తేసిన పోలీసు రక్షణ వ్యవస్థ  ఇక సామాన్య ప్రజల కి ఏమి రక్షణ కల్పిస్తుంది ?  ముఖ్యమంత్రి నే కర్రీ పాయింటు పెట్టుకోమన్న వారు సామాన్య పౌరులకి ఏ గతి పట్టిస్తారు ?     

Wednesday, October 30, 2013

రాష్ట్ర విభజన పై జానారెడ్డి 'పంచాయితీ' !


"ఒక పంచాయితీని విభజించాలంటే ఆ పంచాయితీ తీర్మానం అవసరం లెదు.  మంత్రి హోదాలో నేను విభజించెయ వచ్చు.  రాష్ట్ర విభజన కూడా అంతే.  కేంద్రం రాష్ట్రాన్ని శాసన సభ తీర్మానం లేకపోయినా విభజించెయ్య వచ్చు. " 

విచిత్రమైన ప్రకటనల కి మారు పేరు ఐన పంచాయితీ రాజ్ మంత్రి జానా రెడ్డి గారు తాజా గా ఇచ్చిన ప్రకటన ఇది ! 

 ఇక్కడో విషయం ప్రస్తావించాలి. హైదరాబాదు నగర పరిసరాల్లోని 17 గ్రామ పంచాయితీలని హైదరాబాద్ నగర పాలక సంస్థ లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ వుత్తర్వులకి వ్యతిరేకంగా ఆయా పంచాయితీలు హైకోర్టుని ఆశ్రయించగా విలీనాన్ని కొట్టి వేస్తూ గత నెలలో  న్యాయ స్థానం తీర్పు వెలువరించింది. 
  

ఈ తీర్పు వెలువరించిన సందర్భంలో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు గమనించాలి.  పంచాయితీల విలీనం విషయంలో నిర్ణీత విధి విధానాలను అనుసరించటంలో ప్రభుత్వం విఫలమైందని, ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే విలీన ప్రక్రియని పూర్తి చేశారని  న్యాయ మూర్తి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వుత్తర్వులని కొట్టి వేశారు.    మరి ఇప్పుడు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి గా జానా రెడ్డి గారు తనకున్న అధికారాన్ని వినియోగించి కోర్టు వుత్తర్వులకి విరుద్ధంగా ఆ పంచాయితీలని హైదరాబాదు నగర పాలక సంస్థలో విలీనం చేయ గలరా ? 

రాష్ట్ర విభజన విషయమైనా అంతే !  అక్కడ విలీనం - ఇక్కడ విభజన అదే తేడా... నిర్దిష్టమైన సంప్రదాయాలు పాటించకుండా, శాసన సభ తీర్మానం లేకుండా, ప్రజాభీష్టానికి విరుద్ధంగా,  ఏక పక్షంగా సాగుతున్న విభజన ప్రక్రియ కి కూడా  ఇదే గతి పట్టక తప్పదు. 

Tuesday, October 29, 2013

రాష్ట్ర విభజన పై మంత్రుల కమిటీ(GoM) కి నేను ఇచ్చిన మెయిల్..

To
The chairman,
Group of Ministers (GoM) on AP bifurcation
( feedbacktogom-mha@nic.in )

Sir,
Following is my feed back and suggestions over proposed bifurcation of Andhra Pradesh :

“Small is beautiful !  Good things come in small packages. It may be an effective  line to sell consumer goods, but when it comes to serving the cause of the smaller states of the Indian Union, certainly not….”

At the outset, I firmly express my opinion that creation of new smaller states in India is a  ‘failed concept’ .  The creation of a new state can show various avenues to the politically unemployed persons in that region but the common man in both the mother state and daughter state will fetch nothing.   The fate of the lastly  created 3 states in India proves the same.

Uttarakhand: When floods devastated the state recently, the state administration was completely helpless and all the help rendered to the flood victims was executed with the outside support only.  The Andhra Pradesh state government itself had made its own arrangement to trace out and bring back the stranded Andhra pilgrims from that state. 


Chhattisgarh: Even after 13 years of creation of state, this is state has continued to face serious internal security problems particularly from the Maoists. The Govt. was helpless when maoists attacked and killed about 28 Congress and Salwa judum leaders on 25.05.2013. The state has not been able to control and even contain successfully the violence and extortions perpetrated by the Naxalites thereby causing a huge demand and burden on the resources of both the state and Central exchequer.  

Jharkhand: The most politically unstable state in India. In a short span of 13 years, 5 persons were chaired as Chief Minister in 9 spells and in between those spells, the state undergone president Rule 3 times. Also Its economic performance has been dipping steadily and the internal security problems created by the Maoists/Naxals continue to exist. The unemployment in the state presently is also among the highest in the country.

 At this situation, creation of a new State is not a wise decision at all. Sri LK Advani, senior BJP leader rejected the proposal for creation of Telangana State when he was Honble Union Home Minister.  He also confirmed  that – Govt. of India is of the view that regional disparities in economic development can be tackled through planning and efficient use of available resources. (copy of letter enclosed).  Now, the same BJP party is supporting the creation of Telangana. 


This is a clear example of how the political parties are taking U turns on their stand in creating a new State. BJP is only an example.  All the political parties are taking several U turns and not at all consistent in their decision for creation of Telangana.  Based on the letters issued by such political parties, Congress party decided to go for division of Andhra Pradesh state which is not at all acceptable to majority of the people in the state.  In fact, there is no consensus in the congress party itself over the proposal for division of state.  The Chief Minister of the Andhra Pradesh who belongs to the same Congress party was not taken into confidence before proceeding for division of the State.  Then how the Congress party has moral right to proceed with division based on the letters issued by  other parties?? 

Moreover, the above mentioned 3 states were created after their mother state Assemblies pass unanimous resolutions for bifurcation of their state and there is no opposition for creation of new state in either part of the mother state. But the situation in Andhra Pradesh is completely different. Majority part of the state is strongly  opposing the division of the state. In spite of the severe opposition, Union Governement proposed division of the State in unilateral manner even without a resolution from the Andhra Pradesh Assembly.  It is a fact that Central Government has power under Article 3 of the constitution for creation of a new state but that discretionary power should not be exercised  against the causes and concerns of the people pertaining to one region. The next important thing is Capital.  This is first time in India that a part of a state comprising of the developed capital willing to separate and the Central Govt. accepting the same without bothering the interests of the remaining part of the state.                  

The Union Government has constituted  Sri Krishna Committee in 2010  to examine the situation in the State of Andhra Pradesh with reference to the demand for a separate State of Telangana as well as the demand for maintaining the present status of a United Andhra Pradesh. The said Committee has taken feed back not only from political parties but also from people from all regions of the state and submitted its report after scientifically analyzing the feed back received by them.  The report of the Sri Krishna Committee was not tabled in the Parliament and proper discussion was not done in the statutory bodies regarding the suggestions given by the Sri Krishna Committee on the issue.   

Sri Krishna Committee has suggested to create Telangana state with Hyderabad as its capital and Seemandhra to have a new capital as one of its six suggestions – but only as the second best option and the separation is recommended only in case it is unavoidable and if this decision can be reached amicable among all the three regions.  But without taking considerations of the concerns of seemandhra regions, Union Government proposed unilateral division proposal which is not only favourable to Telengana region but also a big jolt to the other 2 regions of the State. While announcing the bifurcation proposal, Central Government has promised to take due considerations for concerns of the seemandhra region.  But even without settling the Capital issue, and without announcing any relief to the seemandhra region, Union cabinet approved the Note for bifurcation of the State on 03.10.2013.  A prominent issue like the bifurcation of a State was not included in the agenda for cabinet meeting and the same was put up as table item in the meeting and was approved in a hurry.  The way in which the said note was approved in the Cabinet was improper.

  1. Even though it was proposed that Hyderabad will be common capital for 10 years and it is expected to construct a new capital during this period, which is not at all feasible. Today, Hyderabad is the fully developed capital of the Andhra Pradesh state serving the needs of the people of 23 districts.  There is no other city in Andhra Pradesh comparable to Hyderabad in any aspect. All the infrastructural/commercial/educational/IT sector development was concentrated in and around Hyderabad city only.  In this position, without showing suitable exact alternative to Hyderabad, bifurcation process is not at all acceptable to the seemandhra region.

2.  Article 371 (D) was inserted in the Constitution by 32nd Constitutional amendment to do justice to the people living in various zones of Andhra Pradesh state. The central Government has no power to invoke Article 3 for creating the new state of Telangana without winding up the clause under Article 371 (D). In the 32nd amendment to the Constitution, two new articles -- 371 (D) and 371 (E) -- were inserted with the header, ‘Special provisions with respect to Andhra Pradesh’. This amendment was then inserted into the 7th schedule of the Indian Constitution which deals with the Union list, state list and the concurrent list. Article 368 clearly states that if any change is to be made under the 7th schedule, then it has to be adopted by a special majority. Both houses of Parliament have to pass the Bill with a two thirds majority. Such an amendment also has to be ratified by state legislatures. This means 50 per cent of the states have to give their nod in case the amendment has to be ratified.  Thus, the Parliament would need a national consensus on the Constitutional Amendment to create Telangana.  The states of Uttarakhand, Jharkhand and Chattisgarh were carved out of Uttar Pradesh, Bihar and Madhya Pradesh respectively by the National Democratic Alliance under the provisions of Articles 2, 3 and 4 of the Indian Constitution. The creation of these states did not pose too much of a constitutional hassle as there was no special provision mentioned, as in the case of Andhra Pradesh. Without considering all these jargon, Ministry of Home Affairs is hastily moving the division process. 
    
  1. The pro- Telangana political parties and forums are blaming the Seemandhra people for the neglect of Telangana region and are offering tall promises after the creation of the new State. However, the fact remains that it would not be possible to fulfill all these promises due to inherent factors. This does not imply that there would be no additional job opportunities and promotional avenues in the new State. Although the emotional aspirations of the people of Telangana to have their own State will be satisfied, economic expectations, including enhanced job opportunities which they expect, may not actually materialize. This may lead to frustration among the youth, professionals and even farmers. This frustration may lead to ‘ scape- goating’, leading to targeted attacks on Seemandhra settlers and their properties.

  1. There are so many separatist movements in the country like Gorkhaland, bodoland, vidarbha, etc. which are in sleeping mode now.  By creating a new state will now definitely make them to rise again and demands and agitations for so many smaller states will  hamper the development and peace of the nation. Moreover, Uttar Pradesh assembly already made a resolution to bifurcate their state and sent to Central Government earlier.  Keeping that issue pending, which is in advanced stage, the  Central Government is making proposals for division of Andhra Pradesh where there is no resolution from its Assembly.

  1. The Maoists are also likely to gain by the creation of a new state. It will be difficult for the new state to handle them with a bifurcated police force contributing to a weaker response to the problem. Telangana is  contiguous with other highly affected Maoist areas viz., Chhattisgarh and Maharashtra States. As such it is likely that the Maoists will extend their activities from these neighbouring states to Telangana, especially the districts of Adilabad, Karimnagar, Warangal, Khammam, parts of Nizamabad and Medak in north Telangana and Mahboobnagar and Nalgonda in south Telangana. It is important to note that it is not entirely a coincidence that the increased spread of Maoist violence in Chhattisgarh and Jharkhand, has been after the creation of these states.
The proposed bifurcation is not only strongly being opposed by the majority of the people in Andhra Pradesh state but also by the present Chief Minister of Andhra Pradesh who already represented Hon’ble President of India and Prime Minister of India to intervene in the matter and to halt  the bifurcation process which is against the constitutional guidelines. Still, if the Government feels the Division of Andhra Pradesh is inevitable, the following may be the best possible solution for addressing the concerns of all the 3 regions in the United Andhra Pradesh state :

The permanent capital for the Andhra and Telangana  states should be Hyderabad and Hyderabad should be made an Union Territory with extended limits as proposed in 4th suggestion of Sri Krishna Committee Report.  The larger Union Territory of Hyderabad shoud be created  by connecting Hyderabad ( HMDA) with Guntur ( Coastal Andhra)  in South- East and Kurnool ( Rayalaseema) in the South via Nalgonda and Mahboob Nagar (both Telangana districts) respectively through creation of appropriate corridors by merging a few Mandals with Hyderabad ( HMDA).   This proposal links Hyderabad to all the three regions of the State so that these regions have geographical contiguity and physical access to Hyderabad which is a  key issue in the bottleneck.   While larger Union Territory of Hyderabad to be governed with a Legislative Assembly and a Lt. Governor may have the advantage of addressing the issue relating to the status of Hyderabad and may even make Hyderabad Megapolis, an economic giant in due course and in the process help the border towns of all the three regions to grow substantially.

Tuesday, October 22, 2013

371- డి సవరణ అంత సులభమా?


రాజ్యాంగానికి చేసిన 32 వ సవరణ తో వచ్చిన ఆర్టికిల్ 371 - డి ద్వారా జోనల్ పరంగా ఉద్యోగుల/విద్యార్ధుల  ప్రయోజనాలు కాపాడ బడుతున్న సమయంలో  ఆ ఆర్టికిల్ కి సవరణ చేయకుండా  విభజన ప్రతిపాదించటం రాజ్యాంగ విరుద్ధం.   ఈ రోజు సాక్షి పత్రికలో సీనియర్ పాత్రికేయులు ఏబీకె ప్రసాద్ గారు ఈ విషయంలో సవివరమైన వ్యాసం వెలువరించారు. 

http://www.sakshi.com/news/opinion/abk-prasads-view-on-371-d-article-74765

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  విభజన ప్రక్రియకు, ఆర్టికిల్ 371- డి కి సంబంధమే లేదంటూ  ఈ క్లాజుకి సవరణ మహా సింపుల్ అంటూ గోబెల్స్ ప్రచారాలు చేస్తున్న వారు ఈ వ్యాసం చదివి అయినా తమ దురభిప్రాయాలని మార్చుకుంటే మంచిది.  

Monday, October 21, 2013

సీమాంధ్ర కి బిచ్చం వెయ్యనక్కరలేదు !


రాష్ట్ర విభజన విషయంలో మంత్రుల కూటమికి తమ సలహాలని ఇస్తూ డా . ఆచార్య ఫణీంద్ర గారు లేఖ రాసారు. 

http://dracharyaphaneendra.wordpress.com/2013/10/20/గ్రూప్-ఆఫ్-మినిష్టర్స్-gomక/

రాష్ట్రం విడి పొతే సీమాంధ్ర కి ఏమేమి సౌకర్యాలు కలుగ జేయాలో విశదీకరిస్తూ పండితుల వారు కేంద్రానికి లేఖ రాసారు. సంతోషం... అయితే పండిత పుత్రుల వంటి ఒకాయన దానికి వ్యాఖానిస్తూ  అంతటి వుదారత్వాన్ని అందుకోవటానికి సీమాంధ్ర సర్కారుకి అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నారు ! ఆలూ లేదు - చూలు లేదు కొడుకు పేరు సోమ లింగం అన్నట్లు పండితుల వారి లేఖ కేంద్రం  చదివిందో లేదో తెలియదు. చదివాక వారు చెప్పిన సౌకర్యాలన్నీ ఇస్తుందో లేదో తెలియదు.  కానీ ఆ ఇవ్వ బోయే సౌకర్యాలు (?)  అందుకొనే అర్హత సీమాంధ్రులకి  లేదని పండిత పుత్ర సమానులు  తెల్చెస్తున్నారు.  ఇటువంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, ప్రకటనల వల్లే విద్వేషాలు పెరిగి సమస్యలు జటిలం అవుతాయి.   రాష్ట్ర విభజనకి ముందు వున్న ప్రధాన సమస్య రాజధాని మాత్రమె.. 1956 లో రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాదు నగరానికి వచ్చిన మౌలిక వసతులు, విద్యా/వైద్య/ఉద్యోగ/పారిశ్రామిక  పరమైన సౌకర్యాలన్నీ 23 జిల్లాల తో కూడిన ఆంద్ర పదేశ్ రాష్ట్ర రాజధాని హోదాలో మాత్రమె  వచ్చాయి.  అలా ఉమ్మడిగా 57 సంవత్సరాల పాటు అభివృద్ది చెందిన తరువాత రాజధాని ని కలిగి వున్న ప్రాంతం విడి పోతామనటం హేతు బద్ధం కానే కాదు.  భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన రాజధాని పై హక్కులు వారివే అనటం మూర్ఖత్వం.  విడి పోతామన్న వారే కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలి.  అంతే తప్ప ఉమ్మడిగా అభివృద్ధి చెందిన రాజధాని ని కాజేద్దామని చూడటమే గాక సీమాంధ్రులకి ఆ సౌకర్యాలు అందుకొనే అర్హత లేదని వ్యాఖ్యానించటం ఓపలేని తనం.  విడి పోతామంటున్నది ఒకరు.. వుట్టి పుణ్యానికి తమ రాజధాని నుండి విడ దీస్తూ వెళ్ళగొట్ట బడుతోంది మరొకరు..ప్రత్యామ్నాయ రాజధాని ని ఏర్పాటు చేసుకోవటానికి 10 సంవత్సరాల గడువునిస్తూ కేంద్రం విభజన ప్రతిపాదిస్తే మూడేళ్ళు చాలని తెలంగాణా జే ఏ సి వారు సెలవిస్తున్నారు!  అలాగే ఉద్యోగుల విషయానికి వస్తే రాజ్యాంగానికి చేసిన  32 వ సవరణ తో  వచ్చిన ఆర్టికిల్ 371 - డి ద్వారా జోనల్ పరంగా/రాజధాని పరంగా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడ బడుతున్నాయి.  అటువంటప్పుడు హైదరాబాదు కి దీటుగా ప్రత్యామ్నాయ రాజధాని ని చూపకుండా విభజన ప్రతిపాదించటం రాజ్యాంగ విరుద్ధం..ఎవరు అవునన్నా కాదన్నా హైదరాబాదు పై హక్కు ని  సీమాంధ్రులు వదలుకొనే ప్రశ్నే లెదు.  హైదరాబాదుకి సరైన ప్రత్యామ్నాయం చూపే వరకు విభజన ప్రతిపాదన ముందుకి కదలటం సాధ్యం కాదు.  

లెస్స పలికిన జెపీ !


సూటిగా, నిక్కచ్చిగా మాట్లాడతారని పేరున్న లోక్ సత్తా నాయకుడు జయ ప్రకాష్ నారాయణ రాష్ట్ర విభజన ప్రక్రియ  పై చేసిన వ్యాఖ్యలు గమనించ తగ్గవి. సీమాంధ్ర ప్రజల, నాయకులని విశ్వాసంలోకి తీసుకోకుండా ఏక పక్షంగా సాగిస్తున్న విభజన ప్రక్రియ  భవిష్యత్తులో ఎన్నో విపరిణామాలకి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు.  నిజమే మరి ! ఓ పక్క లక్షలాది ప్రజలు గత 82 రోజులుగా  రాష్ట్ర విభజన ప్రతిపాదనకి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి వుద్యమిస్తుంటే కేంద్రానికి కనపడలెదు.  కానీ మంత్రుల కమిటీ కి రెండు వేల ఈ మెయిళ్ళు వచ్చాయిట ! ఏపీ లో అందరూ విభజననే కోరుకుంటున్నారని షిండే గారు సెలవిచ్చారు ! ఇంతకన్నా మూర్ఖత్వం ఎక్కడైనా ఉందా ? అసలు ఆ ఈ మెయిల్స్ ఎవరు  ఇచ్చారు? అందులో ఏముంది ఎవరు చూసారు ?  విభజన విషయంలో మొదటినుండీ తొండి  ఆడుతున్న కేంద్రం పారదర్శకంగా వ్యవహరించట్లేదు.  ప్రజల సొమ్ము వెచ్చించి నియమించిన శ్రీ కృష్ణ కమిషన్ 8 వ అధ్యాయంలో ఏమి వుందో ఈ రోజుకి ప్రజల కి తెలియదు.  రాష్ట్ర విభజన అంశం పై నియమించిన కమిషన్ నివేదిక లో ఒక భాగం రాష్ట్ర ప్రజలకి తెలియక పోవటం విచిత్రం....అంతే కాదు. శాసన సభ తీర్మానం అవసరం లేదంటూ ప్రకటనలు చేయటం కూడా అహంకారమే !  మొదటి ఎస్ఆర్సీ ద్వారా రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఆనాడు ఆంధ్ర, - హైదరాబాద్ రాష్ట్ర విలీనాల కోసం ఆయా  రాష్ట్ర శాసన సభల్లో తీర్మానాలు జరిగాయి.  మరి విడి పోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా ప్రస్తుత రాష్ట్ర శాసన సభలో తీర్మానం జరిగి తీరాలి.  రెండో ఎస్ ఆర్ సి అన్నది ఎలాగో లెదు. కేంద్రం తన విచక్షణాదికారాల తోనే రాష్ట్ర విభజన కై ముందుకు వెళుతోంది. అటువంటప్పుడు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలకి విలువనిస్తూ, శాసన సభ తీర్మానం లేకుండా ముందుకు సాగటం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమే!         

Friday, October 18, 2013

రాజీ డ్రామాలు ఇక ఆపండి !


యూపీఏ  లొసుగు బైట పడింది.  సీమాంధ్రకి  చెందిన 13 మంది పార్లమెంటు సభ్యుల రాజీనామాలని రెండు నెలలుగా నాన్చి  చివరికి వాటిని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలియజేసింది. తిరస్కరణ కి కారణం ఏమైనా కానీ ఎంపీ ల సంఖ్య పైనే ప్రభుత్వ మనుగడ ఆధార పడి  వుందని ఖాయమై పోయింది. తమని ఎన్నుకొన్న ప్రజల పట్ల నిజమైన నిబద్ధత కలిగి వుంటే -  ఇప్పుడు వత్తిడి తెచ్చినట్లే రెండు నెలల క్రితమే సీమాంధ్ర ఎంపీ లు చేసి వుంటే  - రాష్ట్ర విభజన విషయం కాబినెట్ నోట్ వరకు వెళ్లేదే కాదు.  ఇప్పటికైనా మన ఘనమైన పార్లమెంటు సభ్యులకి జ్ఞానోదయం అయ్యిందా అంటే అదీ లెదు... అధిష్టానం తమని మోసం చేసింది .. అధిష్టానం తమకు గౌరవం అసలు ఇవ్వట్లెదు.. తమను అసలు సంప్రదించటమే లెదు.. రాజీనామాల ఆమోదానికి కోర్టుకి వెళతాం అంటూ కాల యాపన చేసే ప్రసంగాలే చెస్తున్నారు.  ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చే దాకా కాబినెట్ నోట్ పెట్టము అని హామీ ఇచ్చిన అధిష్టానం - మాట తప్పి దొంగ దారిలో నోట్ పెట్టిన నాడే నిలదీయాల్సిన వారు - నేటికి కూడా ఆ పని చెయ్యట్లెదు.  అంతే  గాక రాష్ట్ర విభజన పై వెనక్కి తగ్గేదే లేదని రోజుకో చోటా మోటా నాయకుడు  టీవీ ల ముందు చెలరేగి పోతున్నా రోషం రాని  వారు మన సీమాంధ్ర  పార్లమెంటు సభ్యులు !  తమని  గౌరవించని -  తమ అభిప్రాయాలకి విలువ ఇవ్వని - తమ లెక్కే లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్న పార్టీలో ఇంకా వారు కొనసాగటమెందుకో అర్ధం కాదు.   సీమాంధ్రకి చెందిన 20 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతి వద్దకి వెళ్లి - తమ ప్రాంత ప్రయోజనాలకి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం పై తమకి విశ్వాసం లేదని ఒక్క లేఖ ఇచ్చి వుంటే -- విభజన కై రాజ్యాంగ ప్రక్రియ ముందుకు సాగించే ధైర్యం కేంద్రం చేస్తుందా ?  ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.     టక్కు టమార విద్యలు ప్రదర్శించి ప్రజలని ఏమార్చుదామనుకున్న  వారికి 2014 ఎన్నికల్లో తగిన గుణ పాఠం చెప్పి తీరుతారు. 

Thursday, October 17, 2013

శభాష్ ఎన్జీఓస్ !

విరమణ కాదు విరామమే అంటూ సమ్మెకి స్వస్తి పలికారు ఏపీ ఎన్జీఓ లు ! తండ్రిలా చూడాల్సిన కేంద్రం ధృతరాష్ట్రుడు  కౌరవ పక్షపాతం వహించినట్లు సీమాంధ్ర నెత్తిన విభజన కత్తి పెట్టినప్పుడు -  తమ ప్రాంతపు ప్రజల ప్రయోజనాలు దారుణంగా దెబ్బ తినే పరిస్థితి వచ్చినప్పుడు -  సీమాంద్ర రాజకీయ నాయకులు ఏమి చేసారు ?  పాలు తాగి రొమ్ము గుద్దిన రీతిగా తమని అధికారానికి పంపిన ప్రజలనే వంచించి పదవీ లాలసతో అధిష్టానానికి వంత పాడారు. తమని ఎన్నుకొన్న ప్రజల కన్నా కొత్తగా రాష్ట్రం వస్తే వచ్చే పదవులు, కాంట్రాక్టులే మిన్న అని భావిస్తూ ప్రజల అభీష్టానికి తూట్లు పొడుస్తూ నమ్మక ద్రోహం చేసిన రాజకీయ నాయకులు సీమాంధ్రకి రిక్త హస్తం అందించిన పరిస్థితుల్లో ఉవ్వెత్తున ఎగసి పడింది సమైక్యాంధ్ర ఉద్యమం.. ఆ ఉద్యమ నావకి చుక్కానిలా నిలిచి ముందుకు సాగించింది ఎన్జీఓ లే అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.. ఆర్టికిల్ 371 (డి) ద్వారా కాపాడబడుచున్న ఉద్యోగుల ప్రయోజనాలకి విభజన ద్వారా విఘాతం కలుగుతుంటే కడుపు మండిన ఉద్యోగులు సమ్మెకి దిగారు...కానీ ఆరు నెలల్లో ముగిసి పోయే పదవిని, అధికార లాంచనాలని వదులుకోవటానికి రాజకీయ నాయకులు మాత్రం  సిద్ధ పడలేదు. వంచనకి గురి అయిన సీమాంధ్ర కి రాజకీయ పరంగా ఎటువంటి తోడ్పాటు అందని పరిస్థితుల్లో ఉద్యమ బాధ్యతని నెత్తిన వేసుకొని  రెండు నెలల పాటు తమ తమ కుటుంబాలని గాలికి వదలి, ఆర్ధికంగా కూడా నానా బాధలు పడుతూ,  అత్యంత నిబద్ధత తో రాష్ట్ర సమైక్యం కోసం ఉద్యోగులు సాగించిన సమరం సాటి లేనిది..   అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా సెప్టెంబర్ 7 వ తేదీన హైదరాబాదు లో వారు శాంతియుతంగా నిర్వహించిన సమైక్య సభ దేశ వ్యాప్త మన్ననలని  అందుకుంది.  వేర్పాటు వాదులు రక్తమోడేలా దాడులు చేసినా సంయమనం కోల్పోకుండా రాజధానిలో సమైక్య వాణి వినిపించే దమ్ము చూపారు.  సీమాంధ్రకి అన్యాయం జరుగుతోంది. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే ఆ అన్యాయాన్ని ఎదుర్కొనే బాధ్యత కేవలం ఎన్జీఓ లే మోయటమన్నది సమంజసం కానే కాదు.. సమాజం లోని అన్ని వర్గాలు ముందుకి వచ్చి రాష్ట్ర సమైక్యాన్ని కాపాడుకోవలసిన అగత్యం ఇప్పుడు వుంది.  కేవలం కాబినెట్ నోట్ అయినంత మాత్రాన రాష్ట్రం విడిపోయినట్లు కానే కాదు.  ఇంకా జరగ వలసిన రాజ్యాంగ ప్రక్రియ చాలా చాలా వుంది. రాష్ట్రం విడి పోయినట్లే అంటూ రాజకీయ నాయకులు ఆడుతున్న మైండ్ గేమ్ ఉచ్చులో ప్రజలు   పడరాదు. అవసరమైతే మెరుపు సమ్మెకి దిగటానికి ఉద్యోగులు ఎలాగూ సిద్ధంగా వున్నారు. అంతిమ ఫలితం ఎలా వున్నా ఇప్పటి వరకు ఉద్యోగులు చూపిన మార్గ దర్శనానికి సీమాంధ్ర వారికి ఎప్పటికీ ఋణ పడి వుంటుంది.. వుద్యోగులారా అందుకోండి తెలుగు జాతి తరపున  శుభాభినందనలు..విజయోస్తు..

Wednesday, October 16, 2013

సమైక్యత నుంచి సమ న్యాయం - సమ న్యాయం నుంచి అన్యాయం !


కీలకమైన సమయంలో అచేతనంగా ఉండి పోతూ రాష్ట్ర విభజనకి పరోక్షంగా సహకరిస్తున్న సీమాంధ్ర మంత్రుల, ఎంపీ ల ప్రవర్తన నానాటికీ క్షంతవ్యం కాని రీతిన సాగుతోంది.  తమని ఎన్నుకొన్న ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ కూడా సమైక్యానికి కట్టుబడి ఉన్నామంటూ నమ్మ బలకాలని చూడటం విచిత్రం. మైనారిటీ లో ఉన్న ప్రభుత్వం లో సీమాంధ్ర ఎంపీ లు అందరూ మూకుమ్మడిగా రాష్ట్రపతిని కలిస్తే తెలంగాణా నోట్ వచ్చేదా ?  సీమాంధ్ర కి అన్యాయం జరుపుతూ విభజన ప్రతిపాదన చేసిన వెంటనే అధిష్టానాన్ని స్వచ్చందంగా నిల దీయాల్సింది పోయి 77 రోజులు గా ప్రజలు,ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రతిస్పందించక పోవటం తమని ఎన్నుకున్న వారికి ద్రోహం చెయ్యటమే ! అంటోనీ కమిటీ అంటూ మభ్య పెట్టి తమ సమస్యలు వినకుండానే కాబినెట్ ముందుకి తెలంగాణా నోట్ పెట్టినప్పుడైనా స్పందించారా అంటే అదీ లేదు... ఉవ్వెత్తున ఎగసిన ప్రజాగ్రహానికి జడిసి హస్తినలోను, హైదరాబాదులోనూ దాక్కున్నారే తప్ప అధిష్టానాన్ని నిలదీసిన పాపానికి పోలేదు. ఒక రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యం గలిగిన అంశం అజెండాలో లేకుండా కేవలం టేబుల్ పాయింట్ గా పెట్టి తొండి చేసిన విధంగా కాబినెట్ ఆమోదించినప్పుడు ప్రజలు ఆగ్రహంతో స్పందించారు కానీ ఘనమైన సీమాంధ్ర నాయకులకి అది అన్యాయంగా,  అసమంజసంగా కనిపించలేదు.  ఆ కాబినెట్ సమావేశంలో పాల్గొన్న ఇద్దరు సీమాంధ్ర మంత్రులు  కనీసం డిసెంట్ నోట్ ఐన రాసారో  లేదో తెలియదు. ఇక తదుపరి తంతు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ !  విభజన అంశాలని నిర్ణయించ వలసిన మంత్రుల కూటమి లో వుంచుతామంటే రాజీనామా వెనక్కి తీసుకున్న పల్లం రాజు తన పేరు లేనప్పుడైనా పోరాడారా ?  తెలుగు రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలో ఒక్క తెలుగు మంత్రి కి కూడా స్థానం లేకుండా - కనీసం ఆ మంత్రుల కమిటీ రాష్ట్రానికి సైతం రాకుండా తన చిత్తం వచ్చినట్లు విభజన ప్రక్రియని కొనసాగిస్తుంటే అడిగే దమ్ము ఒక్క సీమాంధ్ర నాయకునికీ లేదా ? ఈ రోజు ప్రజల ముందుకి వచ్చి విభజన ప్రక్రియని అడ్డుకోలేక పోయామంటూ మొసలి కన్నీరు కారుస్తూ సీమాంధ్ర కి రావలసిన ప్యాకేజీ కై పోరాడతామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్న కేంద్ర మంత్రుల మాటలు నమ్మే స్థితిలో ఎవ్వరూ లేరు.  ఎప్పుడో 13 ఏళ్ల క్రితం ఏర్పాటైన రాష్ట్రాలకి ప్రకటించిన ప్యాకేజీలకే దిక్కు లేదు.. ఇప్పుడు సీమాంధ్ర కి ప్యాకేజీ అనటం ప్రజల చెవుల్లో క్యాబేజీ పువ్వులు పెట్టటమే...వారికి రావలసిన ప్యాకేజిలు వారికి వచ్చాయి  కనుక కనీసం ప్రజలని మభ్య పెట్టె కార్యక్రమాలకైనా వారు ముగింపు పలికితే మంచిది. 

Monday, October 14, 2013

సిగ్గు శరం లేని సీమాంధ్ర ఎంపీలు !

కేంద్రం ప్రతిపాదించిన అడ్డగోలు విభజన ప్రతిపాదనకి వ్యతిరేకంగా రెండు నెలలుగా జీతాలు కూడా లేకుండా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.  తమ స్వంత ఇంటి నుంచి గెంటి వేసిన విధంగా విభజన ప్రతిపాదించినా కూడా అధిష్టానానికి ఎదురు చెప్పే దమ్ము లేని మన సీమాంధ్ర ఎంపీలు - రెండు నెలల కాలంలో కూడా తమ రాజీనామాలని సైతం ఆమోదింప జేసుకోలేక  పోయారు.  హరికృష్ణ రెండు నిమిషాల్లో చేయగలిగిన పని రెండు నెలల సమయంలో కూడా చేయలేక పోయారు.  అయితే ప్రగల్భాలు పలకటంలో మాత్రం ఏ మాత్రం తక్కువ లేదు వారికి!   రాజీనామాల ఆమోదానికి స్పీకరు దే విచక్షణాదికారం !  అలాగే కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో కూడా కేంద్రానిదే విచక్షణాదికారం ! కానీ ఆ అధికారాలని వారు దుర్వినియోగం చేస్తున్నప్పుడు అడ్డుకొనే మార్గమే తెలీదా మన ఎంపీ లకి ?


కేంద్రం లో యూ పీ ఏ ప్రభుత్వానిది బొటా బొటి మెజారిటీ..  ఒక్క పది మంది ఎంపీలు రాజీనామా చేసి బయటకి వచ్చి  వుంటే కేంద్రం  అంత దూకుడుగా ఉండ గలిగేదా ?  దొంగ దెబ్బ తీసినట్లు టేబుల్ పాయింట్ చర్చ ద్వారా   తెలంగాణా నోట్  పెట్టగలిగి ఉండేదా ?

 పొరుగు రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ కి ఉన్న జ్ఞానం కూడా మన వారికి లేక పోవటం బాధాకరం.  నిద్ర పోతున్న వారిని లేపగలం కానీ నిద్ర నటించే వారిని లేపడం కుదరని పని. హై కమాండ్ పట్ల ఎంపీలకి విశ్వాసం వుండటం తప్పు కాదు. కానీ అంతకన్నా సుప్రీం కమాండ్ అయిన - తమని ఎన్నుకొన్న ప్రజలు, ఉద్యోగులు రాజీనామాలు చేయమని శాసిస్తుంటే - పదవులు పట్టుకొని వేళ్ళాడుతూ కూడా తమది సమైక్య వాదమే అంటూ నమ్మబలుకుతున్న వారంతా తెలుగు జాతి ద్రోహులే ! చిరుద్యోగులకి  ఉన్న నిబద్ధత కూడా తమ ప్రాంతం పట్ల లేని వారందరూ తప్పని సరిగా చరిత్ర హీనులు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. 

ఒక సభకి భద్రతనీయలేని వారు సీమాంధ్రులందరికీ ఇస్తారా ?


వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19 న తల పెట్టిన సమైక్య శంఖారావం సభకి పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల వంక చూపి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలియ చేసారు.  అలాగే సెప్టెంబర్ 7 న జరిగిన ఏపీ ఎన్జీఓ ల సభకి సైతం సవా లక్ష ఆంక్షలతో అతి తక్కువ సమయం మాత్రం అనుమతి ఇచ్చారు.  కానీ ఈ మధ్యనే జరిగిన తెలంగాణా గర్జన సభకి మాత్రం ఎటువంటి ఆంక్షలు లేకుండా ముందుగానే అనుమతులిచ్చేసి ఎంతైనా గర్జించుకోమన్నారు. ప్రస్తుతానికి సమైక్య రాష్ట్రంగా ఉన్నఆంద్ర ప్రదేశ్ రాజధాని లో తమ వాణిని వినిపించే హక్కుని అందరికీ సమానంగా కలిగించాలన్న కనీస స్పృహ ప్రభుత్వానికి లోపించింది. సమైక్య వాదుల సమావేశం అంటే చాలు - నానా విధమైన అడ్డంకులు, దాడులు  చేస్తూ  అరాచకం సృష్టిస్తున్న వేర్పాటు వాదులని కట్టడి చెయ్యకుండా - శాంతియుతంగా సభ జరుపుకుంటామనే సమైక్య వాదుల పైనే ఆంక్షలు, అనుమతి నిరాకరణలు కొన సాగించటం అసమంజసం.  ఇక్కడ ప్రభుత్వం గానీ, వేర్పాటువాదులు గానీ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే....హైదరాబాద్ అన్నది తెలుగు వారందరి రాజధాని.  అది ఏ ఒక్కరి గుత్త సొత్తు కాదు. సభలు సమావేశాలు జరుపుకునే హక్కు అన్ని ప్రాంతాల వారికి వుంటుంది.  అయితే ఈ విషయం కోర్టులు చెప్తే తప్ప వినిపించుకొనే దశలో ప్రభుత్వం కూడా వుండటం శోచనీయం. ఎన్జీఓ ల సభకు కోర్టు అనుమతి కావలిసి వచ్చింది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ సభకి అనుమతి కోసం సంప్రదిస్తే కోర్టు గడువు విధిస్తే తప్ప కనీసం నిరాకరిస్తున్నామన్న సమాధానం సైతం ఇవ్వలేని చేవ లేని స్థితిలో ప్రభుత్వం వుంది.  సమైక్య వాదుల సభ అంటే చాలు,  అడ్డుకొని తీరతామన్న వేర్పాటు వాదుల ఆగడాల పై ఇలా చేతులెత్తేస్తున్న ప్రభుత్వం  - రాష్ట్రం విడిపోతే సీమాంధ్రులందరికీ భద్రత ఎలా కల్పిస్తుంది?  

Sunday, October 13, 2013

పార్టీల లేఖలే తప్ప ప్రజాభిప్రాయం పట్టదా ?

కేవలం పార్టీలు లేఖలు ఇచ్చాయన్న అంశం పట్టుకొని కేంద్రం మొండిగా  రాష్ట్ర విభజనకి అడుగులు వేస్తోంది,  రోజుకో విధంగా మారే పార్టీల అభిప్రాయం రాష్ట్ర విభజన వంటి ముఖ్యమైన విషయానికి ప్రాతిపదికగా  ఎలా తీసుకుంటారు ?   కెసిఆర్  తెలుగు దేశం మంత్రిగా వున్నప్పుడు విశాల రాష్ట్ర ప్రయోజనాలకై సాక్షాత్తూ శాసన సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే.


రెండవ పర్యాయం ఆయనకి చంద్ర బాబు మంత్రి పదవి ఇచ్చి వుంటే  టీఆర్ఎస్ పార్టీ పుట్టేదీ కాదు..కోల్డ్ స్టోరేజీ లో ఉన్న విభజన వాదం బైటకి వచ్చేదీ కాదు.    అలాగే బీజెపీ తాము కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు తెలంగాణా రాష్ట్రం అవసరమే లేదని సాక్షాతూ ఆనాటి కేంద్ర హొమ్ మంత్రి అద్వానీ రాత పూర్వకంగా తెలియజేసారు.


 అంతే కాదు..ప్రాంతీయ అసమానతలకి పరిష్కారం సరైన మార్గంలో వనరుల వినియోగమే తప్ప ప్రత్యెక రాష్ట్రానికి కేంద్రం ప్రతిపాదన అన్నదే లేదని కుండ బద్దలు కొట్టారు.. మరి అదే బీజెపీ నేడు ప్రతి పక్షంలో ఉండి, విభజన వాదాన్ని సమర్ధించటం అవకాశవాదమే !   ఇక మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఎన్ని యూ టర్న్ లు-పీ టర్న్ లు తీసుకున్నాయో లెక్కే లేదు..అసలు విభజన ప్రతిపాదన పట్ల కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు.  తమ స్వంత పార్టీ ముఖ్యమంత్రినే విశ్వాసంలోకి తీసుకోలేని కాంగ్రెస్  కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లు ఇతర  పార్టీల ఉత్తరాలు పట్టుకుని రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూడటం మూర్ఖత్వం.  నేర చరిత్ర గల వ్యక్తులకి సంబంధించిన ఆర్డినెన్స్ ని వెనక్కి తీసుకున్నట్లు గానే రాష్ట్ర విభజన ప్రతిపాదన కూడా  వెనక్కి తీసుకోక పొతే కాంగ్రెస్ భూస్థాపితం అవటం ఖాయం. 

Saturday, October 5, 2013

అంపైర్ మాచ్ ఫిక్సింగ్ !


బుకీలు ఇచ్చే సొమ్ములకి ఆశ పడి మాచ్ ఫిక్సింగ్ చేసిన క్రికెటర్లని చాల మందిని చూసాం.  అయితే అంపైర్ మాచ్ ఫిక్సింగ్ చెయ్యటం అన్నది ఎక్కడైనా జరిగిందా?  ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మధ్యనే జరిగింది.  ఇక్కడ రెండు జట్లు వున్నాయి. మొదటి జట్టులో స్టార్ బాట్ మాన్ వున్నారు, ఇంకా దేశంలోనే ఏ ప్రాంతానికైనా వెళ్లి ఆడి గెలవగల ఆల్ రౌండర్లు వున్నారు.  రెండవ జట్టుకి ఆడటం అసలు చేత కాదు కానీ అవతల జట్టుని ఆడి పోసుకోవటం మటుకు బాగా తెలుసు. ఈ ఆడి పోసుకోవటం అన్నది బాగా ఎక్కువ అవటంతో ఈ మధ్యనే కృష్ణ అన్న న్యూట్రల్ అంపైర్ రెండు జట్ల సామర్ధ్యాలని కూలంకషంగా పరిశీలించి,  రెండవ జట్టు ఆడి పోసుకోవటం అసంబద్ధమే అని తేల్చేసాడు.  దానితో  ఇక ఎలాగైనా గెలవాలన్న దుగ్ధతో రెండవ జట్టు ప్రస్తుత అంపైర్ తో చీకటి ఒప్పందానికి మాచ్ ప్రారంభానికి ముందే  వచ్చేసింది.   ఇక టాస్ వెయ్యటం దగ్గరనించి తొండి ఆట మొదలయ్యింది.  స్వయంగా అంపైరే మొదటి జట్టు సభ్యులని ప్రలోభ పెట్టటం, బెదిరించటం మొదలు పెట్టాడు. అంపైరే తొండి కి దిగుతాడని ఊహించని  మొదటి జట్టు ఆఖరి బంతి వరకు ఆట వుంటుంది కదా, ఎలాగైనా ఆడి గెలవచ్చని భరోసాగా వుంది.  కానీ ఆఖరి బంతి వరకు ఆడనిస్తే అంపైర్ ప్రత్యేకత ఏముంది ?  అందుకే ఆట మధ్యలోనే రెండవ జట్టుకి అనుకూలంగా తీర్పు ఇచ్చేసి మాచ్ ముగిసిందని అంపైర్ ప్రకటించేసాడు.  అడ్డ గోలుగా తీర్పు ఇస్తే చూస్తున్న ప్రేక్షకులు ఊరుకుంటారా? ఉతికి ఆరేస్తారన్న విషయం అంపైర్ మర్చిపోయాడు.  ప్రస్తుతం అంపైర్ ని ఉతికి ఆరేయ్యటం అన్న కార్యక్రమమే రాష్ట్రంలో జరుగుతోంది. 

Thursday, October 3, 2013

ఇల్లలుకగానే పండుగ కాదు ! నోట్ పెట్టగానే రాష్ట్రం రాదు!



ఒక దుష్ట సాంప్రదాయానికి తెర లేచింది. ఒక రాష్ట్ర ప్రజల సమ్మతి లేకుండా, ఆ రాష్ట్ర శాసన సభ తీర్మానం లేకుండా కేంద్రం తన చిత్తం వచ్చినట్లు తమకు నచ్చని రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నించే నికృష్ట చర్యకి కాంగ్రెస్ ఉపక్రమించింది.  రెండు సార్లు వరుసగా అధికారం లోకి రావటానికి కారణ భూతులు అయినందుకు తెలుగు వారి నెత్తిన భస్మాసుర హస్తం కాంగ్రెస్ పెట్టింది. రాష్ట్ర విభజన వంటి అతి ముఖ్యమైన అంశం టేబుల్ ఐటం గా కేబినేట్ లో చర్చించటమా?  సిగ్గు చేటు ! ముందుగా ఎజెండాలో తెలంగాణా నోట్ ని చేర్చే  ధైర్యం కూడా చెయ్యలేని కేంద్రం దొడ్డి దోవలో టేబుల్ ఐటం గా తెలంగాణా నోట్ పెట్టి హడావిడిగా ఆమోదింప జేయడం దేనికి నిదర్శనం ? 

దేశంలో అనేక చోట్ల ప్రత్యెక రాష్ట్ర ఉద్యమాలు వున్నాయి.  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తమ రాష్ట్ర విభజన కోసం శాసన సభ తీర్మానం సైతం కేంద్రానికి పంపి వుంది.  వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలం తెలుగు రాష్ట్రాన్నే విభజించాలని కేంద్రానికి ఎందుకు పంతం?  కాంగ్రెస్ కేంద్ర కమిటీ నిర్ణయమే శిలా శాసనమైతే, నేర చరిత్ర గల సభ్యులని కాపాడే ఆర్డినెన్స్  రాష్ట్రపతి దాకా వెళ్ళాక ఎలా వెనక్కి తీసుకున్నారు?  విభజన వల్ల సీమాంధ్రులకి  జరగబోయే అన్యాయం గురించి లేశ మాత్రం ఆలోచించకుండా విభజన ప్రక్రియని ముందుకు సాగించటం కాంగ్రెస్ చేస్తున్న దుస్సాహసం ! ఇందుకు ఆ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. జూలై 30 ప్రకటన ఇచ్చిన 64 రోజుల తరువాత అదే ప్రకటన నేడు కాబినెట్ నోట్ లో చేర్చడం తప్ప కాంగ్రెస్ ప్రస్తుతానికి సాధించింది ఏమీ లేదు.  ఇంక జరగాల్సింది ముందు చాలా వుంది.


 సీమాంధ్ర లో ఎగసి పడుతున్న ఉద్యమాన్ని లెక్క జేయకుండా విభజన ప్రక్రియకి ముందుకు సాగితే - ఇన్నాళ్ళూ శాంతియుతం గా నిరసనలు తెల్పిన తెలుగు జాతి తమ సత్తా ఏమిటో కేంద్రానికి తెలియ జేపుతుంది. తనకి ఉన్న విచక్షణాధికారాన్ని  దుర్వినియోగం చేసి కేంద్రం అడ్డగోలు విభజనకి తెగ బడుతున్నప్పుడు రాష్ట్రపతి, ఇంకా దేశంలో న్యాయ వ్యవస్థలు కూడా క్రియా శీలకం కావాలి. వారికి ఉన్న విచక్షణాదికారాలని వినియోగించి కేంద్రం దుర్మార్గానికి అడ్డు కట్ట వెయ్యాలి.  సాంప్రదాయ పద్ధతిలో శాసన సభ అంగీకార తీర్మానంతో బిల్లు తన ముందుకు వస్తేనే రాష్ట్రపతి ఆమోదించాలి.    సీమాంద్ర ఉద్యమకారులు కూడా శాంతియుతంగా ఉద్యమం  చేస్తూనే న్యాయ వ్యవస్థల తలుపు తట్టి కేంద్రం దురాగతాన్ని ముందుకు సాగనివ్వకుండా అడ్డు కట్ట వెయ్యాలి. ఇంత జరిగాక కూడా ఇంకా పదవుల్లో ఉన్న సీమాంధ్ర రాజకీయ నాయకులు అందరిని తెలుగు జాతి ద్రోహుల కింద జమ కట్టి సామాజిక బహిష్కరణ చెయ్యాలి. 

Wednesday, October 2, 2013

రాష్ట్ర విభజన జరిగి పోయింది అనే వారందరూ తెలుగు జాతికి ద్రోహులే !

రాష్ట్ర విభజనకి నిర్ణయం జరిగి పోయింది, ఇప్పుడేమి చెయ్యలేం, హైకమాండ్ ని వేడుకోవటం తప్ప చేసేదేమీ లేదు అంటూ బేల తనం నటిస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు అందరూ తెలుగు జాతికి తీరని ద్రోహం చేస్తున్నారు.  ఎవరిని నమ్మించటానికి ఈ కట్టు కధలు చెపుతారో అర్ధం కాదు.  ఒక కాంగ్రెస్ నాయకుడే చెప్పినట్లు  ఈ రోజుల్లో పొలం గట్టు మీద  నుంచున్న రైతుకి కూడా  అన్ని విషయాలు తెలిసి పోతున్నాయి.  నిర్ణయం జరిగింది ఒక రాజకీయ పార్టీ  కేంద్ర కమిటీ లో మాత్రమె. (ఆ కమిటీ లో తెలుగు వాళ్ళెవ్వరూ లేరు). రాష్ట్ర విభజనకి అవసరమైన చట్ట పరమైన ప్రక్రియ
అంగుళం కూడా ముందుకు జరగలేదు..జరగదు. ఈ కారణం వల్లనే రాష్ట్ర విభజన ప్రతిపాదన పై కోర్టుల్లో వేసిన రెండు కేసులని 'ప్రి మెచ్యూర్ద్ ' అని కొట్టి వేయటం జరిగింది. సీమాంధ్ర ఉద్యమం దెబ్బకి విభజనకి నోట్ పెట్టటానికి సైతం కేంద్రానికి ధైర్యం చాలట్లేదు. ఈ పరిస్థితిలో నోట్ పై వెనుకడుగు తమ ప్రతాపమే అని ఎంపీలు ప్రగల్భాలు పలికితే నమ్మే వారు ఎవరూ లేరు.  వారికి తమ హైకమాండ్ పట్ల విశ్వాసం వుంటే తప్పు కాదు. అయితే అంతకన్నా సుప్రీం కమాండ్ అయిన ప్రజలు వారిని రాజీనామాలు చేయమని శాసిస్తున్నప్పుడు తమ పదవులని జలగల్లా వదలకుండా రాజీడ్రామాలు  ఆడుతూ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న విధంగా ప్రజలు తమని గమనించట్లేదని భావించటం మూర్ఖత్వం.  రాష్ట్ర విభజన పై  మిగతా రాజకీయ పార్టీల లాగే కాంగ్రెస్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ నిర్ణయానికి ఆ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు.  అటువంటప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం శిలా శాసనం ఎలా అవుతుంది ? రాహుల్ గాంధీ అనబడే ఒక్క ఎంపీ నోరు విప్పితేనే రాష్ట్రపతి వరకు వెళ్ళిన ఒక ఆర్డినెన్స్ ని చింపి  పారేయ్యాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ వుంది. ఆయన సోనియా గాంధీ కొడుకు అన్న వ్యక్తిగత హోదా ని పక్కన పెడితే కేవలం ఒక్క ఎంపీ అభ్యంతరం తోనే ఒక నిర్ణయాన్ని వెనుకకి తీసుకున్నప్పుడు సీమాన్ధ్రకి చెందిన 25 మంది ఎంపీలు నిజాయితీ గా నిరసన తెలిపితే ఎందుకు ఫలితం వుండదు ? పోనీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదనుకుంటే కనీసం సక్రమంగా రాజీనామాలు చేసినా ప్రభుత్వం మైనారిటీలో పడి బిల్లు వచ్చే పరిస్థితి ఉండదు..ఆ పనైనా సక్రమంగా చేయమని ప్రజలు, ఉద్యోగులు గద్దిస్తున్నా దాగుడు మూతలు ఆడుతున్న సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు  అందరు చరిత్ర హీనులు.. తెలంగాణా కి అడ్డుపడ్డ వారందరూ తెలంగాణా ద్రోహులే అని తెలబాన్ నాయకుడు ప్రకటించాడు.  సీమాంధ్ర రాజకీయ నాయకులారా! మీరు ఒక్క విషయం గమనించాలి.. మీరు  తెలంగాణా ద్రోహులు అయినా పరవాలేదు.. తదుపరి ఎన్నికల్లో ప్రజలు మీకు బ్రహ్మ రధం పడతారు.  కానీ తెలుగు జాతి ద్రోహులు అయితే మాత్రం చరిత్ర హీనులుగా కాల గర్భంలో కలిసి పోతారు... 

Tuesday, October 1, 2013

కేసిఆర్ కుసంస్కారం !


ఈ క్రింది వీడియో చూడండి.. తెలబాన్ నాయకుని దురహంకార వ్యాఖ్యల పై నిండు శాసన సభలో ఆనాటి ముఖ్య మంత్రి వైఎస్ కడిగి పారేసినప్పుడు కిక్కురుమనకుండా కుక్కిన పేనులా పడివున్న కేసిఆర్ ఈనాడు వైఎస్ ప్రమాదంలో మరణిస్తే పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయాడని అవహేళన చెయ్యటం ఏమి సంస్కారం? చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడే పధ్ధతి ఇదేనా? 
  



 అంతే కాదు..కలిసుందామని చెప్పిన వారందరూ బేవకూఫ్ లుగా కనిపిస్తున్నారు ఆయనకి ! ఒక వేలు ఎదుటి వారికి చూపిస్తే నాలుగు వేళ్ళు తననే చూపిస్తాయన్న సంగతి ఆయన మర్చి పోతున్నారు. పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఎదుటి వారందరూ బేవకూఫ్ లుగా కనిపిస్తే అది ఆయన లోపమే అవుతుంది.  సీమాంధ్రకి అన్యాయం చేస్తూ ఏకపక్షంగా ప్రతిపాదించిన విభజన పై తన నిరసన గళాన్ని వినిపించిన ముఖ్య మంత్రి పై వ్యక్తిగత దూషణలకి దిగటం కూడా ఆయన దిగజారుడు మనస్తత్వానికి ప్రతీక. అయినా తెలబాన్ నాయకుని నుండి సంస్కారయుతమైన ప్రసంగాలని ఆశించటం ఇసుక నుండి తైలం తీసే ప్రయత్నమే అవుతుంది.  కానీ ఎప్పుడూ ఇతర పక్ష నాయకులని, వ్యాపారస్తులని మాత్రమె దూషించే కెసీఆర్ సకల జన భేరి లో మొత్తం సీమాన్ద్రులనే దుమ్మెత్తి పోయటం రాబోయే విపరిణామాలకి సూచిక.  లంకలో పుట్టిన వారందరూ రాక్షసులే.. సీమాన్ధ్రలో పుట్టిన వారందరూ తెలంగాణా ద్రోహులే అని నోరు పారేసుకుంటే ఇక రాబోయే (?) తెలంగాణా లో సీమాంధ్రుల భద్రత కి హామీ ఎక్కడ వుంటుంది ?  తెలబాన్ నాయకుడు ఇటువంటి నోటి దురుసు చూపినంత కాలం సీమాన్ధ్రలో ఉద్యమం ఎగిసి పడుతూనే వుంటుంది..తెలంగాణకి నిలువూ అడ్డం రెండూ కెసీఆర్ మాత్రమె అవుతారు...