Sunday, October 13, 2013

పార్టీల లేఖలే తప్ప ప్రజాభిప్రాయం పట్టదా ?

కేవలం పార్టీలు లేఖలు ఇచ్చాయన్న అంశం పట్టుకొని కేంద్రం మొండిగా  రాష్ట్ర విభజనకి అడుగులు వేస్తోంది,  రోజుకో విధంగా మారే పార్టీల అభిప్రాయం రాష్ట్ర విభజన వంటి ముఖ్యమైన విషయానికి ప్రాతిపదికగా  ఎలా తీసుకుంటారు ?   కెసిఆర్  తెలుగు దేశం మంత్రిగా వున్నప్పుడు విశాల రాష్ట్ర ప్రయోజనాలకై సాక్షాత్తూ శాసన సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే.


రెండవ పర్యాయం ఆయనకి చంద్ర బాబు మంత్రి పదవి ఇచ్చి వుంటే  టీఆర్ఎస్ పార్టీ పుట్టేదీ కాదు..కోల్డ్ స్టోరేజీ లో ఉన్న విభజన వాదం బైటకి వచ్చేదీ కాదు.    అలాగే బీజెపీ తాము కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు తెలంగాణా రాష్ట్రం అవసరమే లేదని సాక్షాతూ ఆనాటి కేంద్ర హొమ్ మంత్రి అద్వానీ రాత పూర్వకంగా తెలియజేసారు.


 అంతే కాదు..ప్రాంతీయ అసమానతలకి పరిష్కారం సరైన మార్గంలో వనరుల వినియోగమే తప్ప ప్రత్యెక రాష్ట్రానికి కేంద్రం ప్రతిపాదన అన్నదే లేదని కుండ బద్దలు కొట్టారు.. మరి అదే బీజెపీ నేడు ప్రతి పక్షంలో ఉండి, విభజన వాదాన్ని సమర్ధించటం అవకాశవాదమే !   ఇక మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఎన్ని యూ టర్న్ లు-పీ టర్న్ లు తీసుకున్నాయో లెక్కే లేదు..అసలు విభజన ప్రతిపాదన పట్ల కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు.  తమ స్వంత పార్టీ ముఖ్యమంత్రినే విశ్వాసంలోకి తీసుకోలేని కాంగ్రెస్  కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లు ఇతర  పార్టీల ఉత్తరాలు పట్టుకుని రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూడటం మూర్ఖత్వం.  నేర చరిత్ర గల వ్యక్తులకి సంబంధించిన ఆర్డినెన్స్ ని వెనక్కి తీసుకున్నట్లు గానే రాష్ట్ర విభజన ప్రతిపాదన కూడా  వెనక్కి తీసుకోక పొతే కాంగ్రెస్ భూస్థాపితం అవటం ఖాయం. 

6 comments:

  1. కాంగ్రెస్ ఇప్పటికే భూస్థాపితం అయిపొయింది సీమాంధ్ర లో. అది తెరాస, వైకాపా సహాయంతో రెండు వైపులా అన్ని వోట్లు కొల్లగొట్టొచ్చు అని పగటి కలలు కంటోంది. ప్రజలని మరీ ఇంత అర్థం చేసుకోలేని వెధవలనుకున్నారేమో. ఎన్నికలయ్యాక తెరాస, వైకాపా రెండూ కాంగ్రెస్ లో విలీనం అయ్యేవే.

    ReplyDelete
  2. మరి టిడిపి ? అది కాంగ్రెస్‌కు లోపాయికారిగా మద్దతిస్తుందా

    ReplyDelete
  3. నిజమె, నాకు మొదటి నుంచీ ఈ లేఖల వ్యవహారం వింతగా అనిపించింది.పార్టీ అద్యక్షులనే కొందరు వ్యక్తులు ఇచ్చిన లేఖలకి చట్టబధ్ధత యెలా ఉంటుంది?రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి అయినా మంత్రివర్గ సభ్యుడయినా అధికార పక్ష సభ్యుడైనా ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుదయినా సాంకేతికంగా వాళ్ళందరి మౌలికమయిన శాశ్వతమయిన గుర్తింపు శాసన సభ్యుడిగా మాత్రమే కదా. ఒక శాసన సభ్యుడు మంత్రిగా గానీ ముఖ్యమంత్రిగా గానీ యెప్పుడవుతాడు?వాళ్ళు యే పార్టీ తరపున పోటీ చేసారో ఆ పార్టీకి అత్యధిక స్థానాలు వొస్తే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని సమర్ధతల్ని బట్టి యేర్పాటు చేసుకున్న్న తాత్కాలికమయిన సర్దుబాట్లు మాత్రమే కదా.ఆ యా స్థానాలకి యెప్పుడయినా వాళ్ళు రాజీనామా చేస్తే అంతిమంగా మిగిలి ఉండేది వాళ్ళ శాసన సభ్యుడి హోదా మాత్రమే కదా!యేదయినా ఒక బిల్లుని సభలో ప్రవేశపెట్టటానికి కానీ, సవరణలు ప్రతిపాదించటానికి కానీ, వ్యతిరేకించటానికి కానీ సమర్ధించటానికి కానీ ప్రతి సభ్యుడికీ హక్కులూ బాధ్యతలూ అధికారాలూ అన్నింటిలోనూ అందరూ సమానమే కదా. కాకపొతే యెక్కువ స్థానాలు గెలవడం వల్ల అధికార పక్ష సభ్యులకి మాత్రం బిల్లుల్ని నెగ్గించుకోవటానికి యెక్కువ వెసులుబాటు ఉంటుంది, అంతే. మరి వాళ్ళ అభిప్రాయాలకి విలువ నివ్వకుండా కొందరు వ్యక్తులు ఇచ్చిన లేఖల్ని రాజ్యాంగ పరమయిన ప్రక్రియలో ఉపయోగించుకోవటం యెంతవరకూ సమంజసమనేది రాజ్యాంగ నిపుణులు తేల్చి చెప్పాలి.అలాంటి అలోచనే యెవరూ చెయ్యలేదు, పరిశీలించలేదు - యెందుకని?
    మరి చంద్రబాబు కానీ మరొకరు కానీ ఒక రాజ్యాంగ సంబంధమయిన ప్రక్రియ కోసం రాజ్యాంగం గుర్తించని హోదాని యెలా వినియోగించుకుంటాడు?ఆ లేఖలన్నీ రేపు సభలో ఆ బిల్లుకి వ్యతిరేకమయిన వోటు వెయ్యకుండా ఉపయోగించుకోవడానికి తీసున్న ఉత్తుత్తి నైతికపరమయిన బ్లాక్ మెయిలింగు కోసమే తీసుకున్నారని నేననుకుంటున్నాను. స్పష్తంగా చెప్పాలంటే చట్టసభల్లో ఆ బిల్లుని వ్యతిరేకించకుండా ఉండతానికి తీసుకున్న లోపాయకారి హామీలు మాత్రమే.పార్టీ అద్యక్షుడి హోదా ఆ పార్టీ తరపున యెన్నికయిన శాసన సభ్యులకున్న రాజ్యాంగ పరమయిన హక్కుల్ని హరించేదిగా ఉంటే దానికి విలువ ఉంటుందా?ఇవ్వాళ ఆ పార్టీ అద్యక్షుడిగా ఉన్నవాడు రేపు కూడా అంటే తెలంగాణా విభజన్ పూర్తి అయ్యేదాకా కొనసాగుతాదనే గ్యారెంటీ లేదు కదా. ఇది కూడా రాజ్యాంగ నిపుణులు తేల్చాల్సిన విషయమే కానీ మన లాంటి వాళ్ళం తొందర పడి హడావుడి చెయ్యాకూడదు.
    ఇప్పుడు షిండే ఒక మాటా డిగ్గీ ఒక మాటా యెందుకు చెప్తున్నారు. అసలు ఆర్టికిల్ 3 యేం చెప్తుంది? యే ఆర్టికిల్ అయినా రాజ్యాంగ పరమయిన ఒక ప్రక్రియలో ప్రజా ప్రతినిధులుగా యెన్నికయిన సభ్యులకి బిల్లు రూపకల్పనలో గానీ, సవరణలు ప్రతిపాడించటంలో గానీ, వ్యతిరేకించటానికీ సమర్ధించటానికీ తమకు గల హక్కుల్ని దూరం చేసేలా ఉంటుందా?
    ---
    ఇవన్నీ రాజ్యాంగ విషయాల మీద గట్టి పట్టు ఉన్నవాళ్ళు చెప్పాలి. వాళ్ళు గనక ఇవన్నె తప్పు అంటే రాశ్ట్రం సమైక్యంగా ఉండదం ఖాయం.పైగా ఇలాంటి విష్యాల గురించి తెలిసీ తెలియకుండా మనలాంటి వాళ్ళు మాట్లాడీతె బాగుండదు.కాబట్టి మీకు తెలిసిన రాజ్యాంగా నిపుణుల్ని ఈ విషయాల గురించి అడిగి వారి అభిప్రాయాల్ని ఇక్కడ ప్రచురించండి.సాంకేతికపరమయిన విషయాల్ని భావోద్రేకాలూ ప్రజా స్పందనలతో వ్యతిరేకించే కన్నా సాంకేతికపరమ్యిన వాదనల్తో వ్యతిరేకిస్తేనే ఫలిత ముంటుంది

    ReplyDelete
    Replies
    1. "యేదయినా ఒక బిల్లుని సభలో ప్రవేశపెట్టటానికి కానీ, సవరణలు ప్రతిపాదించటానికి కానీ, వ్యతిరేకించటానికి కానీ సమర్ధించటానికి కానీ ప్రతి సభ్యుడికీ హక్కులూ బాధ్యతలూ అధికారాలూ అన్నింటిలోనూ అందరూ సమానమే కదా"

      A bill under article 3 can only be introduced only on the recommendation of the president (i.e. after cabinet approval). Private member bills even if passed have no effect.

      "మరి వాళ్ళ అభిప్రాయాలకి విలువ నివ్వకుండా కొందరు వ్యక్తులు ఇచ్చిన లేఖల్ని రాజ్యాంగ పరమయిన ప్రక్రియలో"

      The constitutional process starts with cabinet approval. The previous steps like consultations are political in nature.

      "అసలు ఆర్టికిల్ 3 యేం చెప్తుంది?"
      Full text below.

      3. Formation of new States and alteration of areas, boundaries or names of existing States: Parliament may by law

      (a) form a new State by separation of territory from any State or by uniting two or more States or parts of States or by uniting any territory to a part of any State;

      (b) increase the area of any State;

      (c) diminish the area of any State;

      (d) alter the boundaries of any State;

      (e) alter the name of any State;

      Provided that no Bill for the purpose shall be introduced in either House of Parliament except on the recommendation of the President and unless, where the proposal contained in the Bill affects the area, boundaries or name of any of the States, the Bill has been referred by the President to the Legislature of that State for expressing its views thereon within such period as may be specified in the reference or within such further period as the President may allow and the period so specified or allowed has expired Explanation I In this article, in clauses (a) to (e), State includes a Union territory, but in the proviso, State does not include a Union territory Explanation II The power conferred on Parliament by clause (a) includes the power to form a new State or Union territory by uniting a part of any State or Union territory to any other State or Union territory

      Delete
    2. sincere thanks for the information. enlightened.

      Delete
  4. Asalu vibhajana enduku? Evari kosam? Ee vibhajana valla laabhapadedi evaru? Sagatu TELUGU pourudu evvadikee deeni valla labham evariki? 1. Ka cha ra kee vaalla kutumbaanikee, inkaastha dochukodaniki.
    2.jagan ki inka em migilindeedochukovadaanikee. Unnadi kappadu kovadanike. 3.arava thambi chidambaram.....akkada inka puttagathulu levu...sure anduke oka place , ade thappaka geliche place choosukuntunnadu.telangana prajalu gelipistharane dheema.4.azad, moilee veellaki ysr hayam lone pampakaalu jarigina sangathi, endariki thelusu? Vaatiki mari kaastha cherchaali plus ammagari daya5 digvijay, ahmedpatel nijangaa dhoorthulu.bootpolish thappa maremee theliyani thasamadeeyulu.6.ika amma gaaru ikkadaa akkadaa koodaa yuvaraajulni gadde ekkinchaalani mahaa athram. Verasi andhra pradesh vibhajana.
    mari telugu vari thelivi sudden ga veligithe?
    Paina cheppina vaallandarikee adhogathe kani......jarigenaa?

    ReplyDelete