Wednesday, October 2, 2013

రాష్ట్ర విభజన జరిగి పోయింది అనే వారందరూ తెలుగు జాతికి ద్రోహులే !

రాష్ట్ర విభజనకి నిర్ణయం జరిగి పోయింది, ఇప్పుడేమి చెయ్యలేం, హైకమాండ్ ని వేడుకోవటం తప్ప చేసేదేమీ లేదు అంటూ బేల తనం నటిస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు అందరూ తెలుగు జాతికి తీరని ద్రోహం చేస్తున్నారు.  ఎవరిని నమ్మించటానికి ఈ కట్టు కధలు చెపుతారో అర్ధం కాదు.  ఒక కాంగ్రెస్ నాయకుడే చెప్పినట్లు  ఈ రోజుల్లో పొలం గట్టు మీద  నుంచున్న రైతుకి కూడా  అన్ని విషయాలు తెలిసి పోతున్నాయి.  నిర్ణయం జరిగింది ఒక రాజకీయ పార్టీ  కేంద్ర కమిటీ లో మాత్రమె. (ఆ కమిటీ లో తెలుగు వాళ్ళెవ్వరూ లేరు). రాష్ట్ర విభజనకి అవసరమైన చట్ట పరమైన ప్రక్రియ
అంగుళం కూడా ముందుకు జరగలేదు..జరగదు. ఈ కారణం వల్లనే రాష్ట్ర విభజన ప్రతిపాదన పై కోర్టుల్లో వేసిన రెండు కేసులని 'ప్రి మెచ్యూర్ద్ ' అని కొట్టి వేయటం జరిగింది. సీమాంధ్ర ఉద్యమం దెబ్బకి విభజనకి నోట్ పెట్టటానికి సైతం కేంద్రానికి ధైర్యం చాలట్లేదు. ఈ పరిస్థితిలో నోట్ పై వెనుకడుగు తమ ప్రతాపమే అని ఎంపీలు ప్రగల్భాలు పలికితే నమ్మే వారు ఎవరూ లేరు.  వారికి తమ హైకమాండ్ పట్ల విశ్వాసం వుంటే తప్పు కాదు. అయితే అంతకన్నా సుప్రీం కమాండ్ అయిన ప్రజలు వారిని రాజీనామాలు చేయమని శాసిస్తున్నప్పుడు తమ పదవులని జలగల్లా వదలకుండా రాజీడ్రామాలు  ఆడుతూ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న విధంగా ప్రజలు తమని గమనించట్లేదని భావించటం మూర్ఖత్వం.  రాష్ట్ర విభజన పై  మిగతా రాజకీయ పార్టీల లాగే కాంగ్రెస్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ నిర్ణయానికి ఆ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు.  అటువంటప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం శిలా శాసనం ఎలా అవుతుంది ? రాహుల్ గాంధీ అనబడే ఒక్క ఎంపీ నోరు విప్పితేనే రాష్ట్రపతి వరకు వెళ్ళిన ఒక ఆర్డినెన్స్ ని చింపి  పారేయ్యాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ వుంది. ఆయన సోనియా గాంధీ కొడుకు అన్న వ్యక్తిగత హోదా ని పక్కన పెడితే కేవలం ఒక్క ఎంపీ అభ్యంతరం తోనే ఒక నిర్ణయాన్ని వెనుకకి తీసుకున్నప్పుడు సీమాన్ధ్రకి చెందిన 25 మంది ఎంపీలు నిజాయితీ గా నిరసన తెలిపితే ఎందుకు ఫలితం వుండదు ? పోనీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదనుకుంటే కనీసం సక్రమంగా రాజీనామాలు చేసినా ప్రభుత్వం మైనారిటీలో పడి బిల్లు వచ్చే పరిస్థితి ఉండదు..ఆ పనైనా సక్రమంగా చేయమని ప్రజలు, ఉద్యోగులు గద్దిస్తున్నా దాగుడు మూతలు ఆడుతున్న సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు  అందరు చరిత్ర హీనులు.. తెలంగాణా కి అడ్డుపడ్డ వారందరూ తెలంగాణా ద్రోహులే అని తెలబాన్ నాయకుడు ప్రకటించాడు.  సీమాంధ్ర రాజకీయ నాయకులారా! మీరు ఒక్క విషయం గమనించాలి.. మీరు  తెలంగాణా ద్రోహులు అయినా పరవాలేదు.. తదుపరి ఎన్నికల్లో ప్రజలు మీకు బ్రహ్మ రధం పడతారు.  కానీ తెలుగు జాతి ద్రోహులు అయితే మాత్రం చరిత్ర హీనులుగా కాల గర్భంలో కలిసి పోతారు... 

7 comments:

  1. state has been divided (if not geographically, mentally)

    _A Telugu (?) person

    ReplyDelete
  2. True,,,, ka cha ra and family created a mental division among telugu speaking people. Other stupid , spineless incompetant, bootlicking............politicians are adding fuel.
    CHAVATALLARAA TELUGU JATHI MIMMALNI KSHAMINCHADU

    ReplyDelete
  3. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది. ఇందులో సందేహమే లేదు. ఈ తెలంగాణ లుచ్చాగాళ్లకి ఇంకా అర్థంకానిదేమంటే.. సీడబ్ల్యూసీ చెప్పేసింది కదా వచ్చేస్తుందని అనుకుంటున్నారు. కోటిగబ్బిళాల ఊళగాడు బెంగళూరు రాజధాని చేసుకోండంటూ వెటకారాలు చేస్తున్నాడు. ఇంకో అక్షర అబద్ధాలుగాడు వాడికి అనుకూలమైన రాతలన్నీ వెతికివెతికి పెడుతున్నాడు. ఆ రాతలన్నీ అప్పట్లో వాడిలాంటి లుచ్చాలే రాశారని వాడికీ తెలుసు. అయినా పెడతాడు. పోన్లేండి వాళ్లకి ఆ ఆనందమైనా దక్కనివ్వండి. ఎలాగూ తెలంగాణ రాదుగా.

    ReplyDelete
    Replies
    1. అహో ... శత్రువుల ఆక్రందనలు ఎంత వినసొంపుగా ఉన్నవి. తెలంగాణా రాగానే మీరందరూ ప్రస్తుతం మీ ఉద్యమాలలో చెప్పుకుంటున్నట్లు ఎలా అడుక్క తింటారో, ఎట్లా గడ్డి తింటారో, ఎట్లా ఆకులు కట్టుక తిరుగుతారో చూడటానికి ఆగలేకున్నా, తెలంగాణా రాదు రాదు రాదు అని పదేళ్ళ నుండి చెప్పవట్టే .. తిర జూస్తే హోం శాక నోట్ దాక పాయె ... అయినా ఎం పర్లేదు తమ్ముడు, నువ్వు ఇదే కాన్ఫిడెన్స్ తో హప్పిగా ఉండు, ఎవడు కాదంటాడో నేను చూస్తా.

      Delete
  4. తుపాకి రామన్న బొమ్మ తుపాకి బలే సౌండ్ జేస్తుందే. ఏమో అనుకున్న, నాకు సప్పుడు లేకపోతె నిద్ర పట్టదు , ఇంకోచం పెద్దగ సప్పుడు జేయ్యన్న .

    ReplyDelete
  5. అన్న,

    బతికే ఉన్నవా? షాక్ గొట్టి గుండె గిట్ల ఆగిందేమొనని ఇక్కడ అందరు పరేషాన్.

    ReplyDelete