Wednesday, October 16, 2013

సమైక్యత నుంచి సమ న్యాయం - సమ న్యాయం నుంచి అన్యాయం !


కీలకమైన సమయంలో అచేతనంగా ఉండి పోతూ రాష్ట్ర విభజనకి పరోక్షంగా సహకరిస్తున్న సీమాంధ్ర మంత్రుల, ఎంపీ ల ప్రవర్తన నానాటికీ క్షంతవ్యం కాని రీతిన సాగుతోంది.  తమని ఎన్నుకొన్న ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ కూడా సమైక్యానికి కట్టుబడి ఉన్నామంటూ నమ్మ బలకాలని చూడటం విచిత్రం. మైనారిటీ లో ఉన్న ప్రభుత్వం లో సీమాంధ్ర ఎంపీ లు అందరూ మూకుమ్మడిగా రాష్ట్రపతిని కలిస్తే తెలంగాణా నోట్ వచ్చేదా ?  సీమాంధ్ర కి అన్యాయం జరుపుతూ విభజన ప్రతిపాదన చేసిన వెంటనే అధిష్టానాన్ని స్వచ్చందంగా నిల దీయాల్సింది పోయి 77 రోజులు గా ప్రజలు,ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రతిస్పందించక పోవటం తమని ఎన్నుకున్న వారికి ద్రోహం చెయ్యటమే ! అంటోనీ కమిటీ అంటూ మభ్య పెట్టి తమ సమస్యలు వినకుండానే కాబినెట్ ముందుకి తెలంగాణా నోట్ పెట్టినప్పుడైనా స్పందించారా అంటే అదీ లేదు... ఉవ్వెత్తున ఎగసిన ప్రజాగ్రహానికి జడిసి హస్తినలోను, హైదరాబాదులోనూ దాక్కున్నారే తప్ప అధిష్టానాన్ని నిలదీసిన పాపానికి పోలేదు. ఒక రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యం గలిగిన అంశం అజెండాలో లేకుండా కేవలం టేబుల్ పాయింట్ గా పెట్టి తొండి చేసిన విధంగా కాబినెట్ ఆమోదించినప్పుడు ప్రజలు ఆగ్రహంతో స్పందించారు కానీ ఘనమైన సీమాంధ్ర నాయకులకి అది అన్యాయంగా,  అసమంజసంగా కనిపించలేదు.  ఆ కాబినెట్ సమావేశంలో పాల్గొన్న ఇద్దరు సీమాంధ్ర మంత్రులు  కనీసం డిసెంట్ నోట్ ఐన రాసారో  లేదో తెలియదు. ఇక తదుపరి తంతు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ !  విభజన అంశాలని నిర్ణయించ వలసిన మంత్రుల కూటమి లో వుంచుతామంటే రాజీనామా వెనక్కి తీసుకున్న పల్లం రాజు తన పేరు లేనప్పుడైనా పోరాడారా ?  తెలుగు రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలో ఒక్క తెలుగు మంత్రి కి కూడా స్థానం లేకుండా - కనీసం ఆ మంత్రుల కమిటీ రాష్ట్రానికి సైతం రాకుండా తన చిత్తం వచ్చినట్లు విభజన ప్రక్రియని కొనసాగిస్తుంటే అడిగే దమ్ము ఒక్క సీమాంధ్ర నాయకునికీ లేదా ? ఈ రోజు ప్రజల ముందుకి వచ్చి విభజన ప్రక్రియని అడ్డుకోలేక పోయామంటూ మొసలి కన్నీరు కారుస్తూ సీమాంధ్ర కి రావలసిన ప్యాకేజీ కై పోరాడతామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్న కేంద్ర మంత్రుల మాటలు నమ్మే స్థితిలో ఎవ్వరూ లేరు.  ఎప్పుడో 13 ఏళ్ల క్రితం ఏర్పాటైన రాష్ట్రాలకి ప్రకటించిన ప్యాకేజీలకే దిక్కు లేదు.. ఇప్పుడు సీమాంధ్ర కి ప్యాకేజీ అనటం ప్రజల చెవుల్లో క్యాబేజీ పువ్వులు పెట్టటమే...వారికి రావలసిన ప్యాకేజిలు వారికి వచ్చాయి  కనుక కనీసం ప్రజలని మభ్య పెట్టె కార్యక్రమాలకైనా వారు ముగింపు పలికితే మంచిది. 

5 comments:

  1. సీమాంధ్ర లో కాంగ్రెస్ కి (మరియు పిల్ల కాంగ్రెస్ కి ) , బిజెపి కి ఒక్క MP సీట్ కూడా రావొద్దు. అప్పుడు తెలుస్తుంది ప్రజాగ్రహం అంటే ఎలా ఉంటుందో. కానీ మన ప్రజలకి అంత సిగ్గు, శరం ఉన్నాయా లేదా వెళ్లి వాళ్ళనే తిరిగి గెలిపిస్తారా చూడాలి. అప్పుడు ద్రోహులు నాయకులు కాదు ప్రజలు అవుతారు.

    JP లాంటి ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని ఎన్నుకోవడానికి ఇంతకంటే మంచి తరుణం లేదు. సీమాంధ్ర లో అసలు ప్రత్యామ్నాయమే లేదు.

    ReplyDelete
    Replies
    1. India TV/C-Voter opinion poll predictions for AP

      YSR Cong 13, TRS 13, Congress 7, TDP 8, MIM 1

      Assuming Congress wins 3 seats in Telangana, region wise breakup:

      Telangana: Total 17, TRS 13, Congress 3, MIM 1

      Andhra: Total 25, YSR Cong 13, Congress 4, TDP 8

      Delete
    2. ఇప్పుదు పిల్ల కాంగ్రెస్ తప్ప వెరె దారిలెదు

      Delete
    3. It is probably better to vote congress than pilla congress if people are not ready for change. If not, LOK SATTA is the best option.

      Delete
  2. We can believe Pilla Congress, if they bring there district leaders from Telangana to Samakya Shankaravam on 26th

    ReplyDelete