Friday, February 14, 2014

తెలంగాణ పై కేంద్రం ఇక తొండి ఆడనవసరం లేదు!

లోక్ సభలో  రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశ పెడుతున్న సమయంలో జరిగిన సంఘటనల పై లోక్ సభ స్పీకర్ స్పందన ఇది!  నిజమే! ఒక ప్రజాస్వామ్య దేశం యొక్క అత్యున్నత చట్ట సభలో జరగకూడని సంఘటనలు నిన్న లోక్ సభలో చోటు చేసుకున్నాయి.  అయితే ప్రతి వాదనకి రెండో కోణం అన్నది ఉండి  తీరుతుంది.  అసలు లోక్ సభలో విభజన బిల్లు సక్రమంగా ప్రవేశ పెట్టె విషయమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.  రోజువారీ వ్యవహారాల సూచిలో లేని ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లుని ఉన్న పళంగా అనుబంధ అంశంగా చెర్చెసి, కనీసం ప్రతిపక్ష నాయకురాలికి సైతం సరైన సమాచారం ఇవ్వకుండా సభలో బిల్లు ప్రవేశ పెట్టిన తీరు పరువు తక్కువ కాదా?  తెలంగాణా విషయంలో కేంద్రానిది మొదటి నుండీ అదే తొండి ఆట!  కాబినెట్ నోట్ మొదలుకొని బిల్లు ఆమోదం వరకు అన్నీ టేబుల్ ఐటం వ్యవహారాలే నడిచాయి.  ముందస్తు సమాచారం ఇచ్చి ప్రక్రియ కొనసాగించే ధైర్యం ఏ స్థాయిలోనూ కేంద్రం చూపలేదు.  చివరికి ఇప్పుడు లోక్ సభలో

బిల్లు ప్రవేశ పెట్టె విషయంలో కూడా స్వయానా ప్రతిపక్ష నాయకురాలు అభ్యంతరం తెలియ జేసినా కూడా దొంగాట ని కేంద్రం కొన సాగిస్తూనే ఉంది.  అసలు పదవీ కాలం ముగుస్తున్న చివరి రోజుల్లో ఒక రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యత గల బిల్లుని ప్రవేశ పెట్టటానికే రాష్ట్రపతి అనుమతి ఇవ్వకూడదు. అందునా స్వయానా కేంద్రమే ఒక ప్రాంత ప్రయోజనాలకి కొమ్ము కాస్తూ ఏక పక్షంగా తయారు చేసిన బిల్లుని సాధారణ బిల్లు మాదిరిగా గుర్తించరాదు.  పైగా ఈ బిల్లుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ, శాసన మండలి కూడా తిరస్కరించి పంపిన సందర్భంలో ఆయా సభల అభ్యంతరాలని పరిష్కరించాకే విభజన ప్రక్రియ కొనసాగించాలి.  అయితే   దురదృష్ట వశాత్తు రాష్ట్రపతి కూడా ఈ విషయంలో
తన విచక్షణాధికారాన్ని వినియోగించకుండా కేంద్ర మంత్రి మండలినిర్ణయానికే పచ్చ జెండా ఊపారు.  బీజేపి సీనియర్ నాయకుడు అద్వానీ సైతం ప్రస్తుత పరిస్థితుల్లో  వోట్ ఆన్ అక్కౌంట్ తప్ప మరే బిల్లులు ప్రవేశ పెట్టరాదంటూ అభిప్రాయ పడ్డారు.  ఐనా ఎవరి అభిప్రాయంతో నైనా కేంద్రానికి పనేముంది?  ఇప్పుడు బాధిత ప్రాంతమైన సీమాంద్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులందరినీ సభ నుండి బహిష్కరించిన తరువాత కేంద్రానికి  ఇక తొండి ఆడే అవసరం లేదు.  రాజ మార్గంలోనే మెజారిటీ ప్రజాభిప్రాయానికి గొంతు నొక్కే ప్రక్రియని చట్ట సభల్లోనే పూర్తి చేయ వచ్చు.    

5 comments:

  1. తలవంపుల పర్వం ఎప్పుడో మొదలయ్యింది.

    దేశంలో అత్యున్నతమైన కార్యనిర్వాహక పదవి ప్రధానమంత్రి స్థానం. దాన్ని నిలువునా రెండుగా చీల్చి, సోనియమ్మ అనే విదేశీయురాలు ఆడిన నాటకాన్ని మహత్తర్తత్యాగంగా కాంగ్రేసు వారు కీర్తించి తలకెత్తుకోగానే తలవంపుల పాలయ్యింది మనదేశపాలన.

    ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు అన్నీ‌ హానికరసోనియాపాదదాస శ్రీమాన్ మన్మోహన సింహంగారివి.
    ప్రధానమంత్రి పదవికి సంబంధించిన హక్కులన్నీ ఇటాలియన్ కటారి మహమ్మారి సోనియమ్మవి.

    ఇన్నాళ్ళుగా నడుస్తున్న ఈ‌ నాటకం చూస్తూ కూడా మనదేశానికి పట్టిన దుర్దశను అర్ధం చేసుకుందుకు బుధ్ధి చాలని వారిని చూసి కాలం జాలిపడుతున్నది!

    ReplyDelete
  2. అన్నట్లు మరచాను, ఏమనారేమన్నారూ మీరాకుమార్ గారు? నిన్నటి సంఘటన మనం సిగ్గుపడేలా చేసిందా!?!? కాంగ్రేసువారికి సిగ్గుపడటం అంటే ఏమిటో కూడా తెలుసునా బడాయి కాకపోతే?

    ReplyDelete
    Replies
    1. నీ ముర్ఖత్వానికి,ఆహంకారనికి పరాకాస్ట. దెవున్ల గురించి నీతులు చెప్పె
      నువ్వే ఇలా ఎడుస్తే మిగత వాల్ల గురించి ఏమనాలి

      Delete
    2. ఒరెయ్ తల తక్కువ తెలబాన్ వెధవా. ఎంతసేపు ఏడవడేమేనా? గుడుంబా, గోచి నాయాలా! కాస్త పక్క వాడు ఏమన్నాడో విను.నీ సంస్కృతి చూపించుకున్నావ్. తాగుబోతు జాతి లక్షణాలెక్కడికి పోతాయి. పాముకి కోరల్లో విషం, తెలపాములకి ఒళ్ళంతా విద్వేషం సహజ గుణం. కష్టపడి పని చెయ్యడం నేర్చుకో నీ జాతి అవగుణాలన్ని పోతాయి.

      Delete
  3. చివరిమాట.

    బిల్లును ఎప్పుడుప్రవేశపెట్టారో అత్యధికులకు తెలియనే లేదు.
    అంతే కాదు. చూస్తూ ఉండండి. సభలో ఎవ్వరికీ‌ తెలియకుండానే బిల్లు పాస్ కూడా అవుతుంది.

    ష్యూర్.

    ReplyDelete