Thursday, February 6, 2014

ప్రణబ్ దాదా మరో ఫక్రుద్దీన్ కారాదు!

తన ఎన్నిక చెల్లబోదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వటంతో 1975 లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ  ప్రతిపాదించిన ఆత్యయిక పరిస్థితి కి సంబంధించిన ఆర్డినెన్స్ పై అర్ధ రాత్రి సంతకం చేసి రబ్బరు స్టాంపు అన్న అప్రతిష్ట మూట కట్టుకున్నారు నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో ఈ రోజు పరిస్థితి అప్రకటిత  ఆత్యయిక    పరిస్థితి వలె ఉన్నదనటంలో ఏ మాత్రం సందేహం లెదు.  కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకై వ్యవహరిస్తున్న తీరు ఇందుకు ఉదాహరణ.  ఒక రాష్ట్ర విభజన వంటి ప్రాముఖ్యత గల అంశాన్ని మంత్రివర్గ సమావేశ ఎజెండాలో చేర్చకుండా కేవలం టేబుల్ పాయింటుగా  ప్రవేశ పెట్టి హడావిడిగా కాబినెట్ నోట్ ని ఆమోదించటం తో మొదలైన తొండి ఆట ఈ రోజు మంత్రుల కూటమి రాష్ట్ర విభజన బిల్లుకి  తుది మెరుగులు దిద్దే వరకు కొనసాగింది.  గతంలో రాష్ట్రపతి పాలన విధించే సందర్భాల్లో ఆర్టికిల్ 356 దుర్వినియోగం జరిపిన రీతిలో ఈనాడు రాజ్యాంగం లోని ఆర్టికిల్ 3 దుర్వినియోగం జరుగుతోంది.  విభజన ప్రతిపాదించిన రాష్ట్రం యొక్క శాసన సభ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా - చివరికి ప్రతిపాదిత బిల్లుని రాష్ట్ర శాసన సభ తిరస్కరించినా కూడా కేంద్రం మొండిగా ముందుకి సాగటం ఖచ్చితంగా విచక్షణాధికారాల దుర్వినియోగమే అవుతుంది.  ఓ పక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ తమ రాష్ట్ర విభజన కోసం రెండేళ్ళ క్రితమే తీర్మానం పంపితే - దాన్ని పక్కన పడేసి - ఏ ప్రతిపాదన, ప్రాతిపదిక అన్నది లేకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకి కేంద్రం పూనుకోవటం లో ఔచిత్యం ఏమిటి అన్నది రాష్ట్రపతి పరిశీలించాలి. అంతే గాక రాష్ట్ర విభజనకై ఆర్టికిల్ 3 ని దుర్వినియోగం చేస్తున్న కేంద్రం అదే ఆర్టికిల్ 3 లో వున్న సూచనల  ప్రకారం పార్లమెంటులో ప్రవేశ పెట్టబోయే బిల్లునె రాష్ట్రపతి ద్వారా శాసన సభ అభిప్రాయానికి పంపాలి.  అయితే బిల్లు యొక్క లక్ష్యాలు, ఆర్ధిక పత్రాలు వంటి ముఖ్యమైన పత్రాలేమీ లేకుండా చిత్తు ప్రతిని రాష్ట్రం మొఖాన పడేసి అభిప్రాయం చెప్పమనటం రాజ్యాంగ  విరుద్ధమే. సీనియర్ పార్లమెంటేరియన్ గా అనేక సంవత్సరాల అనుభవం వున్న ప్రస్తుత
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు విషయంలో క్రియా శీలకంగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా వుంది.  అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనల తో ఉన్న విభజన బిల్లుని పార్లమెంటు కి పంపే ముందు సుప్రీం కోర్టు వద్ద న్యాయ సలహా పొందటం మేలు.  కాని పక్షంలో భారత దేశంలో ప్రజాస్వామ్యం అన్నది నేతి బీరకాయలో నెయ్యి అన్న చందాన వుందని ఋజువు అయి పోతుంది.  

24 comments:

  1. telangana vyakthulu minimum sankhyalo unna samaikya udyamam nethi beerakayalo neyyi kaka inkem aithadhi anna?zara cheppa raadhe

    ReplyDelete
    Replies
    1. పన్నెండు వందల మందికి దొరికిన అగ్గిపుల్లలు కచరా కుటుంబంలో వాడికి దొరక్క పోవటానికి కారణ మేమిటో తెలుసుకుంటే విభజన వల్ల యెవరికి లాభమో తెలుస్తుంది.కికురెవి చిల్లర వేషాలయితే అగ్గిపుల్ల తీసుకెళ్ళకుండా ఆత్మాహుతికి తెగబడ్డం యెమవుతుంది?

      Delete
    2. సెలైను గొట్టాలతో చేసిన విలాసవంతమయిన నిరాహార దీక్ష సంగతేమిటో నువ్వు చెప్పరాదె?

      Delete
    3. 1200 మందా? ఇదెక్కడి దొంగ లెక్క!!!!తాగి చచ్చిన వాడు కూడా అమరవీరుడే.ఇలాంటి దొంగ లెక్కలు, అబద్దాలతోనే నడిచింది పక్కోడి కష్టార్జితాన్ని దోచుకునే దొంగ ఉద్యమం.దీనికి వేర్పాటు కాశ్మీర్ తీవ్రవాదానికి తేడా ఏముంది. వాళ్ళూ కూడా మిగతా దేశం కష్టం దొబ్బి తిని, మేము వేరు పడతామంటున్నారు.అక్కడ వందలమంది తీవ్రవాదులు చంపుతు చస్తున్నారు.వాళ్ళు వేరె దేశం కావలంటున్నారు.ఎందుకివ్వడం లేదు.అక్కడ తాలిబన్లు, ఇక్కడ తెలబాన్లు.అంతే తేడా.వీళ్ళ సావాసం పోతున్నందుకు సంబరాలు చేసుకోవాలి.వేదకాలమ్నుంచి ఉన్న ఆంధ్ర జాతి మనది.వీళ్ళు లేకముందు కూడా మన పూర్వీకులు అద్భుతంగా జీవించారు. వీళ్ళు తరతరాలుగా బానిస బ్రతుకులో ఉన్నారు.కష్టపడే జాతి మనది. పక్క వాడి మీద పడి దొబ్బి తినే పరాన్నభుక్కులు వీళ్ళు. మళ్ళీ వాళ్ళ మీద పడి ఏడుస్తారు. సంస్కారం, విద్య,నీతి లేని జాతితో కలిసి ఉండే అవసరం మనకేంటి.ఇది చాలా మంచి తరుణం.విడిపోవడం మన మంచికే.మనం నష్టపోయాం ఒకసారి.మన భవిష్యత్తరాలు నష్టపోకూడదు.

      Delete
  2. haranna,nenu vyakthula gurinchi chepthalenu.rendu vaipula vyakthulu,mukhyanga rajakeeya nayakula thappulu chesinru.kaani nenu cheppedhi basic fundamental gurinchi-23 jillalu kalisundaali ani 13 jillale udyamam etla chestaru?telangana gramallo samaikya udyamam enduku chestaleru?

    ReplyDelete
    Replies
    1. అసెంబ్లీ లో తోటి శాసన సభ్యుల్నే చొక్కాలు పట్టుకుని గుంజుతున్నారు కేవలం తమ పాయింటుని చెప్తున్నందుకే, రాజధానిలో సభ పెట్టుకోవటానికి వస్తుంటేనే అంత భీబత్సం చేశారు, మేము మీ పల్లెల్లోకి వచ్చి మాట్లాడగలగటం అయ్యేపనేనా చెప్పు తమ్ముడూ!యెంత అమాయకంగా ఉందో నీ ప్రశ్న.

      Delete
    2. మరి 23 జిల్లాల ప్రజలు తమ రాజధాని అని దాన్ని వృధ్ధి చేస్తే 10 జిల్లాల వాళ్ళు మొత్తం కొట్టేయాలనుకోవటం న్యాయమా చెప్పు.

      Delete
    3. banjara hillslo 90% seemandhrulu,slumslo 90% telangana vaaru.idhena nuvvu cheppe "abhivrudhi"
      and wat do u meen by kotteyadam.haa?
      ap formed in 1956,hyd construction started in 1592
      rajadhaaniki kaavalsina infrastructure aa rojuna Kurnool lo lekapothe mee poorvikulu hydki vachinru.im not insulting anybody but this is the truth.
      telangana vidipoyina Indialone untundhi.ika "kotteyadam" ane question ekkada nunch vasthadi mr.hari babu???

      Delete
    4. anjara hillslo 90% seemandhrulu,slumslo 90% telangana vaaru.idhena nuvvu cheppe "abhivrudhi"
      ------------------
      అభివృధ్ధి అని దేన్ని లెక్కలు వేస్తారో తెలుసా నీకు? ఒక ప్రాంతాన్ని -అ అది ఒక నగరమయినా కావచ్చు మొత్తం జిల్లా అయినా కావచ్చు - అక్కడి నుంచి వచ్చే రెవెన్యూ ని లెక్కగట్టి అది అభ్హివృధ్ధి చెందిందా లేదా అనేది నిర్ణయిస్తారు. ఇక స్లంస్ ఉండటం అనెది ముంబాయి లో ఆసియాలోకల్లా అతి పెద్ద స్లం ఉంది. అవి అధికార్లు సిటీ ప్లానింగ్ తో పరిష్కరించాల్సిన పట్టణ పారిశుధ్యానికి సంబంధించిన విషయం. స్వతంత్రం వచ్చిన దగ్గిర్నుంచీ ప్రభుత్వ పరంగా ప్రాంతాల వారీగా అభివృధ్ధిని లెక్కగట్టటానికి అక్కడి నుంచి వచ్చిన రెవెన్యూనే ప్రామాణికం తప్ప యెన్ని స్లంస్ ఉన్నాయనేది కాదు.

      ఇప్పటి కిప్పుడు అంటే ఈ తాజా ఆర్ధిక సంవత్సరం లెక్కల్ని చూసినా, లేదంటే గత చరిత్రని సంవత్సరాల వారీగా కానీ దశాబ్దాల వారీగా కానీ మిగతా రెండు ప్రాంతాల కన్నా తెలంగాణా నుంచే యెక్కువ రెవెన్యూ వసూలవుతున్నది. అసలు మొత్తం రాష్ట్ర రెవెన్యూ లోనే ఒక్క అహైదరాబాదు నుంచి వచ్చే రెవెన్యూ 47%. దీన్ని మినహాయించి మిగతా రెవెన్యూని లెక్కవేస్తే కూడా మిగతా రెండు ప్రాంతాల నించి వచ్చే రెవెన్యూ కన్నా ఒక్క తెలంగాణా నుంచి వచ్చే రెవెన్యూనే యెక్కువ. మిగతా రెండు ప్రాంతాల నుంచీ వచ్చేది 1 అనుకుంటే తెలంగణా నుంచి 1.5 వస్తున్నది. మొత్తం మీద చూస్తే 47% తెలంగాణా నుంచి రగా ఆంధ్రా నుంచి 40 నుంచి 44% కాగా రాయల సీమ నుంచి 12 నుంచి 15% ఉంటున్నది. అయితే దీన్నంతా కలిపి మూడు ప్రంతాలకీ పంచితే మూడు ప్రాంతాలకీ 33% పంపకం జరుగుతుంది కదా! వెనకబాటు తనం నుంచి స్వాభిమానం వరకూ విభజనకి మీరు పైకి చెప్తున్న కారణాలు కానీ ఆ పంచుకోవడం వల్ల వచ్చె తరుగు(47-33 = 15)ని మీరిష్ట పదక పోవటం వల్ల . అవునా కాదా?

      మనకున్న నదుల్లో వర్షాధారమయినవే యెక్కువ.జీవనదుల్లో కూడా హిమాలయాల వల్ల ఆటుపోట్లతో ప్రభావితమవుతున్నవే. వర్షాలు గట్టిగా కురిసినప్పుడు యెవ్వరూ నష్ట పోవడం లేదు. వర్షాలు కురవకపోతే యెండి పోయే భూములు మూడు ప్రాంతాల్లోనూ ఉన్న్నాయి. ఇంకా నైసర్గికంగా మేము దిగువన ఉన్నాం. మీ ఉద్యమ నేత ఈ మధ్యనే మేం యెగువ రాస్ష్ట్రంగా ఉంటాం, మాకు తిక్క రేగితే మీకు నీళ్ళు బంద్ చేస్తాం జాగర్త అని కూసాడు గదా వినలేదా? తక్కువగా నీళ్ళు వచ్చినప్పుడు పడే ఇబ్బందిని కూడా మీరు సహించలేకపోతున్నారు, అవునా?

      ఉద్యోగాలు రావాలంటే కావల్సినదేమిటి? చదువు. నువ్వు యే జిల్లా వాడివో మీ జిల్లా అక్షరాస్యతా శాతం ఇవ్వాల్టి 201 4 లెక్కలే చెప్పు. అక్ష్రాస్యత పెరగాలంటే అక్కడ లోకల్గా ఉన్న నాయకులు విద్య పట్ల శ్రధ్ధ చూపించాలి. ఒక చోట స్కూలు నుంచి యునివర్సిట్య్ వరకూ అయెది పెట్టాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో యవీ కాకుండా యునివర్శిట్య్ గ్రాంట్స్ కమిషన్ అనుమతి ఇవ్వాలి.అది దానంతటదిగా ఇవ్వదు.ఆ ప్రాంతం వాళ్ళు అడగాలి. కేవలం పెట్టటం వరకే కాదు, ప్రతి సంవత్సరం ఉత్తెర్ణతా సాతాన్ని లెక్కలు గట్టీ గ్రాంట్ ఇవ్వలా వద్దా అనేది నిర్ణయిస్తుంది.ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కొత్తగా యేవయినా స్కూళ్ళు పెట్టాలనుకున్నా యూజీసె కి పిటిషన్లు పెట్టటమే తప్పించి సొంతంగా యేమీ చెయ్యలేరు.

      విద్యాశాఖ మంత్రులు కూడా సిలబస్ దగ్గిర్నుంచి విద్యా ప్రమాణాల వరకూ యూజీసీ కి లోబడే పని చేస్తారు.దీనినంతా సరి చూసి తప్పులుంటే చెప్పు, ఒప్పుకుంటాను.లేని పక్షంలో మా ఉద్యోగాలు లాక్కున్నారనే మాట అబధ్ధం అనేది ఒప్పుకో.మీ వాళ్ళు మీ ప్రాంతపు అక్షరాస్యతా శాతాన్నె విద్యా ప్రమాణాల్నీ పెంచలేకపోవటానికి మా వాళ్ళు యెలా కారణ మవుతారో చెప్పు.

      ప్రైవేటీకరణతో అసలు ప్రభుత్వ శాఖలే కుంచించుకుపోతుంటే ప్రభుత్వోద్యోగాలు యెలా వస్తాయి? ప్రైవేటీకరణ వూపందుకోవటం వల్ల ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనలో చేతులెత్తేసి చాలా కాలమయింది.కోటి ఉద్యోగాల వాగ్దానాన్ని పదేళ్ళ క్రితం చేసిన ప్రధాని గారు ఒక్క ఉద్యోగమూ చూపించలేక మౌనంగా ఉండి పోయాడు, తెలుసుకో.


      Delete
  3. Are we afraid or sentimental? We are the winners after separation. See the broad parameters in the following link. I swear it is for our good and for the best of our future generations. lets congratulate ourselves for getting rid of the lazy and parasitic part of our body. See the following

    (http://ibnlive.in.com/news/telangana-the-past-and-the-future/410495-62.html)

    ReplyDelete
    Replies
    1. In my openion, now we must stop the division and after bjp coming to power, we MUST divide in a way we should not loss our respect. That is my openion. We will defenitely get rid of those people who hate us,, but we should not lose our self-respect. That's IT!

      Delete
  4. Can anybody share the so called 1200 list !!!!!
    Looks like lot of Telabaans are here in blogs
    Can anybody share it?

    ReplyDelete
    Replies
    1. You just take the list of last 1200 deaths due to consumption of gudumba. It tallies.

      Delete
  5. tg gaariki,
    telangana vidipoyina Indialone untundhi.ika "kotteyadam" ane question ekkada nunch vasthadi mr.hari babu???
    ------------------
    1956 నాటి తెలంగాణా అడుగుతున్నారు మీరు. హైదరాబాదుని కూడా 1956లో ఉన్నప్పటి స్తితి లోనే తీసుకోవచ్చుగా?అప్పటికి హైదరాదు నుంచి యెంత రెవెన్యూ ఉంటుందో లెక్కలు ఉండే ఉంటాయి కదా? అప్పటి నుంచీ సంవత్సరాల వారీగా హైదరాబాదు రెవెన్యూ లెక్కలు వేసి అందులో దామాషా పధ్ధతిలో - అంటే ఈ రెవెన్యూ పెరగడంలో తెలంగాణా వాళ్ళు యెంతశాతం ఉన్నారు, ఆంధ్రా వాళ్ళ పాత్ర యెంత ఉందో లెక్కప్రకారం పంచుకుందామా?లేదంటే మీరు ఆంధ్రా అధిపత్య వర్గాలు, ఆంధ్రా దోపిడీ దార్లు అంటున్న వాళ్ళంతా తమ తమ వ్యాపారాల్నీ పరిశ్రమల్నీ విడిపోయిన ఇప్పటి ఆంధ్రా ప్రాంతానికి తరలించేశాక విడిపోదామా?

    ReplyDelete
  6. @hari
    hyderabadlo unna pedda software companies-microsoft,dell,ibm,polaris,ivi foreign companies.
    atlaage wipro,infosys,tcs,cognizant-ivi evi seemandhrula companies kaavu
    seemandhrula athi pedda software company sathyam.daani paristhithi ento meeku thelusu
    ika pothe manufacturing sector lo BHEL,ECIL, Defence Sector lo unna BDL,Nuclear Fuel Complex, Bharath Dymaics Limited.ivi kendra prabhutva samsthalu.seemandhra samsthalu kaadhu.
    pharma rangamlo seemandhra aadhipathyam undhi-reddys labs and aurobindo pharma.kaani,at the same time non seemandhra comanies kooda unnaayi

    contd..

    ReplyDelete
  7. contd..
    cherlapally,jeedimetla,patancheru industrial arealo unna factorys maximum seemandhrulavi.
    haranna,ikkada telangana industrialists enduku leranna?
    ok,whatever,let it be.kaani mee seemandhra indistrialistski vachina govt land,water,power,ivanni telanganave kadha.alage chala industrieski govt subisidy isthadhi.veetitho polisthe mee pettubadulu ekkuva lekunte mee laabhalu ekkuva-aalochichinchuko.

    inkoka vishayam akkada industies lo ekkuva mandhi udyogulu seemandrulu.vere pranthamlo parisrama pettinappudu,kaneesam "semi skilled jobs" sthaanikulaki ivvadam saampradayam.adhi meere paatinchinro ledho aalochincukondi
    i agree that new seemandhra state will have reveue loss,kaani daaniki telangana prajalu baadhyulu kaaru.kendra prabhutvam meeku package ivvali.
    లేదంటే మీరు ఆంధ్రా అధిపత్య వర్గాలు, ఆంధ్రా దోపిడీ దార్లు అంటున్న వాళ్ళంతా తమ తమ వ్యాపారాల్నీ పరిశ్రమల్నీ విడిపోయిన ఇప్పటి ఆంధ్రా ప్రాంతానికి తరలించేశాక విడిపోదామా?
    mee daggra kooda parisramalu raavani,akkada kooda udyogaalu and income peragalani korukuntunna.
    jai telangana,jai seemandhra

    ReplyDelete
    Replies
    1. అదే స్వామీ మేం ఇన్నాళ్లుగా చెబుతున్నది. మేం వచ్చి పెట్టుబడులు పెట్టాం. ఉద్యోగులు వచ్చారు. స్థానికంగా ఉన్నవారికి ఉపాధి దొరికింది. అప్పుడేమవుతుంది? ఉద్యోగులుకు ఉండటానికి ఇళ్లు కావాలి కదా. నెమ్మదిగా కాలనీ ‘డెవలప్’ అవుతుంది. జనం వచ్చే కొద్దీ భూమి అవసరం పెరుగుతుంది. కొనేవాళ్లు, ఇల్లు కట్టేవాళ్లు పెరుగుతారు. భూమికి డిమాండ్ పెరుగుతుంది. కాలనీ అన్నాక.. కిరణా కొట్టు దగ్గర్నుంచి రకరకాల సౌకర్సయాల కోసం సవాలక్ష దుకాణాలు ఏర్పడతాయి. అన్ని సౌకర్యాలూ ఏర్పడటంతో భూమి ధర మరింత పెరిగిపోతుంది. దీన్నే అభివృద్ధి అంటారు. సీమాంధ్రులు చేసిన అభివృద్ధి అదే. ఇక్కడికే ఎందుకొచ్చారూ అంటారు.. దానికీ సమాధానం ఉంది. రాజధాని కాబట్టి.

      Delete
  8. what made you to think or hope like that? He is hardcore congress politician. Do you expect a politician to go against the grain. It is foolish. He is never from the masses. He is a manipulative and got through the power corridors throgh lobbying only. So let us not hope him to be a Mahatma ( not MK gandhi, Mahatma)

    ReplyDelete
  9. నిన్ననే జై గొట్తిముక్కల - AP is going out in style! - అని అంటే నేను -భశుం for తెలంగాణా!- అని సరదాగా రిటార్టిచ్చా. తెల్లారే సరికల్లా భాజపా పెద్దాయన అడ్వాణీ గారు బిల్లుని వ్యతిరేకిద్దాం అనేశాడు. కొందరికి షాకులా తగిల్తే తగిలవచ్చు గానీ నేనిది ముందే వూహించాను.భాజపా లెక్కలు భాజపావి.

    ఉద్యమం మొదలయినప్పటి నుంచీ మేము చిన్న రాష్ట్రాలకి సుముఖం తెలంగాణాకు మేం మద్దతిస్తాం అని అన్ని సార్లు చెవి నిల్లు గట్టుకుని పోరినా కాంగ్రెసుకి సాయం చేసి కాంగ్రెసు సాయం తోనే రాష్ట్రాన్ని తెచ్చుకోవాలనే యేకోన్ముఖమయిన అంటకాగుడుతో భాజపాని యేనాడూ దగ్గిరకి రానివ్వలేదు ఉద్యమ నేత.కాంగ్రెసు చూస్తే బిల్లుని బేషరతుగా అంగీకరించి మేమూ సాయం చేశాం అనే చిన్నపాటి మంచిపేరు కూడా భాజపాకి దక్కనివ్వకూడదని పట్టుదలగా ఉంది.

    ఇప్పటి దాకా అసలేమాత్రం పట్టించుకోని సకావాల్ని హఠాత్తుగా వార్ రూంకి పిల్చి చేసిందేమిటి?బహుశా వన్ షాట్ టూ బర్ద్స్ అన్నట్టుగా సకావాల్ని దారికి తెచ్చుకుని బిల్లు వీగిపోతే భాజపా మీదకి తోశేద్దాం అనేవిధంగా కార్నర్ చేదామని అనుకుంది. కానీ చివరికది వన్ బర్ద్ టూ షాట్స్ లాగ తేలింది.సకావాలు మామూలుగానే పాత డిమాండ్లే చేశారు. వాట్ని ఒప్పుకోకుండా భాజపా చహెస్తున్న సవరణల్ని కూడా వాళ్ళ పేరు మీద ఫిరాయించాలని చూట్టంతో రెండు వైపులా కాలింది.

    అసలు కాంగ్రెసు విభజన సజావుగా పూర్తి చెయ్యాలని అనుకోలేదని నా లెక్క చెబుతుంది.మొదటిది: తెరాసా పట్ల గానీ ఉద్యమం పట్ల గానీ కాంగ్రెసుకి యేనాడూ గౌరవం లేదు. విభజన ప్రకటన లోని ముందు చూపుతో కూడిన వెక్కిరింత, ఉద్యమ నేత విలీనాన్ని వ్యతిరేకించిన 24 గంటల్లోనే వేసిన రాయల తెలంగాణా ఝలక్ అందుకు సాక్ష్యాలు.100+ నుంచి ఇలాంటి వాళ్ళను యెంతో మందిని పూచిక పుల్లల్లా విసిరేసిన కాంగ్రెస్తో - ఖాన్ తో గేంస్ ఆడినట్టు - పరాచికాలు ఆడదామనుకున్నాడు. ప్రకటన చేశేసిందిగా ఇంకెక్కడికి పోతుందిలే అనే ధీమా వచ్చి ఉండవచ్చు.

    ReplyDelete
  10. రాయల తెలంగాణా అనేది ఇవ్వాల్టి దానికి గ్రౌండ్ ప్రిపరేషన్ మాత్రమే అని నేను అప్పుడే అనుకున్నాను. విభజన వల్ల మంచి జరిగినా చెడు జరిగినా మొత్తం ఫలితాన్ని కాంగ్రెసు మాత్రమే భరిస్తుంది అనే ఒక కాంగ్రెసు వాది ప్రకటనా, యూపీయే-3 అనే మాస్టర్ ప్లాన్ గురించి బయట పడుతున్న విషయాలూ దాన్నే ఖాయం చేస్తున్నాయి. యెప్పుడయితే ఉద్యమ నేత విలీనానికి దూరమవ్వాలనుకున్నాడో అప్పుడే కాంగ్రెసు చాలా హాయిగా వూపిరి పీల్చుకుని ఉంటుంది.ఇవ్వాళ భాజపాకే కాదు కాంగ్రెసుకి కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచామని చెప్పుకోవదం ద్వారా సీమాంధ్రలో బలాన్ని పెంచుకోవడం అవసరంగా మారింది. అసలు ముందు నుంచి తెరాసా మీద అభిమానం లేదు కాబట్టి "విభజన సజావుగా జరిగితే నాకేంటి? జరక్కపోతే నాకేంటి? " అనే దోరణి కనబడ్డం లేదా కాంగ్రెసు ప్రవర్తనలో?చిన్న చిన్న బిల్లుల్ని కూడా యెంతో పక్కాగా తయారు చేస్తారే, అలాంటిది మంత్రుల బృందమే ఇన్వాల్వ్ అయ్యి తయారు చేసిన బిల్లు అంత దరిద్రంగా యెందుకుంది.బిల్లుని వ్యతిరేకించాలనుకున్న వాళ్ళకి యెన్ని వంకలు కావాలంటే అన్ని వంకలూ అందులో ఉండేటట్టుగా రూపొందించటం అనుకోకుండానో తొందరగా తెరాసా వారిని సంతోష పెట్టెద్దామనో చెయ్యలేదు.

    అసలు తెరాసాని సంతోష పెట్టాలనే దురద కాంగ్రెసుకి యెందుకుంటుంది? యెందుకుండాలి?కాంగ్రెసు సాయం తోనే రాష్ట్రాన్ని తెచ్చుకోవలనుకుంటూ మళ్ళీ నోరు తెరిస్తే, "సోనియా గాంధీని బజారు కీడుస్తా","ఇవ్వకపోతే భూస్థాపితం చేస్తా","బొందల పెడతా","అందుల పూడుస్తా", "ఇందుల కలిపేస్తా" అని రెచ్చిపోయేవాణ్ణి యెవడు ఆప్యాయంగా దగ్గిరికి తీసుకుంటాడు?కాబట్టి తెరాసా ఇవ్వాళ కూరలఓ కరివేపాకు పాత్రకి మాత్రమే పరిమితమైపోయింది!నేను వాళ్ళకి మొదట్లోనే సూచన ఇచ్చాను, ఉద్యమం యొక్క అంతిమ ఫలితాన్ని మీరు శాసించే విధంగా ఉద్యమం నడవట్లేదు, వైరుధ్యాలు ఉన్నాయి, తొలగించుకోండని.వాట్ని తొలగించుకోవటం అటుంచి నా సూచనలే వాళ్ళ కర్ధం కాక అరె ఒరే అని రెచ్చిపోయారు.
    ఇవ్వాల్టి పరిస్తితి యేమిటి?అందరూ రాష్ట్ర పతి గారి వైపు చూసి అలోపొలఓ మని అఘోరిస్తూ ఉండగా హఠాతుగా ఇప్పటిదాకా యెవరూ పట్తించుకోని అన్సారీ గారనే పెద్దమనిషి ద్రౌపదీ సతి "నన్నోడి తన్నోడెనా,తన్నోడి నన్నోదెనా" అని మెలిక వేసినట్టు "ఇది ద్రవ్య బిల్లు వలె నున్నది, తేల్చి అటులైనచో లోక్ సభకే పోనిండు నను మాత్రము విసిగించకుడు " అనేసాడు.

    కధలో ఇంకా చాలా మలుపులు వస్తాయి అంటే - ఒకటేమిటి యెన్నో వినోద కార్యక్రమాలు అన్నాడు గొట్టిముక్కల పండితుడు.ఇవి వినోద కార్యక్రమాలా?!అనుక్షణం గుండెలదరగొట్టే భయానక సన్నివేశాల్తో ప్రతిక్షణం ఊహించని సన్నివేశాల్తో ఉత్కంఠను రేకెత్తిస్తామని కోట్లు ఖర్చుపెట్తి తీసే రాంసే సోదరులను మించి కాంగ్రెసు జనానికి తన నీచ సంస్కృతితో చూపిస్తున్న రాజకీయ భీబత్స నగ్న చిత్రం.బుధ్ధిజీవి అయిన ప్రతివాడూ విభజన బిల్లు భవిష్యత్తుతో సంబంధం లేకుండా ఆంధ్రా తెలంగాణా రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెసుకు ఒక్క సీటు కూడా రాని విధంగా బుధ్ధి చెప్పాలి.

    వాడున్నాడే దగన్, వాడు అవినీతి చేసాడా లేదా అనేది అనవసరం, పత్రికల్లో ఒక ఫోటో చూశాను - తను వాలుగా చెయ్యానించుకోవటానికి వీలుగా ఒక మనిషిని నడుం వంచమని బల్లలాగా వాడుకున్నాడు.ఆ దురహంకారి ఇవ్వాళ రేపటి రోజున తను ముఖ్యమంత్రిగా చెయ్యబోయే సంతకాల గురించి వాగుతున్నాడు.వాడు ముఖ్యమంత్రిగానే కాదు ఒక సాధారణ శాసన సభ్యుడిగా కూడా సభలో అడుగు పెట్టగూడదు.

    ReplyDelete
  11. ఇప్పుడు అర్ధమైందా ఆయన ఎంత మేధావో? ఇలాంటి కాగితం పులుల మీద ఎంతొ ఆశలు పెట్టుకున్నవాళ్ళు ఇంకెంత అజ్ఞానులు? ఆయన జీవితమంతా పైరవీలతోనే గడిచింది.ఇలాంటి కుహనా మేధావుల మీద మనం ఆశలు పెట్టుకున్నాం.

    ReplyDelete
  12. ఈరోజు తెలబాన్ పశువులు తమ బుద్ది లక్షవసారి బయటపెట్టుకున్నారు. అందుకే వీళ్ళని నిజాం ఊరవతల పెట్టీ పశువుల్లాగే చూసాడు. They deserve treatment suitable for African cruel animals.

    ReplyDelete
  13. డిగ్గీ కి ఇప్పుడు తెలుస్తుంది కాక. ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది,యేం చెయ్యాలో యేంటో అని వాపోతున్న్నాడు.కృశా టైపులో "ముందు తెలిసెనా ప్రభూ నీ మందిర మిటు లుంచేనా?" అని పాడుకోవటమే ఇక ముందు.బిల్లు అంతా లోపాల మయం అని విశ్వనాధం గారు గట్టిగా చెప్తున్నారు. అందుకే భాజపా అంత గట్టిగా వ్యతిరేకిస్తున్నది. ఇప్పుడు ఈ తప్పుల తడక బిల్లుని ఒప్పుకుంటే రేపటి రోజు అధికారంలోకి వస్తామనుకుంటున్న పార్తీ కాబట్టి అప్పుడు కోర్టులు మొట్టికాయ వేస్తే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెసు కేమీ కాదుగానీ తగిలేది తనకేగా అనేది ఆ పార్టీ భయం.

    ReplyDelete