Sunday, February 16, 2014

సీమాంధ్ర దేశం అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది?



సున్నితమైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్ని ఎంత అధ్వాన్నంగా యూపీఏ ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో పై ప్రకటన చూస్తె అర్ధం అవుతుంది.  గతంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలన్నీ ఎస్సార్సీ ద్వారానో, కమిటీల నివేదికల ద్వారానో లేదా ఆయా రాష్ట్రాల శాసన సభల తీర్మానాలతొనొ ఏర్పడ్డాయి.  అంతే తప్ప ఆర్టికిల్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి వున్న అధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం అన్నదే లేకుండా  జరగలేదు.   ఆర్టికిల్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ పరంగా అధికారం వుంది అన్నది నిజమె.  అయితే ఆ  విచక్షణాధికారాన్ని వినియోగించే ముందు రాష్ట్రంలోని రెండు ప్రాంతాల వారి అంగీకారం ఉందా లేదా అన్న ఆలోచనే లేకుండా కేవలం ఒక ప్రాంత ప్రయోజనాలకే కొమ్ము కాస్తూ విభజన ప్రతిపాదించ బట్టే -  నేడు విభజన బిల్లు ని కూడా దొంగ చాటుగా,  ప్రతి పక్షాలకి సమాచారం కూడా లేకుండా లోక్ సభలో ప్రవేశ పెట్ట వలసిన దుస్థితి దాపురించింది.  రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించి పంపిన బిల్లుని కూడా నిస్సిగ్గుగా,  పార్లమెంటు సమావేశాలు వారంలో ముగుస్తాయనగా,  3 నెలలలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనగా ప్రవేశ పెట్టటమే అప్రజాస్వామికం.  వోట్ ఆన్ అకౌంట్  బడ్జెట్ ఎందుకు ప్రవేశ పెడతారు?  రెండు నెలలలో ముగిసి పోయే కాలపరిమితిలో ఉన్న  ప్రభుత్వం  కీలక నిర్ణయాలు తీసుకుంటూ పూర్తి  స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టకూడదు కనుక!  అలాగే రాష్ట్ర విభజన వంటి కీలక నిర్ణయం కూడా 52 నెలలు నిద్ర పోయిన కేంద్రం చివరి 8 నెలలలో తీసుకొని హడావిడిగా అమలు పరచాలని చూడటం - కేవలం రాబోయే ఎన్నికలలో ప్రయోజనం పొందుదామన్న దురుద్దేశ్యం తోనే అన్నది స్పష్టం.  ఆ నిర్ణయం అమలు పరిచే విషయంలో కూడా సీమాంద్ర ప్రాంత ప్రజల, ప్రతినిధుల, మంత్రుల విన్నపాలని పూర్తిగా పెడ చెవిన పెట్టి, స్వయానా కేంద్రమే తెలంగాణా ప్రాంత ప్రతినిధిగా అవతారమెత్తి విభజన బిల్లు తయారు చేయబట్టే నేడు ఈ ఉద్రిక్త పరిస్థితులు దాపురించాయి.   పాలక పక్షం సంగతి అలా ఉంచితే ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ కూడా తాము చిన్న రాష్ట్రాలకి అనుకూలమంటూ తెలంగాణ కి మద్దతు ప్రకటించటం శోచనీయం.  తాము 3 రాష్ట్రాలు ఇచ్చామని గర్వంగా చెప్పుకొనే బీజేపీ పార్టీకి ఆ మూడు రాష్ట్రాలు ఏ పరిస్థితుల్లో ఏర్పడ్డాయో తెలియదనుకోవాలా?  బీజేపీ ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల విషయంలో ఆయా రాష్ట్రాల శాసన సభలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపితే విభజన ప్రక్రియ సాఫీగా జరిగిందన్న సంగతి మరువకూడదు.  పైగా అప్పుడు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలే కొత్తగా రాజధానులు ఏర్పాటు చేసుకున్నాయి తప్ప, పూర్తిగా అభివృద్ది చెందిన ఉమ్మడి రాజధానిని కబ్జా చేస్తూ, తల్లి రాష్ట్రాన్నే తన్ని తగలేసే రీతిగా ఏర్పడలేదు.  ఇవేమీ ఆలోచించకుండా గుడ్డిగా తెలంగాణాకి మద్దతు అంటే సీమాంధ్ర పరిస్థితి ఏమిటి?  ఈ విధంగా పాలక పక్షం - ప్రతిపక్షం ఒక్కటై పోయి సీమాంద్ర  ప్రాంత ప్రయోజనాలకి ఇసుమంతైనా విలువనివ్వకుండా ముందుకు సాగటం ఘోరం.  దొంగ చాటుగా బిల్లుని ప్రవేశ పెట్టటానికి దిగజారిన కేంద్రం,  ఆ సమయంలో నిరసనలకి వచ్చిన సీమాంధ్ర ప్రజా ప్రతినిధులపై ఇతర ప్రాంత/ఇతర రాష్ట్ర ఎంపీలతో భౌతిక దాడులు చెయించటమే గాక విభజన బిల్లు లోక్ సభ ఆస్తి అని కేంద్ర హొమ్ మంత్రి ప్రకటించిన సమయంలో సీమాంద్ర  సభ్యులని సభనుండి  బహిష్కరించి - బాధిత ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యమే సభలో లేకుండా చేసి - బిల్లుని ఆమోదింప జేసుకుందామని కుట్ర పన్నితె ఇక సీమాంధ్రకి గత్యంతరం ఏమిటి?  ప్రత్యెక దేశం వంటి  డిమాండ్లు రావటంలో ఆశ్చర్యం ఏమి ఉంటుంది? 
(ప్రత్యెక దేశం వాదాన్ని సమర్ధించటం నా ఉద్దేశ్యం కాదు.  పరిస్థితి ఇంతలా ఎందుకు దిగజారింది అన్న ఆవేదనే ఇది. ) 

11 comments:

  1. India devide avvadame manchidi ani naa uddeshyam.
    already kulala tho, mathaalatho, bashala tho, vidipoyi unnaam. inkaa manalni manam mosam chesukuntu gadapadam kante vidipovadame chaalaa better.

    ReplyDelete
  2. These type of discussions amounts to sedition. Be aware of that.

    ReplyDelete
  3. Correct. This amounts to sedition. But branding 7crores as settlers and looters and threatening them with detha, cutting tongues, blacmail, extortion etc. comes under the category of patriotism.

    ReplyDelete
  4. if you people say so it is correct but telanganites can't say that we want a seperate state? you'll label them as telabans, what kind of justice this is. tanako dharmam, pakkodiko dharmam.

    ReplyDelete
  5. "kalisi unte kaladhu sukham", "vidipothe chedipothaam", "padipthaam", telangana lekapothe seemandhraki bhavishyathu ledhu,telugu neela mukkalu,etc.etc anna vallu ivalla deshanne mukkalu cheyyalanukuntunnaru.
    what a fall my telugu brothers

    ReplyDelete
  6. AP lo అన్ని పార్టీలు అంగీకరించిన తెలంగాన ఇస్తుంటె ఎంకావలొ అడకుండ ఉండడం వల్ల , లేదా తెలంగాన వాల్లతొ కలసి సమైఖ్య ఉంద్యమం చెయ్యలేక పొవడం వల్ల.

    ReplyDelete
  7. babu memu anedi ade meeru first pratyeka rastranga veedipodi,

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. కికురె ముఖ్యమంత్రిగా ఉండి అంత భీబత్సంగా వ్యతిరేకించడం నుంచీ లోక్ సభ లో జరిగిన ఈ రౌడీజం వరకూ అంతా కాంగ్రెసు వాళ్ళు కూడబలుక్కుని చేసిన దుష్ట నాటకం. తెరాసా లో విలీనానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని విలీనానికి ఒప్పించడానికి వేసిన మాస్టర్ ప్లాన్.

    తెరాసాతో విలీనం వల్ల తప్ప సీట్ల సర్దుబాటు వల్ల కూడా తెలంగాణాలో పార్టీకి పరువు నిలబడదని తేలిపోయింది.విలీనానికి ఒప్పుకున్న తెరాసా అధినేతకూ, పక్క తాళం వాయించే ఉద్దండ పండితుడికీ కాంగ్రెసులో సుఖ ప్రయాణానికి మంచి బెర్తులు జమ అయిపోయినాయి. మధ్య అంతరువుల నుంచి కింది వాళ్లకి కూడా కాంగ్రెసు బెర్తులు ఇస్తే పార్టీలో ఉన్న తెకావాలు వూరుకోరు. విలీనం తిరుగుబాట్లు లేకుండా సున్నితంగా జరిగి పోవాలి.అందుకని తెరాసా లో విలీనాన్ని వ్యతిరేకించే వాళ్ళని మానసికంగా బ్రేక్ చెయ్యటానికి. ఈ ప్లాన్ తెరాసా అధినేతకూ తెలిసే ఉండొచ్చు, బహుశా ప్లాను ఇచ్చిందే అతను అయి ఉండవచ్చు.

    ఇంతకీ జరిగిందీ జరగబోయదీ యేమిటంటే, సభ బయట తమకు మరొకరితో ఉన్న ఒప్పందాన్ని ఖరారు చేసుకోవటానికి పార్లమెంటుని వాడుకోవటం.భారత ప్రజాస్వామ్యానికి మూలమయిన రెండు సభలూ కాంగ్రెసు రాజకీయ వ్యాపారానికి తక్కెడ సిబ్బెములుగా ఉపయోగ పడుతున్న్నాయి.పార్లమెంటు భవనం ఒక వ్యాపార వేత్త తన క్లయింటు తో తనకున్న ఒక ఒప్పందానికి ఆఖరి సంతకాలు చేసుకునే కాంఫరెన్స్ హాల్ గా ఉపయోగపడుతున్నది.

    100+ యేళ్ళ అచరిత్ర గలిగి యెక్కువ కాలం అధికారం లో ఉండి సభాసాంప్రదాయాల్ని పాటించటంలో మిగిలిన వాళ్ళ కన్నా యెక్కువ బాధ్యతగా ఉండాల్సిన పార్టీ సిగ్గు యేమాత్రమూ లేకుండా భాజపా లాంటి జాతీయ పార్టీ లన్నింటి సహకారం తో చెయ్యబోతున్న ఘనకార్యం ఇది.

    ReplyDelete
  11. @సీమాంధ్ర దేశం అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది?" నాయకులు ఏం చెప్పినా నమ్మే నీలాంతి ఎర్రి రామన్నలు ఉండబట్టే వచ్చింది!

    ReplyDelete