రాష్ట్రం విడిపోతే తప్పేమిటని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తప్పు లేదు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అయితే అందుకు ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు తెలంగాణా వాదులు. మరి అదే పద్ధతిలో తమ అభిప్రాయాలు చెప్పిన చిరంజీవి,మోహన్ బాబు, రోజా, జయేంద్ర సరస్వతి తదితరులని నానా దుర్భాషలాడారు. తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరికలు చేసారు. మరి భావ ప్రకటన స్వేచ్చ అందరికీ సమానమే కాదా? తమకి అనుకూలంగా చెప్తే దేవుడు...లేక పొతే దుష్టుడు అన్నట్లు ప్రవర్తించటం ఏమి పద్ధతి? ఇక వారి ప్రవర్తనలో మార్పు రాదా?
Saturday, February 27, 2010
Friday, February 26, 2010
లెవలై పోయింది..
అక్కడ పార్లమెంటులో తె.రా.స. కు చెందిన ఇద్దరు ఎం.పీ. ల రాజీనామాలని స్పీకర్ తిరస్కరించారు---ఇక్కడ అసెంబ్లీలో ఇద్దరు కాంగ్రేసు శాసన సభ్యుల రాజీనామాలు స్పీకర్ తిరస్కరించారు. మేటరు లెవలై పోయింది. అయితే రాజీనామాల్లో నాదే ప్రపంచ రికార్డ్ అని చెప్పుకున్న పెద్ద మనిషికి సరైన ఫార్మాట్ లో రాజీనామా ఇవ్వటం తెలియదా? తన తోటి ఎం.పీ.కి సరైన గైడెన్స్ ఇవ్వడం తెలియదా? ఇక ఎవరి పదవులు వాళ్ళు ఎంజాయ్ చెయ్యండి. మరి ఇక్కడ వెర్రి గొర్రెలు అయ్యింది ఎవరు? ఆల్రెడీ పదవులూడగోట్టుకున్న పది మంది శాసన సభ్యులు...నెరవేరని లక్ష్యానికి ప్రాణాలర్పించిన విద్యార్ధులు...ఇంకా చోద్యం చూస్తున్న ప్రజలు....
Wednesday, February 24, 2010
ఒకే ఒక్కడు!
వన్డే మాచ్ లలో తొలి సారిగా డబుల్ సెంచరీ (నాటౌట్) సాధించి రికార్డు నెల కొల్పిన సచిన్ టెండూల్కర్ కి అభినందనలు.
ఎ.పీ.లో ఆగని మమత రైలు
షరా మామూలుగా మళ్ళీ అన్యాయమే జరిగింది. మరో బెంగాల్ పక్షపాత రైల్వే బడ్జెట్ ని మమత ఈ రోజు సమర్పించింది. విదిలించిన కొత్త రైళ్ళు నామ మాత్రం. అవికూడా మనకన్నా పొరుగు రాష్ట్రాలకే ఎక్కువ ఉపయోగం. తెలంగాణా ఉద్యమాన్ని దృష్టిలో వుంచుకొని ప్రకటించిన కొత్త రైల్వే లైన్లు ఎప్పటికి నిజమయ్యేను? అప్పటికి తెలంగాణా ఉద్యమం హుళక్కి--తెలంగాణా హుళక్కి అని వారికి తెలుసు. అసలు 33 మంది ఎం.పీ.లు యూ.పీ.ఎ. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా గల రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇదేనా? కేవలం 19 మంది సభ్యులు గల తృణమూల్ కాంగ్రెస్ కి రైల్వే శాఖ ఇచ్చిననాడే మన వాళ్ళు అభ్యంతర పెట్టి వుండాలి. ఈ రోజు ఏమి అనుకోని లాభం లేదు. లాలూ టైములో బీహారుకి పెద్ద పీట వేసుకుంటుంటే మనం నోట్లో వేలు పెట్టుకుని చూస్తూ కూర్చున్నాం. కనీసం ఈ రోజైన ఐకమత్యంగా అడుగుదామంటే ఆ ఆవకాశం ఇవ్వకుండా తెలుగు వాళ్ళని విడదీసి పారేశారు. ఇప్పటికైనా తెలుగు వాళ్ళ పై జరుగుతున్న కుట్రని గ్రహించి ప్రాంతీయ విభేదాల్ని విస్మరించి తెలుగు వాళ్ళందరూ ఒక్కటే అని చాటే సమయం వచ్చింది. కాదంటారా... మన బతుకులింతే..
Tuesday, February 23, 2010
ఇదేనా నాయకత్వ లక్షణం?
తనని రాజీనామా అడగటం పెద్ద జోక్ అని కే.సి.ఆర్. సెలవిచ్చారు. లీడర్ అన్న వాడు ముందు ఉండి లీడ్ చెయ్యాలి. అంతే కానీ తనను నమ్ముకున్న వారిని ముంచేసి తీరా తన వంతు వచ్చేసరికి మీన మేషాలు లెక్క పెట్టటం కాదు. పై ఫోటోలో చూడండి. నిన్న జరిగిన టీ.ఆర్.ఎస్. పత్రికా సమావేశంలో కే.సి.ఆర్. మొహంలో తప్ప ఎవరి మొహంలోనైనా కళా కాంతులు ఉన్నాయా?
Monday, February 22, 2010
కేంద్రం కొరివితో తల గోకుతుందా?
పార్లమెంటు సమావేశాల ప్రారంభ దినాన ఉభయ సభలని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో తెలంగాణా ప్రసక్తి లేదట! ఇప్పటికే హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన(ల)తో తల బొప్పి కట్టించుకున్న కేంద్రం ఏకంగా రాష్ట్రపతి నోటనే ఆ ప్రస్తావన తెస్తుందని ఎలా ఆశించారో? పైగా పార్లమెంటులో తెలంగాణా కోసం బిల్లు పెట్టాలని మళ్ళీ రాగం మొదలు పెట్టారు. ఐనా రాజ్యాంగ బద్దంగా ఒక కమిటీ ఏర్పాటు అయి పని ప్రారంభించిన దశలో మళ్ళీ ఇటువంటి ఆందోళనలు చేయటం అర్ధ రహితం. చేతనైతే తమ వాదనలు కమిటీకి సమర్ధవంతంగా వినిపించి రిపోర్టు తమకి అనుకూలంగా తెప్పించుకోవాలి గానీ ఇటువంటి పిల్ల చేష్టల వల్ల తెలంగాణా రానే రాదు.
Sunday, February 21, 2010
పోలీసులే లోకువ..
రాష్ట్రం లో గత మూడు నెలలుగా ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తూ శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసులను అభినందించాల్సింది పోయి ఎ చిన్న/పెద్ద సంఘటన జరిగినా వారి మీద రాళ్లేయడం వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది. ధిల్లీ నుంచి గల్లీ స్థాయి నాయకుని వరకు పోలీసులకు అక్షింతలు వేయటానికి రెడీగా వుంటారు. నిషేధాజ్ఞలు అమలులో వున్నప్పుడు సామాన్య జనం మౌనంగా భరిస్తున్నారు కదా! మరి వాటిని ఉల్లంఘించినపుడు చర్యలు తీసుకుంటే తప్పేమిటి? కానీ మన సమాజంలో కొన్ని ప్రత్యెక వర్గాలు వున్నాయి. ఎటువంటి పరిస్థితిలోను వారి పై లాఠీ ఎత్తకూడదు. జర్నలిస్టుల సంగతే తీసుకుంటే, వారి వారి చానేల్సుల్లో,పేపర్లలో వారు రెచ్చగొట్టే వార్తలు, వ్యాఖ్యలు ఎన్నైనా చేయవచ్చు...కానీ వారి మీద లాఠీ ఝుళిపిస్తే అదో పెద్ద నేరం. రాజకీయ నాయకులైనా అంతే. వారిని అరెస్టు చేసినా కూడా వారిని పొలిసు స్టేషన్లలో అత్తారింట్లో అల్లుడి లాగ చూసుకోవాలి. లేక పొతే ఇంతే సంగతి. లగడపాటి వంటి ఎం.పీ. స్థాయి నాయకుడు సినిమాటిక్ గా ప్లాన్ చేసి తప్పించుకుంటే కాపలాగా ఉన్న కొద్ది మంది సిబ్బంది ఏమి చేయగలరు? ఎక్కడో ఉన్న పోలీసు కమిషనర్ ఏమి చేయ గలడు? ఇక విద్యార్ధులున్నారు. వారిని చదువుకొని బాగు పడమని విద్యాలయాలకు పంపిస్తే, తిన్నది అరక్క ఉద్యమాలు, ఆత్మహత్యలు చేసుకుంటే పోలీసులదా బాధ్యత? పోలీసులలో లోపాలు లేవని కాదు. కాని ప్రతి విషయానికీ వారిని తప్పు పట్టడం మంచి పద్ధతి కాదు.
కే.సి.ఆర్. రాజీనా "మాయ"!
పుట్టి బుద్ధెరిగాక రాజీనామాయే తన ప్రవృత్తిగా పెట్టుకున్న కే.సి.ఆర్.కి రాజీనామా సరైన ఫార్మాట్ లో ఇవ్వటం తెలియదంటే నమ్మాలా? తోటి శాసన సభ్యులందరినీ ముంచేసి తానూ,తన చెల్లి మాత్రం రాజీనామాలు తిరస్కరణకు గురి అయ్యేలా జాగ్రత్త పడ్డాడు. ఇక తరువాత డ్రామా ఏమిటో వెండితెర పై చూద్దాం.
Saturday, February 20, 2010
టీ.ఆర్.ఎస్. కారు ఇక "బేకార్"!
గత ఎన్నికల్లో కేవలం పది మంది శాసన సభ్యులు, రెండే రెండు మంది ఎం.పీ. ల తో చావు తప్పి కన్ను లొట్ట బోయినట్లుగా బైట పడ్డ కే.సి.ఆర్..... రాష్ట్రంలో గట్టి నాయకత్వం లేని సమయం చూసి, విద్వేషాగ్నుల్నిరెచ్చగొట్టి, తెలంగాణకి దొర అయి పోదామని కల గన్నాడు. ఆయన అలా తన సామ్రాజ్యాన్ని స్థాపించేస్తే తమ స్థావరాలకి ఎక్కడ ముప్పు వస్తుందో అని కంగారు పడి పోయిన తెలంగాణకి చెందిన ప్రధాన పార్టీల నాయకులు కే.సి.ఆర్. పెట్టిన జే.ఎ.సి. అన్న బోనులో ఎలకల్లా పడ్డారు. పడ్డాక తెలిసింది దొర పెత్తనం తెలంగాణా మీద మాత్రమె కాదు తమ మీద కూడా అని! కేంద్రం కూడా కే.సి.ఆర్. పెట్టిన గాండ్రింపులని సరిగ్గా అంచనా వేయలేక డిసెంబరు 9 వ తేదీన ఒక పొరపాటు ప్రకటన చేసింది. తరవాత జరిగిన పరిణామాలతో నిజం తెలుసుకున్న కేంద్రం దిద్దు బాటు చర్యలు ప్రారంభించింది. (నా ముందరి టపా పొరపాటుని సరిదిద్దండి..చదవండి. http://andhraaakasaramanna.blogspot.com/2010/02/blog-post_17.html ) . ఏమైనా, కే.సి.ఆర్. కర్ర పెత్తనం ఎక్కువగా చేయటమే కాక, మొదటినించీ తమకు అలవాటు ఐన రాజీనామా డ్రామాలు ఆడి తాను తీసుకున్న గోతిలో తామే పడ్దారు. ప్రజలందరికీ కూడా ఆయన చర్యలన్నీ ఉనికి కోసం ఆరాటమే తప్ప తెలంగాణా కోసం నిజమైన పోరాటం కాదని తెలిసి పోయింది. మళ్ళీ జరిగే ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన సీట్లు కూడా వస్తాయన్న నమ్మకం ఎ మాత్రం లేదు. కనుక టీ.ఆర్.ఎస్. కారు ఇంక షెడ్డు కే!
Friday, February 19, 2010
జాయింటు ఊడిన కమిటీ!
అంతా ఊహించినట్లే జరిగింది. తెలంగాణా జే.ఎ.సి. లోంచి ముక్క ఊడింది. (జనవరి 21 వ తేదీనాటి నా ముందరి టపా చదవండి. http://andhraaakasaramanna.blogspot.com/2010/01/blog-post_21.html ) . రాజీనామాలకే కాంగ్రెసుతో లింకు పెట్టిన తెలుగు దేశం ఇంకా జే.ఎ.సి. లో కొనసాగుతుందని భావించలేం. ఒంటెత్తు పోకడలతో ప్రధాన పార్టీలను దూరం చేసుకుని ఏమి సాధిస్తారో తెలీదు. ఇంకా ఈ రోజు మజ్లిస్ పార్టీకి చెందిన శాసన సభ్యుడు అక్బరుద్దీన్-- హైదరాబాదు ఎ ఒక్కరి సొత్తు కాదు అని ప్రకటించటమే కాక చిన్న రాష్ట్రాలుగా విభజనకు తాము వ్యతిరేకమని విష్పష్టంగా ప్రకటించారు. మరి సమైక్య వాదాన్ని బలపరచిన చిరంజీవి, మోహన్ బాబు, రోజా, లగడపాటి..చివరికి కంచి స్వామిని కూడా విడువకుండా దుర్భాషలాడిన తెలబాన్లు మజ్లిస్ ని పల్లెత్తు మాట అన గలరా? అలా అనాలని నా ఉద్దేశ్యం కాదు. హైదరాబాదులో గట్టి పట్టు ఉన్న పార్టీ తమ వైఖరి స్పష్టం చేసాక...ఈ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికే మొహం చెల్లని వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదు. తక్కిన విషయాలు తేల్చటానికి శ్రీ కృష్ణ కమిషన్ ఎటూ ఉంది. కనుక ఇప్పటికైనా విద్యార్ధులే కాక అన్ని వర్గాల వారూ ఆందోళన లు విరమించి కాగల కార్యం శ్రీకృష్ణునికి వదిలి రాష్ట్రంలో మునుపటి ప్రశాంతత తెస్తే బాగుంటుంది.
Thursday, February 18, 2010
ఇప్పటికి గ్రహింపు కి వచ్చిందా?
అసెంబ్లీని ముట్టదిన్చాలన్న ప్రయత్నం మానుకోవాలని మంత్రులు శ్రీధర్ బాబు, అరుణ విద్యార్ధులకు విజ్ఞప్తి చేసారట. చాలా సంతోషించాల్సిన విషయం. ఉద్యమంలో అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం వుందని వారు తెలియచేసారు. ఆ సంగతి వారికి ఇప్పుడు తెలిసిందేమో కానీ, నాగం జనార్ధన్ రెడ్డిని యూనివర్సిటీలో చితక్కొట్టినప్పుడే రాష్ట్ర ప్రజలకు తెలిసింది. విద్యా సంవత్సరం కోల్పోతే ఉద్యోగాలు సంపాదించటానికి నానా కష్టాలు పడాలని హెచ్చరించారు. మరి విద్యార్ధులని రెచ్చగొట్టి వారిని వుద్యమంలోనికి లాగినపుడు ఈ గ్రహింపు ఏమయింది? మరీ విచిత్రం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ఉంటూ....తెలంగాణా వారిపై తెలంగాణా వారే దాడులు చేసుకోవడం ద్వారా ఏమి సందేశం ఇస్తారని విద్యార్ధులని ప్రశ్నించారు. అదే ప్రశ్న ఇప్పుడు ఆంధ్ర ప్రజానీకం వేస్తోంది. తెలుగు వారే తోటి తెలుగు వారి గురించి దుర్భాషలాడి, వారి పై దాడులు చేసి ఇన్నాళ్ళు ఏమి సాధించారు? ప్రపంచానికి ఏమి సంకేతం ఇచ్చారు?
కీలెరిగి వాత పెట్టిన స్పీకర్!
కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు మరోసారి చాణక్య నీతిని ప్రదర్శించాయి. శ్రీ కృష్ణ కమిటీ ని ఏర్పాటు చేసాక కూడా తెలంగాణా ఉద్యమాన్ని తామే హైజాక్ చేసేద్దామన్న అత్యుత్సాహంతో రాజీనామాల డ్రామా ఆడిన టీ.ఆర్.ఎస్. కి స్పీకర్ తగిన బుద్ది చెప్పారు. ప్రతిభావంతుడు, అత్యంత వివాదరహితుడుగా పేరున్న జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ గురించి..దిక్కు మాలిన కమిటీ, గడ్డి పీకుతుందా లాంటి పరుష వ్యాఖ్యలు చేయటమే కాక, తమ చేతిలోని కీలు బొమ్మ ఐన జే.ఎ.సి. కన్వీనర్ చేత రాజీనామాల హుకుం జారీ చేయించటం టీ.ఆర్.ఎస్. నియంతృత్వ పోకడలకు నిదర్శనం. పైగా రాజీనామా చేయని వారిని తెలంగాణా ద్రోహులుగా వర్ణిస్తూ వారి ఇళ్ళ పై పేడ,పిడకలు కొట్టించటం జే.ఎ.సి. సమిష్టి ధర్మానికే విరుద్ధం. అందుకే రాజీనామాలు చేయకుండా కాంగ్రేసు వారు, కాంగ్రెసుతో లింకు పెట్టి కోదండరాం కి లేఖలు ఇచ్చి తెలుగు దేశం వారు చాణక్య నీతిని చూపారు. స్పీకర్ కూడా ఈసారి ఏ మాత్రం ఆలస్యం లేకుండా టీ.ఆర్.ఎస్. వారి పది రాజీనామాలూ ఆమోదించేసి వారికి ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో తమ వాణిని వినిపించే అవకాశం లేకుండా చేసారు. ఐదేళ్ళ పాటు తమ బాగోగులు చూడమని ప్రజలు అసెంబ్లీకి పంపితే...పదవులు మాకు తృణప్రాయం అంటూ స్వంత ఎజెండాలతో ఏడాది కూడా తిరక్క ముందే రాజీనామా చేసి పారేశారు. అటువంటిది వాళ్ళు రేపు మళ్ళీ ఉప ఎన్నికల్లో నిలబడితే...మీరందరూ మాకు తృణప్రాయం అని ప్రజలు వారిని తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది.
Wednesday, February 17, 2010
తెలంగాణా రాజకీయుల సొత్తా?
కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి సమైక్యంగా వుంటే మంచిదని సలహా ఇచ్చారు. అంతే....తెలంగాణా (తీవ్ర) వాదులు ఆయన పై దుర్భాషలు మొదలు పెట్టేసారు. కంచి పీఠంలో కూర్చుని పూజలు చేసుకునే ఆయనకి తెలంగాణా పై మాట్లాడే హక్కు లేదట! ఇంకా ఆయన దిష్టి బొమ్మలు తగలపెట్టతాలూ, తెలంగాణలో తిరగనివ్వమని బెదిరింపులూ, స్కందగిరి ఆలయంలో కార్య కలాపాలు స్తంభింప చేస్తామన్న హెచ్చరికలూ షరా మామూలుగా ఫాలో అయ్యాయి. అసలు ఒక విషయం అర్ధం కాదు. ఈ దేశం లో భావ ప్రకటన స్వేచ్చ అనేది అందరికీ సమానమే. చిరంజీవికి కానీ,మోహన్ బాబుకి కానీ, కంచి స్వామివారికి కానీ తమ ఆభిప్రాయాలు చెప్పే హక్కు వుంది. అలా చెప్పినంత మాత్రం చేత వారిని నానా దుర్భాషలాడటం, వారికి తెలంగాణా రాజ్య బహిష్కరణ విధించడం వంటివి సహించరాదు. ప్రత్యెక రాష్ట్రం రాక ముందే ఇలా పెట్రేగుతున్న వారు, ఒక వేళ తెలంగాణా వస్తే..గిస్తే.. ఇతర ప్రాంతాల వారిని ఎలా కాల్చుకు తింటారో చెప్పకనే చెపుతున్నారు. అయినా కంచిలో పూజలు చేసుకొనే స్వామికి తెలంగాణా పై మాట్లాడే హక్కు లేనపుడు....యూనివర్సిటీల్లో చదువుకొనే విద్యార్దులకీ, అక్కడ పాఠాలు చెప్పుకొనే ప్రోఫెసర్లకీ కూడా వుండకూడదు. కానీ జరుగుతున్నదేమిటి? తెలంగాణా కేవలం రాజకీయ సమస్య కాదు. సామాజిక సమస్య కూడా. సమాజం లో అన్ని వర్గాల వారికి తమ అభిప్రాయం చెప్పుకొనే హక్కు ఉందన్న ఇంగిత జ్ఞానం కూడా ఈ రాజకీయులకు లేదా?
పొరపాటుని సరి దిద్దండి..
అర్ధ శతాబ్దం పైన సాగుతున్న తెలంగాణా ఉద్యమం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న స్థితిలో వుంది. అలాంటిది ఇప్పుడు కనీసం పరిస్థితుల అంచనాల కోసం అధికారికంగా ఒక కమిటీ వచ్చిందని సంతోషించక తెలంగాణా భీభత్స వాదులు ఎంత సేపూ చిదంబరం గారి డిసెంబర్ 9 ప్రకటన పట్టుకొని వేళ్లాడుతూ నానా యాగీ చేస్తున్నారు. అసలు తెలంగాణా ప్రక్రియ మొదలు పెడతామని చిదంబరం ప్రకటన చేయటమే పొరపాటు. తెలంగాణా ప్రక్రియ అనకుండా రాష్ట్ర విభజన కోసం ప్రక్రియ మొదలు పెడతాం అని వుంటే గొడవ వుండేది కాదు. ఎవరి సెంటి మెంట్లు హర్ట్ అయ్యేవి కాదు. రాత్రికి రాత్రి తెలంగాణా అనేసరికి ఇతర ప్రాంతాలవారు సహజంగానే హర్ట్ అయ్యారు. రాష్ట్రం తగలబడటం మొదలైంది. పొరపాటు జరిగింది సరే, ఏ పరిస్థితిలో జరిగింది ఆలోచించాలి. ఆ సమయంలో కేంద్రానికి రెండు కళ్ళుగా ఉండి, సరైన సమాచారం అందించాల్సిన వారు ఎం చేస్తున్నారు? ముఖ్య మంత్రి రోశయ్య నాకేం బాధ్యత లేదు అంతా హై కమాండు దే అని నెత్తిన తడి గుడ్డ వేసుకొని కూర్చున్నాడు. రెండో కన్నుగా చూడాల్సిన గవర్నర్ తివారీ రాస లీలలలో మునిగి తేల్తున్నాడు. విధి లేని పరిస్థితిలో కేంద్రం తన దగ్గరున్న సమాచారంతో (కాంగ్రెస్స్ ఓకే అంటే మేమూ ఓకే అని ప్రతి పక్షాలు ఇచ్చిన లేఖలు) ఒక ప్రకటన చేసింది. అది నిస్సందేహంగా ఒత్తిడుల మధ్య, సరైన సమాచారం లేని పరిస్థితుల్లో ఇచ్చిన పొరపాటు ప్రకటన. ఆ విషయం తదనంతరం జరిగిన పరిణామాలే రుజువు చేసాయి. ఇప్పటికైనా మించి పోయింది లేదు. కేంద్రం భేషజాలకు పోకుండా డిసెంబరు 9 వ తేదీ ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టు వచ్చాక పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని నిర్ద్వందంగా ప్రకటించాలి. రాష్ట్రం లో సత్వరం రాష్ట్రపతి పాలన విధించాలి. అప్పుడే మన రాష్ట్రం లో ప్రశాంతత నెలకొంటుంది.
Sunday, February 14, 2010
వై.ఎస్.రాజ శేఖర రెడ్డి జీవించి వుంటే??
వై.ఎస్.రాజ శేఖర రెడ్డి ఈ రోజు కనుక జీవించి వుంటే పరిస్థితి ఎలా ఉండేదో అని చిన్న ఊహ....
కే. సి. ఆర్. అసలు దీక్షకి కూర్చునే ఆలోచనే చేసేవాడు కాదు. ఒక వేళ నిరాహార దీక్షకి దిగితే..ఇప్పటి ప్రభుత్వంలా ఆ దీక్షని భగ్నం చేయాలని వై.ఎస్.ఆర్ ప్రయత్నించే వాడు కాదు. పైగా దీక్షకి కూర్చున్న మరు క్షణం నుంచి ఆయనకి పచ్చి మంచి నీళ్ళు కూడా అందకుండా పకడ్బందీ ఏర్పాట్లు వై.ఎస్.ఆర్. చేసేవాడు. ఆ విధంగా టీ.పీ.ఎస్. తీసుకుంటూ దొంగ దీక్ష చేయటం కాకుండా అసలు సిసలు నిరాహార దీక్ష చేసే మహద్భాగ్యం కే.సి.ఆర్. కి కలిగి వుండేది. ఓ పది రోజుల తరువాత......డాక్టర్లు ఆరోగ్య పరిస్థితి పై బూటకపు నివేదికలు ఇచ్చినట్లు కాక....కే.సి.ఆర్. నిజంగానే కోమా లోకి వెళ్లి పోయే వాడు. అప్పటి వరకు మూలన కూర్చున్న తెలంగాణా కాంగ్రెస్ సీనియర్లు మేడం కి పరిస్థితి నివేదిస్తారు. మేడం వై.ఎస్.ఆర్. ని ఆరా తీస్తుంది. ఒక్క మనిషి దీక్షకి లొంగి ఇప్పుడు తెలంగాణా ఇచ్చేస్తే దేశంలో మరో 22 రాష్ట్రాలకి డిమాండ్లు వస్తాయని ఆయన వివరించి చెప్పే వాడు. (అంతే కానీ ఇప్పటి రోశయ్య ప్రభుత్వంలా... అక్కడ మనిషి చచ్చి పోతున్నాడు, ఏదో ఒకటి తేల్చండి అని కేంద్రం పీక మీద కత్తి పెట్టే వాడు కాదు.) . ఈ లోపల కే.సి.ఆర్. ప్రాణాలు చాలా విలువైనవి..తెలంగాణా ఉద్యమం బతికి ఉండాలంటే ఆయన బతికి వుండాలని తెలంగాణా ప్రజలు తీర్మానించడంతో కే.సి.ఆర్. వారి కోరిక మేరకు దీక్ష విరమించేస్తాడు. ఇంక వై.ఎస్.ఆర్. ముఖ్య మంత్రిగా వుండగా నిరాహార దీక్ష చేయనని ముక్కు నేలకి రాసి శపధం చేస్తాడు.
కే. సి. ఆర్. అసలు దీక్షకి కూర్చునే ఆలోచనే చేసేవాడు కాదు. ఒక వేళ నిరాహార దీక్షకి దిగితే..ఇప్పటి ప్రభుత్వంలా ఆ దీక్షని భగ్నం చేయాలని వై.ఎస్.ఆర్ ప్రయత్నించే వాడు కాదు. పైగా దీక్షకి కూర్చున్న మరు క్షణం నుంచి ఆయనకి పచ్చి మంచి నీళ్ళు కూడా అందకుండా పకడ్బందీ ఏర్పాట్లు వై.ఎస్.ఆర్. చేసేవాడు. ఆ విధంగా టీ.పీ.ఎస్. తీసుకుంటూ దొంగ దీక్ష చేయటం కాకుండా అసలు సిసలు నిరాహార దీక్ష చేసే మహద్భాగ్యం కే.సి.ఆర్. కి కలిగి వుండేది. ఓ పది రోజుల తరువాత......డాక్టర్లు ఆరోగ్య పరిస్థితి పై బూటకపు నివేదికలు ఇచ్చినట్లు కాక....కే.సి.ఆర్. నిజంగానే కోమా లోకి వెళ్లి పోయే వాడు. అప్పటి వరకు మూలన కూర్చున్న తెలంగాణా కాంగ్రెస్ సీనియర్లు మేడం కి పరిస్థితి నివేదిస్తారు. మేడం వై.ఎస్.ఆర్. ని ఆరా తీస్తుంది. ఒక్క మనిషి దీక్షకి లొంగి ఇప్పుడు తెలంగాణా ఇచ్చేస్తే దేశంలో మరో 22 రాష్ట్రాలకి డిమాండ్లు వస్తాయని ఆయన వివరించి చెప్పే వాడు. (అంతే కానీ ఇప్పటి రోశయ్య ప్రభుత్వంలా... అక్కడ మనిషి చచ్చి పోతున్నాడు, ఏదో ఒకటి తేల్చండి అని కేంద్రం పీక మీద కత్తి పెట్టే వాడు కాదు.) . ఈ లోపల కే.సి.ఆర్. ప్రాణాలు చాలా విలువైనవి..తెలంగాణా ఉద్యమం బతికి ఉండాలంటే ఆయన బతికి వుండాలని తెలంగాణా ప్రజలు తీర్మానించడంతో కే.సి.ఆర్. వారి కోరిక మేరకు దీక్ష విరమించేస్తాడు. ఇంక వై.ఎస్.ఆర్. ముఖ్య మంత్రిగా వుండగా నిరాహార దీక్ష చేయనని ముక్కు నేలకి రాసి శపధం చేస్తాడు.
శుభం. వూహ సమాప్తం.
Saturday, February 13, 2010
సమైక్యాంధ్రకు నాయకత్వ లోపం!
1) సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారి నాలుకలు తెగ్గోస్తాం.
2) సమైక్యాంధ్రకు వ్యతిరేకులైన వారి ఆస్తులు లాక్కుంటాం. వారిని ఉద్యోగాలు, వ్యాపారాలు చేయనివ్వం. వారిని రాష్ట్రం అవతలికి తరిమి కొడతాం.
౩) శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టు సమైక్యాంధ్రకు అనుకూలంగా రాక పొతే రాష్ట్రాన్ని అగ్ని గుండం చేస్తాం. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తాం.
4) రాష్టం సమైక్యంగా వుండాలని చెప్పటానికి వారం రోజులు చాలు. మరి పది నెలలు ఈ కమిటీ ఏం చేస్తుంది? గడ్డి పీకుతుందా?
....ఇలా గట్టిగా వాదించే నాయకుడు ఎవరూ సమైక్యాంధ్ర ఉద్యమానికి లేక పోవటం పెద్ద లోపమే!
Thursday, February 11, 2010
పదవులకి ప్రాంతం కాదు అర్హత!
అడ్వకేటు జనరల్ గా తెలంగాణా వాళ్ళు ఎవ్వరూ పని చేయలేదని కే.సి.ఆర్. గారు తెగ బాధ పడి పోయారు. అడ్వకేటు జనరల్ ఏం ఖర్మ...దేశానికే అత్యున్నత పదవి ఐన ప్రధాన మంత్రి పదవినే తెలంగాణాకి చెందిన ఆంధ్ర ప్రదేశ్ ముద్దు బిడ్డ పీ.వీ.నరసింహారావు గారు అధిష్టించారు. ఐనంత మాత్రాన ఆంధ్ర ప్రాంత వాసులకి కూడా ప్రధాని పదవి ఇవ్వాలని డిమాండు చేస్తే.. అది ఎంత మూర్ఖత్వం? పదవులనేవి వ్యక్తిగత ప్రతిభ పాటవాల వల్లనే లభిస్తాయి తప్ప భౌగోళిక ప్రాతిపదికన కాదని మన ఆంధ్రా జిన్నా గారికి ఎప్పుడు అవగతమవుతుందో??
కే.సి.ఆర్. హిట్లర్!
శ్రీ కృష్ణ కమిటీ తొంభై రోజుల్లోగా నివేదిక ఇచ్చేయాలని కే.సి.ఆర్. డిమాండు చేయటం హాస్యాస్పదం. కమిటీ ఇంకా పని ప్రారంభించలేదు...విధి విధానాలు నిర్ణయం అవలేదు. అప్పుడే డెడ్ లైను విధించేసారు. పైగా విధి విధానాలు తెలంగాణాకు అనుకూలంగా లేక పొతే రాజ్యాంగ సంక్షోభం సృస్టిస్తారట! విధి విదానాలేందుకు.... అసలు ఫైనల్ రిపోర్టు ఎలా ఇవ్వాలో ముందే చెప్పేస్తే సంతోషం. ఆ విధంగా రిపోర్టు ఇవ్వక పొతే కమిటీ సభ్యులను తెలంగాణలో తిరగనివ్వరేమో? నాలుకలు తెగ్గోస్తారేమో ఖర్మ!
Tuesday, February 9, 2010
తెలంగాణా (తీవ్ర) వాదం!
కొడాలి నాని అన్న దాంట్లో తప్పేముంది? ఎన్ని అడ్డంకులు కల్పించినా తన సినిమా ఆడిందని గర్వంగా చెప్పుకున్నాడు...అంతే కదా! అంత మాత్రానికే అతన్ని ఉన్మాది గా చేసేసారు తెలంగాణా (తీవ్ర) వాదులు... ఆంధ్రా వాలే భాగో..తరిమి కొడతాం..నాలుకలు కోస్తాం..అంటూ అసలు సిసలు ఉన్మాదంతో వున్నది తెలంగాణా వేర్పాటు వాదులే. నాగం ని చితక్కొట్టింది విద్యార్ధుల ముసుగులో వున్న తీవ్ర వాదులే కాదా? ఈ సినిమాకి కవిత (కే. సి.ఆర్. కూతురు) ప్రచార బాధ్యత వహించి హిట్ చెయ్యడంలో పాలు పంచుకొందని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అసలు వాళ్ళ వేర్పాటు వాద నాయకునికి ఆనాడు చంద్రబాబు సరైన పదవి ఇచ్చి వుంటే ఈ రోజు ఈ రచ్చ బండ ఉండేదే కాదు. కనుక చంద్ర బాబే దోషి..
Thursday, February 4, 2010
హైదరాబాదు పై హక్కెవరిది??
తెలంగాణా పిడి వాదులందరూ హైదరాబాదు తమ వారసత్వ హక్కు ఐనట్లూ, ఈ నగరంలోని ఇతర ప్రాంతాల వారు కేవలం దోచుకోవటానికే వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు కర్నూలు రాజధానిగా ఉండి వుంటే అందరూ అక్కడికే వెళ్ళే వారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అర్ధ శతాబ్దం పైన ప్రజలందరికీ హైదరాబాదుతో అనుబంధం వుంది. పాతికేళ్ళు కని పెంచిన కొడుక్కి ముచ్చట పడి పెళ్లి చేస్తే, కొత్త కోడలు వచ్చి ఇంక ఆ కొడుకు పై సర్వ హక్కులూ నావే, నువ్వు బైటకి పో అంటె, ఆ అత్త బైటకి వెళుతుందా...ఆ బంధం తెగి పోతుందా? మరి యాభై ఆరేళ్లుగా హైదరాబాదుతో అనుబంధం పెంచుకున్న వారి పరిస్థితీ అంతే. అయినా ఇంత కాలంగా హైదరాబాదుకి వచ్చిన వాళ్ళు ఎవరినీ పర్మిషన్ అడిగి రాలేదు. ఇప్పుడు పొమ్మని అరచి గీ పెట్టినా పోయే ప్రసక్తి లేదు. ఈ రాజధాని అందరిదీ. అందరికీ సర్వ హక్కులూ వున్నాయి ఇక్కడ.. ఇది గుర్తెరిగి మసలుకుంటే బాగుంటుంది.
Wednesday, February 3, 2010
శ్రీ కృష్ణ కమిటీ వచ్చింది..ఇంకేం??
ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల పై శ్రీ కృష్ణ కమిటీ మూడేళ్ళ లో నివేదిక ఇస్తుందట! ఈ లోపల గొంతెమ్మ కోరికలు ఎవరికి ఏమున్నా నివేదించుకోగలరు....
తెలంగాణా వాదులకో సలహా!
అయ్యో.... కాంగ్రెస్స్ మళ్లీ మోసం చేసేసింది....శ్రీకృష్ణ నేతృత్వంలో ఓ కాలయాపన కమిటీని ఏర్పాటు చేసింది..ఇంక లాభం లేదు. ఎవరి అంగీకారాలు, అనుమతుల కోసం చూడకండి. P.O.K. లాగ మీరు కూడా తెలబాన్ ఆక్యుపయిడ్ తెలంగాణాను ఏర్పాటు చేసేసుకోండి. హైదరాబాదులో వున్న సెటిలర్స్ అందరినీ వేళ్లగోట్టండి. ఇన్నేళ్ళుగా వారు దోచేసి సంపాదించిన ఆస్తులన్నీ లాగేసుకోండి. సినీ పరిశ్రమని విశాఖ పట్నానికో, చేన్నైకో తరిమేయండి. సినిమా వాళ్ళ ఆస్తులు కూడా లాగేసుకోండి. ఆ ఆస్తులన్నిటితో తెలంగాణాని అభివృద్ది చేసుకోండి.... విజయీభవ..
వైష్ణవి హంతకులను వురి తీయకూడదు!
మా డాడీ కి చెప్పి డబ్బులు ఇప్పిస్తాను వదిలేయండి ప్లీజ్....అంటూ బ్రతిమలాడినా కనికరం లేకుండా చిన్నారి వైష్ణవిని చంపి బూడిద చేసిన కసాయిలని వురి తీయాలా? ఎన్ కౌంటర్ చెయ్యాలా? కానే కాదు..ఎక్కడైతే ఆ చిన్నారిని బూడిద చేసారో అదే బాయిలర్లో వారిని సజీవ దహనం చెయ్యాలి....నేరం రుజువైంది కాబట్టి అవసరమైతే న్యాయ శాస్త్ర నియమాలను సవరించైనా ఈ శిక్షని అమలు చేయండి. ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా కూడా వైష్ణవి గురించి బాధ పడని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వారందరి బాధకి కొంతైనా ఉపసమనం కావాలంటే ఈ శిక్ష అమలు చేసి తీరాలి.
Tuesday, February 2, 2010
మనుషులా .. రాక్షసులా?
అడవిలో క్రూర జంతువులు సైతం ఆకలి అయితేనే చిన్న జంతువులను చంపి తింటాయి. కానీ కేవలం ఆస్తి గొడవ వల్ల చిన్నారి వైష్ణవిని పైశాచికంగా చంపిన వారు మానవ మృగాలు అని చెప్పటానికి కూడా అర్హులు కారు. వైష్ణవిని బూడిద చేసిన అదే బాయిలర్లో వాళ్ళని తగల బెట్టటమే వారికి సరైన శిక్ష. ఈ కేసుని ఎస్. పీ. సజ్జనార్ కి అప్పగించండి. ఆ దుర్మార్గులని శిక్షించటానికి ఆయనే సరైన వ్యక్తి.
Subscribe to:
Posts (Atom)