Wednesday, February 24, 2010

ఎ.పీ.లో ఆగని మమత రైలు


షరా మామూలుగా మళ్ళీ అన్యాయమే జరిగింది. మరో బెంగాల్ పక్షపాత రైల్వే బడ్జెట్ ని మమత ఈ రోజు సమర్పించింది. విదిలించిన కొత్త రైళ్ళు నామ మాత్రం. అవికూడా మనకన్నా పొరుగు రాష్ట్రాలకే ఎక్కువ ఉపయోగం. తెలంగాణా ఉద్యమాన్ని దృష్టిలో వుంచుకొని ప్రకటించిన కొత్త రైల్వే లైన్లు ఎప్పటికి నిజమయ్యేను? అప్పటికి తెలంగాణా ఉద్యమం హుళక్కి--తెలంగాణా హుళక్కి అని వారికి తెలుసు. అసలు 33 మంది ఎం.పీ.లు యూ.పీ.ఎ. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా గల రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇదేనా? కేవలం 19 మంది సభ్యులు గల తృణమూల్ కాంగ్రెస్ కి రైల్వే శాఖ ఇచ్చిననాడే మన వాళ్ళు అభ్యంతర పెట్టి వుండాలి. ఈ రోజు ఏమి అనుకోని లాభం లేదు. లాలూ టైములో బీహారుకి పెద్ద పీట వేసుకుంటుంటే మనం నోట్లో వేలు పెట్టుకుని చూస్తూ కూర్చున్నాం. కనీసం ఈ రోజైన ఐకమత్యంగా అడుగుదామంటే ఆ ఆవకాశం ఇవ్వకుండా తెలుగు వాళ్ళని విడదీసి పారేశారు. ఇప్పటికైనా తెలుగు వాళ్ళ పై జరుగుతున్న కుట్రని గ్రహించి ప్రాంతీయ విభేదాల్ని విస్మరించి తెలుగు వాళ్ళందరూ ఒక్కటే అని చాటే సమయం వచ్చింది. కాదంటారా... మన బతుకులింతే..

No comments:

Post a Comment