Friday, February 26, 2010

లెవలై పోయింది..




అక్కడ పార్లమెంటులో తె.రా.స. కు చెందిన ఇద్దరు ఎం.పీ. ల రాజీనామాలని స్పీకర్ తిరస్కరించారు---ఇక్కడ అసెంబ్లీలో ఇద్దరు కాంగ్రేసు శాసన సభ్యుల రాజీనామాలు స్పీకర్ తిరస్కరించారు. మేటరు లెవలై పోయింది. అయితే రాజీనామాల్లో నాదే ప్రపంచ రికార్డ్ అని చెప్పుకున్న పెద్ద మనిషికి సరైన ఫార్మాట్ లో రాజీనామా ఇవ్వటం తెలియదా? తన తోటి ఎం.పీ.కి సరైన గైడెన్స్ ఇవ్వడం తెలియదా? ఇక ఎవరి పదవులు వాళ్ళు ఎంజాయ్ చెయ్యండి. మరి ఇక్కడ వెర్రి గొర్రెలు అయ్యింది ఎవరు? ఆల్రెడీ పదవులూడగోట్టుకున్న పది మంది శాసన సభ్యులు...నెరవేరని లక్ష్యానికి ప్రాణాలర్పించిన విద్యార్ధులు...ఇంకా చోద్యం చూస్తున్న ప్రజలు....

5 comments:

  1. తెలంగానా ఎమ్మెల్యేలు బకరా
    మద్యమకారుడు, క్షుద్రమదేవి టొకరా

    ReplyDelete
  2. అయ్యా ఆకాశ రామన్న గారు మీకు తెలంగాణా మీద చూపిన శ్రద్ద కెసిఆర్ గారి పైన చూపే కోపం అది తప్పితే ఇక ముక్యమయినవి ఏమి లేవ. టెండూల్కర్ గురుంచి వ్రాసారు బాగుంది. మీ బుర్ర బడ్జెట్ మీద లేదా లేక బడ్జెట్ పైన అవగాహనా లేదా. ఒక్క కామెంట్ కూడా బడ్జెట్ పైన చేయలేదు

    ReplyDelete
  3. రైల్వే బడ్జెట్ ఐన వెంటనే ఎ.పీ.లో ఆగని మమత రైలు అని రాసాను చదవలేదా? ముప్పై మూడు మంది ఎం.పీ.లు మనకి వున్నా ఏమీ సాధించుకోలేమని అర్ధం ఐ పోయిందిగా! ఇక సాధారణ బడ్జెట్ గురించి ఎదురు చూడనేలేదు. ముప్పై మూడు మంది ఉన్నప్పుడే సాధించలేనిది ఇంకా విడి పోయి ముక్కలై పొతే మనని పట్టించుకొనే వాడే వుండడు.

    ReplyDelete