Sunday, February 14, 2010

వై.ఎస్.రాజ శేఖర రెడ్డి జీవించి వుంటే??




వై.ఎస్.రాజ శేఖర రెడ్డి ఈ రోజు కనుక జీవించి వుంటే పరిస్థితి ఎలా ఉండేదో అని చిన్న ఊహ....
కే. సి. ఆర్. అసలు దీక్షకి కూర్చునే ఆలోచనే చేసేవాడు కాదు. ఒక వేళ నిరాహార దీక్షకి దిగితే..ఇప్పటి ప్రభుత్వంలా ఆ దీక్షని భగ్నం చేయాలని వై.ఎస్.ఆర్ ప్రయత్నించే వాడు కాదు. పైగా దీక్షకి కూర్చున్న మరు క్షణం నుంచి ఆయనకి పచ్చి మంచి నీళ్ళు కూడా అందకుండా పకడ్బందీ ఏర్పాట్లు వై.ఎస్.ఆర్. చేసేవాడు. ఆ విధంగా టీ.పీ.ఎస్. తీసుకుంటూ దొంగ దీక్ష చేయటం కాకుండా అసలు సిసలు నిరాహార దీక్ష చేసే మహద్భాగ్యం కే.సి.ఆర్. కి కలిగి వుండేది. ఓ పది రోజుల తరువాత......డాక్టర్లు ఆరోగ్య పరిస్థితి పై బూటకపు నివేదికలు ఇచ్చినట్లు కాక....కే.సి.ఆర్. నిజంగానే కోమా లోకి వెళ్లి పోయే వాడు. అప్పటి వరకు మూలన కూర్చున్న తెలంగాణా కాంగ్రెస్ సీనియర్లు మేడం కి పరిస్థితి నివేదిస్తారు. మేడం వై.ఎస్.ఆర్. ని ఆరా తీస్తుంది. ఒక్క మనిషి దీక్షకి లొంగి ఇప్పుడు తెలంగాణా ఇచ్చేస్తే దేశంలో మరో 22 రాష్ట్రాలకి డిమాండ్లు వస్తాయని ఆయన వివరించి చెప్పే వాడు. (అంతే కానీ ఇప్పటి రోశయ్య ప్రభుత్వంలా... అక్కడ మనిషి చచ్చి పోతున్నాడు, ఏదో ఒకటి తేల్చండి అని కేంద్రం పీక మీద కత్తి పెట్టే వాడు కాదు.) . ఈ లోపల కే.సి.ఆర్. ప్రాణాలు చాలా విలువైనవి..తెలంగాణా ఉద్యమం బతికి ఉండాలంటే ఆయన బతికి వుండాలని తెలంగాణా ప్రజలు తీర్మానించడంతో కే.సి.ఆర్. వారి కోరిక మేరకు దీక్ష విరమించేస్తాడు. ఇంక వై.ఎస్.ఆర్. ముఖ్య మంత్రిగా వుండగా నిరాహార దీక్ష చేయనని ముక్కు నేలకి రాసి శపధం చేస్తాడు.
శుభం. వూహ సమాప్తం.

10 comments:

  1. Dis KCR take TPS? Do you've any proof of link ?

    ReplyDelete
  2. nijam ga nijam chepparandi..paapam Y.S.R povatam vallane andariki kaallu vachhayi..

    ReplyDelete
  3. బాబూ భీమన్నా... ప్రతి దానికీ లింకులు వుండవమ్మా.. ఉన్న సమాచారంతో జరిగిన మేటర్ని లింక్ చేసుకోవాలి. ఈ క్రింది లింకు చదివి జరిగిన సంఘటనల్ని లింకు చేసుకో..బుర్ర వుంటే నిజం నీకే అవగతమవుతుంది.
    http://www.tadepally.com/2009/12/blog-post_15.html

    ReplyDelete
  4. చిన్న పిల్లాడు అన్నాక మారం చేస్తూనే ఉంటాడు
    అప్పుడు వాడికి "చాక్లెట్" ఇస్తే గోల చెయ్యడు
    "ఆ తాత" ఉంటె ఇచ్చేవాడు
    "ఈ పిసినారి తాత" ఇవ్వలేదు
    అందుకే ఇదంతా

    ReplyDelete
  5. బుర్ర గురించి మాట్లాడకు... నీకుంటే సాక్షాలతో వ్రాయి అంతే కానీ.. అసలు తాడేపల్లి రాసిందే ఊహాజనితం .. దాన్ని నువ్వు ఆధారం గా చేస్కోటం జోగి జోగి రాసుకున్నట్ట్లు... కనీసం వార్తా పత్రికల లో కనిపించిన వార్త నైనా ఆధారం గా పెడ్తే బావుంటుంది.. తాడేపల్లి లాంటి వారి సైట్ లను నమ్మితే మరో రెలయన్స్ పై దాడి లాంటి సంఘటనలు జరుగుతాయి....
    ఆకాశ మనిషివి నీదేం పొయింది... భూలోక వాసులకైతే భాద్యతలుంటాయి...
    భాద్యతాయుతం గా రాబోయే టపాలు రాస్తావని ఆశిస్తున్నాను...

    ReplyDelete
  6. వార్తా పత్రికలేందుకు..అన్ని టీవీ చాన్నేల్స్ లో కూడ కే.సి.ఆర్. దొంగ దీక్ష ఎలా చేసింది లగడపాటి లైవ్ లో చూపించాడు. ఇంకా వేరే సాక్ష్యాలేందుకు?
    ( ఉత్తుత్తి శ్రీరాములు చేసిన ఉత్తుత్తి దీక్ష గురించి అందరికీ అర్ధం అయినా, నటిస్తున్నారు. బుధవారం కోమాలోకి వెళ్ళిపోతాడని వైద్య బృందం ప్రకటించి - శుక్రవారం ఇంటికి పంపిస్తే, శనివారం తీరికగా ఆ బక్క మనిషి శుభ్రంగా క్షవరం చేయించుకుని, తెల్ల బట్టలు వేసుకుని, ఎన్.డి. టీవీ కి ఇంటర్వ్యూ ఇచ్చేసి, హైదరాబదు తెలంగాణాకు రాజధాని అని, హైదరాబాదులో ఉన్న తెలంగాణేతరుల్లో కేవలం 5 శాతమే సీమాంధ్ర వాసులనీ వాక్రుచ్చాడు.........పైన లింక్ లో విరజాజి కామెంట్ చదవండి )
    ఇక రిలయన్స్ పై దాడుల వంటివి బ్లాగుల్లో విమర్శల వల్ల జరగవు. మీడియా అత్యుత్సాహం వల్ల, వేర్పాటువాదుల ప్రేలాపనల్ని అతిగా ఫోకస్ చేసి చూపటం వల్ల జరుగుతాయి. నేను ఆకాశ మనిషిని కాదు. ఆంధ్రా మనిషిని. రాష్ట్రాన్ని కేవలం కొంతమంది స్వార్ధం కోసం, వాళ్ళ రాజకీయ భవితవ్యం కోసం అన్యాయంగా ముక్కలు చేయటానికి ప్రయత్నిస్తున్నారన్న బాధతో, బాధ్యతతో ఉడత సాయంలా రాస్తున్నా తప్ప, నా రాతలతో నిర్ణయాలు మారవు. గొడవలేమీ జరగవు.

    ReplyDelete
  7. ఊహల్లో తేలిపోడం కాదు. పరమాత్మ తత్వం తెలిసిన వారైతే, వై.ఎస్. ఎందుకు పోయాడో అర్థం చేసుకోవాలి.
    54 ఏళ్ళుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పరాకాష్ఠకు చేరుకోగానే దుష్ట శిక్షణ చేసి, తెలంగాణ ప్రజలను రక్షించడానికి పరమాత్ముడు ఉపక్రమించాడు. దైవ లీలను అర్థం చేసుకోక ఇంకా కౌరవుల్లా అహంకరించినవారందరికీ ఏదోలా చెడు జరుగక తప్పదు. ఈ రోజు కౌరవ ప్రవృత్తి గలవారికి కె.సి.ఆర్. బృహన్నలలా కనిపించవచ్చు. కాని రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ఆయనే అర్జునుడిలా పాఠ్య పుస్తకాలలో దర్శనమిస్తాడు.

    ReplyDelete
  8. అంత సీన్ లేదులే. ఇంకో మాట చెప్పు.

    ReplyDelete
  9. KONTA KAALAM TARUVAATA INKO MAATA NUVVE CHEPPUKoVAALSI VASTADI. ANTADAAKA NEE AHAMKAARAM NINNU OPPUKONEEYADU. CHARITRALO ENNI CHOOLLEDU ILAANTIVI.

    ReplyDelete
  10. నేను సదరు టపాలో వ్రాసినది ఖరాఖండిగా అలానే జఱిగిందనేది నా అభిప్రాయం కాదు. అయితే జఱిగిన సంఘటనల మధ్య ఉన్న లంకెలు మనకి తప్పనిసరిగా కావాలి.

    నా అభిప్రాయంలో వై.ఎస్. మరణం యాదృచ్ఛికం కాదు. ఎవఱు చేయించినప్పటికీ, ఇక్కడ ప్రస్తావించబడ్డ వ్యాపారకుటుంబానికి సరైన నైతికనేపథ్యం లేనిమాట వాస్తవం. గతంలో ఆ కుటుంబం బాంబేడైయింగ్ అధినేత నూస్లీ వాడియా మీద హత్యాప్రయత్నం చేయించిందనే ఆరోపణలున్నాయని మఱువరాదు. ఆ మాట స్వయంగా నుస్లీ వాడియాయే ఆరోపించారు. వై.ఎస్. మరణం వల్ల భారీ ప్రయోజనం పొందేవారు కొందఱున్నారు. అది ఎవఱెవఱై ఉంటారో అందఱికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పనక్కఱలేదు. వారికి ఆ దుర్మరణంలో ఏ పాత్రా లేదని నమ్మేటంత అమాయకులం కాకూడదు.

    ReplyDelete