Saturday, February 20, 2010

టీ.ఆర్.ఎస్. కారు ఇక "బేకార్"!




గత ఎన్నికల్లో కేవలం పది మంది శాసన సభ్యులు, రెండే రెండు మంది ఎం.పీ. ల తో చావు తప్పి కన్ను లొట్ట బోయినట్లుగా బైట పడ్డ కే.సి.ఆర్..... రాష్ట్రంలో గట్టి నాయకత్వం లేని సమయం చూసి, విద్వేషాగ్నుల్నిరెచ్చగొట్టి, తెలంగాణకి దొర అయి పోదామని కల గన్నాడు. ఆయన అలా తన సామ్రాజ్యాన్ని స్థాపించేస్తే తమ స్థావరాలకి ఎక్కడ ముప్పు వస్తుందో అని కంగారు పడి పోయిన తెలంగాణకి చెందిన ప్రధాన పార్టీల నాయకులు కే.సి.ఆర్. పెట్టిన జే.ఎ.సి. అన్న బోనులో ఎలకల్లా పడ్డారు. పడ్డాక తెలిసింది దొర పెత్తనం తెలంగాణా మీద మాత్రమె కాదు తమ మీద కూడా అని! కేంద్రం కూడా కే.సి.ఆర్. పెట్టిన గాండ్రింపులని సరిగ్గా అంచనా వేయలేక డిసెంబరు 9 వ తేదీన ఒక పొరపాటు ప్రకటన చేసింది. తరవాత జరిగిన పరిణామాలతో నిజం తెలుసుకున్న కేంద్రం దిద్దు బాటు చర్యలు ప్రారంభించింది. (నా ముందరి టపా పొరపాటుని సరిదిద్దండి..చదవండి. http://andhraaakasaramanna.blogspot.com/2010/02/blog-post_17.html ) . ఏమైనా, కే.సి.ఆర్. కర్ర పెత్తనం ఎక్కువగా చేయటమే కాక, మొదటినించీ తమకు అలవాటు ఐన రాజీనామా డ్రామాలు ఆడి తాను తీసుకున్న గోతిలో తామే పడ్దారు. ప్రజలందరికీ కూడా ఆయన చర్యలన్నీ ఉనికి కోసం ఆరాటమే తప్ప తెలంగాణా కోసం నిజమైన పోరాటం కాదని తెలిసి పోయింది. మళ్ళీ జరిగే ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన సీట్లు కూడా వస్తాయన్న నమ్మకం ఎ మాత్రం లేదు. కనుక టీ.ఆర్.ఎస్. కారు ఇంక షెడ్డు కే!

1 comment:

  1. ఈ దొర ఏందిరో వాని పీకుడేందిరో?
    కారు పంచరైందిరో!
    కోదండరాము, జయశంకర్ చెమ్మచెక్క ఆడుతుండ్రురో
    కేసీఆర్, మధు యాష్కి చెక్కభజన చెయ్యాలిరో
    కేకే కాకా కెవ్వుకెవ్వురో
    దామోదర్, కిషనెరెడ్డి జజ్జినకరిరో
    గద్దరన్న,గోరటన్న జమ్ జమ్మల్ మర్రిరో

    ReplyDelete