Saturday, January 29, 2011

తెలబాన్ నాయకుని దురహంకారం!

" రైతుల గురించి అడగరు, కరెంటు గురించి అడగరు, తెలంగాణ గురించి అడగరు, ఇంకెందుకున్నట్లు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు? ఆంధ్రోళ్ల బూట్లు నాకడానికా? "

"మన కళాకారుల పాటలు వింటే రేషం (రోషం) ఉన్నోడైతే తిరిగి సూడకుంట పోతడు. ఇన్ని తిట్లు తినుకుంట, ఇజ్జత్ ఇడిసిపెట్టి మన సూరు పట్టుకుని వేలాడుతున్నరు. ఈ తిట్లకు తెలంగాణోళ్లయితే భూమికి తలగొట్టుకుని సచ్చేటోళ్లు. ఎన్ని తిట్లు తిడుతున్నా, ముఖం మీదనే ఊంచుతున్నా (ఉమ్ముతున్నా) ఎందుకు వదిలిపోతలేరు?’’

"కలియుగంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉంటుంది. అక్కడ మీరు (రాక్షసులు)  ఆంధ్రావారిగా పుట్టి తెలంగాణను పీక్కుని దోచుకు తినం డని వరమిచ్చాడట (శ్రీరాముడు). అలా తెలంగాణను పీక్కు తినడానికొచ్చినవారే ఇప్పుడు ఆంధ్రోళ్లయ్యారు’’
 
<==తెలంగాణ అధికారులు, ఎన్‌జీఓలు హైదరాబాద్‌లో 28Jan. నిర్వహించిన దీక్షా శిబిరంలో కే.సి.ఆర్.==>

ఇవి ఒక ప్రజా ప్రతినిధి మాట్లాడే మాటల్లా  ఉన్నాయా? ప్రత్యెక రాష్ట్రం ఇక మిధ్య అని ఖాయమై పోయిన ఫ్రస్టేషన్ లో మతి భ్రమించి వదరుతున్న ప్రేలాపనలివి.. చూరు పట్టుకు వేళ్ళాడటం, దోపిడీ, పీక్కు తినటం వంటి పస లేని వాగుడు గురించిన నిజా నిజాలన్నీ శ్రీకృష్ణుడు నిగ్గు తేల్చేసాడు.  చేతనైతే కమిటీ ఇచ్చిన రిపోర్టు సరిగా లేదని నిరూపించి అప్పుడు ఏమైనా మాట్లాడాలి కానీ ఇలా నోరు పారేసుకోవటం తెలబాన్ నాయకుని దురహంకారానికి నిదర్శనం.  అయినా పిట్ట కధలు చెప్పే పిట్టల దొర మాటలకి మీడియా కూడా ప్రాధాన్యత నివ్వటం మానేయాలి. అసలు రాజీనామా సరైన ఫార్మాట్ లో ఇవ్వటం తెలీని ఈ పెద్ద మనిషి కరెక్టుగా ఎలా రాజీనామా ఇవ్వాలో జగన్ దగ్గర శిక్షణ పొందాలి. ఆ తరువాత తానూ, తన చెల్లి సక్రమంగా రాజీనామాలు చేసి ఆ తరువాత ఇతర పార్టీల వారిని డిమాండ్ చేస్తే అర్ధవంతంగా వుంటుంది.  ప్రభుత్వం కూడా పిట్టల దొర మాటల్ని సీరియస్ గా తీసుకొని రెచ్చగొట్టే దూషణలు చేసిన నేరం మీద అరెస్టు చేయాలి. ఆ పని చేయలేక పొతే కనీసం ఇటువంటి ప్రేలాపనలు మళ్ళీ చేయకుండా ఆయనకి మానసిక వైద్య శాలలో చికిత్స అయినా చేయించాలి.

Wednesday, January 26, 2011

నై బోలో తెలంగాణా!

అదుర్స్ సినిమా యూనిట్ ని వేధించడంతో మొదలు పెట్టి ఈనాటి వరకు కూడా తెలుగు సిని పరిశ్రమని ప్రాంతీయ విభేదాల పేరుతొ వెంటాడి వేధించిన తెలబాన్లకి ఆ బాధ ఎలా వుంటుందో తమ దాకా వస్తే కానీ తెలియలేదు. జై బోలో తెలంగాణా సినిమా కి సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరణ కూడా సీమాంధ్రుల కుట్రగా అప్పుడే దుష్ప్రచారం మొదలు పెట్టేసారు. ఒక సినిమా కి సెన్సార్ ప్రాబ్లం వస్తే రివైజింగ్ కమిటీ కి వెళ్ళడం అనేది సాధారణ విషయం. అందునా రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో జై బోలో తెలంగాణా వంటి సినిమాలకి సర్టిఫికేట్ ఇచ్చే ముందు రిలీజ్ అయితే రాబోయే పరిణామాల్ని దృష్టిలో వుంచుకొని మరీ సెన్సార్ చెయ్యాలి.  ఒక ప్రాంతం వారికి అనుకూలంగా సినిమా తీయడంలో తప్పు లేదు. అయితే అందులో మరో ప్రాంతం వారి మీద విద్వేషం వెళ్ళ గక్కడం జరిగితే సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరించడంలో సెన్సార్ బోర్డు తప్పు కూడా ఉండబోదు. నిజా నిజాలు తెలుసుకోకుండా కేవలం సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వలేదన్న కారణం మీద సెన్సార్ బోర్డుని దుమ్మెత్తి పోయటం మూర్ఖత్వం.

Sunday, January 23, 2011

తెలంగాణా ఇవ్వడానికి కాంగ్రేసుకి ఉన్న హక్కు ఏమిటి?

"తెలంగాణా కి ఒకే అంటే సోనియా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకుంటా..- 26 డిసెంబర్,2010  న కే.సి.ఆర్."
ఛీ.. ఇదేనా తెలుగు వాడి ఆత్మ గౌరవం?
స్వంత కొంపలోని అవి నీతిని, అసమ్మతి సెగల్నిఅదుపు చేసుకోలేని ఇటలీ దేవతకి ఇంతలా సాగిల బడి పోవాలా? 33 మంది ఎం.పీ లని ఆంధ్ర ప్రదేశ్ అందించినా కూడా మంత్రి వర్గ విస్తరణలో మన రాష్ట్రానికి ఇచ్చిన ప్రాధాన్యం చూస్తె కాంగ్రేసు దృష్టిలో మన రాష్ట్రానికి ఎంత విలువున్నదో ఇట్టే అర్ధమవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఏ మాత్రం విలువనివ్వని కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర విభజన పైన ఎలాంటి నిర్ణయం తీసుకొనే హక్కు  లేదు.అయినా చిన్నా చితకా పార్టీల మద్దతుతో తప్ప కేంద్రంలో స్వంత బలం తో ప్రభుత్వం ఏర్పాటు చేయలేని కాంగ్రేసు పార్టీ ఒక రాష్ట్ర విభజన వంటి కీలక అంశాన్ని ఏక పక్షంగా  ఎలా నిర్ణయిస్తుంది? ఇతర భాగస్వామ్య పక్షాలతో  సంప్రదించకుండా ఏక పక్షంగా 9 డిసెంబరు 2009 నాడు చేసిన ప్రకటనకి విలువ ఉంటుందా? ఆనాడు అక్కర్లేని అఖిల పక్షం అభిప్రాయం ఇప్పుడు మాత్రం ఎందుకు? సరే, 9 డిసెంబర్2009  ప్రకటన కీలకమైనదే అనుకుందాం. మరి అదే కేంద్ర హోం మంత్రి అదే హోదాలో చేసిన 23 డిసెంబర్  2009 నాటి ప్రకటన కి కూడా అంతే   ప్రాధాన్యం వుంటుంది. ఇంకా  ఎక్కువే ప్రాధాన్యత వుంటుంది. ఎందుకంటే జరిగిన పొరపాటుని సరి దిద్దే ప్రకటన అది! ప్రకటన దిద్దుకోవడంతో సరి పోదు. తదనంతర పరిణామాల్లో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ కూలంకషంగా స్టడీ చేసి ఇచ్చిన అత్యుత్తమ ఆరవ సిఫార్సుని వెంటనే అమలు చేయాలి.అలా చేయకుండా నాన్చినంత కాలం ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది సంవత్సరాల వెనక్కి వెళ్లి పోవటం ఖాయం.

Friday, January 21, 2011

టీ.టీ.డీ. మంచి నిర్ణయం!

ఆనంద నిలయం అనంత స్వర్ణ మయం పధకాన్ని రద్దు చేయాలన్న టీ.టీ.డీ పాలక మండలి నిర్ణయం అభినందనీయం. పాలక మండలి మాజీ అద్యక్షుడు ఆది కేశవులు నాయుడు సొంత ప్రయోజనాలు ఆశించి తలపెట్టిన ఈ పధకం భక్తులు నిరసించినా ఆగలేదు కానీ హై కోర్టు అక్షింతలు వేయడంతో అటకెక్కింది.  అసలు టీ.టీ.డీ వంటి ధార్మిక సంస్థకి ఒక మద్యం వ్యాపారిని చైర్మన్ గా నియమించడమే తప్పు. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చుండ బెడితే ఏమి చేస్తుంది? తోటి మద్యం వ్యాపారి విజయ్ మాల్యా కి ప్రత్యెక దర్శనం కల్పించడం కోసం గంటల కొద్దీ ఇతర భక్తులని ఇబ్బంది పెట్టడానికి కారణం సొంత వ్యాపార ప్రయోజనాలు కావా? అంబానీ ల వంటి పారిశ్రామిక వేత్తలు వచ్చినపుడు వారికి ప్రత్యెక సౌకర్యాలు కలుగ జేసి ఈ పధకానికి బంగారం ఇవ్వమని దేబిరించటం ఏ మాత్రం సమంజసం?  భగవంతుడేమీ వారిచ్చే బంగారానికీ, నగదు విరాళాలకీ మొహం వాచి లేడు.  ఏమైనా పధకం ఎలాగూ రద్దు అయింది కాబట్టి ఇప్పటి వరకు ఈ పధకం కింద వసూలైన 95కిలోల బంగారం, పన్నెండు కోట్ల రూపాయల నగదుని నిత్యాన్నదానం వంటి సామాన్య భక్తుల సౌకర్యాలకై వెచ్చిస్తే సముచితంగా వుంటుంది.

Thursday, January 20, 2011

తెలబాన్ అంటే రోషమెందుకు?

పక్కన ఫోటో చూడండి. హైదరాబాదులో ఓ సంస్థ వారు  ఆకతాయిల బారినుండి తమ ఆస్తులని రక్షించుకోవటానికి లక్షలు ఖర్చు పెట్టి వల ఏర్పాటు చేసుకున్నారు.  ఇటువంటి కంపెనీల అవస్థలు చూసి మన రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలన్నీ గుజరాత్ కి తరలి పోయాయి. ఈ పరిస్థితికి  కారణం తెలబాన్లు కాదా?   ఈ మధ్య తెలబాన్ పదం వాడితే కొందరు ఉడుకెత్తి పోయి తెలంగాణా వారందర్నీ అవమానించినట్లు బాధ పడి పోతున్నారు.  అలాంటి వారి కోసం నాకు తెలిసిన తెలబాన్ నిర్వచనం తెలియ జేస్తున్నాను.  ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ తాలిబన్లు కారు. మత మౌడ్యంతో, వేర్పాటు వాదంతో పెట్రేగుతున్న గ్రూపులనే తాలిబన్లు అంటారు.  అలాగే తెలంగాణా  వాళ్ళందరూ తెలబాన్లు కారు.  సీమాంధ్రుల పై విద్వేషంతో, వేర్పాటు వాదం ముసుగులో స్వంత అజెండాలని అమలు చేసుకోవాలనుకుంటున్న కొద్ది మంది నాయకులు, వారి బంధుగణం, అనుచర గణాలే తెలబాన్ల కేటగిరీ కిందికి వస్తారు. వారు తప్ప తక్కిన వారందరూ సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతానికి చెందిన సాధారణ పౌరులు అవుతారు తప్ప వేరే మరేమీ కాదు. అయినా మూర్ఖంగా ప్రవర్తించే వాడిని   మూర్ఖుడు అంటారు. రౌడీయిజం చేసే వాడిని   రౌడి  అంటారు.  గూండాయిజం చేసే వాడిని   గూండా అంటారు.  కేవలం ఈ లక్షణాలే గాక ఇంకా సవాలక్ష అవలక్షణాలు పుణికి పుచ్చుకుని, ఒరిజినల్ తాలిబాన్లకన్నా అధ్వాన్నంగా ప్రవర్తించే వారిని తెలబాన్ లు గాక మరేమంటారు? 

Tuesday, January 18, 2011

తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది...

(నేడు ఎన్.టీ.రామారావు వర్ధంతి)
 మన రాష్ట్రం ఏర్పడిన దగ్గరనించి 1982 వరకు కూడా కేవలం డిల్లీకి బ్రాంచి ఆఫీసుగా మాత్రమె గుర్తింపు ఉండేదన్నవిషయం మనకి తెలియంది కాదు. తెలుగు వారి ఆత్మ గౌరవమే నినాదంగా రాజకీయాల్లో ప్రవేశించి, గాంధీ-నెహ్రూ వంశీకుల భజనలో తరిస్తున్న కాంగ్రెస్ రాజ్యాన్ని అంతమొందించి తెలుగు వారి సత్తా ఏమిటో ప్రపంచానికి చెప్పారు. తెలుగు వాడు జాతీయ రాజకీయాలను కూడా శాసించ గలడని ఎన్.టీ.ఆర్. కి ముందు ఎవరూ ఊహించలేదు.
అయితే, అదే తెలుగు వాడి రాష్ట్రంలో ఈనాడు ఏం జరుగుతోంది? కుక్క మూతి పిందెల వంటి నాయకులందరూ ఆత్మ గౌరవం అన్న పదానికి వక్ర భాష్యాలు చెపుతూ తెలుగు జాతిని ముక్కలు చేయాలని శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఒక్కటిగా ఉన్నప్పుడే మన రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకొనలేక పోయాం. ఇక ముక్కలైతే మనని ఎవరైనా లెక్క జేస్తారా? తాను  జీవించి వున్నప్పుడు జరిగిన వెన్ను పోటు కన్నా ప్రస్తుతం  జరుగుతున్న పరిణామాలు చూసి స్వర్గంలో ఎన్.టీ.ఆర్. ఆత్మ క్షోభిస్తుందని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. 

Saturday, January 15, 2011

తెలబాన్ నాయకుడు వ్యూహాత్మక మౌనం వీడితే?

రోజులు తనవి కానప్పుడల్లా తెలబాన్ నాయకుడు వ్యూహాత్మక మౌనం పేరుతొ అజ్ఞాతంలోకి వెళ్లి పోవటం మామూలే. ఇప్పుడు కూడా తమ పిడి వాదాలన్నీ డొల్ల అని శ్రీకృష్ణుడు కుండ బద్దలు కొట్టటంతో మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. అజ్ఞాత వాసం వీడాక ఆయన ఇవ్వబోయే స్టేట్మెంట్లు.......

1) కాంగ్రెస్,టీడీపీ దద్దమ్మలు ఇంకా రాజీనామాలు చేయలేదేమిటి?
(క్షమించాలి..నాకు, నా చెల్లికి మాత్రం రాజీనామా సరైన ఫార్మాట్లో ఇవ్వటం ఈ రోజుకి చేతకాదు....జగన్ అంత ఈజీగా ఎలా రాజీనామా చేసాడో మాకు ఇప్పటికీ అర్ధం కాదు! )

2) ఎవరు బడితే వాళ్ళు ఉద్యమం చేయటానికి వీల్లేదు. అందరూ కోదండ రాం చెప్పినట్లు వినాలి.
 (రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు కట్టిన పన్నులతో జీతం తీసుకుంటూ ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడుతున్న సదరు కోదండ రాం ని ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలి. గౌరవ ప్రదమైన ప్రొఫెసర్ పోస్టులో వుండి, విద్యార్ధులని రెచ్చగొట్టటం నేరం మీద అరెష్టు చేయాలి. )

3) ఫాల్తూ కమిటీ రిపోర్టు తో మాకు సంబంధం లేదు. మా తెలంగాణా మాకు ఇయ్యాలె!
(పార్టీలో పది సబ్ కమిటీలు వేసి, అపరాధ పరిశోధన చేసి, శ్రీకృష్ణుడికి నివేదిక ఇచ్చినపుడు తెలీదా ఫాల్తూ కమిటీ అని...రిపోర్టు వ్యతిరేకంగా వస్తే కమిటీని దుమ్మెత్తి పోయడమా?..అయిన ఇలాంటివి మాకలవాటే..)

4) మళ్ళీ ఆమరణ దీక్షకి కూర్చుంటా...
(టీ.పీ.ఎస్. రెడీగా ఉందా లేదా? ముందే చెక్ చేసుకోండి...)


5) విద్యార్దులెవరూ ఆత్మ హత్యలు చేసుకోవద్దు..
(అదేంటి కోదండ రాం..ఇంకా ఎవరూ చేసుకోలేదా? ఇలాగైతే ఎలాగయ్యా ఉద్యమాన్ని నడిపేది??)
6) తెలంగాణా వచ్చుడో ..కేసీఆర్ సచ్చుడో...
   (రెండూ జరిగే అవకాశం  ఇప్పట్లో లేదు..) 



Wednesday, January 12, 2011

శ్రీ క్రిష్ణ పైనే నిందలా? సిగ్గు చేటు..

శ్రీ క్రిష్ణ కమిటీ సభ్యులు లంచాలు తీసుకొని తమ రిపోర్టుని ఇచ్చారని ఎం.పీ. మధు యాష్కీ ఆరోపించటం సిగ్గుమాలిన చర్య.  జస్టిస్ శ్రీ క్రిష్ణ ప్రొఫైల్ తెలిసిన వారెవరైనా ఆయనని కించిత్తు విమర్శించటానికే జంకుతారు.  గతంలో ఆయన చేపట్టిన బొంబాయి అల్లర్ల పై కమిటీ, చెన్నై హైకోర్టు లాయర్ల గొడవలపై వేసిన కమిటీ గాని లేదా కేంద్ర ప్రభుత్వొద్యోగుల జీత భత్యాల కోసం వేసిన ఆరవ పే కమిషన్ చైర్మన్ గా గాని ఆయన చూపిన నిబధ్ధత, నివేదికలనివ్వడంలో ఆయన చూపిన నిష్పాక్షికత అందరికీ తెలుసు.  ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రదెశ్ పరిస్థితులని పది నెలల పాటు కూలంకషంగా అధ్యయనం చేసి సవివరంగా ఆయన అంద జేసిన రిపోర్టు వేర్పాటు వాద తెలబాన్లకి మింగుడు పడక పోవటంలో ఆశ్చర్యం లేదు.  వాళ్ళకి చేతనైతే ఆ నివేదికలో లోపాలు ఏవైన వుంటే ఆధారాలతో వాటిని నిరూపించాలి కానీ వ్యక్తిగత విమర్శలకి తెగబడటం చాల తప్పు.  అందులోనూ దొంగ పాస్ పోర్ట్, దొంగ సర్టిఫికెట్ల కుంభ కొణాల్ని నెత్తిన మోస్తున్న మధు యాష్కీ వంటి వారికి  శ్రీ క్రిష్ణ ని విమర్సించే హక్కు ఏ మాత్రం లేదు. అధికార పార్టీ ఎం.పీగా వున్న  మధు యాష్కీ తన ఆరోపణలకి రుజువులు చూపించాలి.  సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జి హోదా కలిగిన శ్రీ క్రిష్ణ కమిటీ చైర్మన్  పైన ఇటువంటి నిందలు వేయటం కోర్టు ధిక్కారంతో సమానం.   తగిన రుజువులు చూపక పోతే మధు యాష్కీనే కాదు.. తప్పుడు ఆరోపణలు చేసే తెలబాన్లు ఎవరైనా తమ నోటి దురుసుకి మూల్యం చెల్లించుకోక తప్పదు. 

Saturday, January 8, 2011

శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు పై దిక్కు మాలిన చర్చలెందుకు?

ఫాల్తూ కమిటీ అనీ, గడ్డి పీకుతుందా అనీ ఇంకా నానా విధాలుగా తూలనాడిన వాళ్ళ నోళ్ళు మూయించేలా సాధికారమైన గణాంకాలతో, ఋజువులతో కూడిన విష్పష్టమైన నివేదికని నిర్ణీత సమయానికే అంద జేసిన శ్రీక్రిష్ణ కమిటీకి అభినందనలు.  కొండని తవ్వి ఎలకని పట్టిందని, ఆ మాత్రం రిపోర్టు ఇవ్వడానికి కమిటీ ఎందుకని విమర్శిస్తున్న వారికి నివేదిక అర్ధం కాలేదనే భావించాలి.  రిపోర్టుని జాగ్రత్తగా చదివిన వారు ఆ నివేదికలోని ప్రతి వాక్యం వెనుక కమిటీ బృందం చేసిన పరిశోధన, విషయ సేకరణ స్పష్టంగా గమనిస్తారు.  అనుభవజ్ఞుడైన శ్రీ క్రిష్ణ సారధ్యం లోని కమిటీ ఆషా మాషీగా ఈ నివేదిక ఇవ్వలేదు. నిజానికి ఈ నివేదిక ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కే కాదు. వేర్పాటు వాదం వినబడుతున్న దేశంలోని మిగతా రాష్ట్రాలకి కూడ పనికి వచ్చేలా పరి పూర్ణంగా ఇచ్చారు.  మన రాష్ట్రం విషయానికి వస్తే, కమిటీ ఆరు ప్రతిపాదనలు చేసింది. కరక్టే. అయితే అవి ఎంత వరకు ఆచరణీయమో కూడా విష్పష్టంగా చెప్పింది.  వాస్తవానికి ఆ ప్రతిపాదనలేవీ కమిటీ స్వంత అభిప్రాయాలు కావు.  రాష్ట్రం మొత్తం నుండి వచ్చిన నివేదికల, విజ్ఞాపనల సారాంశం.........అయితే నివేదిక వెలువడిన దగ్గరనుండి మన మీడియా వాళ్ళు ఆ ప్రతిపాదనల పై సుదీర్ఘమైన, పనికి మాలిన చర్చల్ని తమ చానెల్స్ లో ప్రసారం చేస్తూ గందర గోళానికి తెర లేపుతున్నారు.  అసలు ఈ ప్రతిపాదనల పై చర్చలే అనవసరం. తమకి వచ్చిన విజ్ఞాపనలనుంచి తయారైన ఆరు ప్రతిపాదనల్లో ఏది అత్యుత్తమమైనదో కమిటీ విష్పష్టంగా చెప్పినపుడు   ఇంక ఈ చర్చలు, రచ్చలు ఎందుకు??  కేంద్రం కూడ ఇక ఎటువంటి తాత్సారం లేకుండా రాజ్యాంగ బధ్ధంగా నియమింప బడిన కమిటీ ఇచ్చిన అత్యుత్తమ సిఫార్సు అమలు చేయాలి.  రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా  తెలంగాణాతో సహా సీమాంధ్ర లో  వెనుక బడ్డ ప్రాంతాల అభివృధ్ధికి ప్రత్యేక మండళ్ళు ఏర్పాటు చేయాలి.  అంతే కాదు. వేర్పాటు వాదం వెర్రి తలలు వేసున్న ఇతర రాష్ట్రాల్లో కూడ ఈ  విధంగానే అభివృధ్ధి సమతుల్యత సాధించాలి.  అంతే తప్ప సెంటిమెంటు వుందనో, లేదా దొంగ దీక్షలు చేసారనో లేదా విద్యార్ధులు చదువులు మానేసి రోడ్ల మీదకి వచ్చి విధ్వంసాలు చేసారనో రాష్ట్రాలు ఇచ్చుకుంటూ పోతే ఈ దేశం ఎన్ని ముక్కలు చేయాలో ఎవరూ చెప్పలేరు.

Friday, January 7, 2011

"కారు" కూతలు ఇంక ఆపండి! శ్రీక్రిష్ణుడు చెప్పిన గీత వినండి!

తమ సంపదని దోచుకున్నారనీ,అభివృధ్ధి అంతా సీమాంధ్రులే చేసుకున్నారనీ ఇలా ఒకటా రెండా...నొటికొచ్చిన 'కారు ' కూతలు కూసిన తెలబాన్ల నోళ్ళు మూయించేలా శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు వెలువడింది.  వ్యవసాయ, నీటి పారుదల, విద్యా రంగాల్లొ తెలంగాణా కంటే వెనుక బడిన ప్రాంతాలు సీమాంధ్రలో వున్నాయని శ్రీక్రిష్ణ కమిటీ కుండ బద్దలు కొట్టింది.  పదవుల విషయానికి వస్తే ముఖ్య మంత్రి పదవిని మూడు ప్రాంతాల వాళ్ళు  పొంద గలిగినా, నెంబర్ టూ అనదగ్గ హోం మంత్రి మాత్రం ఎప్పుడూ తెలంగాణ వారిదే అనికూడా విశ్లేషించింది.  అంతే కాదు. చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలం అని చెప్పుకునే బీ.జే.పీ. విధానాల్ని సైతం కమిటీ ఎండ గట్టింది.  1997 కాకినాడ తీర్మానంలో తెలంగాణా ఇస్తామని మాట ఇచ్చిన బీ.జె.పీ. ఆ తరువాత 1998 నుండి 2004 వరకు ఆరేళ్ళ పాటు సాగిన  తమ ఎన్.డీ.ఏ. పాలనలో ఉత్తరాంచల్, చత్తీస్ ఘర్, జార్ఖండ్ రాష్ట్రాలని ఏర్పాటు చేసింది కానీ తెలంగాణాని ఎందుకు మర్చి పోయింది?  ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలొ చక్రం తిప్పుతున్న చంద్రబాబు ఆనాటికి సమైక్యవాదిగా వున్నాడు కాబట్టి!  మరి ఇప్పుడో? బీ.జె.పీ. మళ్ళీ తెలంగాణా రాగం పాడుతుంటే చంద్రబాబేమో రెండు వేళ్ళు చూపిస్తూ, రెండు కళ్ళు అంటూ ఏమార్చ చూస్తున్నాడు.  ఇక మన తెలబాన్ నాయకుడు 2004 ఎన్నికల ముందు మహా కూటమి అంటూ చంద్ర బాబుతొ జత కట్టి, ఫలితాలు రాక ముందే ఎన్.డీ.ఏ. వైపు గెంతి..మళ్ళీ ఈ రోజు తెలంగాణా ప్రాంతంలో చంద్ర బాబుకి కేడర్ లేకుండా చేద్దామన్న వ్యూహంతొ పావులు కదుపుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే..వై.ఎస్. బతికి వున్నంత కాలం సమైక్య వాదమే..ఎవ్వడూ నోరెత్తలేదు. ఈ రోజేమో కుక్కలు చింపిన విస్తరి. ఎవడు ఎం మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్ధం కాదు.  దీన్ని బట్టి ఏం అర్ధం అవుతోంది? రాజకీయ నాయకులు చేస్తున్న ఆత్మ గౌరవం, సొంత రాష్ట్రం వగైరా నినాదాలన్నీ వారి స్వంత ఎజెండాలే కానీ చిత్త శుధ్ధితో కూడినవి కానే కావు.   ఇంక శ్రీక్రిష్ణ కమిటీ బీ.జే.పీ. ఏర్పాటు చేసిన మూడు కొత్త రాష్ట్రాల స్థితి గతుల్ని కూడా పరిశీలించింది.  వాటిలో ఉత్తరాఖండ్ ని మినహాయిస్తే చత్తీస్ ఘర్,జార్ఖండ్ రెండు రాష్ట్రాలు శాంతి భద్రతల సమస్యలని ఎదుర్కొంటూ మావోయిష్టులని అదుపు చేయలేక సతమతమవుతున్నాయి.  జార్ఖండ్ అయితె మరీ ఘోరంగా పదేళ్ళలొ 8 మంది ముఖ్య మంత్రులని చూడటమే గాక రెండు సార్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది.  మన తెలబాన్ నాయకుడేమో తెలంగాణ వస్తే నక్సలైట్ ఎజెండా అమలు చేస్తామని బాహాటంగా చెబుతున్నాడు.   ఇప్పటికే మన దేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు వున్నాయి.  మళ్ళీ కొత్త రాష్ట్రం ఏర్పాటు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా ఒత్తిడికి లొంగి ఈ రోజు తెలంగాణకి సై అంటే నిద్ర పోతున్న పాముల్లా వున్న గోర్ఖాలాండ్, బొడొలాండ్, విదర్భ, బుందేల్ఖండ్, పూర్వాంచల్, హరిత ప్రదేశ్, లడఖ్, జమ్ము ఇత్యాది రాష్ట్రాలకై డిమాండ్లు ఖచ్చితంగా వస్తాయి. కేవలం రాజకీయ నాయకుల స్వార్ధ ప్రయోజనాలు నెర వేర్చటం కోసం దేశాన్ని ఇన్ని ముక్కలు చేయటం, ఖజానా పై పెను భారం మోపడం ఇప్పుడు అవసరమా???

Monday, January 3, 2011

రోగం ఎక్కడుంటే మందు అక్కడే వేయాలి!

రాజధానిలొ దిగుతున్న కేంద్ర బలగాల్ని చూస్తే తెలబాన్ నాయకునికీ, వారి అనుచర గణానికీ వులుకెందుకో అర్ధం కాదు.  ఎంత సేపూ తాను చేసిన దొంగ దీక్షకి మోస పోయి 9డిసెంబర్2009 న కెంద్రమంత్రి చిదంబరం ఇచ్చిన ప్రకటన వల్లె వేస్తాడే తప్ప... జరిగిన పొరపాటు తెలుసుకున్న తరువాత అదే కేంద్ర మంత్రి 23డిసెంబర్2009నాడు దిద్దుబాటు ప్రకటన చేసారన్న విషయం ఆయనకు జ్ఞాపకముండదా??  తెలబాన్ నాయకునికి మతి మరుపు వచ్చినా రాష్ట్ర ప్రజలు సంవత్సరం క్రితం జరిగిన పీడ కల లాంటి సంఘటనలు ఇంకా మర్చి పోలేదు. గత సంవత్సరం రాష్ట్రంలో వున్న పరిస్థితి ఏమిటి?  రాష్ట్రానికి రెండు కళ్ళుగా వ్యవహరించాల్సిన వారేం చేసారు? గవర్నరేమో రాస లీలల్లో మునిగి తేలుతుంటే, ముఖ్య మంత్రేమో బాధ్యత అంతా హై కమాండుదే అంటూ నెత్తిన తడి గుడ్డ వేసుకుని కూర్చున్నాడు.  అలాంటి దారిన పోయే దానయ్య ప్రభుత్వాన్ని ఏమార్చి- రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులకి పాడె కట్టి, శాంతి భద్రతలకి బొంద పెట్టి, మొత్తం తెలుగు వారందరి పరువు ప్రతిష్టలు మంట కలిసేలా సాగిన తెలబాన్ గణం అకృత్యాలని  ఇంకా ఎవరూ మర్చి పోలేదు.  చివరికి వినొదాన్ని పంచే సినిమా రంగాన్ని కూడ విడువకుండా సీమాంధ్ర కళాకారుల్నీ, నిర్మాతల్నీ వేధించలేదా? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ముందుగానే మేలుకొని కేంద్ర బలగాల్ని రప్పించటంతో తమ ఆగడాలు సాగవని గగ్గోలు పెడుతున్నారు. ఏమైనా ఇప్పుడు మన రాష్ట్రానికి కావలసింది రాజ్యాంగ  బధ్ధమైన పరిపాలన.  గాడి తప్పిన పరిపాలన మళ్ళీ సక్రమంగా పట్టాలెక్కే వరకు రాష్ట్రంలో ఎటువంటి అశాంతికీ, అరాచకత్వానికీ చోటు కల్పించకూడదు.  అంతే కాదు. వేర్పాటు వాదం ముసుగులో సాగిస్తున్న తీవ్ర వాద చర్యల్ని కూడ వుక్కు పాదంతొ అణిచి వేయాలి.