అడ్డగోలు విభజనకి వ్యతిరేకంగా యావత్ సీమాంధ్ర దేశంలో ఎప్పుడూ లేని విధంగా వుద్యమిస్తోంది. అధికారం వుందన్న్న అహంకారంతో ఏమి చేసినా చెల్లిపోతుందనే భావనతో అధిష్టానం తల పెట్టిన విభజన ప్రతిపాదన వారికే తల కొరివి గా మారే పరిస్థితి వచ్చింది. అబద్ధపు ప్రచారాలతో హైకమాండు ని తప్పుదోవ పట్టించి విభజన వూబి లోకి దించిన ఘనత తెలబాన్లదే. గుండె ఘోష చేసిన తాటాకు చప్పుళ్ళు ముందు టపాలో చూసాం. ఇప్పుడు కోటి రత్నాల వీణ వాయిస్తున్న అబద్ధపు ప్రచారాలేమిటో చూద్దాం :
http://kotiratanalu.blogspot.in/2013/09/blog-post_2692.html
1) ఉన్నపళంగా పొమ్మంటే ఎక్కడికి పోతాం:
ఇదొక అసత్యపు, అర్ధం లేని, మూర్ఖపు వాదన. కాస్తో కూస్తో రాజకీయ ప్రగ్నానం ఉన్నవాళ్ళు ఎవ్వరైనా నవ్వుకునే వాదన. రాష్ట్రం విభజించబడ్డంతమాత్రాన హైదరాబాద్‌లోని సీమాంధ్రులను ఎవ్వరూ ఎక్కడికీ వెళ్ళమనడం లేదు, వారు కూడా ఎవ్వరు ఎక్కడికీ వళ్ళారని వారికీ తెలుసు. అసలా మాటకొస్తే హైదరాబాదులో ఏళ్ళతరబడి ఉంటున్నవారికెవరికీ వదిలి వెల్లాలనే భయం లేదు. కాకపోతే హైదరాబాదు సీమాంధ్ర సెటిలర్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు భావిస్తున్న లగడపాటి లాంటి కొందరు సీమాంధ్ర నాయకులు, కొందరు స్వయంప్రకటిత మేధావి సంఘాధ్యక్షులూ ఇలాంటి అపోహలు కల్పిస్తున్నారు. మద్రాసునుండి విడిపోయినంతమాత్రాన అక్కడి తెలుగువారందరూ మద్రాసు నగరం విడిచి ఆంధ్రాకు రాలేదు. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మాత్రం ప్రభుత్వాలు వేరవుతాయి కనుక సహజంగా సీమాంధ్ర నేటివిటీ ఉన్నవారు సీమాంధ్ర ప్రభుత్వంలో పనిచేయాల్సి ఉంటుంది. వారికి కూడా పదేళ్ళు ఉమ్మడి రాజధాని కనుక హైదరాబాదులో ఉండే వెసులుబాటు ఉంది.
కాస్తో కూస్తో రాజకీయ ప్రజ్ఞానం వున్న ఎవరికైనారాష్ట్రం విడి పొతే సీమాంధ్రులు ద్వితీయ శ్రేణి పౌరుల వలె మనుగడ సాగించాలన్న కఠోర వాస్తవం అర్ధమౌతుంది. తెలంగాణా ప్రకటన వచ్చిన మరుక్షణం ముఖ్య మంత్రి అంతటి వాడినే టిఫిన్ సెంటర్ పెట్టుకోమన్నాడు తెలబాన్ నాయకుడు.ఇంక సామాన్య సీమాంధ్ర పౌరుడి గతి ఏమిటి ? మద్రాసు నగర అభివృద్ధిలో తెలుగు వారి పాత్ర ఎంతో వుంది. అయినా కొత్తగా తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పుడు - కొత్త రాష్ట్రమే కొత్త రాజధాని చూసుకోవాలన్న ఇంగిత జ్ఞానంతో ఆంధ్రులు వ్యవహరించి ఎన్నో కష్ట నష్టాలకోర్చి మొదట కర్నూలు ఆ తరువాత హైదరాబాదు లో తమ రాజధాని ఏర్పాటు చేసుకొన్నారు. అంతే తప్ప సమిష్టి కృషితో అభివృద్ది చెందిన రాజధానిని కాజేద్దామని ఎప్పుడూ అనుకోలేదు.
2) ఉమ్మడిగా అభివృద్ధి చేసుకున్నాం, ఇప్పుడు మొత్తంగా మీరే కొట్టేస్తే ఎలా?
1956లో తెలంగాణ, ఆంధ్రా కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ నిధులు (హైదరాబాదుతో సహా) తెలంగాణాలో, ఆంధ్రా నిధులు ఆంధ్రాలో ఖర్చు పెట్టాలి. ఆనిబంధన పాటించినట్టయితే ఎలాంటి పంచాయితీ ఉండేది కాదు. కానీ వాస్తవానికి తెలంగాణ నిధులు ఆంధ్రాకు తరలించబడ్డయి తప్ప ఆంధ్రా నిధులు హైదరాబాద్ రాలేదు. కనుక ఆంధ్రావారు తమ సొమ్ముతో హైదరాబాద్ బాగుపడ్డది అనే అపోహ తొలగించుకుంటే మంచిది. ఇక ఇక్కడికొచ్చి ఒక ఇళ్ళు కట్టుకున్నా, ఒక కంపెనీ పెట్టినా అది వారి సొంత లాభానికి తప్ప సిటీని అభివృద్ధిచెయ్యడం కోసం కాదు. ఆంధ్రా వ్యాపారులకంటే ఎన్నోరెట్లు ఎక్కువగా మల్టీనేషనల్స్ ఇక్కడ పెట్టుబడి పెట్టారు. వారు పెట్టింది లాభాలకోసమే, తెలంగాణవస్తే వాల్ల లాభాలకు ఢోకా లేదని తెలుసుకనుక వారెవ్వరూ చింతించట్లేదు. హైదరాబాదులో వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, మెట్రో రైలు లాంటి ప్రాజెక్టులు అన్నీ ఇక్కడి జనాభా అవసరానికి అనుగుణంగా సహజంగా ఇతర మెట్రోసిటీల లాగానే వచ్చిన ప్రాజెక్టులు. వాటికి పెట్టుబడులు బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ ప్రకారం ఆయా కంపెనీలు పెట్టడమో, లేక అంతర్జాతీయ బ్యాంకులద్వారా ఋణాలు సేకరించడం ద్వారానో జరిగింది. ఆ అప్పులు ఎలాగూ తెలంగాణ రాష్ట్రానికే వస్తాయి కనుక ఈప్రాజెక్టులగురించి కూడా సీమాంధ్రులకు చింత అవసరం లేదు.
ఇటువంటి అబద్ధపు అసత్య గోబెల్స్ ప్రచారాలతోనే ఉద్యమాన్ని నడిపెసారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక చదివి అర్ధం చేసుకున్న వాళ్ళెవరూ ఇటువంటి వ్యాఖ్యానాలు చెయ్యరు. కేంద్రం కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదికని పార్లమెంటులో చర్చకి పెట్టి వుంటే దేశం మొత్తానికి నిజాలెమిటో తెలిసేవి. రాజధాని హోదాలో వచ్చిన ఆదాయాన్ని, సౌకర్యాలని తమ ఖాతాలో వేసుకొని తక్కిన రాష్ట్రాన్నంతా తామే పోషిస్తున్నట్లు చేస్తున్న అబద్ధపు ప్రచారాలన్నీ వట్టివే అని శ్రీ కృష్ణుడు తేల్చేసాడు.
3) హైదరాబాదు లాంటి మరో రాజధానిని నిర్మించుకోవాలంటే ఎన్నేళ్ళు పట్టాలి?
నాలుగొందల ఏళ్ళు పడుతాయి. ఎందుకంటే హైదరాబాదు కూడా నాలుగొందల ఏళ్ళతరువాతనే ఇలాగుంది. కాకపోతే ఒక రాజధానికి ఇంతపెద్ద నగరం అవసరం లేదు. గుజరాత్ లాంటి ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రానికి కూడా ఉన్న రాజధాని అతిచిన్న నిగరం. నిజానికి ఒక ప్రణాలిక లేకుండా ఇలా పెరిగిన ఈహైదరాబాదు నగరంలో లాభాలకంటే నష్టాలే ఎక్కువ. దీనికంటే చిన్న చిన్న నగరాలు ఎక్కువ అభివృద్ధి చేసుకుంటే సుఖంగా ఉంటుంది. సీమాంధ్రలో ఎలాగూ అనేక చిన్న నగరాలు ఉన్నాయి.
హైదరాబాదు నగరం వయసు 400 ఏళ్ళు. కానీ 350 సంవత్సరాల తర్వాత ఎలా వుంది .. మిగిలిన 50 ఏళ్లలో ఎలా మారింది అన్నది చెప్పనక్కరలేదు. ఆ వివరాలు కూడా శ్రీ కృష్ణ కమిటీ నివేదిక 6 వ అధ్యాయంలో వివరంగా వున్నాయి. హైటెక్ సిటీ వచ్చిన తరువాత ఐటీ రంగంలో బెంగళూరు ని హైదరాబాదు తలదన్నిన విషయం అందరికీ తెలుసు. అంతర్జాతీయ కంపెనీలెన్నో బెంగళూరు ని కాదని హైదరాబాదులో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసాయి. రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న సాఫ్ట్ వేర్ రంగ ఎగుమతుల్లో 98 శాతం కేవలం హైదరాబాదు నగరం నుండే జరుగుతున్నాయి అని శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తేల్చింది. అయినా లాభాల కంటే నష్టాలే ఎక్కువ వున్నప్పుడు హైదరాబాదు గురించి అంత మంకు పట్టు ఎందుకు? అక్కడే వుంది అసలు మతలబు!
4) ఉద్యోగావకాశాలన్ని హైదరాబాదులోనే ఉన్నాయి
ఐటీ, ఫార్మా రంగాల్లో హైదరాబాదులో ఉన్న అవకాశాలగురించి ఈఏడుపు. అయితే ప్రైవేటు ఉద్యోగాలకు ప్రభుత్వ ఉద్యోగాళ్ళా నేటివిటీ నిబంధనలేవీ లేవు. మబవాళ్ళెందరో రోజూ బెంగుళూరు, నోయిడాల్లాంటి నగరాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. కనుక రేపు వేరే రాష్ట్రమయినా హైదరాబాదుకు సీమాంధ్ర యువకులు వచ్చి ఉద్యోగాలు వెతుక్కోవచ్చు. ఇక్కడ సీమాంధ్రలో లాగా ఫాక్షనిజం రౌడీయిజం లేవు కనుక ఎవరైనా ప్రశాంతంగా బతుకొచ్చు. అందుకే ఈనగరం అభివృద్ధి చెందింది
ఇక్కడ ఫాక్షనిజం, రౌడీయిజం లేక పోవచ్చు. కానీ వెర్రి తలకెక్కిన వేర్పాటు వాదం, సీమాంధ్రుల పట్ల వల్ల మాలిన విద్వేషం పుష్కలంగా వున్నాయి. ఒక తాజా ఉదాహరణ - ప్రస్తుతానికి సమైక్యంగా వున్న ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అనుమతితో, తమ రాజధానిలో, జరపదలుచుకున్న సమావేశం పట్ల తెలబాన్లు ప్రవర్తిస్తున్న తీరు! సాక్షాత్తూ కేంద్రమే తెలంగాణా ఇవ్వటానికి పరుగులు పెడుతున్న సమయంలో తమ నిరసన తెలపటానికి చిన్న ఉద్యోగులు జరుపుకొనే సమావేశం పట్ల తెలబాన్లు చూపిస్తున్న కక్ష సాధింపు ధోరణి వారి భవిష్యత్ కార్యాచరణ ని చెప్పకనే చెపుతోంది. బందులు, రహదారి దిగ్బంధనాలు ప్రకటించటమే గాక తన్నులు తంతామని కూడా ఓయూ జేఏసీ బరితెగించి చెప్పింది. ఇదేనా కడుపులో పెట్టుకొని చూసుకోవడమంటే?
5) ఆదాయంలో డెబ్బై శాతం హైదరాబాదునుండే!
రాష్ట్ర ఆదాయంలో ఎక్కవ భాగం హైదరాబాదు నుండి రావడం ఇప్పుడు మొదలు కాలేదు, 1956 నుండే ఉంది. ఆ ఆదాయం చూసే అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్ర నాయకులు వచ్చి తెలంగాణను కలుపుకున్నారు. అయితే ఇప్పుడొస్తున్న ఆదాయంలో కూడా ఎక్సైజ్, సేల్స్ టాక్స్ లాంటి ఆదాయాలు ఆఫీసు ఆంధ్రాలో ఉన్నా హైదరాబాదు కిందే వాస్తాయి. అయితే రాష్ట్ర విభజన తరువాత అవి సీమాంధ్ర అక్కౌంటు కిందికి వస్తాయి కనుక ఆదాయం గురించి చింత పడాల్సిన అవసరం లేదు.
6) ఆంధ్రప్రదేశ్ రాజధాని కనుకనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది
ఇదొక పచ్చి అబద్దం. 1956లోనే హైదరాబాదు దేశంలో ఐదవ పెద్దనగరం. మిగతా పెద్ద నగరాలు ఏరేటులో అభివృద్ధి చెందాయో హైదరాబాదు కూడా అంతే ( కాస్త తక్కవే) రేటులో పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి కాకుండా ఇన్నాళ్ళూ తెలంగాణ రాజధానిగా ఉన్నా హైదరాబాదు ఇలాగే ఉండేది. కర్నూలు ఆంధ్ర రాజధానిగా కొనసాగిన అది సుమారు అలాగే ఉండెది, కాకపోతే కాస్తడబ్బొచ్చిన తరువాత డేఋఆలకు బదులు బిల్డింగులు కొన్ని కట్టేవారేమో.
నగర అభివృద్ధి రాజధాని వలన అవదు. వ్యాపార అవకాశాలు, కొత్తవారిని చేర్చుకోవడంలో ప్రజల కలుపుగోలుతనం, భౌగోళిక స్థితిగతులు లాంటి వాటిపైన అభివృద్ధి చెందుతుంది. అలాగే ఐటీ,ఫార్మా కంపెనీలు టాలెంట్ పూల్ లభ్యమయ్యేదగ్గరే ఏర్పడతాయి. అవన్నీ హైదరాబాదుకు ఉన్నాయి గనుకే హైదరాబాదు అభివృద్ధి చెందింది.
అన్నింటితోబాటు హైదరాబాదు చుట్టు పక్కల కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు సరిపడే స్థలం ఉంది. అది ఆంధ్రా సిటీల్లో దొరకదు.
1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసినపుడు తెలంగాణా ప్రాంతాన్ని 5 సంవత్సరాలు ప్రత్యేకంగా వుంచి ఆ తరువాత ఆ రాష్ట్ర శాసన సభ అనుమతితో ఆంధ్రలో విలీనం చేయమని ప్రతి పాదన జరిగింది. అయితే ఐదేళ్ళు కూడా ఆగకుండా బేషరతుగా వెంటనే విలీనానికి వచ్చి ఇప్పుడు హైదరాబాదు స్వయం సమృద్ధం అయ్యాక పొమ్మంటే అర్ధమేమిటి? ఇంకా ఆదాయం విషయంలో కూడా శ్రీ కృష్ణ కమిటీ నివేదికే సమాధానం. రాజదానికి వచ్చే ఆదాయాన్ని తమ ప్రాంత ఆదాయంగా పరిగణించటం వాపుని చూసి బలుపు అని భ్రమించటమే! అసలు ఆదాయ వనరులు, నదీ జలాల పంపిణీ వంటి ముఖ్యమైన పంపకాలు చెయ్యకుండా కేంద్రం విభజన ప్రతిపాదించటమే మూర్ఖత్వం. 23 జిల్లాలతో కూడిన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అన్న హోదా లోనే హైదరాబాదు కి ఈ ఆదాయం , అభివృద్ది సంప్రాప్తించాయి. 1956 లోనే కాదు 2009 వరకు కూడా హైదరాబాదు దేశంలో 5 వ పెద్ద నగరం. మరి ఈ రోజు పరిస్థితి ఏమిటి? వేర్పాటు వాదుల విద్వంసక చర్యలతో మనకు రావలసిన వ్యాపారాలు, పరిశ్రమలు ఎన్నో గుజరాత్ కి తరలి పోయాయి. అభివృద్ధిలో దశాబ్దాల వెనక్కి వెళ్లి పోయాం. ఏమైనా రాజధాని విషయంలో మరోసారి మోస పోవటానికి సీమాంధ్రులు సిద్ధంగా లేరు.