Sunday, January 31, 2010

హైదరాబాదుని ముంబైలా చేయకండి...


ముంబాయి పై సర్వ హక్కులూ మరాఠీ వారికే..ఇక్కడ మొదటి ప్రాధాన్యం వారికే అని శివసేన నాయకుడు, లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి ఈ రోజు ప్రకటించాడు. ఎక్కడో ముంబాయి గురించి మాట్లాడితే మనకేమిటిలే అని తేలిగ్గా తీసి పారేయకండి..ఇక్కడ కూడా మన ఆంధ్రా జిన్నా అనుచర గణం ప్రత్యెక రాష్ట్రం రాక మునుపే బయటి వారిని గెంటేసి నంత పని చేస్తూ భీభత్స వాతావరణం సృష్టిస్తున్నారు కాదా? చిదంబరం గారి భాషలోనే చెప్పాలంటే ఇలాంటి వాదాలని మొగ్గలోనే తున్చేయాలి.. (నా ఇది వరకటి టపా తమిళ తంబిలని చూసైన నేర్చుకోండి చదవగలరు) . శివసేన వారికి మొదట్లో ప్రాధాన్యం, అధికారం ఇచ్చి, ఇప్పుడు వారినేమీ చేయలేక చోద్యం చూస్తున్నట్లే.. రేపు మన పరిస్థితి కూడా తయారవగలదు. తస్మాత్ జాగ్రత్త..

Saturday, January 30, 2010

విద్యార్ధులే వెర్రి గొర్రెలు!


రాష్ట్రంలో ఇటీవల జరిగిన బందులు, అల్లర్లలో జరిగిన నష్టాన్ని అందుకు కారణమైన వారినించే వసూలు చేయమని హైకోర్టు వుత్తర్వులివ్వటం హర్షదాయకం. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ లో మల్లికార్జున్ అనే విద్యార్ధి అరెస్టు అయ్యి బెయిలు కోసం కోర్టుకు వచ్చాడు. కోర్టు అతన్ని లక్ష రూపాయల డిపాజిట్ కట్టమని ఆదేశిస్తే అంత స్తోమతు లేక అతను చేతులెత్తేసాడు. తమ ఉద్యమాలకి విద్యార్ధులని పావులుగా వాడుకున్న వారు ఎవరైనా అతన్ని లక్ష రూపాయలు కట్టి విడిపిస్తారా?? విద్వేషాల్ని రెచ్చగొట్టిన ఈ నాయకులు, మంత్రులు మొదలైన వారు మాత్రం అరెస్టు అయ్యి అత్తారింటికి వెళ్లి వచ్చినట్లు పొలిసు స్తేషన్లనుంచి బయటకి వచ్చేసి తిరిగేస్తున్నారు. వారి చేత రెచ్చగొట్ట బడిన విద్యార్ధి మాత్రం బలి పశువులా జైల్లో వున్నాడు. కనుక విద్యార్ధులు దీన్న్తో గుణ పాఠంగా తీసుకొని రాష్ట్ర విభజన లాంటి అనవసర విషయాల్లో తలలు దూర్చకుండా వారి చదువులు, భవిష్యత్తు పై దృస్టి పెడితే మంచిది.

Wednesday, January 27, 2010

పిల్లి మెత్తనైతే ఎలక ఏం చేస్తుంది?


ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న కోదండ రాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కారణంగా ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలా వద్దా అన్నది ఆయన పని చేస్తున్న డిపార్టుమెంటు అంతర్గత వ్యవహారం. అయితే, కోదండ రాం పై చర్య తీసుకుంటే ఎం జరుగుతుందో చూడండి అని జయ శంకర్ హెచ్చరించడం చాలా తప్పు. ఇది ప్రభుత్వ సార్వ భౌమత్వానికే సవాల్.. ఇప్పటికే, సినిమాలని ఆడనీయమనీ, పండక్కి వెళ్ళిన వారిని తిరిగి రానీయమనీ, ఇంకా చాలా చాలా ప్రకటనల్ని చూసాం. స్వంత రాజముద్రల్ని చలామణీ చేయటం చూస్తున్నాం. ఇంకా ఊరుకుంటే ఇది ఎంత దూరం వెళుతుందో తెలీదు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్యాచరణకి దిగి రాజ్య ధిక్కరణ ని సహించ బోమని వేర్పాటు వాదులకి తెలియ చెప్పాల్సిన సమయం వచ్చేసింది.......

తెలంగాణా ఆచార్యుల అనాగరికం!

ఆచార్య దేవో భావ అని కీర్తించబడే వృత్తుల్లో వున్న జయ శంకర్, కోదండ రాం లు ప్రాంతీయ విభేదాల్ని రెచ్చగొట్టటం తప్ప వేరే ఏమీ చేస్తున్నట్లు లేదు. ఆంధ్రా వాళ్ళది పై చేయి అయితే హైదరాబాదు ని అమ్మేస్తారని జయ శంకర్ అనటం హాస్యాస్పదం. అసలు హైదరాబాదుని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ది చేసింది గత పదునాలుగేల్లుగా వున్న రాయల సీమకి చెందిన ముఖ్య మంత్రులే కాదా? పైగా సభలు, సమావేశాలు పెట్టుకోవాలంటే కోర్టుల పర్మిషన్ తెచ్చుకోవాలా అని అడగటం ఇంకా మూర్ఖత్వం. అసలు ప్రశాంతంగా వున్న రాష్ట్రంలో ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు? కడివెడు పాలల్లో విషం చుక్కలు వేసినట్లు అన్నపూర్ణ వంటి ఆంధ్ర ప్రదేశ్ ని అరాచకాన్ద్రగా మార్చింది ఎవరు? ఇంకా ప్రజల నిర్ణయం అంటూ రాజీనామాల డ్రామాలు! గత ఎన్నికల్లో తెలంగాణకి సై అంటూ మహా కూటమి ఒక వైపు, సమైఖ్యాంద్ర పక్షంలో వై.ఎస్. ఒక వైపు మోహరించారు కదా! ప్రజలు వై.ఎస్. కి అధికారం కట్ట బెట్టారంటే అర్ధం ఏమిటి? ప్రజల మాండేటు సమైఖ్యాంద్ర అని స్పష్టమైంది కదా. మరి ప్రజల వంక పెట్టి ఈ రాజీనామాల డ్రామాలు, గర్జనలు, గాండ్రింపులు, అల్లరులు ఎవరి కోసం?

Sunday, January 24, 2010

ఆలూ లేదూ చూలూ లేదు..రాజ ముద్ర రెడీ !


సాక్షి పేపర్లో వచ్చిన ఈ వార్తని చూసారా!
తెలంగాణా వాసులంతా కొత్త ప్రభుత్వ రాజ ముద్రని మెయిల్సుల్లోనూ, సెల్ ఫోన్లలోనూ తిప్పేసుకుంటున్నారట! (సాక్షి దిన పత్రిక తేదీ 23 జనవరి 2010 రాష్ట్రీయం పేజీల్లో). అసలు కొత్త రాష్ట్రం వస్తుందో రాదో తెలియకుండానే రాజ ముద్రని చలామణీ లోకి తేవటం చట్ట విరుద్ధం కాదా? ఇది దొంగ నోట్లను చలామణీ లోకి తేవటం కన్నా పెద్ద నేరం! ప్రభుత్వం ఎం చేస్తున్నట్లు? షరా మామూలుగా చోద్యం చూస్తోందా?

Friday, January 22, 2010

వైద్య గర్జనలో వింత గాండ్రింపు!


పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కోదండరాం ప్రాంతాల మధ్య, ఆయా ప్రాంతీయుల మధ్య చిచ్చు పెట్టె అపవిత్ర బాధ్యతని తలకెత్తుకున్నాడు. ఆల్రెడీ హైదరాబాదులో లాయర్లు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టేసుకున్నారు. ఇక మిగిలింది వైద్యులే అని అనుకుంటుంటే, ఈ రోజు వైద్య గర్జనలో ఆ లోటు కూడా తీర్చేసారు! ఇరవై ఎనిమిదవ తేదీ లోగా తెలంగాణా పై ప్రకటన చేయక పొతే, తెలంగానేతరులకి వైద్యం చేయరట! అంటే ఆంధ్ర ప్రాంతం రోగి వస్తే హరీమనిపిస్తారా? వైద్యో నారాయణో హరీ అని స్తుతించ బడే వైద్య వృత్తిలో వారు అనవలసిన మాటలేనా ఇవి? రాను రాను వేర్పాటు వాదం వెర్రి తలలు వేస్తూ తీవ్ర వాద స్థాయిని మించుతోంది. దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు????

మన రాష్ట్రానికి సిగ్గు చేటు..

డెక్కన్ 20-20 కప్ క్రికెట్ మాచ్ ని తెలంగాణా వాదులు అడ్డుకున్నారన్న వార్త చదివి నవ్వాలో, ఏడవాలో తెలీటంలా. ఇప్పటికే రాష్ట్రంలో అల్లర్ల వల్ల విశాఖపట్నంలో జరగాల్సిన అంతర్జాతీయ వన్డే మాచ్ రాష్ట్రం బయటకి వెళ్లి పోయింది. ఇలా ఆటల్ని ఆడనీక, సినిమాలని ఆడనీక, రైళ్ళని కదలనీక, బస్సులని నడవనీక, విద్యార్ధులని చదవనీక, ప్రజలని ప్రశాంతంగా బతకనీక ..తెలంగాణా వేర్పాటువాదులు సాధించ దలుచుకున్నదేమిటి? మాట్లాడితే సీమ, ఆంధ్ర వారిని దోపిడీ దారులు అంటారు. ఏమి దోచేసారో అర్ధం కాదు. ఉదాహరణకి రాయలసీమలోని కర్నూలుకి చెందిన పుల్లా రెడ్డి చేసిన మిఠాయిలు హైదరాబాదు వారికి నచ్చబట్టే అక్కడి వారు కొన్నారు. ఆయన కూడా ఆ క్వాలిటీ కొనసాగిస్తూ వ్యాపారం విస్తరించుకొని కోటీశ్వరుడు అయ్యాడు. ఆయన ఎవరిని దోచేసి కోటీశ్వరుడు ఐనట్లు? ఇదే సూత్రం మిగతా వ్యాపారులకి, పరిశ్రమలకి, విద్యా సంస్థలకీ వర్తిస్తుంది. అది అర్ధం చేసుకోకుండా ఆంధ్రా విద్యా సంస్థలు నిషేధిస్తామని, తెలంగానేతరులని వ్యాపారాలు చేసుకోనివ్వమని, ఇంకా ఇలాంటి ప్రకటనలు చేయడం మూర్ఖత్వం. అసలు మనకి దాయాది వైరం ఉన్న పాకిస్తాన్ సైతం మన దేశంలో క్రికెట్ ఆడుతోంది. పైగా ఆ మాచ్ పాకిస్తాన్ గెలిచినా కూడా మనం చప్పట్లు కొట్టి అభినందిస్తున్నాం. అటువంటిది తోటి తెలుగు వారితో ఆడే మాచ్ ని అడ్డుకున్నారంటే నిజంగా సిగ్గు చేటు. ఈ పరిస్థుతులు కొనసాగితే, తెలంగాణా వస్తే, హైదరాబాదు వెళ్ళటానికి వీసా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వై.ఎస్. రాజ శేఖర రెడ్డి చెప్పిన మాట నిజం అయ్యే రోజు దూరంలో లేదు. ....

జాయింట్లు వూడుతున్న కమిటీ

తెలంగాణా జే.ఎ.సి. నుండి విడిపోయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణా కోసమై విడిగా పోరాడుతుందట! దీన్ని బట్టి ఏం అర్ధమవుతోంది? తెలంగాణా వస్తే గిస్తే ఆ క్రెడిట్ తామే కొట్టేద్దామని ఎవరికీ వారు తాపత్రయపడిపోతున్నారు. అప్పుడు ఆ క్రెడిట్ తో పాటుగా ఏర్పడబోయే పదవులన్నీ తామే పొందవచ్చని ఆశ కావచ్చు. అసలు వీరందరికీ ప్రత్యెక రాష్ట్రంతో రాబోయే పదవులని పొందుదామనే తప్ప వేరే ఎజెండా ఏమైనా ఉందా? ఎవరికీ వారు ఎలా అలజడులు సృష్టిద్దామా అని రోడ్డు మ్యాపులు గీస్తున్నారు తప్ప రాష్ట్రం అంటూ వస్తే దాన్ని ఎలా అభివృద్ధి చేద్దామనుకుంతున్నారో ఒక్కరైన చెప్పారా?

Wednesday, January 20, 2010

మళ్ళీ బందా? అమ్మ బాబోయ్..

అసలు తెలంగాణాలో ఎం జరుగుతోంది? రాజకీయ నాయకులేమో దొంగ దీక్షలు, ఉత్తుత్తి రాజీనామాలు, అత్తారింటికి వెళ్లి వచ్చినట్లు అరెస్టై పొలిసు స్టేషన్లకు వెళ్లి రావడం.. మీటింగులు, చర్చల పేరుతొ తమ ప్రొఫెషన్ లని విజయవంతంగా నడిపించుకుంటున్నారు. మీడియాకి కూడా కావలినంత హల్ చల్! వారికీ పండగే! మధ్యలో వెర్రి వెధవలు అవుతున్నది చోద్యం చూస్తున్న ప్రజలు, భవిష్యత్తు నాశనం చేసుకుంటున్న విద్యార్ధులు! ఒక విద్యార్ధి (ఆత్మ) హత్య కారణం చూపుతూ మళ్లి రెండు రోజుల బందు పిలుపు ఇవ్వటం దారుణం. రెండు రోజులు కాదు ఇరవయ్ రోజులు బందు చేసిన కూడా ఈ రాజకీయుల ప్రొఫెషన్ కి ఎ మాత్రం ఇబ్బంది వుండదు. పైపెచ్చు వారికి కావలసినంత హంగామా! ప్రతి చోటా లీడరు మీడియాలో అభిప్రాయాలు చెప్పేవాడే! కాని అసలు ప్రజల అవస్థలు, ఇబ్బందులు ఎవరికైనా పట్టాయా? విద్యార్ధులు కూడా ఆలోచించుకోవాలి. ప్రత్యెక రాష్ట్రం వచ్చినా రాక పోయినా వారికి వొరిగేదేమీ లేదు. కానీ ఈ రాజకీయ నాయకులెవరైన పోయిన విద్యార్ధుల ప్రాణాలు తీసుకు రాగలరా? రేపు వీరు చదువులు నాశనం చేసుకుని నిరుద్యోగులుగా రోడ్లో నిలబడితే ఎ రాజకీయుడైన పలకరిస్తాడా? చస్తే పలకరించరు. ఆ టైము కి వారి చేత క్రియేట్ చేయబడబోయే సమస్యకి ఎవరు సమిధలుగా అవసరమవుతారో వారి వెంట పడతారు కాని వీరిని పట్టించుకోరు. పైగా ఇప్పుడు రెండు రోజుల బందుని ఒక రోజుకి తగ్గించటానికి ప్రయత్నిస్తున్నారట! సంతోషం. అసలు బందు మార్గం కాకుండా, ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా వేరే మార్గాలు చూసుకుంటే మరీ సంతోషం.

Monday, January 18, 2010

Tv-9 కాకి గోల!


వరంగల్ జిల్లాలో బోరు బావిలో పడి ఒక పసి వాడు చని పోవటం అత్యంత విషాదకరమైన సంఘటనే. అయితే ఈ బోరు బావుల విషయంలో Tv-9 ఛానల్ గోల ఎక్కువ చేస్తున్నట్లు నాకనిపిస్తోంది. ముఖ్య మంత్రిని కాపాడుకోలెం.. చంటి పిల్లాణ్ణి కాపాడుకోలెం.. చేతకాని వ్యవస్థ మనది అంటూ యాగీ చేయటం దారుణం. ముఖ్య మంత్రి కానీ, ఆ పిల్ల వాడు కానీ చనిపోయింది ప్రమాద వశాత్తు తప్ప ఆయా అధికారుల ఉద్దేశ పూరిత నిర్లక్ష్యం వల్ల కాదు కదా! ఒక ఎం. ఆర్. ఓ. కి నిర్వర్తించాల్సిన బాధ్యతలు బోలెడు వుంటాయి. వాటన్నిటిని వదిలి ఎక్కడ బోరు బావి తెరిచి వుంది అని రోజూ మండలం అంటా తిరగడు కదా. అక్కడ బోరు బావి తవ్వి వదిలేసింది ఎవరు? చని పోయిన పిల్లాడి తండ్రే కదా! ఆ విషయం ఎక్కడో వున్న రెవిన్యూ అధికారికి ఎలా తెలుస్తుంది.. ఎవరైనా చెపితే తప్ప? ఒక వేళ విషయం తెలిసాక కూడా ఉపేక్షిస్తే చర్య తీసుకోవచ్చు. కానీ ఒక పక్క సహాయక చర్యలు జరుగుతున్నంత సేపూ పక్కనే నస పెడుతూ చిరాకు తెప్పించటం చాలా ఓవర్ యాక్షన్ మాత్రమె.. ఆ ఛానల్ స్పందించ దలుచుకుంటే అంతకు మించిన సమస్యలు చాలా వున్నాయి. అలాగే వేర్పాటు వాద జే.ఎ. సి. నాయకుడు పరీక్షా పత్రాలు దిద్దటం గురించి ఏదో స్తేటుమెంటు ఇస్తే ఆ రోజు కూడా చర్చ పెట్టి యాగీ చేసింది. అసలు ఆ నాయకుని ప్రకటనకన్నకూడా ఆ ఎంఖర్ రజనికాంత్ అడిగే ప్రశ్నలే చాలా రెచ్చగొట్టేవిగా వున్నాయి. అసలే పరిస్థితులు ఉద్రిక్తంగా వున్నప్పుడు ఇలాంటి విషపు చుక్కలు చిమ్మి ఆజ్యం పోయటం హీనాతి హీనం....

Saturday, January 16, 2010

శభాష్ ఆంధ్రా పోలీస్!

నా ముందరి టపా లో (తెలంగాణా కండ కావరం) నేనడిగాను. విద్వేష పూరిత ప్రకటనలు ఇచ్చే వారిపై సు మోటో కేసులు బుక్ చేయరా అని. ఈ రోజు వార్తల్లో చూసాం .. కవిత పై సు మోటో కేసు బుక్ చేసారని! ఈ కేసు ఫైనల్ అవుట్ కం ఎలాగైనా వుండనీ, ఎట్ లీస్ట్ రెచ్చగొట్టే ప్రకటనలు చేసే వారు ఇక ముందు జాగ్రత్తగా వుండాలని ఇదో హెచ్చరికగా పోలీసులు చూపించ గలిగారు. శభాష్ ఆంధ్ర పోలిస్.. (ఇక్కడ ఆంధ్ర పోలిస్ అంటే సమైఖ్యాంధ్ర పొలిసు కాదు.. తెలంగాణా ప్రాంతంలో పని చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పొలిసు అని గమనించ గలరు..)

Wednesday, January 13, 2010

తెలంగాణా కండ కావరం....

అక్షరాలా హై కోర్టు బలపరచిన అదుర్స్ సినిమాని తెలంగాణా లో ఆడనివ్వరట! కవిత గారి ప్రకటన! అసలు ఎవరా కవిత ? కే సి ఆర్ అనబడే వేర్పాటు వాది కుమార్తెగా తప్ప ఆవిడకి ప్రత్యెక గుర్తింపు ఏమైనా ఉందా? సినిమాలని నిషేధించడానికి ఆవిడకి ఉన్న హక్కు ఏమిటి? ఇక తెలంగాణా జే ఎ సి మీటింగు నిర్ణయాలు రాజ్ ధాకరే దుశ్చర్యాలని మించి పోయాయి. టీజీ స్టిక్కర్లు వాహనాలకి అంటిన్చాలా? ఇళ్ళ ముందు తెలంగాణా ముగ్గులేయాలా? ఇళ్ళ పై తెలంగాణా జెండా ఎగరేయాలా? స్కూళ్ళలో తెలంగాణా గీతం పాడాలా? తెలంగాణా రాష్ట్రం రాక ముందే.. వారి ప్రభుత్వం ఏర్పడక ముందే ఇన్ని ప్రేలాపనలు చేస్తున్న వారు... ఒక వేళ తెలంగాణా రాష్ట్రం వస్తే..గిస్తే.. అందులోని ఎన్.ఆర్.ఎ. లను (అంటే నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్) ఎలా కాల్చుకు తింటారో చెప్పకనే చెప్తున్నారు. అసలు రాజ్యాంగ బద్ధమైన ప్రభుత్వం ఉన్న ప్రస్తుత స్థితిలో ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు చేసిన వారిపై సు మోటో గా పోలీసులు గాని కోర్టులు గాని కేసులు బుక్ చేసి ఎందుకు వీళ్ళ నోళ్ళు మూయించరు? రిలయన్స్ పై దాడులు చేస్తే సు మోటో గా కేసులు బుక్ చేసిన ప్రభుత్వం ఈ ప్రకటనలు నేర పూరితమైనవిగా భావించడంలేదా??

Monday, January 4, 2010

తెలంగాణాకి సొంత సాఫ్ట్ వేర్ !

ఐ టీ కి రెడ్ కార్పెట్ వేస్తామని కే సి ఆర్ గారు సెలవిచ్చారట.. సంతోషం.. ఇప్పుడు ఆయన గతంలో ఇచ్చిన స్తేటుమెంట్లు చూద్దాం.
మీ ఆంధ్రోల్లు తీసిన సిన్మాలు మేమెందుకు చూడాల? మాకు హీరోలు లేరా.. మాకు సిన్మాలు తీయటం రాదా?
మీ టీవీలు మేమెందుకు చూడాల? మేమే ఒక టీవీ ఛానల్ పెడతాం చూస్కోండి...
మీ పత్రికలు మేమెందుకు చదవాల? మా సొంత పత్రిక తెస్తాం.
ఇన్ని ప్రత్యేకతలున్న ఆయన తెలంగాణా ద్రోహులైన చంద్రబాబు, వై ఎస్ ఆర్ లు పెంచి పోషించిన ఐ టీ మాత్రం ఎందుకు కావలనుకొంటున్నారు? అంటే తెలంగాణాకి సొంత ఐ టీ, సాఫ్ట్ వేరులు లేవనా దాని అర్ధం?
పోనీలే, తెలంగాణాకి సొంత సాఫ్టు వేరు లేక పోవటమే మంచిది. ఒక వేళ వుంది అనుకుందాం. ఆ సాఫ్టు వేరుని ఎ కంప్యుటర్లో లోడ్ చేస్తే అది బై డిఫాల్ట్ రెండు ముక్కలవటం ఖాయం... అవునా ..కాదా?

హైదరాబాదు నుంచి వెళ్ళ గోడతారా?

ఐదవ తేదీన జరిగే మీటింగు జస్ట్ పార్టీల అభిప్రాయ సేకరణ మాత్రమె మరియు తెలంగాణా పై విధాయక నిర్ణయం/ప్రకటన ఏది వుండదు అని అందరికీ తెలుసు. ఐన ఓ యు గర్జనలో ఎం మొరిగారు? అనుకూల ప్రకటన రాక పొతే ముప్పై లక్షల మందిని వెల్లగోడతారట! అసలు రెచ్చగొట్టే ప్రకటనలు చెయగుడదన్న కండిషన్ తోనే కోర్టు మీటింగు కి పెర్మిషణ్ ఇచ్చింది. ఐన జరిగిందేమిటి? ఎవరిచ్చారు వాళ్ళకా హక్కు? ఇంకా ఎన్నాళ్ళు తగల బడాలి రాష్ట్రం? ఇప్పటికే ఇరుగు పొరుగు చూసి నవ్వుకుంటున్నారు... వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టి అందరి నోళ్ళు మూయించి ఇంకా ఎవరైనా గట్టిగా నోరెత్తితే మిలటరీ వాళ్ళతో కుమ్మిన్చేయండి.. ఇప్పటికి ఇదే పరిష్కారం..

Sunday, January 3, 2010

గర్జనా? రాజ్య ధిక్కారమా? సహించకూడదు..

అసలు చదువుకొనే విద్యార్ధులకి రాజకీయాలు అనవసరం. కొత్త రాష్ట్రం వచ్చినా రాక పోయినా వారికి ఒరిగేదేమీ లేదు. కానీ, గర్జన పేరిట ఓయూ లో చేరిన గుంపు ప్రేలాపనలు చూడండి..
తెలంగాణా పై చర్చ దేశ రాజధానిలో కాక ఉస్మానియా యునివర్సిటీ లో జరగాలట! అంతా వీళ్ళ ఇష్టమే? హైదరాబాదు ని అడిగే హక్కు ఆంధ్రులకు లేదట! వీళ్ళ తాత ముత్తాతలు కట్టించి వీళ్ళకి వీలునామా రాసి ఇచ్చినట్లు చెప్తున్నారు... అసెంబ్లీలో కాదు పార్లమెంటులో బిల్లు పెట్టి తెలంగాణా ఇవ్వాలట... పార్లమెంటులో కూడా ఎందుకు.. వీళ్ళే స్వతంత్ర రాజ్యంగా ప్రకటించేసుకుంటే పోలా? ఐదవ తేదిన తెలంగాణాకి అనుకూలంగా ప్రకటన రాకపోతే ఆంధ్రానించి వచ్చే బస్సులు, రైళ్ళు రానివ్వరట... ఎవరిచ్చారు వాళ్ళకా హక్కు? మనమేమైనా పాకిస్తాన్నించి వస్తున్నామా లేదా పాకిస్తాన్లోకి వెళ్తున్నమా? అలాగే తెలంగాణా పై వైఖరి స్పష్టం చేయాలని చంద్రబాబుని డిమాండ్ చేసారు. అడగడంలో తప్పు లేదు. కాని ప్రకటన వ్యతిరేకమైతే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తారట! ఇదేమి అరాచకత్వం? భావ ప్రకటన స్వేచ్చ ఉండకూడదా? రాను రాను కోతి పుండు బ్రహ్మ రాక్షసి లాగ ఈ ఉద్యమం హద్దులు దాటి తీవ్ర వాదం, రాజ్య ధిక్కారం వైపుగా పయనిస్తోంది. కాదు కాదు ఆల్రెడీ ముదిరి పోయింది. కేంద్రం ఇదంతా తామే కెలికిన కోతి పుండు కాబట్టి పూర్తిగా చేతులు కాలక ముందే మరో బ్లూ స్టార్ ఆపరేషన్ వంటిది చేసి సద్దుమనచక పొతే రాష్ట్రం మరో ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది.

కే సి ఆర్ తిట్ల పురాణం

సాక్షి టీవీలో వచ్చిన ఈ తిట్ల పురాణం చూడండి..

Saturday, January 2, 2010

తమిళ తంబిలని చూసైనా నేర్చుకోండి..

ఈ రోజు వార్తల్లో ఒక విషయం గమనించారా? తమిళనాడులో రామదాస్ అని ఒకాయన వున్నాడు. మన కే సి ఆర్ లాగే ఆయన రాజకీయ నిరుద్యోగి. అచ్చం మన వాడిలానే PMK అని ఒక కేడర్ బేస్ లేని పార్టీ వుందాయనకి. ఇక్కడ మన వాడి హడావిడి చూసి ఆయన తమిళనాడుని కూడా రెండు ముక్కలు చేస్తే బాగుంటుంది అని అభిప్రాయం వెలిబుచ్చాడు. (ఉద్యమాలు చెయ్యలేదు. దొంగ దీక్షలు చెయ్యలేదు. విద్యార్ధులని రేచ్చాగోట్టలేదు. జస్ట్ అభిప్రాయం చెప్పాడు. అంతే. ) వెంటనే మన చిదంబరం గారు అలర్ట్ ఐ పోయారు. ఇలాంటి వాదాల్ని మొగ్గలోనే తున్చేయాలని సెలవిచ్చారు. (అదే చిదంబరం మన రాష్ట్రాన్ని కేకు ముక్కలా కోయటానికి శాలువా కప్పుకొని రెడీ ఐ పోయాడు..) బద్ధ శత్రువులైన కరుణానిధి, జయ లలిత ఇద్దరు కూడా ఆ ప్రతిపాదనకి తాము వ్యతిరేకం అని ప్రకటించేశారు. అలా వాళ్ళు ఒక మాట మిద వుండి...తమ రాష్ట్రంలో అల్లర్లు రేగకుండా, ఆస్తులు బుగ్గిపాలు కాకుండా, ప్రజలకి ఇబ్బందులు లేకుండా, పరిశ్రమలు తరలి పోకుండా, మద్రాసులో సిని పరిశ్రమ వేరే దారులు వెతుక్కోకుండా.... over all గా రాష్ట్రం నవ్వుల పాలు కాకుండా కాపాడుకోగలిగారు. ఆ తెలివి తేటలు, ముందు చూపు మన తెలుగు వారికి లేక పోవటం మనం చేసుకున్న ఖర్మం.
ఏమైనా, తమిళ తమ్బిలకి కంగ్రాట్స్.....