Wednesday, January 27, 2010

పిల్లి మెత్తనైతే ఎలక ఏం చేస్తుంది?


ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న కోదండ రాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కారణంగా ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలా వద్దా అన్నది ఆయన పని చేస్తున్న డిపార్టుమెంటు అంతర్గత వ్యవహారం. అయితే, కోదండ రాం పై చర్య తీసుకుంటే ఎం జరుగుతుందో చూడండి అని జయ శంకర్ హెచ్చరించడం చాలా తప్పు. ఇది ప్రభుత్వ సార్వ భౌమత్వానికే సవాల్.. ఇప్పటికే, సినిమాలని ఆడనీయమనీ, పండక్కి వెళ్ళిన వారిని తిరిగి రానీయమనీ, ఇంకా చాలా చాలా ప్రకటనల్ని చూసాం. స్వంత రాజముద్రల్ని చలామణీ చేయటం చూస్తున్నాం. ఇంకా ఊరుకుంటే ఇది ఎంత దూరం వెళుతుందో తెలీదు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్యాచరణకి దిగి రాజ్య ధిక్కరణ ని సహించ బోమని వేర్పాటు వాదులకి తెలియ చెప్పాల్సిన సమయం వచ్చేసింది.......

1 comment:

  1. పిల్లి గుడ్డిదయితే ఎలుక **** చూపించిందట ..ఏమయినా అంటే మా జీవితాలే బుగ్గయిపోతున్నాయి ఇవ్వన్నీ ఒక లెక్కా అంటారు

    ReplyDelete