Saturday, January 2, 2010

తమిళ తంబిలని చూసైనా నేర్చుకోండి..

ఈ రోజు వార్తల్లో ఒక విషయం గమనించారా? తమిళనాడులో రామదాస్ అని ఒకాయన వున్నాడు. మన కే సి ఆర్ లాగే ఆయన రాజకీయ నిరుద్యోగి. అచ్చం మన వాడిలానే PMK అని ఒక కేడర్ బేస్ లేని పార్టీ వుందాయనకి. ఇక్కడ మన వాడి హడావిడి చూసి ఆయన తమిళనాడుని కూడా రెండు ముక్కలు చేస్తే బాగుంటుంది అని అభిప్రాయం వెలిబుచ్చాడు. (ఉద్యమాలు చెయ్యలేదు. దొంగ దీక్షలు చెయ్యలేదు. విద్యార్ధులని రేచ్చాగోట్టలేదు. జస్ట్ అభిప్రాయం చెప్పాడు. అంతే. ) వెంటనే మన చిదంబరం గారు అలర్ట్ ఐ పోయారు. ఇలాంటి వాదాల్ని మొగ్గలోనే తున్చేయాలని సెలవిచ్చారు. (అదే చిదంబరం మన రాష్ట్రాన్ని కేకు ముక్కలా కోయటానికి శాలువా కప్పుకొని రెడీ ఐ పోయాడు..) బద్ధ శత్రువులైన కరుణానిధి, జయ లలిత ఇద్దరు కూడా ఆ ప్రతిపాదనకి తాము వ్యతిరేకం అని ప్రకటించేశారు. అలా వాళ్ళు ఒక మాట మిద వుండి...తమ రాష్ట్రంలో అల్లర్లు రేగకుండా, ఆస్తులు బుగ్గిపాలు కాకుండా, ప్రజలకి ఇబ్బందులు లేకుండా, పరిశ్రమలు తరలి పోకుండా, మద్రాసులో సిని పరిశ్రమ వేరే దారులు వెతుక్కోకుండా.... over all గా రాష్ట్రం నవ్వుల పాలు కాకుండా కాపాడుకోగలిగారు. ఆ తెలివి తేటలు, ముందు చూపు మన తెలుగు వారికి లేక పోవటం మనం చేసుకున్న ఖర్మం.
ఏమైనా, తమిళ తమ్బిలకి కంగ్రాట్స్.....

10 comments:

  1. telangana kaanksha ninna monna ochindi kaadu..ante kakunDaa meerannattu moggalone tuncheyaalante 69 nundainaa kaasta vivaksha choopettakunte saripoyedi..

    ReplyDelete
  2. సరే ! తెలుగు వాళ్ళంతా సమైక్యంగా ఉండాలంటే, తెలంగాణ ప్రజల కష్టాలను అర్థం చేసుకొని, వారి కోరికలకు ఆంధ్రా, సీమ నాయకులు అంగీకరిస్తారా ? అవేం గొంతెమ్మ కోర్కెలేం కావు. ఇది వరకు ’ పెద్ద మనుషుల ఒప్పందం ’ లో ఉల్లంఘన జరిగిన వాటికి సరిదిద్దే కార్యక్రమాలు... ఇంకా తెలుగు వాళ్ళందరిలో భావ సమైక్యత, సమానత్వం పెంపొందించే పనులు. అర్థం కాలేదా ? చెబుతా వినండి.
    1. " గిర్ గ్లాని కమిషన్ " లెక్కతేల్చిన 2,50,000 మంది ఆంధ్రా, రాయల సీమ ఉద్యోగులను 3 నెలల లోపు ఆ యా ప్రాంతాలకు బదిలీ చేసి, ఆ ఉద్యోగాలలో తెలంగాణ వారిని రిక్రూట్ చేయాలి. అంటే నిక్కచ్చిగా 610 G.O. ను అమలుపరచాలన్న మాట.
    2. " ముల్కీ రూల్సు " ను పునరుద్ధరించాలి. హైదరాబాదు ఆరో జోన్ లో అంతర్బాగమని పార్లమెంటులో బిల్ పాస్ చేయాలి.
    3. ఇక్కడ పెట్టుబడులు పెట్టామని బీరాలు పోయే ఆంధ్రా, రాయల సీమ వాళ్ళ ప్రైవేట్ సంస్థలలో తప్పనిసరిగా కనీసం మూడో వంతు ఉద్యోగాలలో తెలంగాణ వారిని నియమించాలి.
    4. తెలంగాణలోని అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, వినోబా భావే భూదాన యజ్ఞం ద్వారా సేకరించిన భూములు, ఇతర చారిటీ ట్రస్ట్ భూములను ప్రభుత్వం జప్తు చేసుకొని, తెలంగాణ దళితులకు, మైనారిటీలకు, పేదలకు పంచాలి.
    5. రెండు సంవత్సరాలలోపు " ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ " మరియు " ప్రాణహిత - చేవెళ్ళ ప్రాజెక్ట్ " ను పూర్తి చేసి, ఇంకా కృష్ణా, గోదావరి పరీవాహక నిశ్పత్తి ప్రకారం తెలంగాణ జిల్లాలకు సాగు నీటిని, త్రాగు నీటిని అందించే ప్రాజెక్టులను చేపట్టాలి.
    6. హైదరాబాదుతోసహా తెలంగాణ జిల్లాలలో వచ్చే ప్రభుత్వాదాయాన్ని ఈ ప్రాంతంలోనే ఖర్చు చేసి, ప్రతి సంవత్సరం తెలంగాణ బడ్జెట్ ను వేరుగా ప్రకటించాలి.
    7. పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్ర, సంస్కృతిని, ఇక్కడి పాత నాయకులు, కవులు, మహానుభావుల ( ఉదా || పాల్కురికి సోమన, గణపతి దేవ చక్రవర్తి, ప్రతాప రుద్రుడు, పోతన, మల్కిభ రాముడు, కులి కుతుబ్ షా, సాలార్జంగ్, కొమురం భీమ్, మగ్ధూమ్ కవి, వానమామలై సోదర కవులు, దాశరథి, స్వామి రామానంద తీర్థ, బూర్గుల, సురవరం ప్రతాప రెడ్డి, పి.వి. మొ|| వారు ) చరిత్రలను తప్పనిసరిగా ప్రవేశ పెట్టాలి. వారి విగ్రహాలను ఆంధ్రా, రాయల సీమ ప్రాంతాలలో విస్తృతంగా ప్రతిష్ఠించాలి. వారి పేర్లను కూడా ఆ ప్రాంతాల ప్రభుత్వ సంస్థలకు పెట్టాలి.

    ఇంత న్యాయబద్ధమైన కోరికలను మేమడిగితే ... మీ స్వార్థ ప్రయోజనాలు దెబ్బ తింటాయని, మా కన్నా ముందు మీరే " జై ఆంధ్ర - జై రాయల సీమ " అంటారు. 1973 లో మీరు చేసింది అదే కదా! ఒక వేళ మీరు పై పై మాటలకు ఒప్పుకొన్నా, ఆ మాట మీద మీరు నిలబడతారన్న నమ్మకం కూడా మాకు లేదు. అందుకే మీ బతుకు మీరు బతకండి. మా మానాన మమ్మల్ని వదిలేయండి.

    ReplyDelete
  3. ఆరు సూత్రాల ప్రకారం రాష్ట్రంలో ఆరుజోనులు ఏర్పడ్డాయి.కానీ రెవిన్యూ డిపార్ట్ మెంట్ లాంటి కీలక శాఖలకు పోలీసు శాఖలోలాగా జోనల్ ఆఫీసులు ఏర్పడనందున ప్రతి చిన్నపనికీ హైదరాబాదు వెళ్ళాల్సి వస్తోంది.వాస్తవానికి కోస్తా రాయలసీమలవారే దూరాభారాలతో ప్రయాణ ఖర్చు(అనుత్పాదక ఖర్చు) ఎక్కువగా మోస్తున్నారు.హైకోర్టు గుంటూరునుండి తరలిపోయింది .కనీసం యాభై ఏళ్ళకాలంలో బెంచి కూడా ఏర్పాటు చేయలేదు.విజయవాడ,రాజమండ్రి,,తిరుపతి,నంద్యాల,మంచిర్యాల,భద్రాచలం లాంటి కొత్తజిల్లాలు కూడా ఏర్పడలేదు.రాజధాని నగరానికి తరలించి ఒకేచోట పోగుపెట్టిన అభివృద్ధి కేంద్రాలను ఇప్పటికైనా రాష్ట్రంలోని ఆరు జోన్లకూ తరలించాలి.

    ReplyDelete
  4. Tamila tambilaku pranteeya baavam ledhu mana Andhra annallagaa. Tamilnadu anni prantaalalo development jarigindhi. Ayinaa... separate country kaavalunukunay tamila tambilani venakesukochina blog writer ni Tamilnadu pampinchaali...

    ReplyDelete
  5. Naenu chennai lo vuntunnanu.Nijamga hyderabad to compare chestae chennai veyyi retlu nayam.Idi naa abhiprayam kaadu.Nalgonda nunchi vacchi maa office lo pani chestunna oka officer gari bharya abhipryam.Atanu voluntary retirement teesukoni Hyd lo settle avudamani ante aavida sasemira oppukoledu.Endukante Chennai lo telugu vallaku chaala gauravam vundi.Peacefulga vuntundi. Education baaguntndi.Idi naa opinion kaadu.O.K.

    ReplyDelete
  6. మేము వెనకపడ్డాం మాకు అన్యాయం జరిగిపోతుంది అన్న ఫీలింగ్స్ ని తెలంగాణ ప్రజలలో బలంగా ఇంజెక్ట్ చెయ్యబడ్డాయి ఈ స్లోగంస్కి యెక్కడయినా చప్పట్లు వోట్లు కాయం.. నేను దోచుకోబడతున్నాను..అన్న ఫీల్ ఇప్పుడు తెలంగాణ అంతా చూస్తున్నాం ..ఒకటి మాత్రం నిజం ..కస్టపడకుండా సామాన్యునికి ఒక్క రోజు కూడా గడవదు .అది యే రాష్ట్రమయిన సరే..ఇక తమిళ్ అన్న యెప్పుడు తెలివయినవాడే అందు కె కదా మొగ్గలోనే తుంచేయాలని చెప్పాడు ..కానీ మన మేథావులు చాలా తెలివయిన వాళ్ళు కదా కోడి గుడ్డు కి ఈకలు పీకుతుంటే మరి ఇంకా యేమి చెప్పగలం

    ReplyDelete
  7. ముస్లిం ఫోరమ్ ఫర్ తెలంగాణా వాదన ఇలా ఉందిః

    * మజ్లిస్ పార్టీ ఒక్కటే తెలంగాణా ముస్లిములకు ప్రతినిధి కాదు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ముస్లిములకు భద్రత ఉండదని మజ్లిస్ పార్టీ చేసే వాదన నిజంకాదు.అలాగైతే తెలంగాణా లోని మిగతా జిల్లాల ముస్లిములు తెలంగాణా కావాలని ఉద్యమాలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు?సమైక్య రాష్ట్రంలో ముస్లిములకు వచ్చిన 4% రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణాలో పెరిగే అవకాశం ఉంటుంది.తెలంగాణా ఏర్పడితే ముస్లిములకు ఉద్యోగాలు,పదవులు జనాభా దామాషాలో పెరుగుతాయి.ఇక్కడ 224 ఏళ్లుగా ఉర్దూ అధికార భాషగా ఉంది.ప్రభుత్వ అధికారిక లావాదేవీలు ఉర్దూ భాషలోనే జరిగేవి.ఉర్దూ స్థానిక ప్రజాభాష కాబట్టి మళ్ళీ ఉర్దూకు మంచి ఆదరణ పూర్వ వైభవం వస్తుంది.గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జైళ్లలో మగ్గుతున్న వేలాదిమంది ముస్లిం యువకులు తిరిగి వచ్చి ఇక్కడే ఉద్యోగాలు,వ్యాపారాలు సంపాదించుకుంటారు.హైదరాబాద్‌ చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించిన వేలాది ఎకరాల వక్ఫ్‌ భూములు,ముస్లిం ఆస్తులు విడిపించి పేదముస్లిములకోసం వినియోగించవచ్చు.ఇరుకు సందుల్లో పాతబస్తీల్లో దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నముస్లింలను ఫుట్‌పాత్‌లపైనుండి సొంత గృహాల్లోకి తేవచ్చు.విద్యావంతులైన ముస్లిములు రౌడీషీటర్లు, ఐఎస్‌ఐ ఏజెంట్లు లాంటి నిందలు తొలగించుకొని బాధ్యతాయుతమైన తెలంగాణా సోదరులందరితో సమాన అవకాశాలు సాధిస్తారు.

    ReplyDelete