Friday, January 22, 2010

మన రాష్ట్రానికి సిగ్గు చేటు..

డెక్కన్ 20-20 కప్ క్రికెట్ మాచ్ ని తెలంగాణా వాదులు అడ్డుకున్నారన్న వార్త చదివి నవ్వాలో, ఏడవాలో తెలీటంలా. ఇప్పటికే రాష్ట్రంలో అల్లర్ల వల్ల విశాఖపట్నంలో జరగాల్సిన అంతర్జాతీయ వన్డే మాచ్ రాష్ట్రం బయటకి వెళ్లి పోయింది. ఇలా ఆటల్ని ఆడనీక, సినిమాలని ఆడనీక, రైళ్ళని కదలనీక, బస్సులని నడవనీక, విద్యార్ధులని చదవనీక, ప్రజలని ప్రశాంతంగా బతకనీక ..తెలంగాణా వేర్పాటువాదులు సాధించ దలుచుకున్నదేమిటి? మాట్లాడితే సీమ, ఆంధ్ర వారిని దోపిడీ దారులు అంటారు. ఏమి దోచేసారో అర్ధం కాదు. ఉదాహరణకి రాయలసీమలోని కర్నూలుకి చెందిన పుల్లా రెడ్డి చేసిన మిఠాయిలు హైదరాబాదు వారికి నచ్చబట్టే అక్కడి వారు కొన్నారు. ఆయన కూడా ఆ క్వాలిటీ కొనసాగిస్తూ వ్యాపారం విస్తరించుకొని కోటీశ్వరుడు అయ్యాడు. ఆయన ఎవరిని దోచేసి కోటీశ్వరుడు ఐనట్లు? ఇదే సూత్రం మిగతా వ్యాపారులకి, పరిశ్రమలకి, విద్యా సంస్థలకీ వర్తిస్తుంది. అది అర్ధం చేసుకోకుండా ఆంధ్రా విద్యా సంస్థలు నిషేధిస్తామని, తెలంగానేతరులని వ్యాపారాలు చేసుకోనివ్వమని, ఇంకా ఇలాంటి ప్రకటనలు చేయడం మూర్ఖత్వం. అసలు మనకి దాయాది వైరం ఉన్న పాకిస్తాన్ సైతం మన దేశంలో క్రికెట్ ఆడుతోంది. పైగా ఆ మాచ్ పాకిస్తాన్ గెలిచినా కూడా మనం చప్పట్లు కొట్టి అభినందిస్తున్నాం. అటువంటిది తోటి తెలుగు వారితో ఆడే మాచ్ ని అడ్డుకున్నారంటే నిజంగా సిగ్గు చేటు. ఈ పరిస్థుతులు కొనసాగితే, తెలంగాణా వస్తే, హైదరాబాదు వెళ్ళటానికి వీసా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వై.ఎస్. రాజ శేఖర రెడ్డి చెప్పిన మాట నిజం అయ్యే రోజు దూరంలో లేదు. ....

4 comments:

  1. ఎందుకూ? అంత చీదితే వూడిపోయే 'సిగ్గూ వుంటే ఎంత , పోతే ఎంత?

    శంకర్ ;)

    ReplyDelete
  2. Anta siggu champukoni Rashtram techchukunte enta? leka pote enta? Dunnapotu charmam kala vaariki enni cheppina ardham kaadu. Adi mana kharma..

    ReplyDelete
  3. ప్రజలని ఇబ్బంది పెడితే ప్రజలు వెళ్లి అమ్మతో మొరపెట్టుకుని తెలంగాణా తెస్తారని అయి ఉంటుంది. కాక పోతే ఈ బండుల వాళ్ళ ఏమి ఒరుగుతోంది. హైదరాబాద్ కున్న పేరుకాస్తా పోతోంది.
    రామకృష్ణ

    ReplyDelete
  4. ఈ కోపతాపాలు కేవలం ఉద్యమం జరేగిన్నని రోజులు ఉంటవి కావచ్చు కానీ ఎక్కువ రోజులు వుండవు ......ఇన్ని రోజులు పుల్ల రెడ్డి స్వీట్స్ తెలంగాణా వారు కూడా కొన్నారు? మంచి వస్తువును ఎవరు కొనవద్దు అని చెప్పిన ఎవరు వినరు...."విశాఖపట్నంలో జరగాల్సిన అంతర్జాతీయ వన్డే మాచ్ రాష్ట్రం బయటకి వెళ్లి పోయింది" ఈ మ్యాచ్ జరకపోవడానికి తెలంగాణా వారు కారణం కాదు అనుకుంట....

    ReplyDelete