పచ్చగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం భగ్గుమనటం మొదలై నేటికి రెండేళ్ళు! కేంద్రం లోని యూపీఏ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాగా 32 మంది ఎమ్పీలని అందించిన ఆంధ్ర రాష్ట్రానికి మేడం జన్మ దిన కానుకగా ఇచ్చిన మర్చి పోలేని కానుక ఇది....దొంగ దీక్షలకి మోస పోయి, తెలుగు వారిని విడ దీద్దామని ప్రకటించి భంగ పడిన రోజు ఇది....నాడు రగిలించిన రావణ కాష్టం నేటికి కూడా ఆరకుండా తెలుగు జాతి పరువు ప్రతిష్టలను నడి బజారున పడేస్తుండటం మిక్కిలి బాధాకరం. తాజాగా శాసన సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా మజ్లిస్ నాయకుడు ఒవైసీ ప్రసంగం ఇక్కడ గమనార్హం. తమది సమైక్య వాదమే అని కుండ బద్దలు కొట్టిన మజ్లిస్ నేత, గత రెండేళ్లుగా వచ్చిన 30 వేల కోట్ల రూపాయల నష్టానికి బాధ్యులెవరని నిలదీశారు. (30 వేలన్నది మజ్లిస్ లెక్క. వాస్తవానికి మనం నష్ట పోయింది ఇంకా ఎక్కువ.) అలాగే హైదరాబాద్ బ్రాండ్ నేం ఏమయి పోయిందని ఆవేదన వెళ్లగక్కారు. నిజమే.. రెండేళ్ళ క్రితం వరకు మన హైదరాబాదు నగరం అభివృద్ది విషయంలో దేశంలో ఐదవ స్థానం.. మరి ఇప్పుడు? చెప్పుకుంటే సిగ్గు చేటు. దీనికి బాధ్యులెవరు? ఇంకెవరు? పర్యవసానాలు ఆలోచించకుండా తెలుగు జాతిని ముక్కలు చేసే ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీదే ఈ బాధ్యత. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న చందంగా తొందర పాటు ప్రకటన చేసేసి..ఆనక వెనక్కి తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని ఉద్యమాల ఊబిలోకి దించి..తెలుగు ప్రజలందరికీ కష్ట నష్టాలని కలుగ జేసిన కాంగ్రెస్ పార్టీని తెలుగు జాతి ఎన్నటికీ క్షమించదు.
Friday, December 9, 2011
Friday, December 2, 2011
దైవాన్ని పూజించే పధ్ధతి ఇదేనా?
రామ్ చరణ్, ఉపాసన ల నిశ్చితార్ధం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సంతోషం. కానీ ఈ నిశ్చితార్ధ వేడుకల్లో జరిపించిన పూజ కార్యక్రమం సక్రమంగా లేదు. కామినేని ఉపాసన తాను కుర్చీలో కూర్చొని, దేవతని తన కాళ్ళ దగ్గర వుంచి పూలు విసురుతూ చేసిన పూజ దైవాపరాధమే అవుతుంది. కనీసం పూజ కార్యక్రమం జరిపించిన బ్రాహ్మణోత్తములకైనా ఇది తప్పుగా కనపడలేదా?
Tuesday, November 29, 2011
చప్రాసీలు మద్దతిచ్చినా రాదేమి తెలంగాణ?
రోజు రోజుకీ తెలబాన్ నాయకుని నోటి దురుసు హద్దులు మీరుతోంది. తాజాగా ఆయన దేశ ప్రధానిని సైతం చప్రాసీ కున్న జ్ఞానం కూడా లేని వాడంటూ దూషించటం సహించరానిది. వినే వాళ్ళుంటే ఎన్ని పిట్ట కధలైనా చెప్తాడీ పిట్టల దొర! పార్లమెంటులో చప్రాసీలందరూ జై తెలంగాణా అంటున్నారట! ప్రధాన మంత్రికే ఆ జ్ఞానం లేదట! శభాష్.. పార్లమెంట్ ఎందుకు...ఐక్య రాజ్య సమితిలో చప్రాసీలు ఎవరైనా కూడా జై తెలంగాణా అంటున్నారేమో ఎవరైనా విచారించి పిట్టల దొరకి చెప్తే మంచిది కదా....
Thursday, November 17, 2011
గుంటూరు రాష్ట్ర సాధనకై త్వరలో GRS (గుంటూరు రాష్ట్ర సమితి) పార్టీ ఆవిర్భావం!
బ్లాగు బాబ్జీకి తగరపు వలస రాష్ట్రం కావాలట!
మరి ఇంక మా గుంటూరుకేం తక్కువ! తక్షణం గుంటూరు జిల్లాని ప్రత్యెక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండుతో G.R.S. (గుంటూరు రాష్ట్ర సమితి) పార్టీ ఏర్పాటు చేయటానికి నిశ్చయించాం. ఇన్నాళ్ళూ, ఇన్నేళ్ళూ అభివృద్ధి అంతా పక్కనున్న విజయవాడకి మాత్రం చేస్తూ మా గుంటూరుని చిన్న చూపు చూడటంతో మా మనసులన్నీ గాయ పడ్డాయి. ఇంక దేబిరించితే ఏ మాత్రం ప్రయోజనం లేదని ఇక్కడి ప్రజలంతా ప్రత్యెక రాష్ట్రం ఇస్తే గానీ తమ సమస్యలు తీరవని గట్టిగా నిర్ణయించేసుకున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే నాయకుల కర్తవ్యం కాబట్టి గుంటూరు రాష్ట్రం సాధించే దిశగా అడుగులు వేయాలని, పార్టీలకతీతంగా అందరు నాయకులు కలిసి ఐక్య కార్యాచరణ కమిటీని (JAC) ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో వున్నారు. నాగార్జున విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఆనంద రాం ఈ కమిటీకి సారధ్యం వహించే అవకాశం వుంది.
మా డిమాండ్లు:
1 . గుంటూరు జిల్లాని సత్వరం ప్రత్యెక రాష్ట్రంగా ప్రకటించాలి.
2 . బ్రహ్మానంద రెడ్డి స్టేడియం లో ఎయిర్ పోర్టు ఏర్పాటు చెయ్యాలి.
3 . శంకర్ విలాస్ సెంటర్ లో సెక్రటేరియట్, గుజ్జన గుళ్ళలో గవర్నర్ బంగ్లా కట్టించాలి.
ఇంక పార్టీకి సరైన నాయకుడు దొరకటమే ఆలస్యం...ఉద్యమం మొదలై పోతుంది.. రాష్ట్రం అగ్ని గుండమై పోతుంది.. ఆ ఉద్యమానికి విజయవాడ నుంచి లగడపాటి, జగడపాటి లాంటి వారు ఎవరైనా అడ్డంకులు కల్పిస్తే పీకలు తెగ్గోస్తాం.. (నాలుకలు తెగ్గోస్తే రాష్ట్రం రాదని అనుభవ పూర్వకంగా తెలిసింది...అందుకని..) అయినా ఇక ఏ వాదనలు అనవసరం.. మా గుంటూరు మాక్కావాలే ..అంతే.. ప్రత్యెక గుంటూరు రాష్ట్రం తప్ప మరే విధమైన పదాన్నీ మా దగ్గర ఉచ్చరించడానికి వీల్లేదు..
Wednesday, November 9, 2011
ఆంధ్ర ప్రదేశ్ పై కాంగ్రెస్ భస్మాసుర హస్తం!
సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా సకల జనులు సమ్మె చేసారు..కొండా లక్ష్మణ్ బాపూజీ దేశ రాజధానిలో, కోమటి రెడ్డి నల్లగొండ లో దీక్షలు చేసి విరమించేసారు. ఇన్ని జరిగినా కాంగ్రెస్ కి చీమ కుట్టినట్లయినా లేదు. అసలేమీ జరగనట్లే ఆజాద్ జాదూ అంటూ కాలక్షేపం చేస్తోంది. విచిత్రంగా తెలబాన్ శ్రేణులు కూడా ఉద్యమం మానేసి కాంగ్రెస్ నిర్ణయం కోసం చాతక పక్షుల్లా ఎదురు చూస్తున్నాయి. అసలు తెలంగాణా ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అంత ముఖ్యమా అన్నది ఎవరూ ఆలోచించట్లేదు. కేంద్రం లో పూర్తి మెజారిటీ రాక చిన్న చితకా పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చేస్తున్న కాంగ్రేసు పార్టీ ఒక రాష్ట్ర విభజన వంటి ముఖ్యమైన విషయంలో భాగస్వామ్య పక్షాలని సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోజాలదు. ఐతే డిసెంబరు 9 ప్రకటన ఎందుకు ఇచ్చినట్లు? రాజశేఖర రెడ్డి చని పోయిన తరువాత సానుభూతి అంశంతో జగన్ పైకి వస్తాడన్న అనుమానంతో ఇతర పార్టీలని కనీసం సంప్రదించకుండా కాంగ్రెస్ తెలంగాణా తేనె తుట్టెని కదిపింది. ఉవ్వెత్తున ఎగసిన నిరసనలకి వెరచి మళ్ళీ డిసెంబరు 23 ప్రకటనతో వెనక్కి తగ్గింది. కానీ జరిగిందేమిటి? రెండేళ్ళ పాటు రాష్ట్రం తగల బడింది. అభివృద్ది విషయంలో దశాబ్దాల వెనక్కి వెళ్లాం. ఇంక ఇప్పుడేమో జగన్ తన మీద సీబీఐ దాడులతోనూ, కేసులతోనూ ఉక్కిరి బిక్కిరి అవుతుండటంతో పాటు మరో రెండున్నరేళ్ళ పాటు ఎన్నికలు రావని చంద్ర బాబు భరోసా ఇవ్వటంతో రాష్ట్రంలో ఏమి జరిగినా కాంగ్రెస్ పట్టించుకోవటం మానేసింది. 33 మంది ఎంపీ లని కేంద్రానికి అందించిన రాష్ట్రం పట్ల ఇంత నిర్లక్ష్య పూరితంగా ప్రవర్తిస్తున్నా ఇదేమని అడిగే దమ్ము మన నాయకులెవరికీ లేదు. తృణమూల్ కాంగ్రెస్ సంగతే చూస్తె, కేవలం 19 మంది ఎంపీ లని సంకీర్ణానికి అందించినా కూడా రైల్వే శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖని పట్టు బట్టి సాధించుకోవటమే కాక మమతా బెనర్జీ బెంగాల్ కి వెళ్ళినా కూడా ఆ మంత్రిత్వ శాఖ తమ చేజారకుండా చూసుకున్నారు. ఎన్నికలకి ముందు ప్రతి పక్షంలో వున్నప్పుడు కూడా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ నుండి గోర్ఖా లాండ్ విభజనకి అనుమతించేది లేదని తెగేసి చెప్పేశారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల మన నాయకులకి ఆ పాటి నిబద్ధత కొరవడటమే మనకి శాపం. లక్షలాది రూపాయలు వెచ్చించి, రాష్ట్రం నలు మూలలా పర్యటించి, రాష్ట్రంలో పరిస్థితులని శాస్త్రీయంగా విశ్లేషించి ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఏ చెత్త బుట్టలో దాఖలు అయ్యిందో ఏ నాయకుడూ పట్టించుకోవట్లేదు. పైగా కోర్ కమిటీ అని, జాదూ చేస్తారనీ మసి పూసి మారేడు కాయ చేస్తూ ప్రజల్ని వెర్రి వాళ్ళని చేస్తున్నారు. రాష్ట్రం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగడాల్ని ఇంక ఎంత మాత్రం సహించరాదు. సత్వరం శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన అత్యుత్తమ ఆరో పరిష్కారం అమలుకై మన నాయకులు వత్తిడి తేవాలి. లేని పక్షంలో అకారాది క్రమంలో ముందున్న మన రాష్ట్రం అభివృద్ది విషయంలో చిట్ట చివరికి వెళ్లి పోవటం ఖాయం.
Friday, October 28, 2011
దళిత వర్గాలకు నరకాసురుడి అండ! - ఇదెక్కడి చోద్యం??
నేటి ఈనాడు దిన పత్రికలో వచ్చిన ఈ వార్తని చూస్తె నవ్వాలో ఏడవాలో అర్ధం కావట్లేదు.
కులాలు మతాలూ అన్నవి మానవులు ఈ కలి కాలంలో ఏర్పాటు చేసుకున్నవి. అయితే పురాణ కాలంలో దళితులెవరున్నారో? వారికి నరకాసురుడు ఏ విధంగా అండగా నిలబడ్డాడో? ఏ అగ్ర కులాల వారికి వ్యతిరేకంగా నరకాసురుడు పని చేసాడో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం కావట్లేదు. ఈ మధ్యనే భగవంతునికి ప్రాంతీయ విద్వేషాల రంగు అంట కట్టి సమ్మె పేరుతొ పూజాదికాలు మాని ఆటలాడిన పైత్యాన్ని చూసాం.
http://andhraaakasaramanna.blogspot.com/2011/09/blog-post_22.html
ఇక ఇప్పుడు కులాల కుమ్ములాటల్లోకి కూడా భగవంతుడిని తీసుకు రావటం శోచనీయం. అగ్ర వర్ణాలకి వ్యతిరేకంగా ఏదో ఒక పని చేసి వార్తల్లోకి ఎక్కాలన్న దుగ్ధ తప్ప వేరే ప్రయోజనమేమీ ఈ చర్యలో కనపడటం లేదు. ప్రాంతీయ విద్వేషం తలకెక్కి, ఆలయాన్ని మూసేసి ఆటలాడుతూ చేసిన సకల జనుల సమ్మె షెడ్డుకి వెళ్లి పోవటం కళ్ళారా చూసాం. ఇప్పుడు రాక్షస సంహారాన్ని వర్ణ విద్వేషాలకు ఆపాదించిన ఈ విషయానికి భగవంతుడెలా స్పందిస్తాడో చూద్దాం.
ఇక్కడ నాకో సందేహం...నరకాసురుని వధించిన శ్రీ కృష్ణుడు యాదవ సంజాతుడని అందరికీ తెలుసు. అంటే వారి లెక్క ప్రకారం ద్వాపర యుగంలో యాదవులు అగ్ర వర్ణాలకి చెందిన వారన్న మాట! భేష్! వారికి డాక్టరేట్ ఇచ్చి తీర వలసిందే...
http://andhraaakasaramanna.blogspot.com/2011/09/blog-post_22.html
ఇక ఇప్పుడు కులాల కుమ్ములాటల్లోకి కూడా భగవంతుడిని తీసుకు రావటం శోచనీయం. అగ్ర వర్ణాలకి వ్యతిరేకంగా ఏదో ఒక పని చేసి వార్తల్లోకి ఎక్కాలన్న దుగ్ధ తప్ప వేరే ప్రయోజనమేమీ ఈ చర్యలో కనపడటం లేదు. ప్రాంతీయ విద్వేషం తలకెక్కి, ఆలయాన్ని మూసేసి ఆటలాడుతూ చేసిన సకల జనుల సమ్మె షెడ్డుకి వెళ్లి పోవటం కళ్ళారా చూసాం. ఇప్పుడు రాక్షస సంహారాన్ని వర్ణ విద్వేషాలకు ఆపాదించిన ఈ విషయానికి భగవంతుడెలా స్పందిస్తాడో చూద్దాం.
ఇక్కడ నాకో సందేహం...నరకాసురుని వధించిన శ్రీ కృష్ణుడు యాదవ సంజాతుడని అందరికీ తెలుసు. అంటే వారి లెక్క ప్రకారం ద్వాపర యుగంలో యాదవులు అగ్ర వర్ణాలకి చెందిన వారన్న మాట! భేష్! వారికి డాక్టరేట్ ఇచ్చి తీర వలసిందే...
Tuesday, October 25, 2011
సమైక్యాంధ్రకి నిజమైన దీపావళి!
కేంద్రం తెలుగు జాతి మొత్తానికీ అసలైన దీపావళి జరుపుకొనే అవకాశాన్నిచ్చింది. 42 రోజుల సమ్మె ప్రహసనం ముగిసి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. రైల్ రోకో ని సమర్ధంగా ఎదుర్కోవటం గావచ్చు. లేదా శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు లో 8 వ అధ్యాయం అమలు జరిగి ఉండవచ్చు. కారణమేమైనా గానీ తెలబాన్ నరకాసురుడు తోక ముడిచాడు. రాష్ట్రం ముక్కలు కాదన్న భరోసా ఏర్పడింది. అయితే సమ్మె ని ఎదుర్కొన్నంత మాత్రాన తమ బాధ్యత పూర్తి అయినట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించరాదు. చింత చచ్చినా పులుపు చావనట్లు ఇంకా తెలబాన్ వీరులు నవంబరు ఒకటో తేదీని విద్రోహ దినంగా పాటించాలని రంకెలు వేస్తుండటం సహించరానిది. ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం అన్నది అధికారిక కార్యక్రమం. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర అస్తిత్వం ఉన్నంత వరకూ రాష్ట్రం లోని 23 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరిగి తీరాల్సిందే. ఇందుకు అడ్డంకులు కల్పించిన వారిని రాజ ద్రోహం కేసు కింద అరెష్టు చేయాలి. అలాగే ఆ కార్యక్రమంలో పాల్గొనని మంత్రుల్ని మంత్రి వర్గం నుండి తొలగించాలి. ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకి ఎన్నికై రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనకుండా ఎగ్గొట్టే శాసన సభ్యులని సభ నుండి వెలి వేయాలి. ఇటువంటి కఠిన చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తే వేర్పాటు వాద విష సర్పం మళ్ళీ బుసలు కొట్టే ప్రమాదం ఎంతైనా వుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు!
Tuesday, October 18, 2011
కనీ వినీ ఎరుగని పైత్యం..
తెలబాన్ సమ్మె కోడికి ఈకలన్నీ ఒక్కొక్కటిగా రాలుతున్నాయి. ఏ కారణం చెప్పి ఆర్భాటంగా సమ్మె మొదలు పెట్టారో - ఇప్పుడు ఎందుకు సమ్మె విరమించేసుకుంటున్నారో ఆ తెలంగాణా తల్లికే తెలియాలి. సమ్మె చేసిన ఉద్యోగులందరూ ఇప్పుడు జీతాలు, అడ్వాన్సులు, బోనస్ లు తీసుకొని సమ్మె కాలంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయులు సరే సరి..వారికి వచ్చిన నష్టమేమీ లేదు. మరి వాజమ్మలు అయింది ఎవరు? సామాన్య ప్రజలు. వారికి గత నెల రోజులుగా ఏర్పడిన కష్ట నష్టాలకి బాధ్యత ఎవరిది? పైగా, కనీ వినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ సమ్మె విషయంలో కేంద్రం అసలు స్పందించలేదని తెలబాన్ నాయకులు ఆక్రోశించటం మరీ విడ్డూరం! ఎవరి జబ్బ వాళ్ళు గిల్లెసుకొని శోకాలు పెడితే కేంద్రం మాత్రం ఏం చేస్తుంది?? ఏడిస్తే ఏడవనీ అని వదిలేస్తుంది..ఇప్పుడు జరిగింది అదే!!
Saturday, October 15, 2011
శభాష్ డీజీపీ! - 2
తమ హెచ్చరికలు కేవలం తాటాకు చప్పుళ్ళు కావని నిరూపిస్తూ నేడు పట్టాలెక్కిన ప్రతివాడినీ అరెష్టు చేసి డీజీపీ చేవ చూపించారు. తాము మాత్రం చట్టాలని ఉల్లంఘిస్తూ, రాజ్యాంగానికి అతీతులమన్నట్లు ప్రవర్తిస్తూ పోలీసులకి సుద్దులు చెప్పే తెలబాన్ నాయకులకి పోలీసు దెబ్బ రుచి చూపించిన పోలీసు బాసు అభినందనీయుడు. ప్రజల ఇబ్బందుల పట్ల కొంతైనా సానుభూతి లేకుండా నెల రోజుల పైగా సకల జనుల సమ్మె పేరుతొ తెలబాన్ గణం సాగిస్తున్న అకృత్యాలకి అంతే లేదు. ఇంక రైల్ రోకో పేరుతొ కేవలం తెలంగాణా ప్రాంతం వారినే కాక అన్ని ప్రాంతాల వారిని ఇబ్బందుల పాలు చేయాలనుకున్న కుట్ర భగ్నం కావటంతో దిక్కు తోచని తెలబాన్లు అరెష్టులు అక్రమమని రోదించటం హాస్యాస్పదం. ఇప్పటికే సమ్మె విషయంలో ఉద్యోగులని బలి పశువులని చేస్తూ రాజకీయులు తమ పబ్బం గడుపుకుంటున్నారని వారి నాయకుడు స్వామి గౌడ్ బహిరంగంగా ఆవేదన వెళ్ళ గక్కాడు. మిగిలిన రంగాల్లోని వారుకూడా కళ్ళు తెరిచే రోజు ఎంతో దూరంలో లేదు. ఇంత జరుగుతున్నా కేంద్రం స్పందించడం లేదని తెలబాన్ జాక్ నాయకుడు కలుగు లోంచి ఆక్రోశిస్తున్నాడు. కేంద్రం స్పందించక పోవటమేమిటి? కేంద్ర స్పందనకి నిదర్శనమే ఈ అరెస్టులు... ఈ మాత్రం కూడా తెలబాన్ పీత బుర్రలకి అర్ధం కాక పోవటం శోచనీయమే!
Thursday, October 13, 2011
శభాష్ డీజీపీ!
తెలబాన్లు తలబెట్టిన రైల్ రోకో కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించేది లేదని డీజీపీ దినేష్ రెడ్డి నేడు హెచ్చరించారు. అడుసు తొక్కనేల, కాలు కడగనేల అన్న రీతిగా కేంద్రం డిసెంబర్ 9 మరియు 23 ప్రకటనలు చేసేసి ఇప్పుడు ఎటూ నిర్ణయించుకోలేక సతమతమవుతున్న పరిస్థితిని లోకువగా తీసుకొని, తెలబాన్లు గత నెల రోజులుగా పెచ్చరిల్లి పోయారు. రవాణా సౌకర్యాలు స్తంభింప జేసినా, రైతులకి, ప్రజలకి విద్యుత్ కోతకి గురి జేసినా, ఉద్యోగస్తులకి జీతాలు రాక పోయినా, విద్యా సంస్థలు తెరుచుకోక విద్యార్ధులు, తల్లి తండ్రులు ఆందోళనకి గురి అయినా తెలబాన్ నాయకులకి చీమ కుట్టినట్లయినా లేదు. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్లు మళ్ళీ రైల్ రోకోకు తెగ బడ్డారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. గతంలో రెండు సార్లు పాకిస్తాన్ దురాక్రమణ ప్రయత్నాలని, కార్గిల్ దొంగ దాడుల్నీ తిప్పి కొట్ట గలిగిన భారత ప్రభుత్వానికి, తాటాకు చప్పుళ్ళ వంటి తెలబాన్ ఉద్యమాన్ని అణచి వేయటం పెద్ద పని కాదు. అయితే, అవినీతి ఆరోపణలని ఎదుర్కోవడంలోను, ఇంకా పైన చెప్పినట్లు నిర్ణయ రాహిత్య స్థితిలో డోలాయమానంగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంకట పరిస్థితిని లోకువ గట్టి పౌరుల ప్రశాంత జీవనానికి నెల రోజులుగా పాతరేస్తున్న తెలబాన్ల వైఖరి గర్హనీయం. ప్రజల్నీ, ప్రభుత్వాల్నీ ఇబ్బందులు పెట్టేస్తే ప్రత్యెక రాష్ట్రం వచ్చేస్తుందనుకోవటం పిచ్చి భ్రమ! ఎవరినీ ఏ ఇబ్బందులకీ గురి చేయకుండా కేవలం నిరాహార దీక్షతో అన్నా హజారే కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించలేదా? ఆయనకి దేశ వ్యాప్తంగా సకల జనులు మద్దతు పలకలేదా? దొంగ దీక్షతో కేంద్రాన్ని ఏమార్చి, డిసెంబరు 9 ప్రకటన రాబట్టుకున్న తెలబాన్ నాయకుడు, తన కోరిక నేర వేరక పొతే మళ్ళీ దీక్షకి కూర్చొవచ్చుగా! ఆ పని మాత్రం చేయడు. ఎందుకంటే. మీడియా అప్రమత్తంగా ఉన్న ప్రస్తుత స్థితిలో మళ్ళీ దొంగ దీక్ష సాధ్యం కానే కాదు. ఏమైనా కనీసం నెల రోజుల తర్వాత అయినా డీజీపీ రైల్ రోకో కార్యక్రమం మీద కొరడా ఝుళిపించటం హర్షణీయం. అడిగే వాడు, అదిలించే వాడు లేడన్నట్లుగా గత నెల రోజులుగా చిత్ర విచిత్ర విన్యాసాలతో పౌరులని ముప్పు తిప్పలు పెడుతున్న తెలబాన్ శ్రేణులకి ముకు తాడు వేసే ప్రయత్నం జరగటం సంతోషం. డీజీపీ గారు కూడా తమ హెచ్చరిక ని పకడ్బందీగా అమలుచేసి తద్వారా కేవలం తెలంగాణా ప్రజలే కాదు....రాష్ట్రంలో మిగతా ప్రాంతాల ప్రజలు, దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా రైల్ రోకో వల్ల ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి.
Monday, October 10, 2011
తెలంగాణా వాళ్ళంతా తెలబాన్లు కాదు!
తెలంగాణా కోసం రాజీనామా చేయాలంటూ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి చేరి దేబిరిస్తున్న తెలబాన్ గుంపుని చూడండి..రాను రాను వీరి ధోరణి వెర్రి కుదిరింది రోకలి తలకి చుట్టండి అన్నట్లు తయారవుతోంది. కేవలం తెలంగాణా వాసి అవటమే జైపాల్ రెడ్డి చేసిన పాపం. ఉద్యమం ఉధృతంగా వున్నా కూడా ఇన్నాళ్ళూ తటస్థంగా వున్నారంటేనే జైపాల్ అంతరంగం అర్ధమవుతోంది. తెలంగాణా వాసి అయినంత మాత్రాన ప్రత్యెక రాష్ట్ర వాదాన్ని సమర్ధించాలన్న నిబంధన తు.చ. తప్పక పాటించే తెలబాన్లు అందరినీ అదే గాటన కట్టి ఒత్తిడి చేయబూనటం మూర్ఖత్వం. పైగా మంత్రి చుట్టూ చేరి గలాటా చేస్తున్న తెలబాన్ గుంపు లో ఒక్కడన్నా తన పదవి వదులుకున్నాడా? కోదండ రాం ఈ రోజుకి కూడా పైసా పని చేయకుండా నెలకి లక్ష జీతం తీసుకుంటున్నాడు. స్వామి గౌడ్ కూడా అంతే! అసలు వీరికి మంత్రిని రాజీనామా చేయమని అడిగే నైతిక హక్కు అనేది ఉందా? ఇప్పటికే సకల జనుల సమ్మె పేరుతొ నాలుగు వారాలుగా సాగుతున్న నాటకంతో దినవారీ కూలి పనులు చేసుకొనే సగటు పౌరుడు ఇబ్బందుల పాలవుతున్నాడు. బస్సులు తిరగక పండగ సమయంలో సాధారణ ప్రయాణీకులు నరకం చూసారు కరెంటు కోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అంతెందుకు? సమ్మె చేసిన ఉద్యోగులు సైతం పండగ సమయానికి జీతాలు, బోనస్ లు అందక వుసూరుమన్నారు. తాజాగా విద్యా సంస్థలు తెరవకూడదంటూ ఆగడం చేస్తున్న తెలబాన్ గుంపుల ధోరణి శృతి మించుతోంది. విద్యార్ధుల విద్యా సంవత్సరం నష్ట పొతే గానీ తెలబాన్ నాయకుల కడుపు నిండదా? ప్రభుత్వం తన జడత్వాన్ని వదిలి పెట్టాలి. పౌరులకి ప్రశాంతంగా జీవించే హక్కుకి భంగం కలిగిస్తున్న సమ్మె నాటకానికి వెంటనే తెర దించాలి.
Wednesday, September 28, 2011
పిట్ట కదల పిట్టల దొర!
తెలబాన్ దొర రెండు వారాల్లో తెలంగాణా అని ప్రకటించి రెండు నెలలు గడిచి పోయింది. మరి ఈ రెండు నెలల్లో తెలంగాణా ఎందుకు రాలేదో వివరించాల్సింది పోయి, ఈ రోజు మరో పిట్ట కధ వినిపించారు. అనంతపూర్, కర్నూల్ ల తో కలిపిన తెలంగాణా వస్తుందట! అదీ కేంద్రం అసదుద్దీన్ తో రాయబారం చేసిందట! ఎవరిని ఏమార్చటానికి ఈ పిట్ట కధలు చెప్తాడో తెలీదు. తమది సమైక్య వాదమే అని కుండ బద్దలు కొట్టిన మజ్లిస్ నాయకునితో రాష్ట్ర విభజన కోసం కేంద్రం ఎలా రాయబారం పంపుతుందో బుర్రలో గుజ్జు ఉన్న వారెవరికీ అర్ధం కాదు. తెలబాన్ నాయకునితో తాను రాష్ట్ర విభజన విషయం చర్చించనే లేదని అసదుద్దీన్ ఆ తరువాత ఖండించటం కొస మెరుపు. కల్ల బొల్లి కబుర్లు చెప్పినట్లు ఋజువు అయ్యాక కూడా సిగ్గుతో తల దించుకోకుండా... తల తెగి పడ్డా సరే, తల లేని (హైదరాబాద్) తెలంగాణా ఒప్పుకోం అంటూ బీరాలు పలకటం కామెడీ గాక మరేమిటి?? ఇటువంటి పొలిటికల్ బఫూన్ ల సారధ్యంలో అలజడి చేస్తున్న అమాయక తెలంగాణా ప్రాంత ప్రజలని చూసి జాలి పడటం తప్ప మరేమీ చేయలేం.
Tuesday, September 27, 2011
లగడపాటి హైదరాబాద్ రాకూడదా?
ద్వాపర యుగంలో శిశుపాలునికైనా వంద తప్పుల వరకు సహించి శ్రీకృష్ణుడు దండన విధించాడు. కానీ ఈ కలి యుగంలో తెలబాన్ల దురంతాలకు లెక్క అన్నదే లేక పోతోంది. సాక్షాత్తు దేశ రాజధానిలో విధుల్లో ఉన్న ఉద్యోగిని ఒళ్ళు మదంతో చితక బాదిన తెలబాన్ మేనల్లుడి పై ఈ రోజు వరకు చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అలాగే మన రాష్ట్ర రాజధానిలో విధుల్లో ఉన్న ఆంద్ర ప్రాంత రవాణా శాఖ అధికారి పై దాడి చేసిన తెలబాన్ల పై చర్యలు తీసుకొనే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం దాడికి గురైన ఆ అధికారిని పరామర్శించటానికి కూడా వెళ్ళకూడదా? పరామర్శ కి వచ్చిన ఎంపీ లగడపాటి రాజ గోపాల్ ని ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు. అందులో తప్పు లేదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత వారిదే కదా! మరి అదే ముందు జాగ్రత్త, కార్యాచరణ-- తెలబాన్లు దాడులు చేస్తున్నప్పుడు, ఆస్తులు ద్వంసం చేస్తున్నప్పుడు ఎందుకు వుండదు?? ముందుగా చెప్పి మరీ ధ్వంస రచన చేస్తున్న తెలబాన్లని కట్టడి చేయడంలో ఈ జాగ్రత్త ఎందుకు పాటించరు??? సరే, పోలీసుల విషయం వదిలేస్తే, లగడపాటి హైదరాబాద్ రావటమే పాపమన్నట్లుగా తెలబాన్ మూకలంతా రవాణా శాఖ కార్యాలయం దగ్గర చేరి రచ్చ చేయటం అత్యంత మూర్ఖత్వం. హైదరాబాద్ తమ స్వంత ఆస్తి అయినట్లుగా ఎవరు హైదరాబాద్ రావాలో, ఎవరు రాకూడదో నిర్దేశించ బూనటం ముదిరిన పైత్యానికి ప్రతీక. తెలంగాణా విషయంలో సరైన లెక్క రాసిన శ్రీకృష్ణుని నివేదికకి ఆతీ గతీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి శ్రీకృష్ణుడు ఇచ్చిన అత్యుత్తమ పరిష్కారం అమలు దిశగా చర్యలు చేపట్టాలి.
Sunday, September 25, 2011
Saturday, September 24, 2011
తెలబాన్ తొండ ముదురుతోంది!
ఒకటా రెండా.. పది రోజులుగా తెలంగాణా వాసులకి ఊపిరి సలపట్లేదు. సకల జనుల సమ్మె పేరుతొ తెలబాన్ నాయక గణం ఆడిస్తున్న నాటకంలో సామాన్య పౌరుడు సమిధ అవుతున్నాడు. అవును. నిజం... కేవలం సామాన్య పౌరుడే ఇక్కట్ల పాలవుతున్నాడు తప్ప నాయక గణానికి వచ్చిన చిక్కేమీ లేదు. రెండు రోజులు ఆటో నడపక పొతే కడుపు మండేది ఎవరికి? నెలాఖరులో జీతాలు అందక పొతే చిరుద్యోగుల పరిస్థితి ఏమిటి? సమ్మె వల్ల జరిగిన నష్టం పూడ్చటానికి ప్రభుత్వం చార్జీలు పెంచితే బలయ్యేది ఎవరు? ప్రత్యెక రాష్ట్రం వస్తే సగటు బడుగు జీవికి ఒరిగేదేమిటి? ఏమీ లేదు...కానీ నాయక గణం, వారి బంధు వర్గాలకి మాత్రం పదవుల పండగే! కేవలం నాయకుల పదవుల పందేరం కోసం అమాయక తెలంగాణా ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. హోర్డింగులెక్కుతున్నారు. ఎంత కాలం సాగాలి ఈ నాటకం? పిల్లిని కూడా తలుపులు మూసి కొడితే తిరగ బడుతుంది. తెలబాన్లు పన్నిన చక్ర బంధంలో ఇరుక్కుని సతమతమవుతున్న అమాయక తెలంగాణా పౌరుడు కూడా సత్యం గ్రహించి తెలబాన్ సైన్యాన్ని చితక బాదే రోజు దగ్గరలోనే వుంది. ఇప్పటి వరకు ఆడిన నాటకం చాలక ఇంకా గుజ్జర్ల తరహా ఆందోళన అంటూ కొత్త అంకాలకి తెర లేపే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికీ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ కూచుంటే అరాచకత్వం పెచ్చరిల్లి సగటు పౌరుని జీవనం దుర్భరం అవుతుంది. తెలబాన్ తొండ ముదిరి టెర్రరిష్టు ఊసర వెల్లి అవక ముందే ప్రభుత్వం మేలుకొని ఉద్యమం పై ఉక్కు పాదం బిగించాలి.
Thursday, September 22, 2011
(తెలబాన్) పైత్యానికి పరాకాష్ట!
పై ఫోటో చూడండి. ఆలయాన్ని వదిలేసి ఆడుతున్న అర్చకులని చూస్తె ఎవరికైనా ఏమనిపిస్తుంది? వెర్రి కుదిరింది రోకలి తలకి చుట్టమనే కదా! దేవుడికి కూడా ప్రాంతీయ భేదాలు అంట గడుతూ ఆర్జిత సేవలు నిలిపి వేశారంటే వేర్పాటు వాద పైత్యం ఎంత ప్రకోపించిందో అర్ధం చేసుకోవచ్చు. నర నరానా వేర్పాటు వాద విద్వేషాన్ని నింపుకున్న తెలబాన్లు సమీప భవిష్యత్తులో, సీమలో ఉన్నాడని తిరుపతి వెంకన్నను, కోస్తాలో వుందని బెజవాడ దుర్గమ్మను కూడా బహిష్కరిస్తారేమో? పాలకుల పట్ల ధిక్కారం చూపవచ్చు. తప్పు లేదు. కానీ దేవుని పట్ల ధిక్కారమా? సహించరాదు. తెలంగాణా ప్రాంతంలో ఉన్న అన్య మతస్తులెవరైనా ఇలా చేసారా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం వారికి లోపించటం శోచనీయం. ఇటువంటి విపరీత ధోరణులని కట్టడి చేయటంలో చేతకాని ప్రభుత్వమెలాగూ చేతులెత్తేసింది. ఇంక ఆ దేవుడే రక్షించాలి మన తెలుగు జాతిని, తెలుగు జాతి పరువు ప్రతిష్టల్నీ!!
Wednesday, September 21, 2011
తెలబాన్ల వ్యూహాత్మక తప్పిదం!
తెలబాన్ నాయకుడు మళ్ళీ ఆమరణ దీక్ష చేస్తాననగానే భూన బొంతారాలు దద్దరిల్లి పోతాయన్నంత హడావిడి చేసి ఆయన చేత దీక్ష పట్టే ఆలోచన విరమింప చేసి తెలబాన్ శ్రేణులు వ్యూహాత్మక తప్పిదమే చేసాయి. మచ్చ లేని చంద్రుని లాంటి చంద్ర శేఖరుడు గతంలో దీక్ష చేసినప్పుడు సీమాన్ధ్రులు ఎన్నెన్ని అభాండాలు, ఆరోపణలు చేశారు! దొంగ దీక్ష అన్నారు..టీపీఎస్ తో చేశాడన్నారు...ఉద్యమానికి అంత సీన్ లేదన్నారు...రోశయ్య ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చిందన్నారు..ఇలా ఒకటా రెండా...నోరూ వాయి లేక నీరసించిన నాయకుడిపై నిలువెల్లా ఆరోపణలు చేసి రాష్ట్రం రాకుండా అడ్డుకున్నారు. అటువంటప్పుడు వచ్చిన అవకాశం వినియోగించుకొని దీక్ష చేసి అందరి నోళ్ళు మూయిన్చాల్సింది పోయి ఇతర పక్షాల నాయకులు మిన్ను విరిగి మీద పడి పోతుందని హడావిడి చెయ్యగానే తూచ్ అని మానేయటం తప్పిదమే. మీడియా అప్రమత్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిలో దొంగ దీక్షకి అవకాశమే లేదు. మీడియా కాపు కాసి, ఆయన చేత మంచి నీళ్ళుకూడా తాగించకుండా దీక్ష
చేయించేది. తద్వారా తెలంగాణా ప్రాంత పొట్టి శ్రీరాములుగా అవతరించే సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకున్నారు.
అయితే ఒకటి మాత్రం నిజం. ఈ దీక్షా ప్రతిపాదన-విరమణ నాటకంతో ఇతర పక్షాల నాయకుల్ని ఏమార్చి..సూటిగా చెప్పాలంటే వాజమ్మల్ని చేసి, ఉద్యమానికి తానే ఏకైక దిక్కు అన్న విషయాన్ని తెలబాన్ నాయకుడు చెప్పకనే చెప్పాడు. ఇంక సమ్మె చేసిన ఉద్యోగులందరికీ వడ్డీతో సహా జీతాలు, అందరికీ కార్పోరేట్ విద్య, అందరికీ ఉద్యోగాలు అంటూ హిరణ్యాక్ష వరాలు ప్రసాదించేసిన నాయకుని ఆధ్వర్యంలో ఉద్యమించి, ప్రత్యెక రాష్ట్రం సాధించి, సుఖ శాంతులతో మెలగడమే తెలంగాణా ప్రాంత ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.
Monday, September 19, 2011
సమ్మె కోరల్నించి కోర్టులే కాపాడాలి!
హైదరాబాద్ : సకల జనుల సమ్మె పై సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాఖకు చెందిన నారాయణ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. సకల జనుల సమ్మె చట్టవిరుద్ధమని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. సమ్మెతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని నారాయణ పిటిషన్ లో తెలియచేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్ధానం టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, టీఎన్జీవో అధ్యక్షుడు స్వామిగౌడ్, తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ లతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
=======================================================
కనీసం ఒక వారం తర్వాత అయినా విజ్ఞత గల పౌరుడొకడు కోర్టు తలుపు తట్టాడు. వారం రోజుల నుంచి తెలంగాణా ప్రాంత ప్రజలు సకల జనుల సమ్మె పేరుతొ ఇబ్బందుల పాలు అవుతున్నారు. సింగరేణి బొగ్గు సరఫరా లేక తగ్గిన విద్యుత్ ఉత్పత్తి కారణంగా తక్కిన రాష్ట్ర ప్రజలు కూడా విద్యుత్ కోతని అనుభవిస్తున్నారు. యావత్ రాష్ట్ర పజానీకాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్న తెలబాన్ ఉద్యమ సారధుల చిత్త శుధ్ధి ఎంత? తెలబాన్ నాయకుడు తన ఎంపీ పదవిని వదలడు కానీ తక్కిన అందరినీ రాజీనామాలు చేయాలని హుకుం లు జారీ చేస్తుంటాడు. అలా చేయని వారిని తెలంగాణా ద్రోహులుగా ముద్ర వేసి ఆ ప్రాంతంలో తిరిగే హక్కుని కాల రాస్తాడు. రెండు వారాల్లో తెలంగాణా వస్తుందని పిట్ట కధలు చెప్పి రెండు నెలలు అయినా ఆ ఊసే ఎత్తడు కానీ నాలుకలు కోస్తా లాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు మాత్రం క్రమం తప్పకుండా చేస్తాడు. ఇంక తెలబాన్ జేఎసి నాయకుడు మరీ ఘోరం. తన ప్రొఫెసర్ పదవిని, జీత భత్యాల్నీ లేశ మాత్రం వదలడు కానీ విద్యార్ధుల చదువులు నాశనం చేస్తూ వారి భవిష్యత్తుతో ఆటలాడుతున్నాడు. స్వామి గౌడ్ సరే సరి! ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగిగా చేరి, ఉద్యోగ సంఘాల నాయకుడినన్న అహంకారంతో తనకు మాలిన ధర్మంగా వేర్పాటు ఉద్యమాన్ని తలకెత్తుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వమేమో అధికారం నిలుపుకోవటమే ధ్యేయంగా తెలబాన్ శాసన సభ్యులని,మంత్రుల్ని,చివరికి ఉద్యోగుల్ని కూడా కట్టడి చేయలేక చేతులెత్తేసింది. వీరందరికీ నోటీసులిచ్చి వారం సమయం ఇవ్వటం కూడా అనవసరం. సకల జనుల సమ్మె వల్ల సాధించేది ఏమీ లేదని స్వయంగా అధికార పార్టీ కి చెందిన తెలంగాణా ప్రాంత ఎంపీ రేణుకా చౌదరి కుండ బద్దలు కొట్టేసారు. స్వంత ప్రయోజనాల్ని కొంత కూడా పక్కన పెట్టకుండా తెలబాన్ నాయక గణం ఆడిస్తున్న సమ్మె డ్రామాలో వెర్రి గొర్రెలు అవుతున్నది సామాన్య ప్రజలే! ప్రజలకి ఇప్పుడు కావలసింది పెరిగిన ధరల నుండి విముక్తే గానీ ప్రత్యెక రాష్ట్రం వస్తే వారి సమస్యలు తీరవు. గోరు చుట్టు పై రోకటి పోటులా ఈ సమ్మెలు వారి బ్రతుకుల్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. కనుక కోర్టులు కూడా సామాన్య ప్రజల ఇబ్బందులని దృష్టిలో వుంచుకొని ఇటువంటి సమ్మె డ్రామాలని సత్వరం నిషేధించాలి. ప్రభుత్వం కూడా అధికార లాలస వీడి, తెగువతో వ్యవహరించి పని దొంగల భరతం పట్టాలి.
Tuesday, September 13, 2011
సీమాంధ్రుల సంస్కారం...తెలబాన్ల అహంకారం....
Saturday, August 27, 2011
Thursday, August 25, 2011
సాక్షి మూత పడకూడదు!
జగన్ సామ్రాజ్యం కూలుతోంది. సుప్రీం కోర్టు కూడా జగన్ కి బాసట గా నిలవలేదు. కనుక కేంద్రం ఖచ్చితంగా జగన్ పై చర్యల పదును పెంచుతుంది. జగన్ జైలుకి వెళ్ళ వచ్చు. ఆయన ఆస్తులన్నీ ప్రభుత్వ పరం కావచ్చు. ఇంకా ఏమైనా జరగ వచ్చు. కానీ ఎలాంటి పరిస్థితిలోనూ సాక్షి పత్రిక ప్రచురణ మాత్రం ఆగి పోకూడదని సగటు తెలుగు పాఠకుడి కోరిక. సాక్షి పత్రికలో రెండు పూర్తి పేజీలు జగన్ భజనకి వదిలేసినా మిగిలిన 14 పేజీల్లోనూ క్వాలిటీ తో కూడిన సమాచారం/శీర్షికలు అందిస్తున్నారనేది సత్యం. రాజకీయ వార్తల్లో కూడా ప్రజలకి ఒకే కోణంలో సమాచారం అందించ బడుతున్న రోజుల్లో రెండో కోణం కూడా ప్రజలకి చూపడం సాక్షి చేసింది. అంతే కాదు. ఇతర పత్రికలు కూడా క్వాలిటీ పెంచుకోవాల్సిన పోటీ వాతావరణం సాక్షి సృష్టించింది. ఏ రంగంలో అయినా పోటీ అనేది ఉంటేనే వినియోగ దారునికి నాణ్యమైన సేవలు లభిస్తాయి. వార్తా పత్రికలైనా అంతే. అందరికీ గుర్తు వుండే వుంటుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభించిన రోజుల్లో రూపాయికే పత్రిక ని అంద జేసింది. ఆ దెబ్బకి తెలుగు పత్రికలన్నీ కూడా అదే ధరకి దిగి వచ్చాయి. అలాగే వార్తా పత్రికల్లో పని చేసే జర్నలిష్టులకి, ఇతర ఉద్యోగులకి కూడా మంచి జీతాలు, భత్యాలు సాక్షి వచ్చాకే అందుతున్నాయని తెలిసిందే. అటువంటప్పుడు సాక్షి కనుక మూత పడితే పోటీ వాతావరణం అనేది వుండదు. ప్రజలకి ఇంక చాయిస్ అనేది వుండదు. జర్నలిష్టులకి కూడా ఉద్యోగ భద్రత అనుమానమే! కనుక జగన్ దారి ఎటైనా సాక్షి మాత్రం కొనసాగాలని ఆకాంక్షిద్దాం.
Wednesday, August 17, 2011
నో వర్క్...నో పే.. ఇది కూడా కోర్టులే చెప్పాలా?
పని చేయని ప్రభుత్వోద్యోగులకి జీతాలివ్వాల్సిన పని లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన 1617 జీవో ని కొట్టివేస్తూ జీవో 177 అమలు పరచాల్సిందే అంటూ కొరడా ఝుళిపించింది. ఏడాదికి ఉన్న 365 రోజుల్లో 52 ఆది వారాలు, 15 పండుగ సెలవులు, ఇంకా కాజువల్ లీవు, ఐచ్చిక సెలవులు, గట్రాలతో మూడో వంతు పైన రోజులు వేతనంతో కూడిన సెలవులు ప్రభుత్వోద్యోగులకి లభిస్తున్నాయి. ఇక మిగిలిన రెండు వందల రోజులైనా సక్రమంగా పని చేయకుండా బందుల పేరుతొ, సమ్మెల సాకుతో పని ఎగ్గొడుతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోటం శోచనీయం. ఉద్యోగులకి తాము ఉద్యోగంలో చేరేనాడు తెలియదా ..తాము ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వుద్యోగులమని? మరి ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులుగా ఉంటూ రాని తెలంగాణా వంకతో విధులు ఎగ్గొడితే అప్పనంగా జీతాలు ఇవ్వాలా? ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కోదండరాం రెండేళ్లుగా ఏం చేస్తున్నారు? ఆయనకి కాన్దక్టు రూల్సు వర్తించవా? అంతే కాదు. ఈ తీర్పు కేవలం ఉద్యోగులకే కాక - పని చేయని మంత్రులకూ, శాసన సభ్యులకి కూడా వర్తింప జేయాలి. శాసన సభ్యులందరికీ తెలుసు తాము ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ఉన్నామని! అలాగే మంత్రులకి కూడా తెలుసు.. తాము 23 జిల్లాలకు సేవ చేయాల్సిన బాధ్యత తమకి వుందని! అటువంటిది ఉద్యమం పేరుతొ విధులు ఎగ్గొడుతున్న మంత్రి వర్యులకి జీతాలు ఆపాలి. సౌకర్యాలు తొలగించాలి. కోర్టు సు మోటో గా ఈ విషయంలో కలుగ జేసుకొని పని చేయని ప్రొఫెసర్లకి,రాజకీయులకి తగిన గుణ పాఠం చెప్పాలి.
Sunday, August 14, 2011
ఇల్లలుకగానే పండుగ కాదు!
హైదరాబాద్.....23జిల్లాలతో కూడిన మన రాష్ట్రానికి రాజధాని... రాష్ట్రంలోని ప్రతి జిల్లా వారికి హైదరాబాద్ తో ఏదో ఒక విధమైన అనుబంధం/సంబంధం వుంది. ఆ విధమైన అనుబంధం ఉండబట్టే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి చెందిన వారు తమ మేధో సంపత్తిని, ఆర్ధిక వనరుల్ని వుపయోగించి ఈ నగరాన్ని దేశంలోనే ఐదో పెద్ద నగరంగా అభివృద్ది చేసారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో 8 లక్షల పై సంఖ్యలో ప్రజలు హైదరాబాదు నుండి స్వస్థలాలకి వెళ్లి వస్తారని వెల్లడి అవుతోంది. దీన్ని బట్టే చెప్పవచ్చు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి హైదరాబాదుతో గల అనుబంధమేమిటో! ఇలా అన్ని ప్రాంతాల వారి సమిష్టి కృషితో వచ్చిన అభివృద్ది ఫలాలని, తద్వారా వచ్చే ఉపాధి అవకాశాలని అన్ని ప్రాంతాల వారికి అందించటం న్యాయం. ధర్మం. కానీ తాజాగా తెలబాన్ల తల తిక్క ఆందోళనలకి లొంగి, రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ నియామకాల్లో 14-F నిబంధన రద్దుకి ప్రతిపాదించటం, దాన్ని రాష్ట్రపతి ఆదర బాదరాగా ఆమోదించేయటం దురదృష్టకరం. రాష్ట్రం మొత్తానికి అందాల్సిన వాటాని కేవలం ఆరో జోన్ కి మాత్రమె అందించ బూనటం అక్రమమే. పైగా రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడగానే తెలబాన్ శ్రేణులు పండగ చేసుకోవటం మరింత మూర్ఖత్వం. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మొత్తం తెలంగాణా ప్రాంతం జీడీపీ లో ఆరో వంతు కేవలం హైదరాబాదు నగరంనుంచే వస్తోంది. దీన్ని బట్టే హైదరాబాద్ పోటేన్సి ఏమిటో అర్ధం అవుతోంది. అంత ప్రాముఖ్యత గల హైదరాబాదుని అప్పనంగా కొట్టేయాలనే దుగ్ధతోనే కొన్ని వేర్పాటు వాద శక్తులు తెలంగాణా ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి. రాష్ట్ర జనాభాతో పోలిస్తే ఆరో జోన్ లో వచ్చే ఎస్ ఐ ఉద్యోగాల సంఖ్య అతి స్వల్పం. ఇంకా ఆ కొద్ది పాటి ఉద్యోగాల కోసం ఆరాట పడాల్సిన అగత్యంకూడా లేదు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే. స్వల్ప విషయాలకే రాద్ధాంతం చేసి మిగతా ప్రాంతాల వారికి అన్యాయం చేయ తలపెట్టిన వారు రేపు ఖర్మ కాలి ప్రత్యెక రాష్ట్రం ఇస్తే హైదరాబాదులో సీమాన్ధ్రులని బతకనిస్తారా?? ఖచ్చితంగా లేదు అని వారి ప్రకటనలు, చేష్టలు నిరూపించాయి. నిరూపిస్తున్నాయి. కేంద్రం ఇకనైనా తాత్సారం చేసే ధోరణి కట్టి పెట్టి, విశాలాంధ్ర హితంలో ఆలోచించి, వేర్పాటు వాద ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచి వేయాలి. తద్వారా దేశంలో మరెక్కడా ఇటువంటి అభివృద్ది నిరోధక ఉద్యమాలు తలెత్తకుండా నివారణ చర్యలు తీసుకోవాలి.
Wednesday, August 10, 2011
తెలబాన్ చెల్లెమ్మ చిలక పలుకులు!
తెలంగాణా వచ్చుడో..కే సి ఆర్ సచ్చుడో... అని తెలబాన్ నాయకుడు ప్రకటించి ఎన్ని ఏళ్ళు గడిచిందో తెలీదు కానీ ఈ రోజు వరకు ఏదీ జరగలేదు. జరిగే అవకాశం కూడా కను చూపు మేరలో కనపడట్లేదు. అయితే ఉద్యమం పేరిట అమాయకుల (ఆత్మ) బలి దానాలు మాత్రం జరిగి పోతున్నాయి. హఠాత్తుగా ఈ విషయం విజయ శాంతికి ఎలా గుర్తుకి వచ్చిందో కానీ నిన్న తెలబాన్ మహిళల సమావేశంలో ఆమె తెలంగాణా కోసం ఎవరినీ బలి దానాలు చేయద్దనీ, అవసరమైతే, తానూ, అన్న కే సి ఆర్ చస్తమనీ చిలక పలుకులు పలికేసారు. తామంతా రాజీనామాలు చేస్తే భూకంపం వచ్చేస్తుందన్న బిల్డప్ ఇచ్చి తీరా ఈ రోజుకి కనీసం ఆ రాజీనామాల్ని ఆమోదింప జేసుకోవడం చేతకాని వారు ఏకంగా బలి దానాలు చేస్తామంటే నమ్మే స్థితిలో ఎవరూ లేరు. తెలంగాణా ప్రాంతంలో ఆధిపత్య పోరు కోసం కృత్రిమంగా జరిపించబడుతున్న ఈ ఉద్యమ కారణంగా యావత్తు రాష్ట్ర ప్రజానీకం ఇబ్బందుల పాలు, నవ్వుల పాలు కావటమే గాక రాష్ట్ర అభివృద్ది కూడా దశాబ్దాల వెనక్కి వెళ్లి పోయింది. తెలుగు వారే తేల్చుకుంటే ఇంకా కేంద్రం, హోం మంత్రి ఎందుకు? చావటానికా అని ప్రశ్నించిన తెలబాన్ చెల్లి నోటి దురుసులో అన్నకి ఏ మాత్రం తీసి పోనని నిరూపించింది. ఎంత పార్లమెంటు సభ్యులైతే మాత్రం కేంద్ర హోం మంత్రి గురించి ఇలా మాట్లాడడం నేరమే! కేంద్రం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, రోజుకో విధంగా విధ్వంసకర వ్యాఖ్యలు చేస్తున్న తెలబాన్ నాయకులని కట్టడి చేయాలి. అలాగే మార్చిల పేరుతొ, బందుల వంకతో నిత్యం ప్రజానీకాన్ని వేధిస్తున్న తెలబాన్ అనుచర గణం కూడా హద్దులు దాటకుండా చర్యలు చేపట్టాలి.
నయన తార మతం..ఎవరి అభిమతం?
సినీ నటి నయన తార హిందూ మతం స్వీకరించటం పై ఓ క్రిష్టియన్ సంస్థ కారాలు మిరియాలు నూరటం అర్ధ రహితం. పెళ్లి అయి, పిల్లలు గల వాడని, ఆస్తి అంతా మాజీ భార్యా బిడ్డలకే రాసిచ్చాడని తెలిసి కూడా ప్రభు దేవాని వివాహం చేసుకోవాలన్న నిర్ణయం తీసుకొన్న వ్యక్తికి, తాను ఏ మతం పాటించాలన్న విషయంలో కూడా నిర్ణయం తీసుకొనే విచక్షణ, స్వేచ్చ వుంటాయి. వ్యక్తిగత స్వేచ్చని మీరి, మత సంస్థలు చేసే ఇటువంటి ప్రకటనలు ఆక్షేపణీయం. అయినా గతంలో ఎంతో మంది హిందూ మతంనుంచి క్రిష్టియన్ మతానికి మారిన సంఘటనలున్నాయి. ఆ మార్పిడులన్నీ ఎటువంటి ప్రలోభాలు, ప్రేరణలు లేకుండానే జరిగాయని ఎవరైనా చెప్ప గలరా? మన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్చ స్ఫూర్తిగా, పర మత సహనం పాటిస్తున్న హిందూ సమాజాన్ని రెచ్చ గొట్టే ఇటువంటి ధోరణులని కొనసాగించడం - మంచి తనాన్ని చేతగాని తనంగా తీసుకోవడమే అవుతుంది.
Friday, August 5, 2011
ఏమిటీ అరాచకత్వం?
(ఆంద్ర జ్యోతి, ఆగష్టు 5 , 2011 )
ఆంధ్రా ప్రాంత అధికారి నిర్బంధం :
నారాయణఖేడ్, ఆగస్టు4: తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా అధికారులు విధులు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామ పంచాయతీ భవనంలో ఆంధ్ర ప్రాంతాని కి చెందిన వ్యవసాయాధికారిని గురువారం రెండు గంటల పాటు నిర్బంధించారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన శ్రీధర్ ఇటీవల నారాయణ్‌ఖేడ్ వ్యవసాయాధికారిగా బాధ్యతలు చేపట్టారు. విధి నిర్వహణలో భాగంగా ర్యాకల్ గ్రామానికి వెళ్లారు. దీంతో అక్కడికి చేరుకున్న తెలంగాణ నిరసనకారులు ఆంధ్రా అధికారుల వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ.. శ్రీధర్‌ను గ్రామ పంచాయతీ భవనంలో నిర్బంధించారు. తెలంగాణ ప్రాంతంలో విధులు నిర్వహిస్తే ఇదే పరిస్థితి కొనసాగుతుందని వారు హెచ్చరించారు. 14ఎఫ్‌ను తొలగించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమాచారాన్ని గ్రామస్థులు ఎస్ఐ రవీందర్‌రెడ్డికి అందజేయడంతో ఆయన కలుగజేసుకొని నిర్బంధం నుంచి విడిపించారు.
--------
జడ్చర్ల, న్యూస్‌లైన్: జడ్చర్ల సీఐ విఠల్‌రెడ్డి లంచం తీసుకుంటుండగా.. ఏసీ బీ అధికారులు పట్టుకున్న సంఘటన జడ్చర్లలో తీవ్ర కలకలం రేపింది. విష యం తెలుసుకున్న కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, తదితర పార్టీలతో పాటు జే ఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐని కో స్తాంధ్రకు చెందిన హోటల్ యజమాని, ఓ టీవీ ఛానల్ కుమ్మక్కై అక్ర మంగా కేసులో ఇరికించారని వారు ఆరోపించారు. సీఐకి మద్దతుగా తెలంగాణ నినాదాలు చేస్తూ పోలీస్‌స్టేషన్ లోపలికి చొచ్చుకు వెళ్లారు. సీఐ విఠల్‌రెడ్డి, ఏసీబీ అధికారులు ఉన్న క్వార్టర్‌పై దాడి చేసి, కి టికీల అద్దాలను పగులగొట్టారు. లోపలికి ప్రవేశించి, ఫైళ్లను చింపివేశారు. ఏసీబీ డీఎస్పీ రఘుపతిగౌడ్, తది తర ఇన్‌స్పెక్టర్లను బయటికి లాక్కొచ్చి, తీవ్రంగా కొట్టారు. దాడిలో డీఎస్పీ రఘుపతిగౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఏసీబీ అధికారులను పో లీస్‌స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. ఆందోళనకారులు అక్కడికి సైతం వెళ్లి, ఏసీ బీ అధికారుల పై దాడికి యత్నించారు. ఈ దశలో పోలీసు బలగాలు స్టేషన్ వద్దకు చేరుకొని, ఆందోళనకారులను స్టేషన్ బయటికి పంపించివేశారు. దీంతో ఆందోళనకారులు రహదారిపై రాస్తారోకో దిగి సీఐ కి మద్దతుగా, ఏసీబీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ శాసనసభ్యులు మల్లురవి, ఎంపీపీ నిత్యానందం, తది తర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పోలీస్‌స్టేషన్‌లో మకాం వేసి, పరిస్థితిని సమీక్షిం చారు. గాయపడ్డ ఏసీబీ అధికారులను అతికష్టం మీద ఆస్పత్రికి తరలిస్తుడగా ఏసీబీ అధికారుల వాహనంపై రాళ్లతో దాడి చేయడంతో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం ఎస్పీ సు ధీర్‌బాబు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి, పరిస్థితి ని సమీక్షించారు. పలువురు డీఎస్పీలు, సీఐల నే తృత్వంలో ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
హోటల్‌పై దాడి: పథకం ప్రకారమే సీఐని ఏసీబీ అధికారులకు ప ట్టించారని ఆరోపిస్తూ.. అందుకు కారణమైన త్రీ స్టార్ హోటల్ యజమాని రామ్మోహన్‌కు చెందిన హోటల్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. కొత్తబస్టాండ్‌లోని హోటల్‌పై దాడి చేసి, అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే సమీపంలోని త్రీస్టార్ హోటల్‌పై దాడికి యత్నించగా, అక్కడ మోహరించి ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
హోటల్‌పై దాడి: పథకం ప్రకారమే సీఐని ఏసీబీ అధికారులకు ప ట్టించారని ఆరోపిస్తూ.. అందుకు కారణమైన త్రీ స్టార్ హోటల్ యజమాని రామ్మోహన్‌కు చెందిన హోటల్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. కొత్తబస్టాండ్‌లోని హోటల్‌పై దాడి చేసి, అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే సమీపంలోని త్రీస్టార్ హోటల్‌పై దాడికి యత్నించగా, అక్కడ మోహరించి ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
--------
(ఆంద్ర జ్యోతి, ఆగష్టు,5 , 2011 )
బీఎస్ఎన్ఎల్ కార్యాలయ ధ్వంసం కేసులో 14 మందికి పదేళ్ల్ల జైలు
ప్రొద్దుటూరు, ఆగస్టు 5 : సమైక్యాంధ్ర ఉద్యమ నేపధ్యంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ధ్వంసం కేసులో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన పద్నాలుగు మంది ఉద్యమకారులకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2009లో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ధ్వంసం, లోపల పరికరాల కాల్చివేతపై కొండాపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి నేరం రుజువు కావడంతో నిందితులు 14 మందికి పదేళ్ల జైలుశిక్షతో పాటు 25 వేల రూపాయల జరిమానా విధిస్తూ ప్రొద్దుటూరు సీనియర్ సివిల్ జడ్జి ఎ.శ్రీనివాసకుమార్ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే... సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకున్న క్రమంలో 2009 డిసెంబర్ 19న కొందరు ఉద్యమకారులు కొండాపురం పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని అడ్డుకుని లోనికి ప్రవేశించారు. కార్యాలయంలో అద్దాలు పర్నిచర్ ధ్వంసం చేసి, అక్కడ వున్న ట్రాన్స్‌మిషన్ పరికరంపై పెట్రోలు పోసి నిప్పుపెట్టారు. దీంతో బీఎస్ఎన్ఎల్ సంస్థకు సుమారు 2 లక్షల 32 వేలు నష్టం వాటిల్లిందంటూ ఆ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న బాలమునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కొండాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, కాల్చివేతపై చౌటపల్లె, పొట్టిపాడు, కొండాపురం, గండ్లూరు, రామచంద్రానగర్ తదితర గ్రామాలకు చెందిన 14 మందిపై అప్పట్లోనే కేసు నమోదైంది. ప్రొద్దుటూరు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతూ వచ్చింది. కేసులో నిందితులపై నేరం రుజువు కావడంతో కోర్టు ఈమేరకు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ముద్దాయిలు 14 మందిని ప్రత్యేక వాహనంలో కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
-------
ఒకే రోజు వచ్చిన పై మూడు వార్తలు చూస్తె ఏమనిపిస్తోంది? తెలబాన్లు ఉద్యమం ముసుగులో ఎన్ని అరాచకాలు చేసినా నిద్ర నటిస్తున్న ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలు సమైక్యాంధ్ర వాదుల పై మటుకు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. విధ్వంసం చేసిన వారిని సమర్ధించటం నా ఉద్దేశ్యం కాదు. అయితే ఈ న్యాయం అందరికీ సమంగా వర్తింప జేయాలి. జాగో-భాగో...నాలుకలు కోస్తాం...ఆస్తులు లాక్కుంటాం... తరిమి కొడతాం...ఇంకా సవా లక్ష విధ్వంసకర ప్రకటనలు చేసిన నాయకుల పై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అంతెందుకు..సాక్షాత్తు దేశ రాజధానిలో టీవీ కెమెరాల సాక్షిగా విధుల్లో ఉన్న దళిత ఉద్యోగిని చితక బాదిన తెలబాన్ మేనల్లుడికి ఇంత వరకు ఇంత వరకు ఏ శిక్షా పడలేదు! దాంతో మరింతగా రెచ్చి పోయి పాఠ్య పుస్తకాల్లో మా తెలుగు తల్లి పాట ఉన్న పేజీలు చించి తగల పెట్టమని వదరుతున్నాడీ వీరుడు! ఆ ప్రకటన రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించడం కాదా! సు మోటో గా న్యాయస్థానాలు ఇటువంటి ధిక్కార వైఖరులపై స్పందించవా? నానాటికీ వెర్రి తలలు వేస్తున్న వేర్పాటు వాదాన్ని ఏదో ఒక స్థాయిలో కట్టడి చేయక పొతే, మన రాష్ట్ర భవిష్యత్తు ఈశాన్య భారతంలో ఉన్న అత్యంత వెనుక బడ్డ రాష్ట్రాల కన్నా అధ్వాన్నంగా తయారయ్యే రోజు ఎంతో దూరంలో వుండదు.
Sunday, July 24, 2011
స్పీకర్ తప్పుడు నిర్ణయం!
భావోద్వేగాలలో చేసిన రాజీనామాలుగా చిత్రీకరిస్తూ తెలంగాణా ప్రాంత శాసన సభ్యుల రాజీనామాలని స్పీకర్ తిరస్కరించటం సరైన చర్య కాదు. గతంలో కూడా స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డి వున్నప్పుడు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. కానీ ఆనాటి పరిస్థితులు వేరు. దొంగ దీక్షలతో మభ్యపెట్టి, అన్ని పార్టీల అంగీకారం ఉందన్న తప్పుడు సమాచారం అందించి రాత్రికి రాత్రి తెలంగాణా అనేసరికి ఒక్కసారిగా వచ్చిన భావోద్వేగ పరిణామమే సీమాంధ్ర శాసన సభ్యుల, ఎంపీల రాజీనామాలు! కానీ ఇప్పటి పరిస్థితి వేరు.. తెలంగాణా రావటంలేదన్న నిస్పృహ కావచ్చు.. లేదా నియోజక వర్గాల్లో తిరగనివ్వమన్న వేర్పాటు తీవ్ర వాదుల ఫత్వాలకి భయపడి కావచ్చు..రాజీనామా ఇచ్చిన వారంతా ఫలానా తేదీన ఇస్తామని ముందే చెప్పారు. ఆ విధంగానే చేసారు. ఇంక ఇందులో భావోద్వేగాలకు చోటెక్కడ? రాజీనామాలు తిరస్కరించటం అన్నది స్పీకర్ విచక్షణాదికారమే కావచ్చు. కానీ దానికి భావోద్వేగాల ముద్ర వేయటం తప్పు. ఇలా నిర్ణయించే ముందుగా శాసన సభ్యులందరినీ విడి విడిగా స్పీకర్ విచారించి వుంటే, వారిలో ఎందరు స్వచ్చందంగా రాజీనామా ఇచ్చారో, ఎంత మంది ఒత్తిడి కి లోనై ఇచ్చారో తేట తెల్లమయ్యేది! అలాగే కృత్రిమంగా కొనసాగింప బడుతున్న తెలంగాణా ఉద్యమం పట్ల ఆ ప్రాంత శాసన సభ్యుల నిబద్ధత కూడా బయట పడేది! రాష్ట్రాన్ని రావణ కాష్టంలా రగిలిస్తున్న ఉద్యమం పట్ల ఒక అంచనాకి వచ్చే అరుదైన అవకాశాన్ని స్పీకర్ చేజేతులా జార విడిచారనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
Thursday, July 21, 2011
అసెంబ్లీ రౌడీలు!
పై అధికారుల ఆదేశానుసారం తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఏపీ భవన్ ఉద్యోగి పై, శాసన సభ్యుడినన్న అహంకారంతో ఒళ్ళు మదించిన తెలబాన్ మేనల్లుడు హరీష్ రావు చేసిన దౌర్జన్యం సహించరానిది. టీవీ కెమెరాల సాక్షిగా ఏపీ భవన్ ఓ ఎస్ డీ చంద్ర రావు పై హరీష్ రావు చేసిన దాడిని చూసిన దేశం మొత్తం నిర్ఘాంత పోయింది. చేసిన ఘన కార్యం చేసేసి, ఆనక తీరిగ్గా విచారిస్తున్నానంటూ క్షమాపణ చెప్పేస్తే చాలదు. ఇటువంటి అసెంబ్లీ రౌడీలని, అసెంబ్లీ రౌడీ సినిమాలో చూపించిన విధంగానే నడి వీధికి తెచ్చి, టీవీ కెమెరాల సాక్షిగా అదే ఉద్యోగి చంద్ర రావు చేత కుళ్ళ బొడిపించేయ్యటమే వారికి చెయ్యాల్సిన శాస్తి!
Wednesday, July 20, 2011
కాంగ్రేసు ని తెలుగు వారు క్షమించరు!
కేంద్రంలో యూ పీ ఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటానికి వెన్ను దన్నుగా మంది 33 మంది ఎంపీ లని అందించిన ఆంద్ర రాష్ట్రాన్ని ఏడాదిన్నర పాటు రావణ కాష్టంలా రగిలించాక, తీరిగ్గా ప్రణబ్ ముఖర్జీ గారు డిసెంబరు 9 ప్రకటన సమాచార లోపంతో ఇచ్చిన పొరపాటు ప్రకటనగా తేల్చేసారు. ఇదే విషయమై నేను రాసిన ఇంతకు ముందు టపా ఇక్కడ చదవచ్చు. http://andhraaakasaramanna.blogspot.com/2010/02/blog-post_17.html
ఆంద్ర ప్రదేశ్ లో స్వపక్షం లేదా విపక్షం ఎవరు అధికారంలో వున్నా కూడా మన రాష్ట్రం పట్ల కాంగ్రేసుకి ఎప్పుడూ సవతి తల్లి ప్రేమే! నిన్నటి వరకూ రాష్ట్ర విభజన విషయం తేల్చాల్సింది అధిష్టానమే-సోనియా నే అంటూ రాష్ట్ర నాయకత్వం భజన చేస్తుంటే చోద్యం చూస్తూ ఉండి....ఈ రోజు తెలుగు వారి సమస్యని తెలుగు వారే సామరస్యంతో పరిష్కరించుకోవాలంటూ సుద్దులు చెప్పటం కాల్చి వాత పెట్టి వెన్న రాసినట్లే ఉంది. ఇంతోటి పరిష్కారం చెప్పటానికి ఏడాదిన్నర సమయం తీసుకోవాలా? తదుపరి పరిణామాలు ఊహించకుండా తొందర పాటుతో డిసెంబరు 9 ప్రకటన చేసేసి, రాష్ట్రాన్ని తగల పెట్టి, అభివృద్ధిని దశాబ్దాల వెనక్కి నెట్టిన కాంగ్రేసు పార్టీని తెలుగు వారు ఎన్నటికీ క్షమించరు.
Sunday, July 17, 2011
దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!
సీమాంధ్ర మంత్రి తోట నరసింహం పై తెలబాన్లు దౌర్జన్యం చేసిన దరిమిలా తమకు రక్షణ కరువైందని వాపోయిన మంత్రి టీజీ వెంకటేష్ రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ హరీష్ రావు చేసిన ప్రకటన దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే ఉంది. ఆయన పై సు మోటో గా కేసు బుక్ చేయాలనీ, మంత్రి పదవినుంచి తొలగించాలనీ ఇంకా చాల డిమాండ్లు చేసారు. గురువింద గింజ మాదిరిగా ఆరోపణలు చేసే ముందు తమ కింద ఎంత నలుపు వుందో తెలుసుకోక పోవటం ఆశ్చర్యకరం!
ఆంధ్రా వాలే భాగో....నాలుకలు కోస్తాం.. సీమాంద్రులని తరిమి కొడతాం... వారి ఆస్తుల్ని లాక్కుంటాం..ఇలా ఒకటా రెండా? ఎన్నెన్ని ప్రేలాపనలు! ఉద్యమం ముసుగులో ఏమి చేసినా, ఏమి వాగినా చెల్లి పోతుందన్న ధీమాలో చేసిన అకృత్యాలు ఎన్ని?
సు మోటో గా కేసులు బుక్ చేయాల్సి వస్తే ముందు తెలబాన్ల పైన బుక్ చేయాల్సిన కేసులు లెక్కకి అందవు.
గీతా ఆర్ట్స్ కార్యాలయాన్ని ఆక్రమించి తెలంగాణా బేనర్ కట్టటం... మర్యాద రామన్న షూటింగ్ అడ్డుకొని యూనిట్ సభ్యులతో బలవంతంగా జై తెలంగాణా అనిపించటం...అదుర్స్ సినిమాని ఆడనివ్వబోమని బెదిరించడం...వాహనాలపై టీజీ స్టికర్లు వుండాలని హుకుం లు జారీ చేయటం...రాష్ట్రం రాకుండానే రాజ ముద్రని చలామణీ లోకి తేవటం..ఇలా చెప్పుకుంటూ పొతే కేసులు బుక్ చేయాల్సిన సంఘటనలు కోకొల్లలు.
అవన్నీ ఒకెత్తు. శాసన సభ్యుడైన నాగం ని (తెలుగు దేశంలో వుండగా) చితక్కొట్టటం, నిజాల్ని నిక్కచ్చిగా మాట్లాడినందుకు టీవీ కెమెరాల సాక్షిగా కొట్టండి రా వాణ్ని అంటూ జే పీ పై భౌతిక దాడికి దిగటం, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలని ద్వంసం చేయటం ఆటవిక చర్యలు కావా? వాటి పై చర్యలు తీసుకోకూడదా ?
అన్నిటికన్నా దారుణం..తెలుగు జాతి చరిత్రకి సగర్వ సాక్షులైన టాంకు బండ్ విగ్రహాల్ని ద్వంసం చేయటం. అందుకుగాను మిలియన్ మార్చ్ నిర్వాహకులని శిక్షించటం...ఆధ్వర్యం వహించిన పార్టీని నిషేధించటం చెయ్యాలి. కానీ అటువంటి చర్యలేమీ తీసుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చో బట్టే నేడు తెలబాన్లు ఉద్యమం ముసుగులో అరాచకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అలుసు పెచ్చు మీరటంతో, ప్రభుత్వంలో భాగమైన మంత్రినే వేలెత్తి చూపుతున్నారు. కానీ ఒక వేలెత్తి చూపితే, నాలుగు వేళ్ళు తమకేసే చూస్తాయన్న నిజం మూర్ఖ తెలబాన్లకి ఎప్పుడు అర్ధం అవుతుందో?
Thursday, July 14, 2011
అరాచకత్వానికి హద్దే లేదా?
రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అసలు ఇక్కడ ప్రభుత్వం అనేది పని చేస్తోందా అని సందేహం వస్తోంది. వేర్పాటు వాదం వెర్రి తలకెక్కి రైల్ రోకో అనగానే ప్రభుత్వమే ముందుగా రైళ్ళని రద్దు చేయటం చేతగాని తనమే. రైళ్ళ రద్దు వల్ల ఏర్పడే కోట్లాది రూపాయల నష్టానికీ, ప్రయాణీకుల కష్టాలకీ బాధ్యత ఎవరిది? ముమ్మాటికీ ఈ చేతకాని ప్రభుత్వానిదే.. ఉద్యమం ముసుగులో తామేం చేసినా చెల్లి పోతుందన్న అభిప్రాయం ఇప్పటికే తెలబాన్ల నర నరాల్లో జీర్ణించుకు పోయింది. దానికి తోడు ప్రభుత్వమే చేవ చచ్చిన రీతిలో ఇలా తోక ముడిచేయడం ఏ మాత్రం క్షంతవ్యం కాదు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ముందు తన ఉద్యోగులనే కట్టడి చేయలేక పోతోంది. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజా సేవ చేయాల్సిన ఉద్యోగులు అర్ధం పర్ధం లేని డిమాండ్లతో ఆగష్టు ఒకటినుండి పని చేయ బోమని బెదిరించటం ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన అలుసే. తెలుగు వారి చరిత్రకి సగర్వ సాక్ష్యాలైన టాంకు బండు విగ్రహాల్ని కూల్చిన వారిపై ఈ రోజు వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక ఈ రోజు నల్గొండ జిల్లా చుట్టూ గోడ కట్టేస్తామని బెదిరించాడో మాజీ మంత్రి! అసలు తెలంగాణా ఉద్యమ వాదంలో సహేతుకత ఎంత వుంది, ఈ సమస్యకి అత్యుత్తమ పరిష్కారం ఏమిటి తదితర విషయాలన్నీ శ్రీకృష్ణుడు ఏనాడో కుండ బద్దలు కొట్టేసాడు. అయినా కూడా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తూ ప్రజలు ఇబ్బందుల పాలవుతుంటే చోద్యం చూస్తూ కూచోటం క్షమార్హం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా వేచి చూసే ధోరణి మాని రాష్ట్రం లో పరిస్థితులు గాడిన పడే వరకు రాష్ట్రపతి పాలన విధించాలి. శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన ఆరో అత్యుత్తమ పరిష్కారం అమలుకి చిత్త శుద్ధితో కార్యాచరణ సాగించాలి. తద్వారా దేశంలో ఇతర ప్రాంతాల్లో వేర్పాటు వాదాలు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలి.
Wednesday, June 22, 2011
నివాళి ఇచ్చే విధానం ఇదా?
ఆచార్య జయశంకర్ వంటి మేధావిని, విద్యా వేత్తని కోల్పోవటం కేవలం తెలంగాణా ప్రాంతానికే కాదు...తెలుగు వారందరికీ తీరని లోటే. విద్యా రంగంలో ఆయన మన రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయం. అలాగే తాను నమ్మిన సిద్దాంతం పట్ల నిబద్ధత, తన సిద్ధాంత వ్యాప్తి కోసం ఎంచుకున్న గాంధేయ మార్గం కూడా మెచ్చ దగ్గవి. అయితే ఆయన మరణానంతరం నివాళి అర్పించటానికి వచ్చిన తెలంగాణా నాయకులని తెలబాన్ శ్రేణులు చొక్కాలు చిరిగేలా కొట్టటం, రాళ్ళతో దాడి చేయటం ఎ మాత్రం సమర్ధనీయం కాదు. జయ శంకర్ కూడా జీవించి వున్నప్పుడు ఎటువంటి హింసా వాదాన్ని సమర్ధించలేదు. వసూళ్ళ నాయకుల చేతిలో పడి తెలంగాణా ఉద్యమం ఏనాడో పెడ తోవ పట్టింది. కనీసం ఉద్యమ సిద్ధాంత కర్త మరణించిన విషాద సమయంలో సైతం సంయమనం లేకుండా తెలబాన్ శ్రేణులు ప్రవర్తించాయి. జయ శంకర్ అంతిమ యాత్ర జరిగిన సమయంలో కూడా రెచ్చి పోయిన తెలబాన్లు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం పై రాళ్ళతో చెప్పులతో దాడి చేయటం పెచ్చరిల్లిన ఉన్మాదానికి పరాకాష్ట. ఉద్యమం ముసుగులో ఏమి చేసినా చెల్లి పోతుందనే ధీమా వారి చర్యల్లో కన పడుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కి అత్యంత ప్రియమైన టాంక్ బండ్ విగ్రహాలని కూలదోసి ఆయన ఆత్మని క్షోభింప జేసిన తెలబాన్లు ఇక ఏకంగా ఆయన విగ్రహాలపైనే ప్రతాపం చూపారు. ఈ అరాచకత్వాలని ఇక ఎంత మాత్రం సహించకూడదు. ప్రభుత్వం అనేది ఒకటి ఉందన్న స్పృహ కూడా లేకుండా పెచ్చరిల్లుతున్న వేర్పాటు తీవ్ర వాద గణాల భరతం పట్టే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతైనా వుంది
Sunday, June 19, 2011
లగడపాటి లెక్కలో తప్పేముంది?
దొంగ దీక్షలతో కేంద్రాన్ని ఏమార్చి 2009 డిసెంబరు తొమ్మిదిన తెలంగాణకి అనుకూలంగా ప్రకటన ఇచ్చిన నాడు, అందరికంటే ముందుగా అప్రమత్తమై రాష్ట్రాన్ని ముక్కలు గాకుండా కార్యాచరణకి దిగిన వాడు లగడపాటి రాజగోపాల్. ఆయన వ్యక్తిగతంగా వ్యాపారి కావచ్చు. ఆయన వ్యాపార ప్రయోజనాలు హైదరాబాదు లో విస్తరించి ఉండవచ్చు. అది వేరే విషయం. అయితే ఉత్తి పుణ్యానికే రాష్ట్రాన్ని ముక్కలు చేద్దామని జూసిన వేర్పాటు వాదుల కుట్రలు భగ్నం చేస్తూ సమైక్యాంధ్ర ఉద్యమ నావకి చుక్కానిలా నిలిచిన రాజ గోపాల్ అంటే తెలబాన్లకి కంటగింపుగా వుండటం సహజమే. ఆనాటి నుంచి లగడపాటి ఏం మాట్లాడినా దుమ్మెత్తి పోయడం అన్నది తెలబాన్లకి అలవాటుగా మారింది.
తాజాగా-- రాష్ట్రంలో ఎన్నికలు వస్తే సమైక్య వాదులకి 240 ,వేర్పాటు వాదులకి 40 సీట్లు వస్తాయి -- అన్న లగడపాటి ప్రకటన పై తెలబాన్ శ్రేణులు శాపనార్ధాలు పెట్టటం ప్రారంభించాయి. తాను నిర్వహించిన సర్వే లో ఈ విషయం వెల్లడైందని రాజ గోపాల్ అంటున్నప్పుడు, చేతనైతే ఆ సర్వే అబద్ధమని నిరూపించాలి గానీ వ్యక్తిగత దూషణలకి దిగటం చేతకాని తనం. రాష్ట్రాన్ని విభజిస్తే ఏర్పడే పరిణామాలు అంటూ రాజ గోపాల్ చెప్పినవి అన్నీ శ్రీ కృష్ణ కమిటీ 8 వ అధ్యాయంలో వున్నవే. లగడపాటి సొంత సర్వే లని పక్కన పెడితే, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ రాష్ట్రంలోని పరిస్థితుల్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి సమస్యకి తగిన పరిష్కారాలని సూచించి ఆరు నెలలు గడిచి పోయాయి. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించటం మాని, శ్రీ కృష్ణ కమిటీ సూచించిన ఆరవ అత్యుత్తమ పరిష్కారం అమలు పరిచే చర్యలు చేపట్టాలి. గోర్ఖాలాండ్ మాదిరిగానే రాష్ట్రంలో వెనుక బడ్డ తెలంగాణా, ఉత్తరాంధ్ర, రాయల సీమల్లోని ప్రాంతాలకి ప్రత్యెక ప్యాకేజీలు ప్రకటించి వాటి సత్వర అభివృద్ధికి బాట వేయాలి. తద్వారా ఎటువంటి వేర్పాటు వాద ఉద్యమాలు భవిష్యత్తులో తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వంట చేసి ఏం సాధించారు?
త్యాగాల వల్ల తప్ప వేరే విధంగా తెలంగాణా రాదని సెలవిస్తూనే వంటా వార్పూ అంటూ తెలబాన్ నాయకుడు చేసిన హడావిడికి అర్ధం పరమార్ధం ఏమిటో ఆయనకే తెలియాలి. ఓ పక్క కాంగ్రెస్, తెదేపా నాయకులని రాజీనామాలు చేయమని హుంకరిస్తూనే, తానూ, తన తెలబాన్ చెల్లి ఈ రోజుకి కూడా రాజీనామా ఊసు ఎందుకు ఎత్తరో ఏనాడు వివరించిన పాపాన పోలేదు. నిజంగా ఉద్యమం పట్ల చిత్త శుద్ధి, నిబద్ధత గల పెద్ద మనిషి ఐతే మొదటి సారి రాజీనామా తిరస్కరణకి గురి అయ్యాక మళ్ళీ సరైన ఫార్మాట్లో రాజీనామా ఇవ్వాలన్న విషయం ఎవరైనా చెప్పాలా? తాను పదవిని పట్టుకుని వేళ్ళాడుతూ ఇతరులని రాజీనామా చేయాలని వత్తిడి చెయ్యటం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల కిందకే వస్తుంది. ఇలా వంటలు చేస్తూ, వసూళ్లు చేస్తూ ఉద్యమ నాయకుడుగా చెలామణీ కావటం బహుశా వేరెవరికీ సాధ్యం కాక పోవచ్చు. ఇక తెలబాన్ జే ఎ సి నాయకుడిదీ అదే తంతు! తన ప్రొఫెసర్ పదవికి రాజీనామా ఇవ్వడు కానీ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు కట్టిన పన్నుల్లోంచి జీతం తీసుకుంటూ ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడతాడు. అనుకూలంగా మాట్లాడితే తప్పు లేదు. కానీ ఇతర ప్రాంతాల పై, ప్రాంతీయుల పై విద్వేషాగ్నుల్ని రగిలించడం క్షంతవ్యం కాదు. ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కొత్తగా చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసి కొరివితో తల గోక్కునే అవకాశం లేనే లేదు. అది తెలంగాణా కాంగ్రెస్ నాయకుల డిల్లీ పర్యటనలో వారి పట్ల హై కమాండ్ చూపిన మర్యాదే తెలియ జేసింది. ఇంకా వంటా వార్పూ, డెడ్ లైన్, రాజీనామా అంటూ ప్రజలని ఏమార్చడం సాధ్యం కాదు. పైగా మిలియన్ మార్చ్ అంటూ పేర్లు పెట్టి జనాల్ని సమీకరించి రాష్ట్ర చారిత్రిక సంపద ఐన విగ్రహాలని కూల్చి వేయడం క్షమించరాని నేరం. ఇప్పటికే రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగి అభివృద్ధి అనేది ఆమడ దూరం వెళ్ళింది. ఇంకా ఇటువంటి అర్ధం పర్ధం లేని ఉద్యమాలని ప్రభుత్వం ఎంత మాత్రం సాగనీయకూడదు. రాష్ట్ర హితానికి వ్యతిరేకంగా, ప్రజలని అసౌకర్యాల పాలు జేసే విధంగా సాగే ఎటువంటి కార్య కలాపాలని అయినా ఉక్కు పాదంతో అణచి వేస్తేనే మళ్ళీ రాష్ట్రాభివృద్ధి గాడిలో పడుతుంది.
Saturday, June 11, 2011
దళిత కార్డు దుర్వినియోగం కాకూడదు..
ఎంపీ నన్న అహంకారంతో విద్యుత్ శాఖ ఉద్యోగి పైన నోరు పారేసుకున్న సర్వే సత్య నారాయణ ఉద్యోగుల సంఘీభావానికి తోక ముడిచి క్షమాపణ చెప్పారు. ప్రోటోకాల్ విషయమై తప్పు జరిగిందని ఆరోపిస్తూ విద్యుత్ శాఖ ఉద్యోగి పై బూతుల పంచాంగం విప్పిన పార్లమెంటు సభ్యుడు, ఆ శాఖ ఉద్యోగులు అందరూ సంఘీభావంతో
ఒక్కటిగా నిలబడటంతో దిక్కు తోచక కులం కార్డుని వెలికి తీసారు. ఎస్.సి. ఎస్.టీ. చట్టం కింద కేసు పెడతాననీ, స్పీకర్ కి ఫిర్యాదు చేస్తాననీ పరి పరి విధాల బెదిరించారు. అయినా కూడా ఉద్యోగులు వెరవక పోవటంతో తప్పని సరై క్షమాపణలు చెప్పారు. ఎంపీ స్థానంలో ఉన్న వాడే ఉచితానుచితాలు గ్రహించకుండా స్వల్ప వివాదానికి సైతం దళిత కార్డుని వాడ బూనటం ఔచిత్యం అనిపించుకోదు. ఎంపీ గారే కాదు. చాల మంది మన దేశంలో ఒక దళితుడిని తప్పు పడితే చాలు..అంబేద్కర్ ని అవమానించినంత హడావిడి చేస్తారు. పుట్టుక రీత్యా దళితుడైనంత మాత్రాన అన్ని తప్పులనించి ఇమ్యూనిటీ వున్నట్లు ప్రవర్తించటం మంచిది కాదు. రాజ్యాంగం తమకి కల్పించిన వెసులుబాటుని తమ పురోభివృద్ధికై వాడుకోవాలి గానీ ఇలా దుర్వినియోగం చేయడం కూడదు.
Monday, May 23, 2011
ఎస్ ఆర్ సీ బొమ్మలాట కాదు..
తెలంగాణా చిచ్చుని రగిల్చి ఇప్పటికే రాష్ట్రాన్ని అధో గతి పాల్జేసిన కేంద్రం తాజాగా సార్వత్రిక ఎన్నికల వరకు కాల యాపన చేయటానికి వీలుగా రెండో ఎస్.ఆర్.సీ అస్త్రాన్ని బైటకి తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణా విషయమై ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్న జగన్, చంద్ర బాబు లాంటి వారిని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టటానికి కాంగ్రేసు కి ఉన్న ఈ అవకాశం జార విడుచుకోదు. తమ స్వార్ధ పూరిత రాజకీయాల కోసం తెలుగు వారిని చదరంగంలో పావుల్లా వాడుకోవటం, తెలుగు రాష్ట్రాన్ని ఎల్ల వేళలా వంచించటం కాంగ్రెసుకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఎస్.ఆర్.సీ పేరుతొ ఆడ బోయే నాటకం కూడా అదే. అయితే ఎప్పుడో 1955లోనే ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పడిన మొదటి ఎస్సార్సీ ఇక్కడి పరిస్థితుల్ని కూలంకషంగా అధ్యయనం చేసి తద్వారా ఇచ్చిన నివేదిక ఆధారంగానే విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. ప్రత్యెక తెలంగాణా, ప్రత్యెక హైదరాబాదు వాదనలు ఎంత డొల్లవో కమిషన్ ఆనాడే కుండ బద్దలు కొట్టింది. ఆ వివరాలన్నీ కమిటీ రిపోర్టు 369 నుండి 389 వరకు గల పేరాలలో వివరంగా చర్చించడం జరిగింది.
http://en.wikipedia.org/wiki/Para_369_to_389_of_SRC
పోనీ అర్ధ శతాబ్దం తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందనుకున్నా..తాజాగా కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటమే అత్యుత్తమ పరిష్కారమంటూ తేల్చి చెప్పింది. అంతే కాదు. ఝార్ఖండ్, చత్తీస్ గడ్ వంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల మావోయిష్టుల వంటి తీవ్రవాద దళాల చర్యలు పెచ్చుమీరటంతో పాటు రాజకీయ అనిశ్చితి కూడా సంభవమేనని సవివరంగా నివేదించింది. ఇప్పటికైనా కేంద్రం తెలుగు వారి భవిష్యత్తుతో, వారి అభివృద్ధితో ఆటలాడుకోవటం మానాలి. చేతనైతే సరైన పాలకుణ్ణి పెట్టుకొని సమైక్య రాష్ట్రం అభివృధికి తోడ్పడాలి. లేదా తమ వల్ల కాదనుకుంటే రాష్ట్రపతి పాలన విధించి అభివృది నిరోధకంగా మారిన వేర్పాటు వాదాన్ని తుదముట్టించాలి. లేని పక్షంలో తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు వాడి ఆగ్రహ జ్వాలకి కాంగ్రేసు పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో తుడిచి పెట్టుకు పోవటం ఖాయం.
Sunday, April 17, 2011
వెర్రి కుదిరింది..రోకలి తలకి చుట్టండి..
ప్రత్యెక రాష్ట్రం వస్తుందన్న ఆశ నానాటికీ సన్నగిల్లుతుండటంతో దైవం మీద భారం వేస్తూ శత చండీ యాగం చేసాడు తెలబాన్ దొర! తప్పు లేదు. ఇష్ట కామ్య సిద్ది కొరకు దైవ సహాయాన్ని అర్ధించడంలో అధిక్షేపించాల్సిన అవసరమే లేదు.
అయితే ఆకులో అన్నీ వడ్డించి అంచులో ..... రాసినట్లు యాగం చివరలో పిట్టల దొర చేసిన వ్యాఖ్యలు మన్నించ దగ్గవి కాదు. ఆంధ్ర బ్రాహ్మణులది ఆర్భాటమట! తెలంగాణా అర్చకులే నిష్ఠ గల వారట!
(షరా: ఆ వైద్యుడు కూడా ఆంధ్ర ప్రాంతంలో జన్మించి వుండకూడదు / విద్యాభ్యాసం చేసి వుండకూడదు. )
Subscribe to:
Posts (Atom)