Wednesday, December 29, 2010

విద్యార్ధులూ ఇకనైనా మోస పోకండి..

జైళ్ళనుండి  విద్యార్ధుల విడుదల కోసం శాసన సభలో అన్ని పక్షాలు ఎలుగెత్తినా తొణకలేదు మన ముఖ్య మంత్రి!  తొమ్మిదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన ప్రతి పక్ష నాయకుడు వారం పాటు రైతుల కోసం చేసిన దీక్ష గురించి డోంట్ కేర్ అన్నారు!  మందీ మార్బలంతో, మీడియా దన్నుతో చేసిన జగన్ దీక్షని కూడా ఆయన అసలు పట్టించుకోలేదు. అటువంటిది....కేవలం కొద్ది మంది తెలంగాణా ఎం.పీ.లు (తెలబాన్ నాయకుని భాషలో-చవటలు,దద్దమ్మలు)  చేసిన ఒక్క రోజు దీక్షకే విద్యార్ధులని విడుదల చేస్తున్నట్లు ప్రకటించటం ఆశ్చర్యం!  ఇది విద్యార్ధుల పై అభిమానంతో మాత్రమే అనుకుంటే అంతకన్నా పొరపాటు లేదు.  వారిని జైళ్ళనుంచి బైటకి రప్పించిన ఘనత తామే కొట్టేద్దామన్న యావ తప్ప మరేమీ కాదు.  శ్రీ క్రిష్ణ కమిటీ రిపోర్టు ఇచ్చాక గొడవలు చేయటానికి వారికి మళ్ళీ బలి పశువులు కావాలి.  నాయకులు వెనక వుండి,  ముందర వుండే ఇలాంటి అమాయక విద్యార్ధులని రెచ్చ గొట్టేస్తూ, జైళ్ళ పాలు చేస్తూ పబ్బం గడుపుకొవాలి కదా! అందుకే తెలబాన్ నాయకుడు కూడా వారితో చేరి సంఘీభావం తెలియ జేసారు.  ఇక ఇప్పుడు విజ్ఞతతో వ్యవహరించాల్సింది విద్యార్ధులే! యేడాది కాలంగా గుర్తుకి రాని విద్యార్ధులు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారో అని వాళ్ళు తెలబాన్లని, ఇంకా బూటకపు దీక్షలు చేసిన ఇతర నాయకుల్ని  నిలదీయాలి.  ప్రత్యేక రాష్ట్రం కన్నా కూడా విలువైనది వారి కరిగి పోతున్న విలువైన విద్యా సంవత్సరము అన్నది గుర్తెరిగి మసలుకోవాలి. 

Thursday, December 23, 2010

మళ్ళీ ఆమరణ దీక్షట! (టీ.పీ.ఎస్. రెడీగా వుందా?)

శ్రీ క్రిష్ణ కమిటీ నివేదిక తెలంగాణాకి అనుకూలంగా లేక పోతే ఆంధ్ర జిన్నా మళ్ళీ అమరణ నిరాహార  దీక్ష చేస్తారట! తెలబాన్లూ..ఆయనకి టీ.పీ.ఎస్. రెడీగ వుందో లేదొ ముందే చెక్ చేసుకోండి..(టీ.పీ.ఎస్. గురించిన ఇన్ ఫర్మేషన్ కర్టసీ: లగడపాటి రాజ గోపాల్).  మిలిటరీ పోరాటానికి కూడా సిధ్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మరింకేం? ఆయుధాలుకూడా రెడీ చేసుకోండి.... డిసెంబరు 31 తర్వాత రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే అరెస్టే అని డీజీపీ గారు హెచ్చరించారని తొందర పడి ముందే గర్జనలు చేసేస్తున్నారేమో?  అయినా కోర్టు తీర్పు రాక ముందే జడ్జీలని బెదిరించేలా ఈ గర్జనలు, గాండ్రిపులు, రెచ్చగొట్టటాలు ఏమిటి?  నివేదికకి తుది మెరుగులు దిద్దుతున్న విజ్ఞులైన శ్రీ క్రిష్ణ కమిటీ వారు ఈ అప్రజాస్వామిక, అరాచక చర్యలని కూడ పరిగణనలోకి తీసుకోవాలి.  సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు వేర్పాటు తీవ్ర వాదుల దొంగ దీక్షలతో, వీధి పోరాటాలతో మోసపోయిన కేంద్ర ప్రభుత్వం తప్పు తెలుసుకొని ప్రకటన సవరించుకొంది. అదే స్ఫూర్తిని శ్రీ క్రిష్ణ కమిటీ వారు కూడ కొన సాగించి తెలుగు జాతి ముక్కలు కాకుండా విజ్ఞతగల తీర్పునిస్తారని ఆశిద్దాం.

Saturday, December 18, 2010

శభాష్ డీ.జీ.పీ.!

డీజీపీ గారు లెస్స పలికారు.. డిసెంబరు 31 తరువాత రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే అరెష్టులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఈ ప్రకటన చేసింది ఒంగోలులో!  రాష్త్రం మొత్తాన్ని వుద్దేశించి ప్రకటన చేసినా  భుజాలు తడుముకొని వుడికి పోతున్నది మాత్రం తెలబాన్లు.. పైగా డీజీపీ ప్రభుత్వ వుద్యోగి మాత్రమేననీ, ప్రభుత్వం చెప్పినట్లే వినాలి తప్ప ఇలా ప్రకటనలు చేయకూడదనీ ఫత్వాలు జారీ చేశారు.  ప్రభుత్వం అడిగితే తప్ప అదనపు బలగాలు కేంద్రం నుండి రావనీ, ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా డీజీపీ స్థాయి అధికారి ఏ ప్రకటన చేయడన్న ఇంగిత జ్ఞానం తెలబాన్లకి లేకపోవటం శోచనీయం.  తాము స్వయంగా ప్రజా ప్రతినిధులై వుండికూడా   బాధ్యతా రహితంగా చవటలు, దద్దమ్మలు వంటి భాషను వాడుతూ- అంతర్యుధ్ధం తప్పదు, అగ్ని గుండం చేస్తాం అంటూ వెర్రి ప్రేలాపనలు చేస్తున్న తెలబాన్లకి  శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత గల అధికారిని విమర్శించే హక్కు ఏ మాత్రం లేదు.  అయినా ఒక్కటి మాత్రం నిజం. ప్రత్యేక తెలంగాణా వుద్యమం అన్నది గతించిన చరిత్ర.  ఇప్పుడు తెర పై జరుగుతున్నది కేవలం తమ వునికిని కాపాడుకోవటానికో లేదా తమ స్వార్ధ ప్రయోజనాల కోసమో తెలబాన్లు ఆడుతున్న నాటకం మాత్రమే!  వారి నాటకాల్ని రక్తి కట్టించటానికి రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పణంగా పెట్టడానికి వీల్లేదు. ఇప్పటికే గత సంవత్సర కాలంగా అభివృధ్ధి అన్న మాట వినబడని మన రాష్ట్రం మరింత దిగజారితే కోలుకోవటం చాలా కష్టం.  డీజీపీ గారూ.. గో ఎహెడ్.. మరో ఆపరేషన్ బ్లూ స్టార్ కి రెడీ అవ్వండి.  రాష్ట్రాన్ని అగ్ని గుండం కాకుండా మీరు చేపట్ట బోయే చర్యలకి  ప్రభుత్వ సహకారమే గాక ప్రజలందరి మద్దతు కూడా మీకు వుంటుంది...

Friday, December 17, 2010

మహా గర్జన కాదు అది..మహా మొరగటమే!

కూలి పనుల ముసుగులొ చేసిన బలవంతపు వసూళ్ళ సొమ్ముని వినియోగించి,   జనాలకి పైసలిచ్చి సమీకరించి, ఆ జన సమీకరణ అన్న వాపునే బలుపుగా భ్రమించి నిర్వహించిన తెలంగాణా మహా గర్జన ఆద్యంతం హాస్యాస్పదంగా రక్తి కట్టింది.  తెలంగాణా న్యూస్ చానెల్లొ(రాజ్ న్యూస్) మరీ విచిత్రం! టీవీల్లొ ప్రత్యక్ష ప్రసారం చూడకుండా ఆంధ్రా నాయకులు తెలంగాణా జిల్లాల్లొ కరెంటు తీసేయించారట!  హాజరైన అంతమంది జనాలని మూడు వేల మంది ఆంధ్రా పొలీసులు ఇబ్బందులు పాల్చేశారట!  ఇంకా నయం. 9వ తారీఖున వాన ఆంధ్రా వాళ్ళే కురిపించారని అనలేదు. సంతోషం.  జన సమీకరణ చూసి రాష్ట్రాన్ని ఇచ్చేయాలని అధినాయకుడైన ఆంధ్రా జిన్నా తీర్మానించారు. రాష్ట్రాన్ని ఇవ్వటం అంత తేలిక అని ఎలా అనుకుంటారొ అర్ధం కాదు.  చిరంజీవి సభలకీ జనం వచ్చారు. జగన్ సభలకీ వస్తున్నారు.  ఐనంత మాత్రాన వాళ్ళ ఆశలు, ఆశయాలు నెరవేరతాయా?  తెలంగాణా వుద్యమం వున్మాదంగా మారటానికి 54 ఏళ్ళు పడితే ఆ వున్మాదాన్ని అడ్డుకోవటానికి ఆంధ్రా నాయకులు గంటలో ఏకమయ్యారని ఆంధ్రా జిన్నా గారు వాపోయారు.  మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు యాచకుల్లా తిరుగుతున్నారని ఎద్దేవా చేసిన ఇదే పెద్ద మనిషికి పదేళ్ళ క్రితం చంద్ర బాబు సరైన మంత్రి పదవి ఇస్తే నోరెత్తే వాడా?  ఒక ప్రజా ప్రతినిధి అయి వుండి కూడా బాధ్యతా రాహిత్యంతో- భూకంపం సృష్టిస్తాం, అగ్ని గుండం చేస్తాం అని జనాల్ని రెచ్చ గొట్టెస్తున్నప్పుడు శాంతి భద్రతలకి బాధ్యత వహించాల్సిన  డీ.జీ.పీ. అదనపు బలగాల్ని అడిగితే తప్పేమిటి?  అయినా శ్రీక్రిష్ణ కమిటీ మరొ రెండు వారాల్లో రిపోర్టు ఇవ్వనుండగా ఇప్పుడీ బల ప్రదర్శనలూ, బాజా భజంత్రీల హంగామా జరిపించటంలో ఆంతర్యమేమిటి?  కమిటీ రిపోర్టుని ప్రభావితం చేద్దామన్న పేరాశ కావచ్చు.

Monday, December 13, 2010

అసలు విద్యార్ధుల పై కేసులు ఎందుకు ఎత్తి వేయాలి?

శాసన సభ సాక్షిగా-- తెలంగాణా వుద్యమం (?) లో ధ్వంస రచనకి పాల్పడిన విద్యార్ధులని నిష్పూచీగా విడుదల చేయాలని జరుగుతున్న రచ్చ పూర్తిగా అర్ధ రహితం.  కష్ట పడి సంపాదించిన సొమ్ములు వెచ్చించి చదువుకుని బాగు పడమని తల్లి దండ్రులు విద్యాలయాలకి పంపితే, తిన్నది అరక్క రోడ్డెక్కి విధ్వంసం చేసిన వారికి కేసులనుండి విముక్తి కల్పించటం పాముకి పాలు పొయటమే అవుతుంది.  చిన్న పిల్లలైతే వారిని బెంచీ ఎక్కించటమో లేదా గోడ కుర్చీ వేయించటమో చేస్తాం.  అసలు ఒక విద్యార్ధి చదువుని పక్కన బెట్టి సిగరెట్లు తాగటం గట్రా దుర్వ్యసనాలకి లోనైతే ఆయా కర్మల ఫలితం ఆ విద్యార్ధే అనుభవిస్తాడు.  అలాగే తమని కరివేపాకులా వాడుకుని పారేసే రాజకీయుల, సంఘ విద్రొహ శక్తుల  మాటలకి ప్రభావితులై అరాచకాలకి పాల్పడితే వాటి ఫలితం కూడా వారే అనుభవించాలి.  అది మిగతా విద్యార్ధి లోకానికి కనువిప్పు కావాలి.   పైగా శాసన సభలో ఈ చర్చ సందర్భంగా విద్యార్ధులతొ పాటుగా మత కలహాల్లొ నిందితులైన వారిని కూడా విడుదల చేయాలని ఒవైసీ డిమాండు చేయటం మరింత ఆందొళన కలిగిస్తోంది.  ఏమైనా రాష్ట్రంలో రాబోయె విపత్కర పరిస్థితుల్ని దృష్టిలొ వుంచుకొని, విధ్వంస కారుల్ని జైళ్ళలొనే వుంచటం శ్రేయస్కరమే గాక మిగతా బైట వున్న వారికి కూడా ఒక హెచ్చరికని చేసినట్లవుతుంది.

Saturday, December 11, 2010

శభాష్ జేపీ!

విద్యార్ధులపై కేసులు ఎత్తి వేసి వారిని విడుదల చేయాలంటూ అసెంబ్లీ లొ జరిగిన రభస సందర్భంగా లొక్ సత్తా నాయకుడు జయ ప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలు/డిమాండ్ బహుధా ప్రశంసనీయం.  కేసుల తీవ్రతని బట్టి విడుదల విషయం ఆలోచించాలని ఆయన అన్నారే కానీ ఏ ఒక్క ప్రాంతాన్నీ, నాయకుడినీ ఆయన ప్రస్తావించలేదు.  వుద్యమం ముసుగులో, విద్యార్ధులని అడ్డు పెట్టుకొని వారిని పావులుగా వాడుకుంటున్న వారికి జేపీ మాటలు రుచించక పోవటంలో ఆశ్చర్యం లేదు. కేవలం ఒకే ఒక ఎం.ఎల్.ఏ. చేసిన వ్యాఖ్య పై తెలబాన్లు గుమ్మడి కాయ దొంగల్లా ఇంతగా భుజాలు తడిమేసుకుంటున్నారంటే అర్ధమేమిటి? డిసెంబరు 31 వస్తోంది. శ్రీ క్రిష్ణ కమిటీ రిపోర్టు ఇచ్చాక మళ్ళీ అల్ల కల్లోలం చేయాలంటే వారికి జైళ్ళలో వున్న విద్యార్ధులు కావాలి. అందుకే ఇన్నాళ్ళుగా గుర్తుకి రాని విద్యార్ధులు వారికి ఈరొజు జ్ఞప్తికి వచ్చారు.  అసలు విద్యార్ధుల సంగతి పక్కన పెడితే, రాజ్యాంగ బధ్ధంగా ఎన్నికైన పాలనా వ్యవస్థలని, పరిపాలనా యంత్రాంగాలని వుత్తి పుణ్యానికి వారి పబ్బం గడుపుకోవటానికి స్తంభింప జేస్తున్న తెలబాన్ నాయకుల పైనా, శాసన సభ్యుల పైనా కేసులు బుక్ చేసి వారందర్నీశ్రీక్రిష్ణ జన్మ స్థానానికి పంపిస్తే గానీ రాష్ట్రం ప్రశాంతంగా వుండదు.  విజ్ఞులైన శ్రీక్రిష్ణ కమిటీ వారి రిపోర్టులో ఇదే మొట్ట మొదటి రికమెండేషన్ గా వుండాలని కోరుకుందాం.

Sunday, November 21, 2010

తుఘ్లక్ పాలనే ఇది..తక్షణం తొలగించాలి!

లొక్ సత్తా నాయకుడు జయ ప్రకాష్ నారాయణ చెప్పినట్లు ఎస్సై పరీక్షల నిర్వహణ విషయంలొ ప్రభుత్వ వైఖరి తుఘ్లక్ పాలననే తలపిస్తోంది.  శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు రాకముందే ఇంతగా పెట్రేగుతున్న వేర్పాటు వాదుల్ని అదుపు చేయలేక చెతులెత్తేసిన దారిన పోయే దానయ్య  ప్రభుత్వం, కమిటీ రిపోర్టు ఇచ్చాక ఏర్పడ బోయే పరిస్థితులని ఏ విధంగానూ హాండిల్ చేయలెదని చెప్పకనే చెప్పింది.  ఇప్పటికే తెలుగు వారి పరువు-ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా మంటగలిసాయి.  వేర్పాటు వాదం ముసుగులొ మొదలైన వుద్యమం(?) తీవ్రవాదం స్థాయిని దాటి పోయింది.  ఇంక వుపేక్షించటంలో అర్ధం లేదు. ఆపరేషన్ బ్లూ స్టార్ తొ సిక్కు తీవ్ర వాదాన్ని తుద ముట్టించినట్లు ఈ వేర్పాటు వాదాన్ని తక్షణం కూకటి వేళ్ళతో పెకలించే వైపుగా చర్యలు తీసుకోవాలి.  వెంటనె రాష్ట్రంలో గవర్నర్ పాలన ప్రవేశ పెట్టి ఈ దిశగా తొలి అడుగు వేయాలి.

Friday, November 19, 2010

మెదక్ జిల్లాకేనా ఇందిరమ్మ పేరు?? మాకూ కావాలి!

ముఖ్య మంత్రి రోశయ్య తెలంగాణా పై పక్షపాతం చూపిస్తున్నారు.  మహా నాయకురాలైన ఇందిరా గాంధీ పేరుని తెలంగాణాలొని మెదక్ జిల్లాకి పెట్టాలంటూ కోస్తాంధ్రులకి, సీమ వాసులకి చాలా అన్యాయం తలపెట్టారు. రేపు ఖర్మ కాలి తెలంగాణా విడి పోతే (అదెలాగూ జరగదు!) అప్పుడు మిగితా తెలుగు వారికి ఇందిరమ్మ ని జిల్లా పేరుతో తలుచుకునే భాగ్యం వుండద్దా?  కావాలంటె తెలంగాణాలొనె పుట్టి పెరిగిన తెలుగు తేజం పీవీ పేరుని తెలంగాణా వారికి అక్కర్లేక పొయినా సీమకొ,కోస్తాంధ్రులకొ ఓ జిల్లాకి ఇవ్వండి. అంతే తప్ప ప్రాంతాల మధ్య ఇటువంటి పక్షపాతం చూపవద్దని ముఖ్య మంత్రి గారికి విజ్ఞప్తి!!

Sunday, October 31, 2010

తెలుగు వాడు కన్నెర్ర జేస్తే?

ఏ వివాదాల జోలికి పొకుండా తన పని తాను చేసుకు పొయే తెలుగు వాడు కన్నెర్ర జేస్తే ఏం జరుగుతుందో తాజాగా జరిగిన తెలుగు లలిత కళా తోరణం వుదంతం నిరూపించింది. అలాగే ఈ మధ్య కొన్ని వేర్పాటు వాద శక్తులు పిచ్చి ప్రేలాపనలు చేస్తూ మంచి తనాన్ని చేతకాని తనంగా భావించి చిందులేస్తున్నాయి. లేక పొతే "జాక్" అనబడే పిపీలకం రాష్త్రావతరణ దినోత్సవాల్లొ పాల్గొనగూడదని మంత్రులని బ్లాక్ మెయిల్ చేయటమేమిటి?  బాబ్లీ గొడవ విషయమై గుంపుగా వెళ్ళిన ప్రజా పతినిధులనే తన్ని తగలేసింది మహా రాష్ట్ర ప్రభుత్వం! అటువంటిది,  బంతి వెరే కోర్టులొ వున్నప్పుడు కోర్టు తీర్పు వచ్చే వరకు యధా తధ స్థితి కొనసాగాలన్న ఇంగితం లేకుండా తైతక్కలాడుతున్న ఈ జాక్ లని, ఇతర కొతి కొమ్మచ్చి గ్రూపుల్ని అణచడం ప్రభుత్వానికి పెద్ద పని కాదు.  అయినా సంయమనం వహిస్తున్న ప్రభుత్వ మంచి తనాన్ని అలుసుగా తీసుకొని రాష్ట్రావతరణ పండుగనే బహిష్కరించ బూనడం నిస్సందేహంగా జాతి ద్రొహమే! ప్రస్తుతానికి రాష్ట్ర విభజన అన్నది అప్పుడే తేలే విషయం కాదు. శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు ఇవ్వాలి--దాన్ని అన్ని వర్గాలు విశ్లేషించి ఆమోదించాలి--ఆ పై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి. అంత వరకూ యధా తధ స్థితి కొన సాగాలి. అందుకు అడ్డు వచ్చిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం వెనుకాడకూడదు.  అందరికీ సమైక్య ఆంధ్ర ప్రదెశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు !  

Friday, October 29, 2010

అమర జీవి పట్ల అపరాధం..సహించకూడదు..

మనకి నచ్చని రాజకీయ నాయకుల దిష్టి బొమ్మల్ని తగలేయటం అన్నది నిరసన తెలపడంలొ అందరూ ఆమోదించే పధ్ధతి. అయితె ఇది బ్రతికి వుండి స్వార్ధ,సంకుచిత రాజకీయాలు నడిపే వారికే పరిమితం కావాలి. కానీ తెలుగు వారికి స్వంత రాష్ట్ర సాధనకై నిస్వార్ధంగా ప్రాణ త్యాగం చేసిన అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఈ రొజు దుండగులు తగల పెట్టటానికి ప్రయత్నించటం వికృత రూపం తాల్చిన తెలబాన్ ఆగడాలకి నిలువెత్తు నిదర్శనం.    స్వంత రాష్ట్రం రాకుండానే విగ్రహాలపై ఇంతలా తెగ బడ్డ వారు రేపు ఖర్మ కాలి తెలంగాణ వస్తే ఇతర ప్రాంతాల వారిని బ్రతకనిస్తారా?  తండ్రిని మించిన తనయుడిలా రెచ్చగొట్టే ప్రకటనలు చేసి ఈ అమానుషం జరగడానికి కారకుడైన కె.టీ.ఆర్. ని తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. 

రాజీవ్ భజన ఇక చాలు!

తిక్క (వరపు) సుబ్బ రామి రెడ్డి పది కోట్లిచ్చినంత మాత్రాన ప్రజలకు ఆమోదమవుతుందో లేదొ అన్న కనీస ఆలోచన కూడా లేకుండా సర్కారు తెలుగు లలిత కళా తొరణం పేరుని రాజీవ్ లలిత కళా తొరణంగా మారుస్తూ ఏకంగా జీ.ఓ. ఇచ్చెయటం దారుణం. ఇప్పటికే మన రాష్ట్రంలో వున్న ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయానికి మన తెలుగు ప్రధాని పీ.వీ. పేరు కాకుండా రాజీవ్ కి అంకితమిచ్చేశాం.  మన తెలుగు ప్రధానికి మాత్రం ఆ విమానాశ్రయానికి దారి తీసే ఒక రొడ్డుకి ఆయన  పేరు పెట్టెసి చేతులు దులుపుకున్నాం. చెన్నై, ముంబై, అహ్మదాబాద్, కోల్ కతా ఇంకా మరే విమానాశ్రయాన్ని వుదాహరణగ తీసుకున్నా ఆయా రాష్ట్రాలకు చెందిన స్థానిక నాయకులవొ లేదా చారిత్రక పురుషుల పేర్లు వాటికి పెట్టారు. మరి మనకెందుకీ భావ దారిద్ర్యం?  సరే, జరిగిన పొరపాటుకి ఏమీ చేయలెం.  కానీ ఇంకా కక్కుర్తిగా అల్రెడీ నామకరణం జరిగి పొయిన వాటికి కూడా ఇందిర/రాజీవ్ పేర్లు జత పరచాలని చూడటం ఖచ్చితంగా మన చేత కాని తనాన్ని అవహెళన చేయటమే అవుతుంది.  తెలుగు లలిత కళా తొరణాన్ని రిపేరు చేయించ దలుచుకుంటే ప్రభుత్వం వద్ద పది కోట్ల రూపాయలు లేకుండా పోయాయా?  ఏ స్వార్ధం, పరమార్ధం లేకుండానే తిక్క(వరపు) సుబ్బ రామి రెడ్డి వంటి వ్యాపారి పది కోట్లు ఇచ్చేస్తాడా? ప్రభుత్వం ఇప్పటికైన మేలుకొని ఏదో కన్నీటి తుడుపుగా తీసేసిన తెలుగు అన్న పదం జత చేయటం గాకుండా "తెలుగు లలిత కళా తొరణం" పేరుని యధా తధంగా వుంచాలి.  సీ.పీ.ఐ. నాయకుడు నారాయణ చెప్పినట్లు రోశయ్య ప్రభుత్వానికి అంత కోరికగా వుంటే రాష్ట్రం లోని సులాభ్ కాంప్లెక్సులు అన్నిటికీ ఇందిర/రాజీవ్ ల పేర్లు పెట్టుకుంటే ఎవరికీ ఏ అభ్యంతరం వుండ బోదు.

Thursday, October 28, 2010

సమైక్యాంధ్ర ప్రదేశ్ అవతరణ దినం సగర్వంగా జరుపుకుందాం..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్ని బహిష్కరించాలని తెలబాన్లు పిలుపునివ్వటం వారి మూర్ఖత్వానికి పరాకాష్ట. డిప్యూటీ స్పీకరుగా, కేంద్ర మంత్రిగా ఇంకా అనేక రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉంటూ ఇన్నేళ్ళుగా రాష్ట్రావతరణ దినోత్సవాల్లో అధికారికంగా పాల్గొన్న తెలబాన్ నాయకుడికి తాను ఇరవై మూడు జిల్లాలతో కూడిన ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఇన్నాళ్ళు తెలియలేదా? వునికిని కాపాడుకొవటం కొసం గత సంవత్సరమే గుర్తు వచ్చిందా? అలాగే ఇన్నాళ్ళూ లెనిది ఒక్కసారిగా వారికి కొమరం భీం ఎందుకు గుర్తుకి వచ్చాడో? స్వర్గీయ ఎన్.టీ.ఆర్. టాంకు బండు పైన విగ్రహాలు పెట్టించినపుడు వారి నాయకుడు అధికార పార్టీలొనే వున్నాడు కదా? ఆనాడే అడిగి వుంటే ఎన్.టీ.ఆర్. కాదనే వారా?  ఇంత కాలం మిన్నకుండి ఇప్పుడు కొమరం భీం విగ్రహం పెట్టక పొతే మిగిలిన విగ్రహాల్ని పెల్చెస్తామనటం వెర్రి తనం. 1956 లో భాషా ప్రయుక్త రాష్ట్రాల  ఏర్పాటులో మొట్ట మొదటిగా  తెలుగు వారందిరినీ ఒక్కటిగా చేస్తూ ఏర్పాటైనది మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం.  అన్ని రంగాల్లొ అద్వితీయంగా వెలుగుతున్న మన తెలుగు వారిని మరోలా దెబ్బ కొట్టటం చేత గాక ఏనాడొ బ్రిటిషు వారు వుపయోగించిన విభజించు-పాలించు మంత్రాన్ని సాంబారు కెంద్ర మంత్రి ప్రయోగిస్తే మన వేలితో  మన కన్నే పొడుచుకున్నట్లు పరస్పరం కీచులాడుకొని ఇప్పటికే చాల చులకన ఐపొయాం.  ఇకనైనా కళ్ళు తెరిచి, వేర్పాటు వాద కాశ్మీరు వుగ్రవాదులకన్నా దారుణమైన పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న తెలబాన్ల మాటల్ని పట్టించుకొకుండా....మన సమైక్య రాష్ట్ర అవతరణ దినం మనం సగర్వంగా జరుపుకుందాం. 

Sunday, August 22, 2010

శాంపిల్ చూపిన కాకా!

గుడిసెల వెంకట స్వామిగా తనకున్న పేరుని సార్ధకం చేసుకుంటూ తాజాగా "కాకా",  నటుడు శ్రీకాంత్ భూమిని కబ్జా చేసారు.  అందులో ఆశ్చర్యం ఎమీ లేదు.  అయితే దానికి తెలంగాణా ట్విస్టు ఇవ్వడంలోనె వుంది అసలు విషయం.
పోలీసులతో సహా ఇతర తోటి నాయకులు అందరూ కూడా న్యాయం వైపు మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక, కేవలం శ్రీకాంత్ ఆంధ్రా వాడు కనుక కబ్జా చేయటం సమంజసమే అన్న ధొరణిలో మాట్లాడటం ఆయన తెలబాన్ మనస్తత్వాన్నే సూచిస్తోంది. ఇటువంటి వారికి ప్రత్యేక రాష్ట్రం వచ్చి, వారే పాలకులైతే ఆ రాష్ట్రాన్ని రాతి యుగం లొకి తీసుకు వెళతారు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.

Tuesday, August 10, 2010

దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!

సీమాంధ్ర మంత్రులు శ్రీక్రిష్ణ కమిటీకి ఇచ్చిన రిపొర్టు పైన కే.సీ.ఆర్.కి అంత వులుకెందుకో?  అసలు శ్రీక్రిష్ణ కమిటీ వేసిందెందుకు?
 ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునేందుకే కదా! తాను మాత్రం ఒక డజను కమిటీలు వేసి రిపోర్టు ఇవ్వవచ్చు గానీ సీమాంధ్ర మంత్రులు ఇస్తే తప్పు బట్టటం హాస్యాస్పదం. తెలంగాణా వాదం దేశ ద్రోహమని అన్నారంటే అది వారి వ్యక్తిగత అభిప్రాయం. అది కూడ బహిరంగంగా కాకుండా కమిటీకి మాత్రమే వారు తెలియ చెప్పారు. అది చాలా పెద్ద తప్పని ఇల్లెక్కి కూస్తున్న ఇదే కే.సీ.ఆర్. ఎన్నో బహిరంగ సభల్లొనే సీమాంధ్రుల వ్యాపారాలు, కాలేజీలు మూయిస్తామనీ, వాళ్ళని తరిమి కొడతామనీ, నాలుకలు తెగ్గోస్తామనీ ఇంకా చాలా చాలా సెలవిచ్చారు. వాటన్నిటికీ కలిపి ఆయనకి ఎంత పెద్ద శిక్ష వేయాలొ తెలుసుకుంటే సంతోషం!

Sunday, August 8, 2010

పొలిటికల్ మూర్ఖుడు కే.సీ.ఆర్....

గ్రేట్ ఆంధ్రా.కాం లొ వచ్చిన ఈ ఆర్టికిల్ చదవండి..
http://telugu.greatandhra.com/cinema/6-08-2010/01f_08_pol.php

Friday, July 30, 2010

ఇల్లలుకగానే పండుగ కాదు!

పిల్లల ఆట లాగ ఖాళీ చేసిన స్థానాల్లొనే మళ్ళీ పోటీ చేసి, ప్రజల నెత్తిన కోట్ల రూపాయల ఖర్చుతొ వుప ఎన్నికలని రుద్ది,  గెలిచాం అనిపించుకున్న మాత్రాన తెలంగాణా రానే రాదు.  ప్రత్యేక రాష్ట్రం కావాలంటే దానికి అన్ని ప్రాంతాల వారి అంగీకారం, సహకారం తప్పని సరిగా వుండాలి.  సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి సైతం తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించాక  వెల్లువెత్తిన నిరసనలతొ తోక ముడిచి ప్రకటన సవరించుకోవటం జరిగింది. అటువంటిది ఒక పన్నెండు మంది శాసన సభ్యులు తిరిగి ఎన్నికై పోతే అదే గొప్ప విజయమనుకొని తెలంగాణా వచ్చేస్తుందన్న పిచ్చి భ్రమలొ పడవద్దని వేర్పాటు వాదులకి నా సలహా!

Wednesday, July 28, 2010

E-సుదర్శనం బాగుంది!

తి.తి.దే. ఈ మధ్యనే ప్రవేశపెట్టిన ఈ-సుదర్శనం చాలా బాగుంది. అసలు శ్రీవారి దర్శనానికి దెవస్థానం అమలు చేస్తున్న అనేక పధకాల్లో అత్యంత ప్రజాదరణ పొందినది సుదర్శనం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కేవలం 50 రూపాయలకే రెండు లడ్డూలతో పాటు రెండు గంటలలొ సులువుగా శ్రీవారి దర్శనం కలుగజేసే ఈ పధకం ఇన్నాళ్ళూ జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లొ మాత్రమే అందుబాటులొ వుండేది.  ఇప్పుడు దాన్ని ఈ-సుదర్శనం పేరుతొ ఇంటెర్నెట్ కి  విస్తరించడం ద్వారా అన్ని ప్రాంతాల వారికిఈ అందుబాటులొకి తేవడం అత్యంత ముదావహం.  ముందుగా రిజిష్ట్రేషన్ చేసుకొవడం, ఫొటోలు అప్ లోడ్ చేయడం లాంటి సాధక బాధకాలున్నా, పధకం దుర్వినియోగం కాకుండా వుండాలంటే అవన్నీ తప్పవు.  అయితే, యాత్రికుల ఫొటో తొ సహా రసీదు ప్రింటు తీసుకున్నాక, మళ్ళీ దానిని వెరే సుదర్శనం వొచర్ కి సీ.ఆర్.వో. ఆఫీసులొ మార్చుకొవడం అన్న ప్రక్రియని తొలగిస్తే బాగుంటుంది.  IRCTC  E-టికెట్ లాగ యాత్రికుల రసీదునే సుదర్శనంకి అనుమతిస్తే బాగుంటుంది.  అలాగే కొత్తగా ప్రవేశ పెట్టిన 100 రూ. లడ్డు పడి టికెట్ సౌకర్యం కూడా బాగుంది. యాత్రికులకి, కోరినన్ని లడ్డూలు లభించడంతో లడ్డూల బ్లాక్ మార్కెటింగ్, డూప్లికేట్ లడ్డూల చలామణీ వంటివి అరికట్టినట్లైంది. ఇందుకు తి.తి.దే. కి అభినందనలు.

ఇంక దేవస్థానం పాలక మండలిలో కూడా మద్యం వ్యాపారులని, రాజకీయులని తొలగించి, ఆధ్యాత్మిక భావం, సేవా తత్పరత మెండుగా వున్న వారిని నియమిస్తే, వారినుంచి భక్తులకి ఇటువంటి సౌకర్యాలు అనేకం మనం ఆశించ వచ్చు. అయితే, ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని భావించడం అత్యాశే అవుతుంది.  ఈ విషయంలొ  TV-9 చానెల్ చేస్తున్న ప్రచారం కూడా చిత్తశుధ్ధితో కూడుకున్నదని నేను అనుకొవట్లేదు.  కేవలం ఆదికేశవుడు దూషించాడనొ లేదా TRP రేటింగ్స్ పెంచుకోవడానికో చేస్తుండ వచ్చు.

Wednesday, July 21, 2010

"మహా" మచ్చు తునక!

బాబ్లీ ప్రాజెక్టు మహా రాష్ట్ర అక్రమంగా కట్టిందా లేదా అన్నది పక్కన బెడదాం. అలాగే చంద్ర బాబు కూడా మహా రాష్ట్ర యాత్ర స్వంత రాజకీయ ప్రయోజనాల కోసమా కాదా అన్నది కూడా వేరే విషయం. అయితే ఇక్కడ స్పష్టంగా తేట తెల్లమైన విషయం ఏమిటంటే, భౌగొళికంగా నదీ ప్రవాహ ప్రాంతాలకు ఎగువన వున్న రాష్ట్రాలు, దిగువన వున్న ప్రాంతాలకు తలచుకుంటే ఇబ్బందులు కలుగ జేయగలవని ఈ సంఘటనతో రుజువైంది.  అలాగే, తెలుగు వారితొ చరిత్రలొ ఎటువంటి తగాదాలూ లేని మహా రాష్ట్ర ప్రభుత్వమే తమ రాష్ట్రానికి వచ్చిన మన మాజీ ముఖ్య మంత్రిని, ఇతర ప్రజా ప్రతినిధులని ఎలా ట్రీట్ చేసిందొ చూసాం. ఇక సీమాంధ్ర వాసులపై వుత్తి పుణ్యానికే విరుచుకు పడే తెలబాన్లకి స్వంత రాష్ట్రం వస్తే ఏం జరుగుతుందొ చెప్పక్కర్లేదు.  (నా ముందరి టపా "తెలంగాణా వస్తే కోస్తా ఎడారే" చదవండి... http://andhraaakasaramanna.blogspot.com/2010/03/blog-post_16.html ) . అటువంటి దుస్థితి తెలుగు వారికి సంప్రాప్తించకూడదని ఆ భగవంతుడిని ప్రార్ధిద్దాం..

Saturday, July 10, 2010

సినిమా ట్రిక్కులకి తెలంగాణా రాదు!

తెలంగాణా ప్రాంత వుప ఎన్నికల్లొ మూకుమ్మడి నామినేషన్లు వెయించి తద్వారా బేలట్ వొటింగు తప్పనిసరి చేయడాన్ని తమ విజయంగా భావించడం అక్కడి నాయకుల మూర్ఖత్వం!  వేగవంతం,ఖచ్చితత్వం మరియు సౌకర్యవంతమైన ఈ.వీ.ఎం. ల వినియోగాన్ని టాంపరింగ్ ఆరొపణలతొ ఆడ్డుకొవాలని చూడటం వారి ప్రగతి నిరొధక తత్వాన్నే సూచిస్తుంది. అసలు ఈ.వీ.ఎం.ల వాడకం మొదలు పెట్టాకే రిగ్గింగు, బేలట్ పేపర్లపై ఇంకు, నీళ్ళు పొయటం లాటి దుశ్చర్యలకి అవకాశం లేకుండా పొయింది.  అయినా ఈ.వీ.ఎం.లని టాంపరింగ్ చేయగలిగే అవకాశమే వుంటె,  2004లొ అధికారంలొ వున్న టెక్నాలజీ మాష్టర్ చంద్రబాబు ఎన్నికల్లొ ఓడిపొయేవాడా?  తెలంగాణా వుద్యమంలొ ప్రాణాలు కొల్పొయిన వారి సన్నిహితులని నిలబెట్టక పొగా, పదవీ లాలస వదలని అదే అభ్యర్ధులని మళ్ళీ బరిలొకి దించటమే గాక, ఎటువంటి అక్రమాలకైనా పాల్పడి తమ అభ్యర్ధులని గెలిపించుకొవాలన్న తాపత్రయమే ఈ చర్యల వెనుక వుద్దేశ్యం అన్నది ప్రజలకి అర్ధమై పొయింది. అలా అడ్డగొలుగా గెలిచేసి, ప్రజాభిప్రాయం తెలంగాణకే అని చాటాలన్న పిట్టల దొర ఆలొచన ఫలించదు. ఏనాడొ అసెంబ్లీ రౌడీ సినిమాలొ చూసాం. శివాజీ నిర్దొషి అని బేలట్లొ స్లిప్పులు వేస్తె, కొర్టు ప్రజాభిప్రాయంగా పరిగణించి హీరొని విడుదల చేస్తుంది.  అలాగే అడ్డగోలుగా అభ్యర్ధులు గెలిచినంత మాత్రాన (ఒక వెళ గెలిస్తే) అదె ప్రజాభిప్రాయం అనేసి తెలంగాణా ఇచ్చేస్తారని కలలు కనటం కూడా మూర్ఖత్వం.

Thursday, July 8, 2010

వై.ఎస్.ఆర్. కి అసలైన నివాళి!

రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క, జగన్ వర్గం ఓ పక్క, కాంగ్రెస్ శ్రేణులు, వై.ఎస్.ఆర్. అభిమానులు మరొ వైపు ఈ రొజు రాజ శేఖర రెడ్డి జయంతిని జరుపుకుంటున్నారు. అయితే కడ వరకూ సమైక్య వాదానికి కట్టుబడి - తెలంగాణా వస్తే హైదరాబాదుకి వెళ్ళాలంటే వీసా తీసుకొవాలన్న సత్యాన్ని చాటిన ఆయన జీవించి వుంటె ఈ రొజు వేర్పాటు వాద విష నాగులు పడగ ఎత్తే సాహసం చెసేవా?? రాష్ట్ర అసెంబ్లీలొ తీర్మానం పెట్టటమో, కడప జిల్లాకి వై..ఎస్.ఆర్. పేరు పెట్టటమో లేదా జగన్ ఓదార్పు యాత్రలకి హాజరు కావటమో కాదు. రానున్న వుప ఎన్నికల్లొ వేర్పాటు వాదులని పూర్తిగా మట్టి గరిపించి వారికి తగు గుణ పాఠం నేర్పటమే గాక తెలుగు వారందరూ సమైక్య వాదులే అని చాటడమే ఆయనకి మనమివ్వ గలిగే ఘనమైన నివాళి.

Monday, July 5, 2010

వేర్పాటు వాదులకు బుధ్ధి చెప్పాలి!

2009 సార్వత్రిక ఎన్నికలలొ సమైక్య వాదానికి కట్టుబడి ఒంటరిగా రాజ శేఖర రెడ్డి ఒక వైపు, తెలంగాణాకి సై అని మహా కూటమి మరొ వైపు మోహరించి పొరాడిన విషయం తెలిసిందే.  అటువంటి ఎన్నికల సమరంలొ ప్రజలు ఇక్కడ వై.ఎస్. ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వటంతొ బాటు కెంద్రంలొ యూ.పీ.ఎ. ప్రభుత్వానికి కూడ 33 మంది ఎం.పీ. లని అందించారు. దీన్ని బట్టి ప్రజల మాండేటు సమైక్య వాదమే అన్నది అప్పుడె ఋజువై పొయింది. బలవంతుడైన వై.ఎస్. ని ఎదుర్కొవడం చెత గాక మూలన కూర్చున్న కే.సీ.ఆర్., ఆయన అకాల మరణం తరువాత మళ్ళీ తన వునికిని చాటుకొవటానికి తెలంగాణా వుద్యమాన్ని తలకెత్తుకున్నాడు. తదనంతర పరిణామాల్లొ తాను, తన చెల్లి మాత్రం పదవులు అంటి పెట్టుకొని సహచరులందరి చేత రాజీనామాలు చెయించి ప్రజల నెత్తిన బలవంతంగా వుప ఎన్నికలని రుద్దాడు. ఇవి ఖచ్చితంగా ప్రజలు కొరుకున్న ఎన్నికలు కావు. వారిపై బలవంతంగా రుద్ద బడిన ఎన్నికలు మాత్రమె. అయినా రాజీనామా చేసిన వారే మళ్ళీ పొటీ చేసి గెలిస్తే వారు చేసిన త్యాగం ఎమిటొ బోధ పడదు. తెలంగాణా వుద్యమంలొ ప్రాణాలు కొల్పోయిన వారి సన్నిహిత బంధువులని ఈ ఎన్నికల్లొ నిలబెట్టక పోగా, కనీసం ఇప్పుడు ఆ ప్రస్తావన కూడా ఎవరూ తీసుకు రావట్లేదంటె తెలంగాణ పట్ల వారి చిత్త శుధ్ధి  ఏ పాటిదొ చెప్పకనే చెబుతోంది. కనుక ప్రజలు తమకు అనుకొకుండా వచ్చిన ఈ అవకాశాన్ని వుపయోగించి, వేర్పాటు వాదుల డ్రామాలు మరింక కొన సాగకుండా తీర్పు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

Friday, July 2, 2010

అడుసు తొక్కనేల? ఆసుపత్రిలొ చేరనేల?

రాజకీయాల్లొ సాధారణంగా ఎదుటి వారి పై బురద జల్లే వారినె చూస్తుంటాం. అయితే, స్వయంగా తామే అడుసు తొక్కిన చందంగా నొటి దురద వల్ల అవస్థల పాలవుతున్న రాములమ్మ లాంటి వారికి అసలు రాజకీయాలు ఎందుకు? నా ముందరి టపా "రంకెలేసిన రాములమ్మ" చదవండి.

Wednesday, June 30, 2010

రంకెలేసిన రాములమ్మ!

తెలంగాణకి అడ్డొచ్చిన సమైక్య వాదులని నరికేయాలని విజయ శాంతి తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలా నరికేస్తే సమైక్య వాదులు చేతులు ముడుచుకుని కూర్చుంటారా?  ఎన్నికల కొడ్ అమలులొ వున్నప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదన్న కనీస నియమం పాటించాల్సిన బాధ్యత ఎం.పీ.గా ఆమెకి లేదా?  ఇక ఎన్నికల సంఘమే కలుగ జెసుకొని ఆమె పదవినీ, అహంకారాన్నీ నరకాల్సిన బాధ్యత నిర్వర్తించాలి.

Monday, June 28, 2010

పీ వీ ని మరచిన దేశం!

ఈ రోజు మాజీ ప్రధాని, తెలుగు తేజం పీ.వీ. జయంతి అని గుర్తున్న వారిని వేళ్ళ మీద లెక్క పెట్టచ్చేమో!  తెలుగు వారి నుండి ప్రధాన మంత్రి పదవిని నిర్వహించిన ఏకైక వ్యక్తిని కనీసం తెలుగు వారమైన మనమైనా ఈ రోజు స్మరించుకోవడం కనీస ధర్మం. రాజీవ్ హత్య జరిగే సమయానికి దేశ ఆర్ధిక పరిస్థితి ఎలా వుందో ఎవరికైనా జ్ఞాపకముందా?  రిజర్వ్ బ్యాంకు బంగారం అమ్మి బాకీలు తీర్చాల్సిన దుస్థితిలో పీ వీ కి ప్రధాని పగ్గం చేతికి వచ్చింది.  ఆయన దూరాలోచనతో అప్పటి వరకూ బ్యూరోక్రాట్ గా ఉన్న మన్మోహన్ సింగ్ ని ఆర్ధిక మంత్రిని చేసి, సంస్కరణల అమలులో ఆయనకి పూర్తి స్వేచ్చ ఇచ్చి దేశ ఆర్ధిక పటిష్టతకి కారణమైన వ్యక్తిని కనీసం ఆయన సొంత పార్టీ మనుషులే మర్చిపోవటం దారుణం. వారు పీ వీ ని మర్చి పోయారనటం కూడా తప్పు. బాబ్రీ మసీదు నించి భోపాల్ గ్యాసు దాకా అన్ని సంఘటనలకీ  బాద్యుడిని చేయటానికి కాంగ్రేసు వారికో పాపాల భైరవుడు కావాలి.  ఆయనే పీ.వీ.!  ఇంక ప్రతి చిన్నా చితకా సినీ తారల పుట్టిన రోజులకీ, పెళ్లి రోజులకీ రిపీటేడ్ గా ప్రత్యెక కార్యక్రమాలు ఇచ్చే మన తెలుగు టీవీ చానెళ్ళు సైతం బహు భాషా కోవిదుడైన ఈ అపర చాణుక్యుడిని విస్మరించడం విచిత్రం.

Sunday, June 20, 2010

వీ.ఐ.పీ. సేవలింక ఆపండి..

సామాన్య భక్తులకి కనీసం రెండు సెకనులు కూడా కళ్ళారా స్వామిని చూడనీయకుండా మహా లఘు అని, మహా మహా లఘు అని పేర్లు  పెట్టి గెంటి వేసే టీ.టీ.డీ. అధికార గణం ఈ రోజు విజయ్ మాల్య కోసం రెండు గంటలు క్యు లైనులని ఆపెశారన్న వార్త వింటేనే పట్టరాని ఆగ్రహం వస్తోంది.  ఇంక ఆ రెండు గంటలు పిల్లా పాపలతో నిలబడి పోయిన భక్తుల అవస్థలు ఆ భగవంతుడికే ఎరుక! అసలు ఒక మద్యం వ్యాపారికి ఆలయ నిర్వహణ పగ్గాలు అందించడమే తప్పు. అధికారం చేతిలో వున్నప్పుడు తోటి మద్యం వ్యాపారికి ఎర్ర తివాచీలు పరచటంలో ఆశ్చర్యం లేదు.  పీ.వీ.ఆర్.కే.ప్రసాద్, కామి శెట్టి శ్రీనివాసులు వంటి నిబద్ధత గల (మాజీ) అధికారులని-- వయసై పొయిందనో లేదా కోర్టు చెప్పిందనో వంకతో వేటు వేసిన ఆలయ అధికార గణం ... ఎ అర్హత వుందని - భోగ లాలసుడిగా పేరు పడ్డ ఈ మద్యం వ్యాపారికి రాచ మర్యాదలు చేసారో అవస్థలు పడ్డ భక్త జనులకి వివరణ ఇచ్చి తీరాలి.

Tuesday, April 27, 2010

ఆది కేశవుడి ఆగడాలకు అడ్డు లేదా?

             కేవలం తిరుమల దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి కోసమే పార్టీ ఫిరాయించి ఆ పదవిని పొందిన ఆదికేశవులు నాయుడు దేవస్థానం విషయంలో చేస్తున్న ఆకృత్యాలకు  అంతే లేకుండా పోతోంది. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన అనంత స్వర్ణ మయం పధకానికి హై కోర్టు అడ్డు చెప్పినా కూడా ఇంకా ఆ పధకం పట్ల  ఆయన ప్రత్యెక శ్రద్ధ చూపడం  పట్ల ఎవరికైనా అనుమానాలు రాక తప్పదు. తాజాగా నిన్న - సామాన్య భక్తులందరికీ కొండ ప్రవేశం నిషిద్ధమైన వేళలో - తానె దగ్గరుండి అంబానీ కుటుంబాన్ని కొండ పైకెక్కించి, ఆలయ ప్రవేశం చేయించి సకల మర్యాదలు  చేయడంలో అర్ధం, పరమార్ధం ఏమిటి? పైగా కోర్టు కేసు క్లియర్ అయితే ఈ పధకానికి బంగారం విరాళంగా ప్రకటిస్తామని అంబానీలు ప్రకటించటం నిజంగా సిగ్గు చేటు. తన ఆలయాన్ని స్వర్ణ మయం చేయమని ఆ దేవుడేమీ కోరలేదు. ఈ అంబానీలు ఇచ్చే బంగారానికి ఏమీ ఆయన మొహం వాచి లేడు. కార్య నిర్వహణ అధికారిగా కృష్ణారావు గారు వచ్చిన దగ్గరనించి, ఆయన చేస్తున్న సంస్కరణలకు అడుగడుగునా అడ్డు తగులుతూ, స్వంత ప్రయోజనాల కోసం  ఆలయ మర్యాదలని మంట గలుపుతున్న ఆది కేశవుని కబంధ హస్తాలనుంచి టీ.టీ.డీ.  ఎప్పుడు విముక్తమవుతుందో?

Sunday, April 18, 2010

పిచ్చి ముదిరింది!

నాయకుడేమో అంతర్యుద్ధం తప్పదని ఫత్వాలు జారీ చేస్తున్నాడు. అదీ చట్ట బద్దంగా ఏర్పాటైన కమిటీని సవాల్ చేస్తూ! అనుచరులేమో మర్యాద రామన్న సినిమా షూటింగ్ అడ్డుకొని యూనిట్ సభ్యులతో జై తెలంగాణా అని బలవంతంగా నినాదాలు చేయిస్తున్నారు.  ఇక ప్రత్యెక రాష్ట్రం సెంటిమెంటు అనేది ఉన్నట్టా లేదా కొంత మంది స్వార్ధ ప్రయోజనాల కోసం విద్వేషాలు రగిలిస్తున్నారా? అసలు అంతర్యుద్ధం అంటే అర్ధమేమిటో ఆ నాయకుడికి తెలుసా? తెలంగాణా ప్రాంతం వారు, ఇతరులు తమలో తాము కొట్టుకోవాలనా ఆయన ఉద్దేశ్యం? ఇటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసే వారి పై పోలీసులు సు మోటో కేసు బుక్ చేసి జైల్లోకి తొయ్యాలి.  అప్పుడు గానీ ఈ పిచ్చి ప్రేలాపనలు ఆగవు.

Saturday, April 17, 2010

నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు!

రానున్న ప్రజా పధం కార్యక్రమంలో తెలంగాణా కోసం రాజీనామా చేయని ప్రజా ప్రతినిధులని  నిలదీయాలని కే.సి.ఆర్. పిలుపునివ్వడం విచిత్రం. తన పార్టీకి చెందిన శాసన సభ్యులందరూ రాజీనామా చేసినా పదవిని పట్టుకు వేళ్ళాడుతున్న తానె అలా నిల దీయాల్సిన పక్షంలో మొదటి వ్యక్తిగా  నిలబడాల్సి వస్తుందని ఆయనకి తోచలేదు కాబోలు! ఫాల్తూ కమిటీ అని చెడ తిట్టిన శ్రీ కృష్ణ కమిటీ కి నివేదిక ఇవ్వడమే  గాక చర్చలు కూడా జరిపి వచ్చారు. మంచిదే.  కానీ తిరిగి వచ్చిన వెంటనే కమిటీ నివేదిక అనుకూలంగా రాక పొతే అంతర్యుద్ధం తప్పదని హెచ్చరించడం సమస్యని మళ్ళీ మొదటికి తేవడమే!  కేవలం ఉనికిని కాపాడుకోవటానికి చేసే ఇటువంటి కాల యాపన జిమ్మిక్కు రాజకీయాలు ప్రజలు గమనించడం లేదనుకోవడం పొరబాటు.    ఇటువంటి పంధానే     కొనసాగిస్తే ఇప్పటికే హైదరాబాదు నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడానికి మొహం చెల్లని ఆయన పార్టీకి ఏకంగా తెలంగాణాలోనే నూకలు చెల్లే రోజు వస్తుంది.   

Monday, April 12, 2010

ఇంత హంగామా అవసరమా?

సానియా మీర్జా పెళ్లి చేసుకుంది. సంతోషం. ఐతే ఈ విషయంలో మీడియా చాలా ఎక్కువ హంగామా చేసి అనవసరమైన ప్రచారం ఈ పెళ్ళికి  కలుగ జేసింది. ప్రపంచంలో ఇంకెవ్వరూ దొరకనట్లు ఒక పాకిస్తానీని వరించి దుబాయిలో సెటిల్ అవుతానని ప్రకటించేసిన ఆమెను ఆశీర్వదించి వదిలేస్తే చాలు. అంతే తప్ప ఆమె కట్టుకున్న చీర ఖరీదెంత? కారు కలరెంటి? పెళ్ళిలో భోజనాల వివరాలు ఇత్యాదులన్నీ భారత ప్రజలకి అనవసరం. భారత దేశం నుండి విశిష్టమైన అర్జున అవార్డుని అందుకొని, ఎం.జీ.ఆర్. యూనివర్సిటీ నుండి డాక్టరేటు తీసుకొని, ఇంకా అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డు సైతం కట్ట బెట్టిన దేశాన్ని కాదని వెళ్లి పోతున్న సానియాను పట్టుకొని పాకులాడటం మీడియా చేస్తున్న అతి గానే భావించాలి.

Tuesday, March 30, 2010

ఆనంద నిలయం అనంత అవినీతి మయం కాకూడదు!

ప్రపంచం మొత్తంలోనే అతి సంపన్నమైన దేవాలయం మన తిరుమల తిరుపతి దేవస్థానం! కోట్లాది భక్తులు కానుకలుగా, ముడుపులుగా సమర్పించే ధనాన్ని, బంగారం ఇతర విలువైన వస్తువుల సంరక్షణ, నిర్వహణల బాధ్యతలని భక్తుల తరపున నిర్వర్తించాల్సిన దేవస్థానం ధర్మ కర్తల మండలి బాధ్యతలని సక్రమంగా నిర్వహిస్తోందా?? లేనే లేదు. అసలు దేవాలయాల ధర్మ కర్తల మండలిలో రాజకీయ నాయకులు ప్రవేశించిన నాడే నిబద్ధత అన్నది అడుగంటి స్వార్ధ ప్రయోజనాలకి పెద్ద పీట వేసుకోవటం మొదలైంది.  తెలుగు దేశం నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించి దానికి ప్రతిఫలంగా టి.టి.డీ. అద్యక్ష పదవిని పొందిన ఆదికేశవులు నాయుడు చేస్తున్న పని అదే. ఆనంద నిలయం అనంత స్వర్ణ మయం పేరుతొ  కేవలం ఏక వ్యక్తి ఎజెండాగా సాగుతున్న ఈ కార్యక్రమం ఎ మాత్రం కొనసాగటానికి వీల్లేదు.బోర్డు సభ్యులు అబ్యంతరాలు చెప్పినా,ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా,కోర్టు కేసులు వేస్తున్నా కూడా ఈ పధకం అమలుకి ఆయన పట్టు పడుతున్నారంటే దీని వెనుక స్వార్ధ ప్రయోజనాలు లేవని ఎలా అనుకోగలం?  విజయ్ మాల్యా వంటి వారిని రప్పించి ఈ పధకానికి బంగారం ఇప్పించి అందుకు ప్రతిగా వారికి ప్రత్యెక సౌకర్యాలు కలుగ చేయటం కేవలం తన వ్యాపార ప్రయోజనం కోసం  కాదా? అయినా టే.టే.డీ. ఇతర ధార్మిక కార్యక్రమాలన్నిటికీ ఇచ్చే చందాల పై వున్న ఆదాయ పన్ను మినహాయింపు ఈ అనంత బంగారం పధకానికి లేదు. దీన్ని బట్టే ఇది స్వంత ఎజెండా అని నిరూపితమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో కలుగ జేసుకుని అశేష భక్త జనుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రాజెక్టులు అమలు జరగకుండా చూడాలి. పాలక మండలి చైర్మన్లుగా రాజకీయ నాయకుల బదులు పీ.వీ.ఆర్.కే.ప్రసాద్ లాంటి నిబద్ధత గల మాజీ అధికారులని నియమిస్తే భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేసినట్లవుతుంది.

Monday, March 29, 2010

పదవిని వదలని కే.సి.ఆర్.!

తెలంగాణా జైత్ర యాత్ర లేదా కే.సి.ఆర్. అంతిమ యాత్ర ఏదో ఒకటి తప్పదని ఆర్భాటం చేసి నిరాహార దీక్ష మొదలు పెట్టిన కే.సి.ఆర్. ఆ రెండింటిలో ఏదీ సాధించలేక పోయినా రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులకి మాత్రం పాడె కట్టి ఊరేగించారు. పాల పొంగులాగ వచ్చిన ఉద్యమ వేడిలో పార్టీ శాసన సభ్యులని బలి పశువులని చేసి రాజీనామాలు చేయించి.. తానూ, తన చెల్లి మాత్రం పదవులని అంటి పెట్టుకొని వున్నారు. పదవినే త్యాగం చేయలేని మనిషి ప్రాణ త్యాగం చేసేసి తెలంగాణా తెచ్చేస్తాడని నమ్మడం తెలివి తక్కువ పని. పైగా శ్రీ కృష్ణ కమిటీని ఫాల్తూ కమిటీ అని, గడ్డి పీకుతుందా అంటూ అపహాస్యం చేసిన ఆయన ఈ రోజు అదే కమిటీకి రిపోర్టు ఇవ్వడానికి తన పార్టీలో పది సబ్ కమిటీలు వేసారు. దీనర్ధం... అసలు తెలంగాణా విషయమై ఆయనకు ఎ మాత్రం అవగాహన లేదు. కేవలం ఉనికిని కాపాడుకోవటానికే ఉద్యమాల పేరున ప్రజలని రెచ్చ గొట్టారు. విద్యార్ధుల ప్రాణాలు బలి తీసుకున్నారు. తీరా సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిన సమయం వచ్చేసరికి కమిటీలు ఏర్పాటు చేసి కసరత్తులు మొదలు పెట్టారు. అయినా తెలంగాణా ప్రాంతంలోనే ఉన్న హైదరాబాదు నగర పాలక సంస్థ ఎన్నికల్లో కనీసం పోటీ చేయడానికి మొహం చెల్లని వారు ఎ ముఖం పెట్టుకొని తెలంగాణా సాధిస్తామని జనాల్ని మోసం చేస్తున్నారు?

Sunday, March 21, 2010

కోదండ రాం నాన్ స్టాప్ కామెడీ!


వెర్రి కుదిరింది..రోకలి తలకు చుట్టమన్నట్లు తయారయింది కోదండ రాం గారి పరిస్థితి. జాయింట్లు అన్నీ ఒక్కటొక్కటిగా ఊడి పోయేసరికి జే.ఎ.సి. చైర్మన్ గారికి మతి చెడిందన్న విధంగా ఆయన మాట్లాడుతున్నారు. తాజాగా సినీ పరిశ్రమలో తెలంగాణా వారికి నలభై శాతం రిజర్వేషన్ కావాలని డిమాండు చేసారు. కళ అన్నది సృజనాత్మకతకి సంబంధించిన అంశం. ఎవరికీ టాలెంటు వుంటే వారు ఆ రంగంలో పైకి వస్తారు గాని రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనో, లేదా వారసత్వం వల్లనో ఎవరూ పైకి రారు. ఉదాహరణకి ఈ మధ్యనే వచ్చిన సుమన్(బాబు) నాన్ స్టాప్ కామెడీ ప్రజల్ని ఎంత నాన్ స్టాప్ గా హింసిన్చిందో చూసాం. సొంత మీడియాలో విపరీత ప్రచారం, బహుమతుల ఆశలు చూపినా ఆ కామెడీ జనం భరించలేక పోయారు. ఇక రిజర్వేషన్ ఇచ్చినా పరిస్థితి అంతే. అసలు సినీ రంగంలో ఒక ప్రాంతం వారికి రిజర్వేషన్ అన్నది ప్రాక్టికల్ గా సాధ్యం కానే కాదు. కేవలం సినీ రంగాన్ని దెబ్బ తీయాలన్న దురుద్దేశ్యం తోనే ఈ విధమైన ప్రకటనలు చేస్తున్నారేమో అనిపిస్తోంది.

Tuesday, March 16, 2010

తెలంగాణా వస్తే కోస్తా ఎడారే!


కృష్ణా, గోదావరి జలాల వినియోగం పై మనకి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర లతో ఇప్పటికీ వివాదాలు నడుస్తున్నాయి. అయితే అవి పద్దతిగా కోర్టుల్లోనూ, ట్రిబ్యునల్స్ లోనూ సాగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణా అనే ప్రత్యెక రాష్ట్రం వచ్చిన పక్షంలో, భౌగోళికంగా రెండు నదుల పరీ వాహక ప్రాంతాలూ తెలంగాణాని దాటి కోస్తాకి రావాల్సి వుంటుంది. అయితే రాష్ట్రం రాక ముందే రోడ్ల మీద గోడలు కట్టేసిన మహానుభావులు నదులకి అడ్డంగా డ్యాములు కట్టేయరని గ్యారంటీ ఏమిటి? అన్ని ప్రాంతాల వారి సమిష్టి కృషితో అభివృద్ది చెందిన హైదరాబాదుని అనాయాసంగా గుంజుకుందామని చూస్తున్న వారు అప్పనంగా వచ్చే నదీ జలాలు వదులుతారా? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితుల అధ్యయనానికి ఏర్పాటైన శ్రీ కృష్ణ కమిటీ ఒక వేళ ప్రత్యెక రాష్ట్రం గురించి ప్రస్తావించ దల్చుకుంటే తద్వారా ఏర్పడ బోయే నదీ జలాల వివాదాల గురించి కూడా ఆలోచించాలి.

Saturday, March 13, 2010

ఇంకొక్క జాయింటు మిగిలింది..





ఏక పక్షంగా రాజీనామాల హుకుం జారీ చేయటంతో తెలంగాణా జే.ఎ.సి. నుంచి కాంగ్రెస్ వెళ్లి పోయింది. తమ ఆజ్ఞను పాటించలేదని తెలుగు దేశం పార్టీని జే.ఎ.సి.నించి కోదండరాం గారు బహిష్కరించారు. ఇక జాయింట్ల యాక్షన్ కమిటీలో మిగిలిన ముక్క టీ. ఆర్.ఎస్. మాత్రమె. ఇంకా టీ.ఆర్.ఎస్. లో కూడా కే.సి.ఆర్., విజయ శాంతి రాజీనామాలు చెయ్యలేదు. వారినికూడా బహిష్కరించేస్తే కోదండ రాం గారు ప్రశాంతంగా ఉండచ్చు. అయితే అది జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే తోలు బొమ్మలాటలో కంట్రోల్ అనేది వెనుకనుంచి ఆడించే వాడికి వుంటుంది కానీ తెర మీద ఆడే బొమ్మకి కాదు కదా!

Friday, March 12, 2010

సమైక్యాంధ్ర ప్రదేశ్ తరపున పది వేల కృతఙ్ఞతలు!




కేవలం 76 రోజుల్లో పది వేల హిట్స్ వస్తాయని నేను ఈ బ్లాగు మొదలు పెట్టిన రోజు ఊహించలేదు. ఒక్కటిగా ఉన్నతెలుగు వారి రాష్ట్రాన్ని వుట్టి పుణ్యానికి ముక్కలు చేసేస్తారేమోనన్న ఆందోళన డిసెంబరు 2009 నాటికి వుండేది. ఆ సమయంలో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని జరుగుతున్న డ్రామాలని చూస్తుంటే, వేర్పాటువాదుల పిడి వాదాల్ని వింటుంటే వచ్చిన వుక్రోషాన్ని వెళ్ళ గక్కటానికి ఈ బ్లాగు మొదలు పెట్టాను. ఇందులో రాసినవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమె. అవి అందరికీ నచ్చాలని రూలేమీ లేదు. అందుకే వచ్చిన పది వేల హిట్లలో సమర్ధించిన సమైక్యవాదులున్నారు. విమర్శించిన వేర్పాటు వాదులున్నారు. అలాగే పచ్చి బూతులు తిట్టిన తెలబాన్లు కూడా వున్నారు. (వారి సంస్కారం ఇంతే అని తెలియ చేయటానికి వారి కామెంట్లని డిలిట్ చేయకుండా యధాతధంగా బ్లాగులో ఉంచాను). అయితే డిసెంబరు నాటికీ, ఇప్పటికీ పరిస్థితిలో మార్పు వచ్చింది. రాష్ట్రం ముక్కలవదన్న భరోసా వచ్చింది. అందుకే అందరికీ కూడా సమైక్యాంధ్ర ప్రదేశ్ తరపున పదివేల కృతఙ్ఞతలు.

కోదండ రాం రాజీనామా చెయ్యాలి!


రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల నుండి వసూలైన పన్నులనుండి జీతం తీసుకుంటున్న కోదండ రాం కి ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆయనకే గనుక నైతిక బాధ్యత వుండే పక్షంలో...తాను వేర్పాటు వాదానికే కట్టుబడేటట్లయితే ప్రొఫెసర్ పదవికీ, లేదా ప్రభుత్వ వుద్యోగం కావాలనుకుంటే జే.ఎ.సి. కన్వీనర్ పదవికీ తక్షణం రాజీనామా చెయ్యాలి.

గవర్నరుని చూసి నేర్చుకోండి..



తిరుమల ఆలయంలో మహా ద్వార ప్రవేశార్హత ఉన్నాకూడా సాధారణ భక్తుని వలె వైకున్థం క్యూ కాంప్లెక్సు ద్వారా దర్శనానికి వెళ్ళిన గవర్నరు ఎంతైనా అభినందనీయుడు. సాధారణ భక్తుల అవస్తల్ని పట్టించుకోకుండా, అసలు తమకి మహా ద్వార ప్రవేశ అర్హత వుందో లేదో కూడా తెలియకుండా..అధికారాన్ని ఉపయోగించో, సిఫారసుల ద్వారానో మహా ద్వార ప్రవేశం చేస్తున్న రాజకీయులకు, వారి అనుచరులకు ఇది కనువిప్పు కావాలి. రాష్ట్రానికి ప్రధమ పౌరునిగా గవర్నరు చూపిన ఆదర్శం అందరికీ ఆచరణీయం అవ్వాలి.

రాయల తెలంగాణా పై అంత ఉలుకెందుకు?


జే.సి.దివాకర రెడ్డి చేసిన రాయల తెలంగాణా వ్యాఖ్య పై తెలంగాణా నాయకులందరూ ఎందుకు గోల చేస్తారో అర్ధం కాదు. జే.సి. అన్నది రాష్ట్రం విడి పోయిన సందర్భంలో మాత్రమె అన్న మాట మరచి పోయి దుమ్మెత్తి పోయటం మొదలు పెట్టేసారు. అయినా సాక్షాత్తూ ప్రధాన మంత్రి సైతం ఏకాభిప్రాయ సాధన లేనిదే రాష్ట్ర విభజన సాధ్యం కాదని తేల్చేసాక ఇక తెలంగాణా రావడమన్నది కల్ల. అందుకే అందరూ ప్రశాంతంగా వుండండి.

Tuesday, March 9, 2010

పదే పదే.. అదే పొరపాటు!




కేంద్రంలో వున్న యు.పీ.ఎ. ప్రభుత్వం లోని కాంగ్రేసు పార్టీ, తమది సంకీర్ణ ప్రభుత్వం అన్న సంగతి మరచి పోయి తమ అధినేత్రి పుట్టిన రోజు సందర్భంగానూ, మహిళా దినోత్సవ సందర్భంగానూ దేశ ప్రజలకు కానుకలు ఇవ్వబోయి భంగ పడటం మనం చూస్తున్నాం. ఉదాహరణకి మహిళా రిజర్వేషన్ల బిల్లు సంగతే తీసుకుంటే..ఉద్దేశం మంచిదే అయినాకూడా బిల్లు ప్రవేశ పెట్ట బోయే ముందు భాగస్వామ్య పక్షాలతో చర్చించి వారిని సంతృప్తి పరచిన తరువాత బిల్లు ప్రవేశ పెడితే బాగుండేది. ఇప్పుడు పెద్దల సభలో ఆ ఎం.పీ. ల ప్రవర్తన వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇండియా పరువు పోయింది. అలాగే మూడు నెలల క్రితం తెలంగాణా పై ఒక విధాయక నిర్ణయం భాగస్వామ్య పక్షాలకు కనీసం తెలియ జేయకుండా అర్ధ రాత్రి ప్రకటించేశారు. ఆ తరువాత అడుసు తొక్కనేల..కాలు కడగనేల అన్న చందంగా కేంద్రం వ్యవహరించిన సంగతి మనం చూసాం. కనుక ఇకనైనా యు.పీ.ఎ. ప్రభుత్వం సంకీర్ణ ధర్మాన్ని గుర్తెరిగి మసలుకుంటే బాగుంటుంది.

Monday, March 8, 2010

గతమెంతో ఘనం! ఇప్పుడో??




2009 వ సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ కి అవార్డు వచ్చింది.ఇది గత సంవత్సరం మాట. మరి ఈనాడు మన రాష్ట్రానికి టూరిస్టు అన్న వాడు రావడానికి ధైర్యం చేస్తున్నాడా? ఈ సంవత్సరం టూరిజం అవార్డుల్లో మన స్థానం ఎక్కడ వుంటుంది? ఈ పరిస్థితికి కారకులెవ్వరు?

Saturday, March 6, 2010

అర్ధం పర్ధం లేని లాయర్ల ఆందోళన!


లాయర్లు తమ వాదనా పటిమని కోర్టుల్లో చూపించి కేసులు గెలిపిస్తే అర్ధవంతంగా వుంటుంది కానీ వుట్టి పుణ్యానికి రోడ్ల మీద చేరి పిడి వాదాలు చేస్తుంటే అసంబద్ధంగా వుంటుంది. అధిక ధరలకు నిరసనగా చంద్ర బాబు నాయుడు ఈ రోజు ఇందిరా పార్కు దగ్గర మీటింగు పెట్టి ప్రసంగిస్తుంటే అక్కడికి చేరిన కొంత మంది లాయర్లు అడ్డుకొని తెలంగాణా పై వైఖరి చెప్పమని అల్లరి పెట్టారట! ఎంత హాస్యాస్పదం? తెలంగాణా పై వైఖరి చెప్పాలా వొద్దా, ఎప్పుడు చెప్పాలి అన్నది చంద్ర బాబు ఇష్టం. ఆ విషయమై వొత్తిడి తెచ్చే హక్కు ఎవరికీ లేదు. అలా వొత్తిడి తెస్తున్న సమయంలో కార్య కర్తలకు, లాయర్లకి మధ్య ఘర్షణ అనివార్యం. అయితే దాన్ని కారణంగా చూపి ఇక చంద్ర బాబుని టార్గెట్ చేసేస్తున్నారు. అటువంటప్పుడు ఆ లాయర్ల వెనుక ఏదో ఒక రాజకీయ పార్టీ వుందని చంద్రబాబు అనుమాన పడటంలో అసహజం ఏముంది?

ప్రధాని మాట - చూపాలి బాట !


ఆంధ్ర ప్రదేశ్ ని విడదీయాలంటే ఏకాభిప్రాయం అవసరమని రాజ్య సభలో ప్రధాని మన్మోహన్ చేసిన ప్రకటన ఎంతైనా సమర్ధనీయం. బీ.జే.పీ. హయాంలో మూడు రాష్ట్రాలు ఎటువంటి సమస్యలు లేకుండా ఇచ్చామని వారు గొప్పలు చెప్పుకున్నారంటే అప్పుడు ఆయా రాష్ట్రాల విభజనకి ఎటువంటి అభ్యంతరాలూ ఎవరినించి రాలేదు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. విభజన అన్న మాట వినబడితేనే రాష్ట్రం అగ్ని గుండమై పోతోంది. ఇటువంటప్పుడు కావలసింది ప్రధాని చెప్పినట్లు ఎకాభిప్రాయమే గాని ఏక వ్యక్తి అభిప్రాయమో, ఎజెండానో రాష్ట్రం పై రుద్దరాదు.

Thursday, March 4, 2010

బావిలో దూకే ముందు తెలీదా?


కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల వారు తె.రా.స. ని బాయిలో నూకి గడ్డ మీద వున్నాయని కే.సి.ఆర్. వాపోయారు. అసలు తెరాస శాసన సభ్యులని బావిలోకి ఎవరు తోసారు? జే.ఎ.సి.లో ప్రతిపాదన పెట్టేసి దానికి మిగతా పార్టీల అంగీకారం వుందో లేదో తెలుసుకోకుండానే ప్రజల్లో క్రెడిట్ కొట్టేద్దామన్న అత్యుత్సాహంతో పది మంది శాసన సభ్యుల్నీ బావిలోకి తోసింది కే.సి.ఆర్. కాదా? రాజీనామా అస్త్రం ఎప్పుడూ పని చేయదన్న సంగతి ఇప్పుడు తెలిసాక మిగతా పార్టీలని తూర్పార పడితే ఉపయోగం ఏమిటి? (అయినా ప్రస్తుతానికి కే.సి.ఆర్., విజయ శాంతి ఇంకా బావిలోకి దూకలేదు. గట్టు మీదే ఉండి వారి శాసన సభ్యులు మునుగుతారా, తేల్తారా అని అంచనాలు వేస్తున్నారు.) తాము ఆశించినట్లుగా రాజ్యాంగ సంక్షోభం రాకుండా పరిస్థితి ఉప ఎన్నికల వైపు తిరిగేసరికి దిక్కు తోచక..ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయం ఆయా పార్టీల విజ్ఞతకి వదిలేస్తున్నామని బుకాయిస్తున్నారు. విజ్ఞత గల పార్టీలు కాబట్టే అనవసరంగా ఉప ఎన్నికల ఖర్చు ప్రజల పై రుద్దకుండా చేసాయి. మరి మళ్ళీ వీళ్ళని గెలిపిస్తే ఆరు నెలలకల్లా ఏదో కారణం చెప్పి ఉప ఎన్నికలు తేరని గ్యారంటీ ఏముంది? (రాజీనామాల్లో ప్రపంచ రికార్డు వారిది!) అయినా ..తెలంగాణా కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పి మళ్ళీ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక అయి వచ్చేస్తే ఇక వారు చేసిన త్యాగం ఏమిటి?? నిజంగా త్యాగధనులే అయితే ఓ.యు. విద్యార్ధులు కోరినట్లుగా ఆత్మార్పణ చేసిన విద్యార్ధుల బంధువులని వారి నియోజక వర్గాల్లో నిలబెట్టి గెలిపించుకోవాలి. అప్పుడే విద్యార్ధుల బలి దానానికి కొంతయినా సఫలత చేకూరుతుంది.

Wednesday, March 3, 2010

వెర్రి తలలు వేస్తున్న వేర్పాటు వాదం!

రాష్ట్రంలో సినిమా, పరిశ్రమలు, పర్యాటకం, సాఫ్టువేర్, రవాణా ఇత్యాది అన్ని రంగాల్ని తగలబెట్టేసిన తరువాత వేర్పాటు వాదుల దృష్టి విద్యా రంగం పై పడింది. ఇంటర్ పరీక్ష పేపర్లని ఎ ప్రాంతం పేపర్లు అక్కడే దిద్దాలన్న డిమాండుతో ఈసారి వారు తెర మీదకి వచ్చారు. ప్రత్యెక రాష్ట్రం కోసం నానా యాగీ చేసిన తరువాత కేంద్రం అధికారికంగా కమిటీ వేసి డిమాండ్లని చెప్పమని ముందుకు వస్తే పత్తా లేకుండా తెర మరుగై పోయిన వారందరూ ఈ రోజు విద్యార్ధుల జీవితాలతో ఆడుకోవటానికి మళ్ళీ కలిసి కట్టుగా ముందుకు వచ్చారు. స్వయంగా ప్రొఫెసర్ ఐన జే.ఎ.సి. కన్వీనరుకి జంబ్లింగు పద్ధతి ఎందుకు పెట్టారో, బార్ కోడింగ్ పద్ధతిలో అది సక్రమంగా జరుగుతోందో లేదో తెలియదనుకోవాలా? ఐనా రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్ పరీక్ష కాబట్టి లోకువ గట్టి ఇటువంటి అర్ధ రహిత డిమాండు చేసారు. మరి జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరిక్షలు, సివిల్ సర్వీసు పరీక్షల పేపర్ల సంగతేమిటి? వాటిని కూడా తెలంగాణాలోనే దిద్దాలా? మరింకెందుకు...అక్కడే పరీక్షలు పెట్టి, అక్కడే ఫుల్ మార్కులు ఇచ్చేసుకొని, అక్కడే ఉద్యోగాలు ఇచ్చేసుకుంటే ఎ బాధ వుండదు కదా?

Saturday, February 27, 2010

ఇదేమి రీతి? ఇదేమి నీతి?


రాష్ట్రం విడిపోతే తప్పేమిటని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తప్పు లేదు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అయితే అందుకు ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు తెలంగాణా వాదులు. మరి అదే పద్ధతిలో తమ అభిప్రాయాలు చెప్పిన చిరంజీవి,మోహన్ బాబు, రోజా, జయేంద్ర సరస్వతి తదితరులని నానా దుర్భాషలాడారు. తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరికలు చేసారు. మరి భావ ప్రకటన స్వేచ్చ అందరికీ సమానమే కాదా? తమకి అనుకూలంగా చెప్తే దేవుడు...లేక పొతే దుష్టుడు అన్నట్లు ప్రవర్తించటం ఏమి పద్ధతి? ఇక వారి ప్రవర్తనలో మార్పు రాదా?

Friday, February 26, 2010

లెవలై పోయింది..




అక్కడ పార్లమెంటులో తె.రా.స. కు చెందిన ఇద్దరు ఎం.పీ. ల రాజీనామాలని స్పీకర్ తిరస్కరించారు---ఇక్కడ అసెంబ్లీలో ఇద్దరు కాంగ్రేసు శాసన సభ్యుల రాజీనామాలు స్పీకర్ తిరస్కరించారు. మేటరు లెవలై పోయింది. అయితే రాజీనామాల్లో నాదే ప్రపంచ రికార్డ్ అని చెప్పుకున్న పెద్ద మనిషికి సరైన ఫార్మాట్ లో రాజీనామా ఇవ్వటం తెలియదా? తన తోటి ఎం.పీ.కి సరైన గైడెన్స్ ఇవ్వడం తెలియదా? ఇక ఎవరి పదవులు వాళ్ళు ఎంజాయ్ చెయ్యండి. మరి ఇక్కడ వెర్రి గొర్రెలు అయ్యింది ఎవరు? ఆల్రెడీ పదవులూడగోట్టుకున్న పది మంది శాసన సభ్యులు...నెరవేరని లక్ష్యానికి ప్రాణాలర్పించిన విద్యార్ధులు...ఇంకా చోద్యం చూస్తున్న ప్రజలు....

Wednesday, February 24, 2010

ఒకే ఒక్కడు!


వన్డే మాచ్ లలో తొలి సారిగా డబుల్ సెంచరీ (నాటౌట్) సాధించి రికార్డు నెల కొల్పిన సచిన్ టెండూల్కర్ కి అభినందనలు.

ఎ.పీ.లో ఆగని మమత రైలు


షరా మామూలుగా మళ్ళీ అన్యాయమే జరిగింది. మరో బెంగాల్ పక్షపాత రైల్వే బడ్జెట్ ని మమత ఈ రోజు సమర్పించింది. విదిలించిన కొత్త రైళ్ళు నామ మాత్రం. అవికూడా మనకన్నా పొరుగు రాష్ట్రాలకే ఎక్కువ ఉపయోగం. తెలంగాణా ఉద్యమాన్ని దృష్టిలో వుంచుకొని ప్రకటించిన కొత్త రైల్వే లైన్లు ఎప్పటికి నిజమయ్యేను? అప్పటికి తెలంగాణా ఉద్యమం హుళక్కి--తెలంగాణా హుళక్కి అని వారికి తెలుసు. అసలు 33 మంది ఎం.పీ.లు యూ.పీ.ఎ. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా గల రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇదేనా? కేవలం 19 మంది సభ్యులు గల తృణమూల్ కాంగ్రెస్ కి రైల్వే శాఖ ఇచ్చిననాడే మన వాళ్ళు అభ్యంతర పెట్టి వుండాలి. ఈ రోజు ఏమి అనుకోని లాభం లేదు. లాలూ టైములో బీహారుకి పెద్ద పీట వేసుకుంటుంటే మనం నోట్లో వేలు పెట్టుకుని చూస్తూ కూర్చున్నాం. కనీసం ఈ రోజైన ఐకమత్యంగా అడుగుదామంటే ఆ ఆవకాశం ఇవ్వకుండా తెలుగు వాళ్ళని విడదీసి పారేశారు. ఇప్పటికైనా తెలుగు వాళ్ళ పై జరుగుతున్న కుట్రని గ్రహించి ప్రాంతీయ విభేదాల్ని విస్మరించి తెలుగు వాళ్ళందరూ ఒక్కటే అని చాటే సమయం వచ్చింది. కాదంటారా... మన బతుకులింతే..

Tuesday, February 23, 2010

ఇదేనా నాయకత్వ లక్షణం?


తనని రాజీనామా అడగటం పెద్ద జోక్ అని కే.సి.ఆర్. సెలవిచ్చారు. లీడర్ అన్న వాడు ముందు ఉండి లీడ్ చెయ్యాలి. అంతే కానీ తనను నమ్ముకున్న వారిని ముంచేసి తీరా తన వంతు వచ్చేసరికి మీన మేషాలు లెక్క పెట్టటం కాదు. పై ఫోటోలో చూడండి. నిన్న జరిగిన టీ.ఆర్.ఎస్. పత్రికా సమావేశంలో కే.సి.ఆర్. మొహంలో తప్ప ఎవరి మొహంలోనైనా కళా కాంతులు ఉన్నాయా?

Monday, February 22, 2010

కేంద్రం కొరివితో తల గోకుతుందా?


పార్లమెంటు సమావేశాల ప్రారంభ దినాన ఉభయ సభలని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో తెలంగాణా ప్రసక్తి లేదట! ఇప్పటికే హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన(ల)తో తల బొప్పి కట్టించుకున్న కేంద్రం ఏకంగా రాష్ట్రపతి నోటనే ఆ ప్రస్తావన తెస్తుందని ఎలా ఆశించారో? పైగా పార్లమెంటులో తెలంగాణా కోసం బిల్లు పెట్టాలని మళ్ళీ రాగం మొదలు పెట్టారు. ఐనా రాజ్యాంగ బద్దంగా ఒక కమిటీ ఏర్పాటు అయి పని ప్రారంభించిన దశలో మళ్ళీ ఇటువంటి ఆందోళనలు చేయటం అర్ధ రహితం. చేతనైతే తమ వాదనలు కమిటీకి సమర్ధవంతంగా వినిపించి రిపోర్టు తమకి అనుకూలంగా తెప్పించుకోవాలి గానీ ఇటువంటి పిల్ల చేష్టల వల్ల తెలంగాణా రానే రాదు.